Breaking News

Agriculture

రైతు భరోసా పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న తలపెట్టిన ఛలో కామారెడ్డి కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో శాసనమండల విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతుభరోసా పాద యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 14న సాయంత్రం 6 గంటలకు కామారెడ్డిలోని సిఎస్‌ఐ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. రైతుల్లో స్ఫూర్తినింపి వారికి భరోసా ...

Read More »

రైతు ఆత్మహత్యలన్ని సర్కారీ హత్యలే

  వైకాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయని, వీటిని రైతు ఆత్మహత్యలు అనడం కన్నా సర్కారీ హత్యలు అనడమే సబబని వైకాపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఆదివారం రైతుదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు బంగారు తెలంగాణ సాధిస్తానని చెప్పిన కేసీఆర్‌ తన ఇంట్లో వ్యక్తులకు మంత్రి పదవులు ...

Read More »

నీరు, గాలి, తిండి స్వచ్చంగా ఉంటేనే ఆరోగ్యం

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలు శుభ్రంగా ఉంటేనే కుటుంబాల్లో అనారోగ్యాలు దూరమవుతాయని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పకుండా నిర్మించుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం స్తానిక నూతన అంబేడ్కర్‌ భవన్‌లో నగరపాలకసంస్థ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చభారత్‌- స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా యుజిడిలేని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ...

Read More »

వినియోగదారులపై అకాల వర్షాల ప్రభావం

  బాన్సువాడ, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అకాల వర్షాల దెబ్బతో కూరగాయల పంటలక తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గిపోయి మార్కెట్‌లో కొరత ఏర్పడింది. వినియోగదారులనుంచి కొనుగోలు పెరగడంతో సరిపడా మార్కెట్లో కూరగాయలు అందుబాటులో లేకుండాపోయాయి. ముఖ్యంగా స్తానికంగా సాగయ్యే ఆకుకూరలు, తీగజాతి కూరలు, ఉల్లిగడ్డలు అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. ఇటీవల వరకు ...

Read More »

యానంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో రైతు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించటానికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకొని వాడుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని వాటినే వాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. శుక్రవారం కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామాన్ని అధికారులతో సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలతో సమావేశమై మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం తదితర అంశాలపై స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం వాటి పరిస్తితి కొనసాగుతున్న తీరును గ్రామస్తులతో ...

Read More »

రైతులను ఆదుకోవాలి …

  – బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి. ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ...

Read More »

రైతుల ఆత్మహత్యలు తెరాస పుణ్యమే…

  – టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగానే 700 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి టిడిపి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాటల్లో చెప్పిన పనులు చేతల్లో ఏమాత్రం చూపడం లేదని, ...

Read More »

రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  – ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల క్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రైతు బాగుంటేనే తెలంగాణ ప్రభుత్వం బాగుంటుందని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలంలో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వడగళ్ళ వానకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిందని, రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నోటికొచ్చే తరుణంలో ప్రకృతి కన్నెర్ర జేయడంతో రైతు శ్రమ వృధా ...

Read More »

13,604 హెక్టార్లలో పంట నష్టం

  – మంత్రి పోచారం వెల్లడి నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ళ వాన వల్ల వరి, సజ్జ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామంలో వరి పొలాలను సందర్శించి అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిదులతో ...

Read More »

చెరువుల అభివృద్ధితోనే రైతన్న అభివృద్ధి… – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువులు అభివృద్దిచెందితేనే రైతన్న పంట పొలాలు పచ్చగా ఉంటాయని తద్వారా రైతులు అభివృద్ది చెందుతారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దోమకొండ మండలంలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ చేసేందుకు మిషన్‌ కాకతీయను చేపట్టామని, తద్వారా చెరువుల్లో లభ్యమయ్యే మట్టిని రైతులు తమ పంట పొలాలకు తరలించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. దీనిద్వారా చెరువుల్లో ...

Read More »

ముమ్మరంగా నూర్పిళ్ళు…

బాన్సువాడ, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కారుమబ్బులు కర్షకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు వారిలో గుండెదడ పెంచుతున్నాయి. ఆరుగాలం కష్టించి పనిచేసిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. రెండ్రోజులుగా తెరిపి లేకుండా మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులు వస్తుండడంతో రైతులు పంటలను కోతలు చేపడుతున్నారు. ముఖ్యంగా సాగునీటి కష్టాలు ఎదుర్కొని సాగుచేసిన వరిపంట చేతికందే తరుణంలో వడగళ్ళు వెంటాడుతుండడం అన్నదాతను అందోళనకు గురిచేస్తోంది. దీంతో ఉన్నఫలంగా రైతులు కోతలకు సిద్దపడుతున్నారు. యంత్రాలను అద్దెలకు ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతులకు బంగారు పంట …

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్‌ కాకతీయ తో చెరువుల పునరుద్దరణ చేసి తద్వారా రైతులు బంగారు పంటలు సాగుచేసుకునేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని భిక్కనూరు మండలంలో బాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, తిప్పాపూర్‌ గ్రామాలను సందర్శించి మిషన్‌ కాకతీయ పనులను, పలు అభివృద్ది పనులనుసైతం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఆంధ్రా పాలకుల ...

