Breaking News

Nizamabad News

గాంధారిలో గంజాయి పట్టివేత

    గాంధారి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో గురువారం ఉదయం గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గంజాయి నిందితులను, కారును పోలీసులు విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం కథనం ప్రకారం… బుధవారం రాత్రి గాంధారి ఎస్‌ఐ రాజేశ్‌ పోలీసులతో కలిసి మండల కేంద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. గురువారం వేకువజామున 5 గంటలకు హైస్కూల్‌ ఎదుట చద్మల్‌ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇండికా కారు ఎపి 25 ...

Read More »

హోటళ్లపై ఎన్‌ఫోర్సుమెంట్‌ దాడులు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై గురువారం ఎన్‌ఫోర్సుమెంట్‌ శాఖాధికారులు ఆకస్మిక దాడులు చేశారు.హోటళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారనే సమాచారంతో దాడులు చేశారు. ఈ సందర్భంగా 5 హోటళ్లపై కేసులు నమోదు చేసి నిబందనలకు విరుద్దంగా వినియోగిస్తున్న 11గృహ వినియోగ గ్యాస్‌సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

Read More »

జాతీయపక్షి అధికారులకు అప్పగింత

  కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ శివారులో నీటికోసం గ్రామంలోకి వచ్చిన జాతీయపక్షి నెమలిని గ్రామస్తులు గమనించి అధికారులకు అప్పగించారు. గురువారం అడ్లూర్‌ శివారులోని పౌల్ట్రీఫాంలోకి నీటికోసం నెమలి వచ్చింది. గమనించిన గ్రామస్తులు దాన్ని పట్టుకొని సురక్షితంగా అటవీశాకాధికారులకు అప్పగించారు.

Read More »

పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి

  – వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్‌ డాక్టర్‌ వాకటి కరుణ కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలందించాలని వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్‌ డాక్టర్‌ వాకటి కరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఆసుపత్రిల వారిగా పిహెచ్‌సి, సబ్‌సెంటర్ల పనితీరు విధానాన్ని ప్రస్తావించారు. పనివిధానం మెరుగుపరుచుకునేందుకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ...

Read More »

ధాన్యం దళారుల పాలు చేయొద్దు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించిన రైతు ధాన్యాన్ని దళారుల పాలు చేసి నష్టపోకూడదని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం సరైన మద్దతు ధర అందిస్తుందని, దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని ఆర్డీవో అన్నారు. సన్నరకం ధాన్యానికి రూ. 1470, దొడ్డు రకం ధాన్యానికి రూ. 1510 ...

Read More »

ఘనంగా కుస్తీపోటీలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని బీర్కూర్‌ గ్రామంలో గత మూడురోజులుగా కొనసాగుతున్న గజ్జలమ్మ జాతరలో భాగంగా గురువారం కుస్తీపోటీలు గ్రామ సర్పంచ్‌ నర్సయ్య ఆద్వర్యంలో నిర్వహించారు. పోటీలకు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. చివరి కుస్తీ మహారాష్ట్రలోని జావూరు గ్రామానికి చెందిన సంజయ్‌ విజేతగా నిలిచాడు. బీర్కూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ. 2 వేలు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కుస్తీ పోటీలను తిలకించడానికి బీర్కూర్‌, బాన్సువాడ, మహారాష్ట్ర నుంచి ప్రజలు ...

Read More »

బిజెపి బీర్కూర్‌ మండల కమిటీ

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గురువారం బిజెపి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ అద్యక్షుడు చిదుర సాయిలు ఆధ్వర్యంలో బీర్కూర్‌ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సురేశ్‌, ఉపాద్యక్షుడుగా హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శులుగా బీర్కూర్‌ సుభాష్‌, రాములు, కార్యదర్శిగా భీంరావులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకున్న కమిటీ బిజెపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పైడిమల్లి లక్ష్మినారాయణ,అనిల్‌, ప్రణయ్‌, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

లక్షణంగా నిర్మించారు – అనాథగా వదిలేశారు

  – సిహెచ్‌ కొండూరులో ప్రారంభానికి నోచుకోని ఎన్టీఆర్‌ విగ్రహం నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని తమగ్రామంలో ప్రతిష్టించాలనే లక్ష్యంతో టిడిపి నాయకులు, గ్రామస్తులు మండలంలోని సిహెచ్‌ కొండూరులో ప్రధాన రహదారి వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. బడానాయకులను పిలిచి ఘనంగా ప్రారంభోత్సవం చేద్దామనే సమయంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సిద్దించడం, టిడిపి నాయకులందరు తెరాసలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో ...

