Agriculture

పంట నష్టం అంచనావేస్తున్న అధికారులు

  బీర్కూర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత గురువారం మండలంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌, దామరంచ, చించొల్లి గ్రామాల్లో వదగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగింది. వందశాతం పంట నష్టం జరిగినప్పటికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు నష్టం వాటిల్లిందో తెలుసుకనేందుకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయాధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు. Email this page

Read More »

రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహాబోర్డు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో యాసంగి పంటకు సంబంధించి ప్రతి ఎకరాకు నీరందించేలా నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అదికారులు ప్రణాళికతో చర్యలు …

Read More »

నర్సరీలో వేగవంతంగా పనులు

నిజాంసాగర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి, నర్సింగ్‌రావుపల్లి, సుంకిపల్లి గ్రామాల్లో చేపట్టిన నర్సరీల్లో పనులు వేగవంతం చేయాలని ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించిన లబ్దిదారులకు డబ్బులు వారి ఖాతాల్లో జమచేశామని, ఈ విషయాన్ని లబ్దిదారులకు తెలియజేయాలని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం …

Read More »

చెరుకు రైతులను ఆదుకుంటాం

నిజాంసాగర్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టపడి చెరుకు పండిస్తున్న రైతుకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మాగి గాయత్రీ చక్కర కర్మాగారం, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంలో మాగి గాయత్రీ చక్కర కర్మాగారం చెరకు రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాగి కర్మాగారంలో చెరుకు క్రషింగ్‌ కోసం తరలిస్తున్న రైతులకు బిల్లులు సకాలంలో అందించేలా కృషి చేస్తానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తోడు నీడలా వెంట ఉంటామని సిడిసి ఛైర్మన్‌ …

Read More »

బెల్లం వండడం రైతుల హక్కు

  – సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బెల్లం తయారుచేయడం రైతుల హక్కు అని సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న అన్నారు. బుధవారం కామారెడ్డలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చెరుకు వండవద్దని ఎక్సైజ్‌ అధికారులు రైతులవద్దకెళ్లి బెదిరించడం సమంజసం కాదన్నారు. హరితహారంలో భాగంగా కామారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ కామారెడ్డి గడ్డ బెల్లంకు అడ్డ అని మాట్లాడి ప్రస్తుతం బెల్లం వండితే …

Read More »

చలితో సాగుకు ఇబ్బంది…

బాన్సువాడ,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదారురోజులుగా చలి తీవ్రత పెరగడం ఖరీఫ్‌ సాగును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వరి సాగుచేసే రైతులకు ఇబ్బంది ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఇపుడు వరి నారుమళ్ళు వేస్తే సక్రమంగా మొలకెత్తలేని పరిస్తితి ఉంటుంది. దీంతో రైతులకు ఇబ్బంది ఎదురవుతుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు మేలు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. చలి తీవ్రత వల్ల గతంలో నారుమళ్ళకు ఇబ్బంది కలిగిన అనుభవాలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు …

Read More »

రైతు అభివృద్దే పరమాధిగా పనిచేయాలి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులందరు రైతుల అభివృద్దే పరమావధిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిపోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో యాసంగి 2016-17 పంటల సాగు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు అభివృద్ది చెందితేనే అంతా అభివృద్ది చెందుతుందని, రైతులు నష్టాల్లో కూరుకుంటే …

Read More »

రైతులకు లబ్దిచేకూర్చేలా కొనుగోళ్ళు చేపట్టాలి

  నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌కమిటీలో రైతులు పంటను కొనుగోలు చేసి వారికి నేరుగా లబ్ది చేకూర్చేలా చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీలో రైతు పంటను కొనుగోలు చేయడంలో అవలంబిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హమాలీలతో, స్వీపర్లతో, సెక్రెటరీతో, మార్కెటింగ్‌ సహాయ సంచాలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కమీషన్‌ ఏజెంట్‌ నుండి మొదలుకొని మమాలీ, …

Read More »

చెరుకు రైతులకు అండగా ఉంటాం

చెక్కర కర్మాగారం పునరుద్ధరణపై వారంలో నిర్ణ‌యం – నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చెరుకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల‌కు చెందిన చెరుకు రైతులతో బుధవారం హైదరాబాద్‌లో ఆమె సమావేశమయ్యారు. చెరుకు సాగు విస్తీర్ణం, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెక్కర కర్మాగారాలు మూతపడి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చ‌క్కెర క‌ర్మాగారాలు, రైతుల బకాయిలపై …

Read More »

విత్తనాల కోసం రైతు ఎదురుచూపు

  బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగట్లో అన్నీ ఉన్నా… అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. నీటి వనరుల్లో పుష్కలంగా నీరున్నా బోరుబావుల్లో నీరు ఎగిసి పడుతున్నా రైతులు సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీటి కొరత లేకున్నప్పటికి రబీ సాగు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆశించిన స్థాయిలో సాగు ముందుకు సాగడం లేదు. ఓవైపు విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా …

Read More »