Breaking News

Nizamabad News

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో పైప్‌లైన్‌ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ గురువారం ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3 లక్షలు, మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో మంచినీటి పైప్‌లైన్‌ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పిట్ల విద్య వేణుగోపాల్‌, భూమేశ్వర్‌, ఎ.ఇ. జగన్నాథం, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రైతుల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేద్దాం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమానికి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహకార సంఘం ప్రతినిదులు కలిసికట్టుగా పనిచేయాలని ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ అన్నారు. కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జమాఖర్చులు, ఆర్థిక నివేదికపై చర్చించారు. కామారెడ్డి సంఘంలో విలీనమై ఉన్న చిన్నమల్లారెడ్డి, గర్గుల్‌ సంఘాలను వేరుచేయడానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిలు పంపుతున్నట్టు తెలిపారు. చిన్నమల్లారెడ్డి, ఇస్రోజివాడి, ఉగ్రవాయి గ్రామాల్లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ...

Read More »

కొనసాగుతున్న తెరాస సభ్యత్వ నమోదు

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో రెండ్రోజుల్లో తెరాస సభ్యత్వ నమోదు పూర్తవుతుందని మండల పార్టీ అధ్యక్షుడు గైని విఠల్‌ అన్నారు. మండలంలోని మండల పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభించి మాట్లాడారు. నిజాంసాగర్‌ సర్పంచ్‌ బేగరి రాజు పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నారు. మండలంలో 6425 సాధారణ సభ్యత్వ నమోదు లక్ష్యం ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, నాయకులు లక్ష్మణ్‌, తదితరులున్నారు.

Read More »

అధిక లోడ్‌ వాహనాల సీజ్‌

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక లోడ్‌తో వెళుతున్న వాహనాలపై దాడులు నిర్వహించి ఏడు వాహనాలు పట్టుకొని సీజ్‌ చేసినట్టు కామారెడ్డి ఆర్టీవో శ్రీనివాస్‌ తెలిపారు. డిటివో ఆదేశాల మేరకు వాహనాలపై దాడులు చేపట్టామని, అధిక లోడ్‌తో వెలుతున్న వాహనాలు పట్టుకొని సీజ్‌చేసి జరిమానా విధించినట్టు వివరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడం, ఓవర్‌లోడ్‌తో వెళ్లిన, లైసెన్సులు లేకున్నా కేసులు తప్పవని హెచ్చరించారు.

Read More »

కంటి వైద్య శిబిరం

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దుమ్‌పూర్‌ గ్రామంలో కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి వైద్యులు శివకుమార్‌ 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమగువరికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో మక్దుమ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ సవాయిసింగ్‌, గాలిపూర్‌ సర్పంచ్‌ రాగాగౌడ్‌ తదితరులున్నారు.

Read More »

అంగన్‌వాడి టీచర్లకు శిక్షణ

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో అంగన్‌వాడి టీచర్లకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. పూర్వప్రాథమిక విద్య కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. పిట్లం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ కొమరవ్వ టీచర్లకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్దిపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అంగన్‌వాడి కేంద్రాలకు చిన్నారులను ఎలా తీసుకురావాలి, వారికి బోధించే విధానంపై శిక్షణలో పేర్కొన్నారు.

Read More »

తాళ్లరాంపూర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలో మండల కార్యదర్శుల బృందంచే స్పెషల్‌ డ్రైవ్‌ గురువారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటి పన్ను వసూలు చేశారు. 40 వేల పైచిలుకు బకాయిలు వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల వారిగా లక్ష 7 వేల 600 పన్ను వసూలైనట్టు ఎంపిడివో తెలిపారు. ఇందులో మండల కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, తిరుపతి రెడ్డి, రమేశ్‌, సాజన్‌కుమార్‌, ...

Read More »

చెక్కుల పంపిణీ

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ ఆంధ్రాబ్యాంకులో లింకేజి కింద మంజూరైన రుణాలను స్వయం సహాయక సభ్యులు ఎంపిపి సునంద గంగారెడ్డి, గున్కుల్‌ సర్పంచ్‌ బాలమణి, ఎంపిటిసి ఉన్నీసాబేగం, సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. మండలంలోని 160 సంఘాల సభ్యులకు 3.50 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరైనట్టు ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి, సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు ...

