Breaking News

Nizamabad News

సంతోషిమాత ఆలయంలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని హమాల్‌వాడి సాయిబాబా, సంతోషిమాత ఆలయంలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మను సంప్రదాయ బద్దంగా అలంకరించి బతుకమ్మలాడారు. నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లం సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీనివాస్‌ తెలిపారు.

Read More »

కెసిఆర్‌ను గద్దె దింపడమే కాంగ్రెస్‌ ధ్యేయం

రెంజల్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంతోపాటు కళ్యాపూర్‌, దండిగుట్ట, వీరన్నగుట్ట గ్రామాల మీదుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెంజల్‌ రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కెసిఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని దళితులకు మూడెకరాల ...

Read More »

కేర్‌ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థినిలు సుమారు 200 మంది సంప్రదాయ దుస్తులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్బంగా కళాశాల ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని, ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఆడపడుచులు గౌరమ్మను తలచుకుంటూ ఉత్సవాలు ...

Read More »

నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని మనోరమ సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆసుపత్రి స్థాపించి సంవత్సరకాలం పూర్తయినందున గురువారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి స్థాపించిన నాటినుంచి ప్రజలు తమపై నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారని, అతి విశాలమైన భవనంలో అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. తమ ఆసుపత్రిలో ...

Read More »

గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని లింగంపేట్‌, కొండాపూర్‌ గ్రామ పంచాయతీలోని కంచామహల్‌ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళి 50 గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ సిఐ దీపిక తెలిపారు. మంజప్రేమ్‌సింగ్‌ వ్యవసాయ భూమిలో మంజనార్చోడా అనే వ్యక్తి 50 గంజాయి మొక్కలు పెంచాడని వాటిని కాల్చివేశామని తెలిపారు. అదే వ్యవసాయ భూమిలో 1.2 కిలోల ఎండు గంజాయి ...

Read More »

టిఎస్‌ జేఏసి ఆవిర్భావం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాధించుకున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ కాలేదని, ఉద్యమకారుల పట్ల, విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పది విద్యార్థి సంఘాలతో టిఎస్‌ జేఏసి ఏర్పాటు చేసినట్టు ప్రతినిదులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా విద్యార్థి సంఘాలు ఏకమవుతూ జేఏసిగా ఏర్పడుతున్నాయని, నాటి సమైక్యవాదుల బానిస చెర నుంచి తెలంగాణ ...

Read More »

భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తి శ్రద్దలతో, శాంతియుతంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సూచించారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి అనుమతి పొందాలని, చందా విషయంలో ఎవరిని బలవంతం చేయకూడదని, దుర్గామాత సందర్శనకు వచ్చే మహిళలపై యువతులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా స్పీకర్‌ల విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, సమస్యలు ఏర్పడితే డయల్‌ ...

Read More »

బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మంగళవారం 12,20వ డివిజన్‌లలో ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా గుప్త మాట్లాడుతూ అర్బన్‌ నియోజకవర్గ ప్రజల నుంచి తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారున్నారని, విషయం తెలిసి తమకెంతో సంతోసం కలిగిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ...

Read More »

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాకు చెందిన యెండల సౌందర్య నిఖత్‌ జరీన్‌, గుగులోత్‌ సౌమ్య, పూర్ణ తదితరులు జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని కలెక్టర్‌ తెలిపారు. గెలుపు ఓటములు క్రీడా స్పూర్తిగా తీసుకొని ఓటమి చెందినపుడు కుంగిపోకుండా తిరిగి విజయం సాధించడానికి పట్టుదలతో కృషి ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ లలిత

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం నందిపేట మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను పోటీచేయనున్న ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళ తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ...

Read More »

సౌదీలో మృతుల దేహాలను స్వదేశానికి రప్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల సౌదీలో మృతి చెందిన నందిపేట్‌ మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన దేవిదాస్‌, నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన సయ్యద్‌ సత్తర్‌ మృత దేహాలను స్వదేశానికి రప్పించాలని తెలంగాణ గల్ప్‌ ఫోరం అధ్యక్షుడు వసంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 9న ఇద్దరు మృతి చెందారని, సౌదీలో ఒకే గదిలో ఉంటూ పనులు చేసుకునేవారని, అగ్నిప్రమాదం చోటుచేసుకోగా మృతి చెందారని వివరించారు. నాటి నుంచి బాధిత ...

Read More »

రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మండలంలోని నీలా గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అఖిలబేగం, ...

