నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వెల్నెస్ సెంటర్లో టెలిమెడిసిన్ సెంటర్‌ను సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. జిల్లా ప్రజలకు ఏవైనా దగ్గు, జ్వరం, తుమ్ము, ఇతరత్రా కోవిడ్ 19కి సంబంధించిన ఆరోగ్యపరమైన అనుమానాలుంటే టెలిమెడిసిన్ సెంటర్‌కు 8309219718 కు ఫోన్ చేయాలని సూచించారు. తద్వారా ఫోన్ ద్వారా నిపుణులైన వైద్యులు సలహాలు, చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెంటర్ పనిచేస్తుందని ...
Read More »ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ సేవలు అద్వితీయం
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్‌లోని రెడ్‌క్రాస్ భవనంలో ఇందూరు బ్లడ్ డ్ఱొనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథుగా ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి పి.సుధా, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి పి.సుధా రక్తదానం చేయడం అందరికి స్పూర్తిదాయకమని నిర్వాహకులు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రక్త నిధులు తగ్గిపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ...
Read More »మైలారం గ్రామంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ
బీర్కూర్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు పేర్క శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ యశోద, మహేందర్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, ఎస్సై సందీప్ కుమార్ తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్ డౌన్ తప్పక పాటిస్తూ ఇంట్లోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు తప్పకుండా ధరించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. ఇంటికి ...
Read More »జిల్లా ప్రజలకు మంత్రి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో ప్రజలు ఒక చోట గుమిగూడ కుండా మహాత్ముల జయంతి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా మహాత్ముని జన్మదినం సందర్భంగా ఆయన ...
Read More »137 వాహనాలు సీజ్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 137 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో 127 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 6, ఫోర్ వీలర్స్ 4, ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు ఆదివారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...
Read More »నిజామాబాద్‌లో 68 నెగటివ్ రిపోర్ట్స్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో తదుపరి పరీక్షలకు పంపిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్‌లో 68 మందికి నెగటివ్ వచ్చిందని వీరికి కరోనా లేదని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం 45 మంది ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టుకు సంబంధించి శాంపుల్ తగు పరీక్షల కోసం పంపినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. లాక్ డౌన్లో భాగంగా ప్రజలు వారం రోజులు నిబంధనలు కఠినంగా కచ్చితంగా 100 శాతం పాటించాలని తద్వారా ఢల్లీి వెళ్లి వచ్చిన వారి ప్రైమరీ ...
Read More »వైద్య సలహాలకు టెలి మెడిసిన్ కంట్రోల్ రూమ్‌లు
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య విషయాలలో డాక్టర్లకు ఫోన్ చేసి తగు సలహాలు పొందుటకు టెలిమెడిసిన్ కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు దగ్గు, జ్వరం, జలుబు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే అత్యవసరంగా వారికి తగు సలహాులు సూచనలు అందించడానికి మూడు డివిజన్లలో టెలిమెడిసిన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాదులో 8309219718, ఆర్మూర్‌లో 9398194337 ...
Read More »వారం రోజులు చాలా ముఖ్యం
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజులు లాక్ డౌన్ పాటించడం చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సిపి కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి కంటెన్మెంట్ క్లస్టర్ ఏరియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితిని పరిశీలించారు. ఖిల్లా రోడ్డు, బర్కత్ పుర, అర్సపల్లి, మాలపల్లి, ఆటోనగర్, ఫ్రూట్స్ మార్కెట్, పెయింటర్ నగర్ ప్రాంతాలలో పర్యటించి లాక్ డౌన్ పరిశీలించారు. లాక్ డౌన్ పటిష్టత వలన మనకు వచ్చే వారం ...
Read More »బిజెపి నాయకుల రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధిలో తగినంత రక్త నిల్వలు లేవని సమచారం అందటంతో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు ఆదివారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నరేష్ (సంగమేశ్వర్ గ్రామ ఉప సర్పంచ్) మాట్లాడుతూ ప్రస్తుతం కరొనా వల్ల లాక్ డౌన్ నేపథ్యంలో రక్త నిల్వలు కూడా లేవని, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణిలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని బీజేపీ ఆధ్వర్యంలో రక్తదానం చేశామని, కరొనా మహమ్మారిని సమిష్టిగా ...
Read More »పోలీసు సిబ్బందికి మాస్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్లో అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్ రావు సూచనల మేరకు ఉచిత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు వడ్ల నారాయణ చారి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోన వైరస్ వ్యాది నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. సమాచార హక్కు ...