Read More »

25న మండల సర్వసభ్య సమావేశం

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్యసమావేశం ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు గురువారం ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Read More »

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలి

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ వినియోగదారులకు ఆయా మండలాల, గ్రామాల విద్యుత్‌ అధికారులు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలని డిఇ సాన్యానాయక్‌ అన్నారు. గురువారం మోర్తాడ్‌లోని బద్దంవాడ సంఘభవనంలో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల వినియోగదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బకాయిలు సకాలంలో చెల్లించి విద్యుత్‌శాఖకు సహకరించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్‌పై ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా సమాచారం ఇచ్చిన వెంటనే సరిచేసి విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ...

Read More »

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరా, పాలెం, తడపాకల్‌, గ్రామాల్లోగల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు దుగ్గెర రాజేందర్‌, తోగేటి అనిత శ్రీనివాస్‌, లోలం లావణ్య, చిన్నారెడ్డిలు, ఎంఇవో రాజేశ్వర్‌ గురువారం పాఠ్యపుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఇంగ్లీష్‌, తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలను ముందస్తుగా సరఫరా చేయడంతో ఆయా పాఠశాలలకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, సిఆర్‌పిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

కళ్యాణలక్ష్మి అమలుచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద తల్లిదండ్రుల ఆడపిల్లలకు భారం పడకుండా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేసి అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, వైస్‌ ఎంపిపి పాపాయి పవన్‌, మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివెనవీన్‌, జిల్లా తెరాస ఉపాధ్యక్షుడు రాజా పూర్ణానందం, మండల తెరాస అద్యక్షుడు కల్లడ ఏలియాలు అన్నారు. గురువారం మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో స్తానిక ఎంపిపి అధ్యక్షతన తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు ...

Read More »

వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ

  బీర్కూర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని నాచుపల్లి గ్రామంలో జడ్పిటిసి కిషన్‌ నాయక్‌ ఆద్వర్యంలో వాటర్‌ ట్యాంకు నిర్మాణాలకు గురువారం భూమిపూజ చేశారు. నాచుపల్లి గ్రామంలో 40 వేల లీటర్ల జిఎల్‌ఎస్‌ఆర్‌ సామర్థ్యంగల నీటి ట్యాంకును రూ. 16 లక్షల వ్యయంతో, రాములగుట్ట తాండాలో 20 వేల లీటర్ల వాటర్‌ట్యాంకులకు రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంలో బాగంగా వాటర్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మి ...

Read More »

చదువుతోనే అభివృద్ది

  నందిపేట, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుతోనే అభివృద్ది సాద్యమని ఉర్దూమీడియం ప్రైమరీ స్కూల్‌ ఎస్‌ఎంసి ఛైర్మన్‌ బిలాల్‌ అన్నారు. గురువారం మొదటి తరగతి నూతన అడ్మిషన్లు పొందిన విద్యార్తులకు తీపి అన్నం తినిపించి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఆంగ్ల విద్య ఆదరణ పెరుగుతున్నప్పటికి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాష విద్యకొరకు విద్యార్థులను చేర్పించడం శుభసూచకమన్నారు. అదేవిధంగా ఐలాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పిఏసిఎస్‌ ఛైర్మన్‌ లక్ష్మినారాయణ విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆయా పాఠశాలల ...

Read More »

అన్నింటికీ ‘ఆధార’మే

ఫైనాన్స్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం పన్ను ఎగవేతలు, ఇతరత్రా అవకతవకలను నిలువరించాలంటే ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి అని లోక్‌సభలో ఫైనాన్స్‌ బిల్లుపై చర్చకు సమాధానం చెబుతూ జైట్లీ స్పష్టం చేశారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలన్న సభ్యుల డిమాండును ఆయన తోసి పుచ్చారు. ప్రజలందరూ ఆధార్‌ కలిగి ఉండేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా అన్న ఒక సభ్యుని ప్రశ్నకు అవునని ఆయన సమాధానం చెప్పారు. వ్యవసాయం రాష్ర్టాల పరిధిలోని అంశమని, వ్యవసాయంపై పన్ను విధించే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన ...

