Breaking News

Nizamabad News

విద్యాసంస్థల ప్రారంభం నాటికి వాహనాలు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభమయ్యే వరకు వాహనదారులు సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో తమ తమ బస్సులు, వ్యానులు, ఇతరత్రా వాహనాలు ఫిట్‌నెస్‌ చేసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి డి.వి రెడ్డి తెలిపారు. సంబంధిత వాహనదారులు ఫిట్‌నెస్‌ లేకుండా వాహనాలను నడిపిన పక్షంలో జప్తు చేసి చట్టరీత్యా తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు, సంబంధిత వాహనదారులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలని ఆయన కోరారు.

Read More »

70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్లో జరుగు తుదివిడత ఎంపీటీసీ, జెడ్‌పిటిసి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా 70 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రం వారీగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 46 లోకేషన్లలో 229 సున్నిత అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినందున కేంద్రాలలో ఏలాంటి అవాంఛనీయ ...

Read More »

చెక్‌డ్యాం పనుల కొరకు సర్వే

బీర్కూర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూర్‌ మంజీర పరివాహక ప్రాంతంలో గల చెక్‌ డ్యామ్‌ పనుల కొరకు ఏ.ఇ. భూమన్న సర్వే చేపట్టారు. అలాగే 15 రోజులలో పనులు ప్రారంభం చేస్తామన్నారు. ఆయన వెంట బీర్కూర్‌ తెరాస మండల అధ్యక్షులు రఘు, బుడ్డరాజు, లాడిగం గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

ప్రశాంతంగా పరిషత్‌ తుదివిడత పోలింగ్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుదివిడత ప్రాదేశిక ఎన్నికలలో ఏలాంటి చెదురుముదురు సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌, ఆలూరు గ్రామాలలో, నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన వసతులను పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ ...

Read More »

నేడు తుదివిడత పోలింగ్‌

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో తుదివిడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా తప్పని సరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో తుదివిడత జెడ్‌పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు ఆర్మూర్‌ డివిజన్‌లోని 11 మండలాల్లో ఈ నెల 14 వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగతుందనీ చెప్పారు. 11 ...

Read More »

కామారెడ్డి మండలంలో ఎస్‌ఎస్‌సిలో 91.8 శాతం ఉత్తీర్ణత

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతి ఫలితాలను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. కామారెడ్డి మండలంలో 91.8 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మండల విద్యాశాఖాధికారి ఎల్లయ్య తెలిపారు. మండలంలో 22 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 886 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, ఇందులో 814 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. 6 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాదించాయని చెప్పారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో తిమ్మక్‌పల్లి (కె), అడ్లూర్‌, టేక్రియాల్‌, గర్గుల్‌, కెజిబివి టేక్రియాల్‌, ...

Read More »

బాలవికాస ప్రారంభం

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో సోమవారం బాలవికాస నీటి శుద్దికరణ పథకాన్ని ప్రారంభించారు. వరంగల్‌ నుంచి శ్రీనివాసరావు, విజయకమిటీ సభ్యులు అశోక్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నవీన్‌, నర్సింలు, ఉపాధ్యాయులు అశోక్‌తో పాటు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులకు నీటి శుద్దికరణ ద్వారా స్వచ్చమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ఫ్రాంక్లిన్‌ టెంప్టేషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో బాలవికాస పేరిట ప్రజలకు శుద్దమైన నీటిని అందిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే రామేశ్వర్‌పల్లిలో పథకాన్ని ప్రారంభించినట్టు వివరించారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ బైపాస్‌ రోడ్డు వద్ద సోమవారం వేకువజామున జరిగిన బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజు సన్హి, సంజీవ్‌ సన్హిలు నిజామాబాద్‌లో ఉంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు హైదరాబాద్‌కు నుంచి నిజామాబాద్‌ తిరుగు ప్రయాణంలో టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని కిందపడి మృతి చెందారని పోలీసులు చెప్పారు. బీహార్‌ ...

Read More »

కోర్టు భవనం కోసం స్థల పరిశీలన

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు భవనం కోసం స్థలాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా జడ్జి సుధ, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామం జాతీయ రహదారి వెంబడి సర్వేనెంబరు 312లోని సుమారు 25ఎకరాల స్థలాన్ని కోర్టు కోసం పరిశీలించారు. అంతకుముందు జడ్జి సుధను ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, అడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రాజ్‌కుమార్‌, జ్యుడిషియల్‌ సిబ్బంది ...

Read More »

పలు శాఖలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్పరెన్సు

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కింద మంజూరు చేసిన వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, పెండింగ్‌ వాటిని వెంటనే పూర్తి చేసి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేలా జిల్లా కలెక్టర్‌లు దష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె జోషి అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ సచివాలయం నుండి పంచాయతి రాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ...

Read More »

ఆంగన్‌వాడి కేంద్రం తనిఖీ

రెంజల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలోని ఆంగన్‌ వాడీ కేంద్రాలను సోమవారం సూపర్‌ వైజర్‌ ప్రమీల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పెండింగులో ఉన్న రికార్డులను పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట ఆంగన్‌ వాడి ఉపాధ్యాయురాలు అరుణ, రాణి ఉన్నారు.

Read More »

రెంజల్‌ మండల టాపర్‌గా ధనుష

రెంజల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వెలువడిన పదవతరగతి ఫలితాల్లో రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ధనుష 10 జిపిఏ సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ధనుష మండల కేంద్రంలోని మోడల్‌ పాఠశాలలో పదవ తరగతి చదివింది. పదవ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ మార్కులు సాధించి రెంజల్‌ మండల టాపర్‌గా నిలవడంతో మండల విద్యాశాఖ అధికారి గణేష్‌ రావు, తల్లిదండ్రులు, పలువురు అభినందనలు తెలిపారు.

Read More »

14న ఉచిత వైద్య శిబిరం

బీర్కూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ తండాలో 14వ తేదీ మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గ్రూఫ్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ సౌజన్యంతో మ్యాక్సుక్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసినట్టు ప్రతినిధులు తెలిపారు. శిబిరంలో ఉచితంగా షుగర్‌, బిపి టెస్టులు, జనరల్‌ ఫిజిషియన్‌ అందుబాటులో ఉంటారని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు.

Read More »

14న కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14వ తేదీ మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివ పార్వతి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆర్యవైశ్య సంఘం ప్రతినిదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7:15 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం పల్లకి ఊరేగింపుగా పట్టణం లోని అన్ని ఆర్యవైశ్య సంఘాల నుండి, సామూహిక కళాశాలతో, గాంధీ గంజి నుండి ఊరేగింపుతో దేవాలయానికి చేరుకుంటుందన్నారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, కుంకుమ ...

Read More »

ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడి మతి

హైదరాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు మతి చెందిన సంఘటన మేడ్చల్‌ జిల్లా జవహార్‌ నగర్‌ పి.యస్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హరికష్ణ అనే ఐదు సంవత్సరాల బాలుడి పైకి వేగంతో ద్విచక్ర వాహనం తీసుకువెళ్లడంతో తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మతి చెందాడు. బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని జవహార్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పదిహేను రోజుల ...

Read More »

సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి

నిజాంసాగర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌తోనే అభివద్ధి జరుగుతుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ మండలం లోని మల్లూరు, నిజాంసాగర్‌ గ్రామాల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలలో జరగని అభివద్ధి ఐదేళ్లలో చేసి ...

Read More »

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులు కల్పించాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్‌ డివిజన్‌లో జరుగు మూడో విడత జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు సందర్భంగా ఆదివారం సాయంత్రం వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో చల్లటి త్రాగునీరు, టెంటు, ఓఅర్‌యస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు ...

Read More »

రాశివనంలో మొక్కలు నాటిన ఎన్నికల పరిశీలకురాలు

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలోని రాశివనంలో ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అభిలాష్‌ బిస్తు మొక్కలు నాటారు. హరితవనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర అవసరమని, ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని కోరారు. రాశివనాన్ని అద్బుతంగా తీర్చిదిద్దారని, అన్నిరకాల మొక్కలు నాటుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందిస్తున్నారని ప్రశంసించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, నిజామాబాద్‌ కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, జిల్లా ఎస్‌పి శ్వేత తదితరులున్నారు.

Read More »

స్ట్రాంగ్‌రూంల పరిశీలన

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడోవిడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌రూంలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, బ్యాలెటు బాక్సుల భద్రత, కౌంటింగ్‌కు సంబందించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివో చిన్నారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

పోలింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌రోజు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న పొరపాటుకు ఆస్కారమివ్వద్దని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ రోజు చెక్‌ లిస్టు ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి శ్వేత, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, ఎంపిడివో చిన్నారెడ్డి, ఎన్నికల ...

Read More »