Breaking News

Nizamabad News

ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలైన పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాన్ని ప్రతి యేటా ఆనవాయితీగా నిర్వహిస్తారు. రెంజల్‌ మండల కేంద్రంలో ఆదివారం గ్రామస్థులందరు కలిసి ఒకే చోటుకి చేరి బోనాలతో తరలి వెళ్తారు. ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ గ్రామస్తులతో కలిసి బోనమెత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు మంగళ వాయిద్యాలతో ఘనంగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ...

Read More »

అంజనాద్రి ఆలయంలో భజన కార్యక్రమం

నిజాంసాగర్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులోని అంజనాద్రి ఆలయంలో మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పట్లోల కిషోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాత్రి వేళల్లో అంజనాద్రి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిచ్కుంద, గోర్గల్‌, గున్కుల్‌, మొహమ్మద్‌ నగర్‌ గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నిజాంసాగర్‌ ఎస్‌ఐ సాయన్నకు పట్లోళ్ల ...

Read More »

చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అన్నారు. అన్ని వర్గాల అభివద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అహర్నిశలు కషి చేస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం బింగి కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో ముందుకు ...

Read More »

మున్సిపల్‌లో కాంగ్రెస్‌ జండా ఎగుర వేస్తాం

నిజాంసాగర్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ జండా ఎగురవేయడం ఖాయమని కాంగ్రెస్‌ నాయకులు సుభాష్‌ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ నాయకులు వీధి వీధిలో తిరిగి శంకుస్థాపనలు చేసినంత మాత్రాన పని అయిపోదని వెంటనే పనిని మొదలు పెట్టాలని అన్నారు. సామెత గుర్తుకు వస్తుంది ఇల్లు అలకగానే పండుగ కాదని అలాగే కొబ్బరికాయ కొట్టగానే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకోవడం పప్పులో కాలేసినట్టే అని ఆయన అన్నారు. రైతు బజార్‌ను ...

Read More »

ఎస్‌ఐ ఎంపికైనా కళ్యాపూర్‌ యువకుడు

రెంజల్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన అమాంద్‌ అరవింద్‌ (28) శుక్రవారం రాత్రి వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. వత్తి రీత్యా వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు అమాంద్‌ తుకారాం, లలితల రెండవ కుమారుడు అరవింద్‌ ఎస్‌ఐగా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎస్‌ఐగా ఎంపిక కావడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. తన సోదరుడు ప్రసాద్‌ కషి వల్లే ఎస్‌ఐగా ...

Read More »

14న విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వప్రేమ మఠం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము నిర్వహిస్తున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకులు కర్మయోగి నారాయణ జిజ్ఞాసు తెలిపారు. నగర శివారులోని నాగారం ఓం గురుకుల ఆశ్రమంలో యాగము జరుగుతుందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు, వైదిక ధర్మ రక్షణ కొరకు యాగం తలపెట్టినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Read More »

ఆసుపత్రి తనిఖీ

రెంజల్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొందరు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆమె వెంట మాజీ ఎంపీటీసీ కిషోర్‌ ఉన్నారు.

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

నిజాంసాగర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌ మున్సిపల్‌ పరిధిలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసేందుకు అన్ని రకాలుగా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ...

Read More »

పొట్టకూటి కోసం వస్తే..ప్రాణమే పోయింది

నందిపేట్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం కేంద్రంలోని రాజ్‌నగర్‌ దుబ్బలో ఇంటి పైకప్పు కూలడంతో దినసరి కూలి కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం… జీవనోపాధి కోసం ప్రకాశం జిల్లా కేసముద్రం మండలం ఎర్రుపాలెం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబం నందిపేట మండల కేంద్రానికి శుక్రవారం రాత్రి వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలింది. దీంతో అంజయ్య కుమార్తె ...

Read More »

రూ. 19 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలో రూ. 19 కోట్లతో చేపట్టే పలు అభివద్ధి పనులకు రాష్ట్ర రవాణా, రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. శనివారం ఆయన భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ.19 కోట్లతో భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే పనులు సిసి / బిటి రోడ్లకు, సీసీ మురుగు కాలువలకు పదిహేను కోట్ల రూపాయల అంచనాతో చేపట్టడానికి శంకుస్థాపనలు నిర్వహించారు. ఆరు స్మశాన వాటికలకు కోటి ...