Read More »

ఈవిఎంల వినియోగంపై అవగాహన

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దూపల్లి గ్రామాల్లో ఈవిఎం మిషన్ల ఉపయోగంపై ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో వీటి గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఓటరు ఈవిఎంపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏపిఎం చిన్నయ్య, తాజా మాజీ సర్పంచ్‌ చందూరు సవిత, రవి, మదన్‌ తదితరులున్నారు.

Read More »

చిన్నారుల బతుకమ్మ సంబరాలు

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా, కందకుర్తి, అంగన్‌వాడి కేంద్రాల్లో సోమవారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో చిన్నారులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండగ సందర్భంగా ప్రతియేట ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో చిన్నపిల్లలతో బతుకమ్మ నిర్వహిస్తామని సూపర్‌వైజర్‌ ప్రమీల తెలిపారు. తీరొక్కపూలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తయారుచేసిన బతుకమ్మ చూపరులను ఆట్టుకున్నాయి. చిన్నారులకు పలు రకాల క్రీడలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు సూపర్‌వైజర్‌ ప్రమీల, ప్రదానోపాధ్యాయుడు సాయిలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారాం, రాజు, శ్రీనివాస్‌, ...

Read More »

ఎన్నికల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌తో 24 గంటల నిఘా

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో ప్లయింగ్‌ స్క్వాడ్స్‌ ద్వారా 24 గంటల నిఘా ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జనహిత భవనంలో ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్క్వాడ్స్‌, స్టాటిస్టికల్‌ సర్వే లైన్స్‌ టీం, వీడియో టీం, అకౌంటింగ్‌ టీంలు 24 గంటల పాటు నిర్విరామంగా మూడు షిఫ్టుల్లో ...

Read More »

ఎన్నికల నిర్వహణలో నిబందనలు అతిక్రమించొద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో ఎవరు నిబంధనలు అతిక్రమించకుండా సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబందనలపై సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలపై ఆదేశాలు, సలహాలు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా ఎస్‌పి శ్వేతా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె తదితరులు పాల్గొన్నారు.

Read More »

11న ఏబివిపి పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పార్శి రాములు కళ్యాణ మండపంలో ఈనెల 11వ తేదీన ఏబివిపి పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు పూర్వ విద్యార్థులు వెంకటస్వామి, నరేశ్‌లు తెలిపారు. సోమవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో ఏబివిపి ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి ఏబివిపి జాతీయ సహ సంఘటన కార్యదర్శి లక్ష్మణ్‌, పూర్వ జాతీయ అధ్యక్షుడు ఎన్‌సిఆర్‌టి సభ్యులు మురళీమనోహర్‌లు పాల్గొననున్నట్టు తెలిపారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ...

Read More »

బంగారు తెలంగాణ కోసం తెరాసను గెలిపించుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే తెరాసను గెలిపించుకోవాల్సిన అవసరముందని జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తెరాస అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరఫున సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. సదాశివనగర్‌ మండలం మల్లుపేట గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఇంటింటికి తాగునీరు, సిసి రోడ్లు, నిరంతర విద్యుత్తు, అందరికి పింఛన్లు, ఎకరాకు 4 వేలు, రైతుబీమా తదితర సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ తెలంగాణ ...

Read More »

జిల్లా ముదిరాజ్‌ ఐక్య వేదిక అధ్యక్షునిగా రాజేశ్వర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా ముదిరాజ్‌ ఐక్య వేదిక నూతన అధ్యక్షునిగా రాజేశ్వర్‌ను ఎన్నుకున్నారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన ముదిరాజ్‌ ఐక్య వేదిక సమావేశంలో జిల్లా కమిటీతోపాటు మండల కమిటిలను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా హన్మాండ్లు, సహాయ కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా బండి రాములు, సలహాదారులుగా బుచ్చన్న, సాయిలు తదితరులను ఎన్నుకున్నారు. ముదిరాజ్‌ల ఐక్యతకు అభివృద్దికి అందరు పాటుపడాలని ప్రమాణం చేశారు.

Read More »

ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర కీలకం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో ఎన్నికల మానిటరింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవిఎం యంత్రాలపై మాక్‌ పోలింగ్‌ నిర్వహించి చూపించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి మీడియా వాటి మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు. ప్రకటనలకు, వార్తకు ఉన్న తేడాను గమనించి రాయాలన్నారు. లాభదాయక వార్తలు, ప్రకటనల పట్ల నిరంతర ...

Read More »