Breaking News

Nizamabad News

జనాభా నియంత్రణకు అవగాహన కల్పించాలి

రెంజల్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరు తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని మండల వైద్యాధికారి క్రిస్టినా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీనీ ప్రారంభించారు. గాంధీ చౌరస్తా మీదుగా పలు వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను నియంత్రించినప్పుడే ఏ కుటుంబమైనా, దేశమైనా అభివద్ధి ...

Read More »

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కలెక్టర్లను ఆదేశించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఈ చట్టంలోని అదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల వ్యర్ధాలు, మురుగు చెత్త, భవన నిర్మాణాల వ్యర్థాలను ప్లాస్టిక్‌ ...

Read More »

సభ్యత్వ నమోదులో యువత కీలకం

రెంజల్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి పార్టీ సభ్యత్వ నమోదులో యువతే కీలకమని భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. రెంజల్‌ మండలం నీలా గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌లతో కలిసి పలువురికి సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

Read More »

సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగాలి

రెంజల్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సాటాపూర్‌, రెంజల్‌ గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలువురికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ఫారుక్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదును నాయకులు కార్యకర్తలు ఉద్యమంలా ...

Read More »

అగ్రికల్చర్‌ సెక్రెటరీతో ఎంపి భేటీ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్రికల్చర్‌ సెక్రెటరీ సంజయ్‌ అగర్వాల్‌లో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి బుధవారం భేటీ అయ్యారు. అగ్రికల్చర్‌ సెక్రటరీ కార్యాలయంలో జరిగిన భేటీలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కాగా పసుపు పంటపై విస్తృతంగా చర్చించారు. రెండు వారాల్లో ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రియెంట్‌ మేనేజ్మెంట్‌ (పంట నాణ్యతను పెంచే కార్యక్రమం), పసుపు పంటకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ కోసం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో ఎంపీ అర్వింద్‌ ధర్మపురితో పాటు మరో ఇద్దరు రైతులకు పాల్గొనే అవకాశమున్నట్టు ...

Read More »

నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటితోనే మానవ భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం అంకుశాపూర్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో వర్షపునీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాలను పెంపొందించేందుకు దష్టి పెట్టకపోతే మానవ మనుగడ కు కష్టతరమని జల సంరక్షణలో అందరు భాగస్వాములు అయినప్పుడే సాధ్యమవుతుందని ఇది ఒక ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే ...

Read More »

ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా గుర్తింపు తెచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ జలశక్తి అభియాన్‌ అమలు జిల్లా నోడల్‌ అధికారి నికుంజ్‌ కిషోర్‌ సుంద రాయ్‌ అన్నారు. వర్షపు నీటి సంరక్షణ పద్ధతులపై గ్రామపంచాయతీ భవనములో సర్పంచ్‌ ఎంపిటిసి వార్డ్‌ మెంబర్‌తో పాటుగా ప్రజలకు ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో పడిన వర్షం నీటి కంటే ఎక్కువగా వినియోగించుకుంటున్నారని ...

Read More »

తపస్‌ సభ్యత్వ నమోదు

బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో బుధవారం తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌ కుమార్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాటు పడుతుందన్నారు. మండలంలో సభ్యత్వ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నామ్‌దేవ్‌, మండల కార్యదర్శి బాలరాజ్‌, శోభన్‌బాబు పాల్గొన్నారు.

Read More »

తెరాస పేదల ప్రభుత్వం

బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని తెరాస రాష్ట్ర నాయకులు, సభాపతి తనయుడు పోచారం సురేందర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్లి గ్రామంలో బుధవారం బోయి కుటుంభ సభ్యుల కొరకు నూతనంగా నిర్మించనున్న 20 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం గ్రామంలో తెరాస సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ...

Read More »

మొక్కలు నాటాలి… సంరక్షించాలి….

బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా హరిత హారంలో తమ ఇంటి పరిసరాల్లో, పంట పొలాల్లో మొక్కలు నాటీ వాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. గ్రామం లో ప్రజలకు మొక్కలు పంచారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శ్యామల, ఎంపీటీసీ ...

Read More »

జాతీయస్థాయి గుర్తింపు కోసం అంకాపూర్‌ కృషి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలలో చేపట్టే జలసంరక్షణలో అంకాపూర్‌ గ్రామం జాతీయస్థాయిలో గుర్తింపు పొందే విధంగా గ్రామస్తులు కషి చేయాలని కేంద్ర ప్రభుత్వ సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ, జలశక్తి అభియాన్‌ జిల్లా నోడల్‌ అధికారి నికుంజ్‌ కిషోర్‌ సుందరాయ్‌ అన్నారు. బుధవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై పాఠశాల విద్యార్థులచే ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావుతో ...

Read More »

పశువులకు టీకాలు

బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ధుర్కి గ్రామంలో బుధవారం పశు వైద్య అధికారులు ఆవులకు, గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ శ్యామల మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణకు గ్రామంలో గేదెల కు, ఆవులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

విద్యాసంస్థల బంద్‌

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలంలో విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే ధోరణి మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రించాలని పేర్కొన్నారు. పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అరుణ్‌, చిన్న విజయ్‌, ...

Read More »

వేతనాల కోసం ధర్నా

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ విలీన గ్రామాల నర్సరీ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండడాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఐసిటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ మున్సిపల్‌ విలీన గ్రామాల్లో గతం నుంచి కొనసాగుతున్న నర్సరీ యొక్క నిర్వహణ కార్మికులు 100 మంది వరకు ఉంటారు. కాగా వీరికి మూడు ...

Read More »

మాచారెడ్డికి సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని బాలుర వసతి గృహానికి ఏఐఎస్‌ఎప్‌ సైకిల్‌ జాత చేరుకుంది. ఈ సంధర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు గణేష్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యార్థులకు నిలయంగా మారాయని అన్నారు. అంతే కాకుండా విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని కేజీ నుంచి పిజి ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్‌ నేడు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. సంక్షేమ హాస్టల్‌, జూనియర్‌ కళాశాలలు, ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హాసన్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల వల్లే పార్టీ సభ్యత్వాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వీ.గంగాధర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పిప్పిరి సుష్మా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో హిందూ ధర్మంపైన, దేవాలయాలపైన మతోన్మాదుల దాడులు అనేకంగా పెరుగుతున్నాయని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో దుర్గాదేవి ఆలయం మీద దాడి జరిగిందని, దేశంలో లవ్‌ జీహాద్‌ ద్వారా మతమార్పిడులు అధికామవుతున్నాయని విహెచ్‌పి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రతీ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ...

Read More »

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70 వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ అవిర్భావ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థి పరిషత్‌ చేసిన సేవా, నిర్మాణాత్మక అందోళనాత్మక కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు నరేష్‌, జంగం రాజాగౌడ్‌, నర్సింహరాజు, నరెందర్‌ రెడ్డి నారాయణ, భాను, లక్ష్మణ్‌, నిఖిల్‌, రాజు, మహేష్‌ కళాశాల విద్యార్థులు ...

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, కార్పెట్లు, బెడ్‌షీట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఉమా వినయ్‌కుమార్‌, ఎంపిపి పట్లోల్ల జ్యోతి, దుర్గారెడ్డి, ఎంపిటిసి రీనారాని సందీప్‌, ఏఎంసి ఛైర్మన్‌ విఠల్‌ చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రావు, ఏసయ్యా, లింగాగౌడ్‌, వార్డెన్‌ జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

వసతి గృహంలో సామగ్రి పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అచ్చంపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు అందజేశారు. సర్పంచ్‌ అనసూయ, సత్యనారాయణ, ఎంపిటిసి సుజాత రమేశ్‌ చేతుల మీదుగా వీటిని అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారి జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »