Breaking News

NizamabadNews OnlineDesk

రజక ఉద్యోగులకు సన్మానం

  ఆర్మూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మామిడిపల్లిలో రజక ఉద్యోగులు ఎల్లయ్య, మల్లేశ్‌, మేకల సాయిలు, కిషన్‌, సంతోష్‌, ఓరుగంటి బాలులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానస గణేశ్‌ మాట్లాడుతూ 2013లో రజక ఐక్యవేదిక ఏర్పాటైన నుంచి ఉద్యోగులు వారి మేదస్సును, డబ్బును, సమయాన్ని ఇచ్చి జాతి అభివృద్దిలో కీలక పాత్రపోషిస్తున్నారని అన్నారు. అటువంటి వీరు అభినందనీయులని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తు, పేద …

Read More »

మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కబడ్డి పోటీలు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నమల్లారెడ్డి గ్రామ మున్నూరు కాపు సదార్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కబడ్డి పోటీలు నిర్వహించారు. కబడ్డి పోటీల్లో యువకులు హోరాహోరీగా ఉత్సాహంగా తలపడ్డారు. పోటీలను తిలకించేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. విజేతలకు బహుమతులు అందించనున్నట్టు మండల యూత్‌ అధ్యక్షుడు దామోదర్‌ తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బత్తుల కిషన్‌, నవీన్‌, భాస్కర్‌, నర్సింలు, రాజయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

  ఆర్మూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని మానస పాఠశాలలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఆర్మూర్‌ మండల ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించినట్టు అసోసియేషన్‌ ప్రతినిదులు తెలిపారు. ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్‌ భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యేను సత్కరించినట్టు తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన రూ. 5 లక్షలకు సంబంధించిన ప్రొసీడింగ్‌ కాపీని ఎమ్మెల్యే యాజమాన్యానికి అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, …

Read More »

ఘనంగా రేణుకామాత ఆలయ వార్షికోత్సవం

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుకాంబ ఆలయంలో ఆదివారం నుంచి ఆలయ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం విఘ్నేశ్వరపూజ, అఖండస్థాపనం, స్వస్తి పుణ్యాహవాచనం, అమ్మవారికి అభిసేకం, మంగళహారతులు, కుంకుమార్చన, మహాపూజ, తీర్థ, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని గౌడ సంఘం ప్రతినిదులు తెలిపారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకోవాలి

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఆదివారం 8వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో సీనియర్‌, జూనియర్‌ స్థాయి విద్యార్థులకు ఓటుహక్కు, ఎన్నికల సంస్కరణలు, తదితర అంశాలపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విదానం ప్రపంచంలోనే గొప్పదన్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటుహక్కు ప్రసాదించిందని, …

Read More »

కనుమరుగవుతున్న సమ్మర్‌బాగ్‌

  నిజాంసాగర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండ్లతోటలు, పక్షుల కిలకిలరాగాలతో, పచ్చని చెట్లతో పర్యాటకుల మదినిదోచిన సమ్మర్‌బాగ్‌ నేడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నిజాంకాలంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ సమ్మర్‌బాగ్‌ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన ఇంజనీర్లు, కార్మికులకు చల్లదనంతోపాటు ఆరోగ్యానికి దోహదపడే విధంగా పండ్ల చెట్లను పెంచారు. అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని సమ్మర్‌బాగ్‌ అని పిలిచేవారు. సమ్మర్‌బాగ్‌లో చెట్లకు నీరు, వాటి పోషణను అధికారులు పట్టించుకోకపోవడంతో దశాబ్దకాలం …

Read More »

మొదటి వార్డులో పారిశుద్య కార్యక్రమాలు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో ఆదివారం పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. మునిసిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా 1వ వార్డులో పేరుకుపోయిన మురికి కాలువలను శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. కాలువల్లోని పూడికలు తొలగించి మురికి కాలువల మార్గాన్ని సుగమం చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ జమీల్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

వ్యాయామం, శారీరక శ్రమతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు వ్యాయామం, శారీరక శ్రమ, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద పాఠశాలలో ఆదివారం శ్రీప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు జరపడం అభినందనీయమన్నారు. ప్రజలు వ్యాధి …

Read More »

ఐటి సెల్‌ కార్యక్రమానికి తరలిన బిజెపి శ్రేణులు

  కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర ఐటిసెల్‌ కార్యక్రమానికి ఆదివారం వెళ్తున్న జిల్లా ఐటిసెల్‌ బృందాన్ని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిద్దిరాములు జెండా ఊపి ప్రారంభించారు. ఐటిసెల్‌ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియాల నేపథ్యంలో ఐటి సెల్‌ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటిసెల్‌ ప్రతినిధులు తిరుపతిరెడ్డి, సతీష్‌, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఉపాధి హామీ ఏపివోబదిలీ

  నిజాంసాగర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ఉపాధి హామీ ఏపివో సుదర్శన్‌ బాన్సువాడకు బదిలీ అయ్యారు. అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఎపివోగా విధులు నిర్వహిస్తున్న ఓంకార్‌ను నిజాంసాగర్‌కు బదిలీ చేశారు. ఏపివోగా సుదర్శన్‌ ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా చేపట్టి పలువురి మన్ననలు పొందారు.

Read More »