Read More »

ఆలయ ప్రారంభానికి ఎమ్మెల్యే రాక

  నందిపేట, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మినర్సింహస్వామి, ఆంజనేయస్వామి, శివపంచాయతన ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేయాల్సిందిగా డొంకేశ్వర్‌ గ్రామ ఆలయ కమిటీ సభ్యులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా నికాల్‌పూర్‌ గ్రామానికి వెళ్లే బస్సులు డొంకేశ్వర్‌ మీదుగా వెళ్లేలా చూడాలని, దాంతో ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. డొంకేశ్వర్‌ నుంచి నాళేశ్వర్‌ వరకు వేసిన నూతన లింకురోడ్డు వద్ద డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌ గ్రామాల మధ్య దూరం ...

Read More »

‘బాహుబలి-2’ విడుదల చేయొద్దని పిటిషన్

చెన్నై: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-2 మూవీకి తాజాగా ఓ సమస్య తలెత్తింది. ఇటీవల తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మూవీ యూనిట్ అట్టహాసంగా నిర్వహించింది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న తరుణంలో మూవీని నిలిపి వేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రావలసిన బకాయిలు చెల్లించేవరకూ బాహుబలి-2 విడుదలను నిలిపివేయాలని తన పిటిషన్‌లో శరవణన్ పేర్కొన్నారు. రూ.1.18 కోట్ల మేర బకాయిలు ...

Read More »

ఎండల్లో చర్మ రక్షణ

 ఏప్రిల్‌ నెల వచ్చేసింది . మేలో సూర్యుడు తన వీర ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇక ఎండలు మండిపోతున్నాయి . ఉదయం పదకొండు దాటిన తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయం కలిగేలా ఉంది. ఒకవేళ ఏదైనా పని ఉండి ఎండకు బయటకు వెళ్లామా ఎండ వేడిమికి చర్మం కందిపోతుంది. నల్లగా మారిపోతుంది. అలా మారకుండా ఉండడానికి చాలామంది సన్‌స్ర్కీన్‌ లోషన్లు రాసుకుంటారు. కానీ ఆ లోషన్ల కన్నా కూడా తీసుకునే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉపయోగకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి చర్మాన్ని కాపాడటమే కాకుండా ...

Read More »

ఆధార్‌లేకుంటే ఖాతాల నిలిపివేత

ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ హెచ్చరిక ఏప్రిల్‌ 30 వరకు గడువు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) బహుపరాక్‌.. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేశారా? లేకుంటే ఏప్రిల్‌ 30లోపు మీ బ్యాంకుకు నో యువర్‌ కస్టమర్‌ (కెవైసి) వివరాలతోపాటు ఆధార్‌ నెంబర్‌ను కూడా అందజేయండి. లేని పక్షంలో ఆ ఖాతాను బ్యాంకు అధికారులు స్తంభింపజేస్తారు. ఈ నిబంధన బీమా పాలసీలు, షేర్ల ఖాతాలకు కూడా వర్తిస్తుంది. 2014 జూలై నుంచి ఆగస్టు 2015 వరకు తెరిచిన అన్ని ఖాతాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదాయం ...

Read More »

కాళ్లు పట్టుకుంటా.. ప్లీజ్ నా బైకెక్కు..!

బెంగుళూరు: ఓ యువకుడు తన బైకెక్కమని ఓ యువతిని తెగబతిమాలుకున్నాడు. అంతేనా నడి రోడ్డులో ఆ యువతి కాళ్లు కూడా పట్టుకున్నాడు. బెంగుళూరులోని కత్రిగుప్పే అనే ప్రాంతంలో జరిగిందీ సంఘటన. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే రోడ్డుపైకి వెళ్తున్న ఓ యువతిని సడెన్‌గా ఓ యువకుడు వచ్చి అడ్డుకున్నాడు. తన బైకెక్కమంటూ ఆవిడని వేడుకున్నాడు. ఎంత చెప్పినా తను ఒప్పుకోడం లేదు. కాసేపు ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ అలా సైలెంట్‌గా నిల్చున్నారు. ఉన్నట్లుండి ఆ ...