Read More »

జిల్లాలో 276 వరి కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ రబీలో వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 276 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో రైస్‌మిల్లర్లు, పౌర సరఫరా లశాఖ అధికారులతో రబీ ధాన్యం కొనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 230, ఐకెపి ద్వారా 44, మెప్మా ఆధ్వర్యంల రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల డిమాండ్‌మేరకు అవసరాన్ని బట్టి ...

Read More »

హనుమాన్‌ జయంతికి ముస్తాబు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

రబీలో రైతులకు 4 కోట్ల పంట రుణాల పంపిణీ

  – ఐడిసిఎం ఛైర్మన్‌ ముజిబుద్దీన్‌ కామారెడ్డి, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వ్యవసాయ సహకార సంఘ పరిధిలో రబీ సీజన్‌లో రైతులకు రూ.4 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్టు ఐడిసిఎం ఛైర్మన్‌ ముజిబుద్దీన్‌ తెలిపారు. గురువారం కామారెడ్డి పిఏసిఎస్‌ 52వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ముజిబుద్దీన్‌ మాట్లాడారు. రైతు సేవకోసమే సహకార సంఘం ఉందని, వారి సంక్షేమం కోసమే పనిచేస్తామని పేర్కొన్నారు. వారికి కావాల్సిన పంట రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ...

Read More »

ఏగబాకుతున్న కూరగాయలు

  – సామాన్యులకు గుండెదడ బాన్సువాడ, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉల్లిగడ్డలు ఉరుకుతున్నాయి…. మిరప చురుక్కుమనిపిస్తుంది. మొత్తానికి కూరగాయల ధరలు సామాన్యుడికి గుండెదడ పుట్టిస్తున్నాయి. ఇటీవల వరకు అందుబాటులో ఉన్న ధరలు అమాంతంగా పెరిగాయి. పెళ్ళిళ్ళ సీజన్‌ ప్రారంభం కావడంతో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. బోదన్‌ డివిజన్‌లో ధరలు అమాంతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఆకుకూరలతో పాటు కాయకూరల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. కూరగాయలు కొందామని మార్కెట్‌కు వెళుతున్న వినియోగదారులు వ్యాపారులు చెప్పే ధరలు వింటూనే ...

Read More »

ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి

ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి. -నేడు డిల్లీలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి కుమారి ఉమాభారతి గారిని కోరిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. “ట్రిపుల్ ఆర్ పథకం కింద రాష్ట్రానికి నిధులివ్వండి. రాష్ట్రానికి వచ్చి ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయను చూడవలసిందిగా కుమారి ఉమాభారతిని ఆహ్వానించిన శ్రీమతి కవిత” ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించమని నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, కేంద్ర జలవనరుల, నధుల అభివృద్ది శాఖా మంత్రి కుమారి ఉమాభారతిని కోరారు. నేడు న్యూడిల్లీలోని మంత్రి ...

Read More »

పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వంచే విహారయాత్ర

  – డైరీ మేనేజర్‌ నాగేశ్వర్‌రావు నిజామాబాద్‌, మార్చి 25 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ లైవ్‌ స్టార్‌ మెషిన్‌ ద్వారా 25 మంది పాడి రైతులకు కలెక్టర్‌ నిధుల ద్వారా గుజరాత్‌లో గల అబుల్‌ ఆనంద్‌ డైరీకి విహార యాత్రకు తీసుకెళుతున్నట్టు డైరీ మేనేజర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. వీరిలో నలుగురు ఎస్టీ, నలుగురు ఎస్సీ అభ్యర్థులు ఉంటారన్నారు. వీరందరికి ఒక్కొక్కరికి 5 వేల చొప్పున ఖర్చులనిమిత్తం ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. విహారయాత్రకు పాలు ఉత్పత్తి చేసేవారు మాత్రమే అర్హులని సూచించారు. ...

Read More »

కరెంటు కోతలతో ఎండిన పంటలు

  – ఆందోళనలో అన్నదాతలు – అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు -అక్కరకు రాని ప్రభుత్వం – విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్తితి రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక రైతన్న… అన్నంపెట్టేవాడు అన్నదాత… అనే యోధాన యోధులు మన రాజకీయ నాయకులు ఎన్నికలపుడు నిలువెత్తు ప్రశంసలతో అన్నదాతను ముంచెత్తుతారు. కానీప్రశంసలు కురిపించిన వారే నేడు అన్నదాతకు అ్కరకు రాకుండా ఏదోరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఖరీఫ్‌లో పంటలు వేసుకోవాలని ...

Read More »