Read More »

వర్షాల కోసం జలాభిషేకం

నిజాంసాగర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు సమృద్ధిగా కురవాలని నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి హనుమాన్‌ ఆలయంలో జలాభిషేకం చేశారు. అనంతరం వైస్‌ ఎంపీపీ మనోహర్‌ మాట్లాడుతూ వర్షాలు భారీగా కురిసి తెలంగాణలోని పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని హనుమాన్‌ మందిర్‌లో జలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రైతులందరూ వర్షాలు కురిస్తే పొలాలు వేసుకోవడం జరుగుతుందని, దేవుని కపతో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నదులు నిండుకుండలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లూర్‌ సర్పంచ్‌ ఖాసీంసాబ్‌, నాయకులు ...

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

నిజాంసాగర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరు చేయాలని వెల్గనూర్‌ సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామ శివారులో మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ మొక్కల సంరక్షణ వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరులు ఉన్నారు.

Read More »

రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి

ఆర్మూర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ మరియు అవుట్సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికులకు చెందిన వివిధ జీవోలను సవరించి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, కార్మికుల వేతనాలను పెంచాలని దాసు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఐఎఫ్‌టియు రాష్ట్రసదస్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. సదస్సులో ముఖ్యవక్తగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ప్రసంగిస్తారని, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కష్ణ, సూర్యం పాల్గొంటారని, రాష్ట్రంలోని ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని ...

Read More »

జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు

బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమను బీసీ కులంలోకి మార్చవలసిందిగా కోరిన ప్రజల జీవన స్థితిగతుల కనుగుణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బిఎస్‌ రాములు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పర్యటన కోసం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన విషయాలపై వారిద్దరూ కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జరిగిన పలు ఎన్నికలను ...

Read More »

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయాన్ని నిర్మించిన చీఫ్‌ ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదిన వేడుకలను గురువారం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 12 వరద గేట్ల సమీపంలోని గార్డెన్‌లో ఏర్పాటుచేసిన చీఫ్‌ ఇంజనీర్‌ విగ్రహానికి ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ దత్తాత్రి, ఏఈఈ శివకుమార్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డిప్యూటీ ఈఈ మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించి రెండు లక్షల 75 ...

Read More »

ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే వివాహ దినోత్సవ వేడుకలు

నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ శాసన సభ్యులు అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే దంపతుల వివాహ దినోత్సవాన్ని నిజాంసాగర్‌ మండల నాయకులు ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సిడిసి చైర్మన్‌ దుర్గరెడ్డిలు కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. అనంతరం సిడిసి చైర్మన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే దంపతులు ఇలాంటి వివాహ వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు సాదుల సత్యనారాయణ, గాలిపూర్‌ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి, లింగగౌడ్‌, మహేందర్‌, మండల మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ...

Read More »

మహాన్యాస పూర్వక ఏకాదశ వరుణ యాగం

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం వర్షాలు సరైన సమయంలో లేక తీవ్ర వర్షాభావ పరిస్థితులు సంభవించినందున, భవిష్యత్తులో దీని ప్రభావం వలన తీవ్ర కరువు వచ్చే ప్రమాదం ఉన్నందున ఆ ప్రమాదం నుండి పూర్తిగా కాకపోయినా కొంతవరకు అయిన మన శక్తి మేరకు మన వంతు మానవ ప్రయత్నంగా సష్టిలోని సమస్త జీవ రాశులతో పాటు ముఖ్యంగా పుడమి తల్లిని నమ్ముకొని జీవనం గడుపుతూ మన అందరి ఆకలి తీర్చడం కోసం అహర్నిశలు కష్టపడే రైతులందరు క్షేమంగా ...

Read More »

నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల నియామకం

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌టి ద్వారా సెలెక్ట్‌ చేయబడిన ఉపాధ్యాయుల నియామకం నిబంధనలను అనుసరించి నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఉపాధ్యాయుల నియామకంపై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిక చేసి పంపబడిన 103 మంది ఉపాధ్యాయుల జాబితాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఉపాధ్యాయుల కొరత ఉన్న ...

Read More »

జనాభా నియంత్రణ అందరి బాధ్యత

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా నియంత్రణతోనే అభివద్ధి సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆయన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను నియంత్రించినప్పుడే ఏ కుటుంబమైనా దేశమైనా అభివద్ధి సాధిస్తుందని తెలిపారు. జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరు తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని జనాభా నియంత్రణకు అందరూ కట్టుబడి ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టియు రాష్ట్ర సదస్సు ఈనెల 16 తేదీన హైదరాబాదు విజ్ఞాన కేంద్రంలో వనమాల కష్ణ అధ్యక్షతన ఉంటుందని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న, దాసు, సూర్య శివాజీ చెప్పారు. ఈ మేరకు ఆర్మూర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించి, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తి ప్రక్రియను కొనసాగించి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని కెసిఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. ...

Read More »