Read More »

సయోధ్య సాధ్యమేనా?

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ అత్యధికస్థానాలు సాధించి, యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కావడంతో అయోధ్య అంశంలో ఏదో ఒక కదలిక తప్పదని అనుకున్నదే. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధినాయకులంతా బహిరంగ సభల్లో రాముడికి జైకొడుతూ, ఆలయ నిర్మాణం జరగాలంటే తమకు అద్భుత మెజారిటీ దక్కాల్సిందేనని ప్రజలకు గుర్తుచేశారు. ప్రధానితో ఒక్క వేదికనూ పంచుకోని యోగి ఆదిత్యనాథ్‌, తన ప్రచార సభల్లో రామమందిర నిర్మాణం ఖాయమని హామీ ఇస్తూ వచ్చారు. ‘నిర్మాణాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉన్నదా?’ అని సవాలు చేశారు. ‘మసీదు కూల్చివేతనే ...

Read More »

అమ్మ పుట్టినరోజునే ఆమెను హత్యచేశాడు. కారణం..

ఫ్లోరిడా: ప్రాణం పోసిన అమ్మ పుట్టిన రోజు వచ్చిందంటే ఆమె కడుపున జన్మించిన వారికి చెప్పలేని సంతోషం ఉంటుంది. అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని అత్రుతగా ఎదురుచూస్తారు. కానీ.. అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ యువకుడు విరుద్ధంగా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లిని ఆమె పుట్టిన రోజు నాడే కడతేర్చాడు. జోషూ లియోన్ కర్మోనా అనే 18 ఏళ్ల యువకుడు అమ్మను చంపేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూశాడు. ఆమె పుట్టిన రోజు నాడే ఆమెను చంపాలని ముహూర్తంగా ఎంచుకున్నాడు. అనుకున్న రోజు రానే ...

Read More »

మధ్యాహ్నం 2 తర్వాత ఏమీ తినొద్దు

ఉపవాసాలు ఉండటం.. కేవలం పళ్ల రసాలు తిని ఉండటం… బరువు తగ్గడానికి చాలా మంది ఇలా రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ‘గూట్లో దీపం.. నోట్లో ముద్ద’ అని మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు. అంటే చీకటిపడి దీపాలు వెలిగించగానే తినేసి, తర్వాత త్వరగా పడుకోమని అర్థం. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు ఈ సమయాన్ని మరింత ముం దుకు జరిపారు. ‘మీరు ఎంత తిన్నా.. ఏమి తిన్నా ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 2 లోపు తినేయండి. ఆ తర్వాత ఇక ఏమీ ...

Read More »

బిసి హాస్టల్‌ తనిఖీ

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బిసి హాస్టల్‌ను జిల్లా సహాయ బిసి సంక్షేమ అధికారి కేశవులు బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా హాస్టల్‌లోని రికార్డులను పరిశీలించారు. హాస్టల్‌లోని హాజరు పట్టికను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థుల వివరాలను వార్డెన్‌ దినేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు పౌష్టిక ఆహారంతోపాటు శుద్దమైన తాగునీటిని అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని, హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన వార్డెన్‌కు సూచించారు.

Read More »

అంగరంగవైభవంగా హనుమాన్‌ మండల పూజ

  గాంధారి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ముదెల్లి గ్రామంలో బుధవారం హనుమాన్‌ మహా మండల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక సర్పంచ్‌ పద్మా మోహన్‌ యాదవ్‌ హనుమాన్‌ యజ్ఞాన్ని నిర్వహించారు.ఉదయం నుంచే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. యజ్ఞ మండపం ఆవరణను ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉదయం హనుమాన్‌ యజ్ఞం నిర్వహించిన అనంతరం ఆంజనేయ స్వామికి ప్రత్యేకపూజలు చేపట్టారు. స్థానిక హనుమాన్‌ ఆలయంలో స్వామివారి విగ్రహానికి చంద్రం పూసి పూజలు చేపట్టారు. మహా ...

Read More »