Read More »

ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ- నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్ స్పెక్షన్ కేడర్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్ ఆఫీసర్స్‌ భర్తీ కోసం అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 8 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌(ఎంపిసి)తో ఇంజనీరింగ్‌ డిగ్రీ (మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ప్రొడక్షన్ /ఇన్ స్ట్రు మెంటేషన్/ ఐటి/ కెమికల్‌/ మెటలర్జీ/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేసిన వారు/ చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 1993 జనవరి 2 నుంచి 1998 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ...

Read More »

ధర్మయుద్దం గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 18న విద్యార్థి సంఘాల జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్మయుద్దం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను బుధవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా విద్యార్థి జేఏసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావ్యతిరేక విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాటం, ఉద్యోగాలు తదితర అంశాలపై దర్మయుద్దం సభలో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పేర్కొన్న విధంగా ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసి ప్రతినిదులు బాలు, సందీప్‌, భాను, లక్ష్మణ్‌, ...

Read More »

ఘనంగా గజ్జలమ్మ జాతర

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్‌ నర్సయ్య ఆద్వర్యంలో గజ్జలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. బుధవారం ఎడ్లబండ్ల ఊరేగింపు, రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గురువారం కుస్తీ పోటీలు ఏర్పాటుచేసినట్టు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.

Read More »

సైకిల్‌యాత్రికునికి ఎంపి ప్రశంసా

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు సైకిల్‌ యాత్ర చేస్తున్న రవికిరణ్‌ను బుధవారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ అభినందించారు. నిజామాబాద్‌ జిల్లా వర్నికి చెందిన బడ్డోల రవికిరణ్‌ జనవరి 6వ తేదీ నుంచి కన్యాకుమార్‌ నుంచి కాశ్మీర్‌ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. రైడ్‌ ఫర్‌ గ్రీన్‌ పేరిట సైకిల్‌ యాత్ర చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపిని కలిసిన రవికిరణ్‌ను అభినందించారు. పచ్చదనం కోసం రవికిరణ్‌ చేపడుతున్న యాత్ర ప్రశంసనీయమని ...

Read More »

ఎండదెబ్బతో ఉపాధి కూలీ మృతి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారిపేట గ్రామంలో బుధవారం ఎండదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందాడు. గ్రామంలో ఉపాధి హామీ కూలీపనిచేస్తుండగా వడదెబ్బ తగిలి రాపర్తి నారాయణ (60) మృతి చెందాడు. పనుల వద్ద టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, తాగునీటి వసతి లేకపోవడంతో నారాయణ మృతి చెందినట్టు ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నారాయణ మృతి చెందాడని ఆరోపించారు. ఉపాధి కూలీలకు సరైనవసతులు కల్పించకపోవడం అన్యాయమని ఆగ్రహం ...

Read More »

బడిపిల్లలకు నోటుపుస్తకాల పంపిణీ

  గాంధారి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలకు నోటుపుస్తకాలను గాంధారి ఎంఇవో సేవ్లానాయక్‌ అందజేశారు. బుధవారం మండలంలోని తిప్పారం గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఈ సందర్బంగా బడిబయట పిల్లలు పాఠశాలల్లో చేరితే వారికి ఉచితంగా పుస్తకాలతోపాటు నోటుపుస్తకాలు అందజేస్తామని పాఠశాల ఉపాధ్యాయులు ముందుకువచ్చారు. దీంతో గ్రామంలోని బడిబయట పిల్లలు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. దీంతో బడిలో చేరిన పిల్లలకు నోటుపుస్తకాలు అందజేశారు. బడిబయట పిల్లలను బడుల్లో చేర్పించడానికి పాఠశాల ఉపాధ్యాయులు ...

Read More »

ఉపాధి హామీ పనుల పరిశీలన

  గాంధారి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను కామారెడ్డి జిల్లా డ్వామా పిడి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని తిమ్మాపూర్‌లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఎండాకాలం సందర్భంగా ఉదయమే పనులు చేయాలని, మధ్యాహ్న సమయంలో పనులు చేయకూడదని సూచించారు. ప్రతి జాబ్‌కార్డు దారునికి పని కల్పించడం జరుగుతుందన్నారు. కూలీలు జాగ్రత్తగా వుండాలన్నారు. వేసవి కాలం సందర్భంగా కూలీలకు టెంట్‌లను అందిస్తామన్నారు. కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు ...

Read More »