Read More »పారిశుద్య కార్మికులకు ఆయుర్వేద మాత్రల పంపిణీ
ఆర్మూర్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అర్మూర్ మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డ్ వెంకటేశ్వర కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కరోనా సోకకుండా ఆయుర్వేద మాత్రలను స్థానిక కౌన్సిలర్ ఆకుల రాము చేతు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల రాము మాట్లాడుతూ కరోనా వ్యాధి నిర్మూనలో భాగంగా పారిశుద్య కార్మికులు విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. వారికి మునిసిపాలిటీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అదేవిధంగా ...
Read More »13న రక్తదాన శిబిరం
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మొత్తం రాష్ట్రంలో రక్తం యొక్క కొరత ఏర్పడిరదని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తలసేమియా పేషెంట్లు, గర్భవతులు, మిగతా పేషెంట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందూరు బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో 13వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రక్త దాతలు ముందుకొచ్చి రక్త దానం చేసి ఇటువంటి విపత్కర సమయంలో ఆదుకోవాలని పేర్కొన్నారు. ...
Read More »ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, అన్ని కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ తహసిల్దార్, వ్యవసాయ అధికారుల నెంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరి కోతలకు గ్రామాల్లో యంత్రాలు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని కోరారు. కేంద్రాల ...
Read More »పెద్ద గుల్లలో గంజాయి సాగు
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మండలంలోని గుల్ల పెద్ద గ్రామంలో కోవిడ్-19 లాక్ డౌన్ సందర్భంగా ఆయా గ్రామాలను తహశీల్దార్ వెంకటేష్, ఎస్ఐ రఫియోద్దీన్ సందర్శించారు. ఈ సమయంలో జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల శివారులో ఓ రైతు ఎకరం పంట పొలం గంజాయిని మిశ్రమ సాగు చేశాడని తహశీల్దార్ వెంకటేష్‌కు పక్క సమాచారం అందడంతో తహశీల్దార్, ఎస్.ఐ రఫియోద్దీన్ పంట పొలాన్ని పరిశీలించారు. గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి ఆబ్కారీ శాఖకు సమాచారం అందించటంతో అబ్కారీ ...
Read More »విద్యుత్ షాక్‌తో రైతు మృతి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ భూమిలో కోతుల బెడద కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు రైతు ప్రాణం తీసింది. విద్యుత్ తీగ చూడకుండా వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. దాంతో రైతు ఇంట్లో విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి సంగయ్య వెంకట్రాంరెడ్డి వ్యవసాయ భూమిలో పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన సంగయ్య ఉల్లిగడ్డను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి ...
Read More »నిజామాబాద్‌లో రెండు కరోనా పాజిటివ్ కేసులు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదు అయ్యాయి. ఢల్లీి వెళ్లి వచ్చిన వారి అందరి ప్రైమరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ తీసుకొని తదుపరి పరీక్షలకై పంపడం జరిగిందని తెలిపారు. గతంలో కొన్ని పంపామని శనివారం 103 మంది శాంపిల్స్ పరీక్షల కోసం పంపినట్టు తెలిపార. ఇప్పటికే కొన్ని రిపోర్ట్ వచ్చినాయని, మరికొన్ని రావాల్సి ...
Read More »ధాన్యం కొనుగోలుపై కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను జిల్లాస్థాయిలో ఫిర్యాదుల కొరకు నిజామాబాద్‌లోని కలెక్టరేట్లోని మూడు రెవెన్యూ డివిజన్లలోను, ఆర్డీవో కార్యాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ` 08462 220183 ఆర్డీవో కార్యాయం నిజామాబాద్‌లో ` 08462 220051, ఆర్డిఓ కార్యాయం బోధన్‌లో ...
Read More »ఎంపి నిధుల నుంచి రెండు అంబులెన్సులు ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్, స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి బిచ్కుంద మండలం కాట్ గావ్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కూలీలకు మాస్క్‌లు అందించారు. ఈ సందర్బంగా ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. అదేవిధంగా ఎంపీ బి.బి.పాటిల్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రెండు అంబులెన్స్‌లు ఒకటి 22.79 లక్షలు విలువ గలది మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరొకటి 14.92 లక్షల విలువ ...
Read More »చత్తీస్ ఘడ్ వలస కూలీలకు నిత్యవసర సరుకులు
బీర్కూర్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం బీర్కూర్ మండలంలోని భైరపూర్ గ్రామంలో ఛత్తీస్ ఘడ్ రాష్టం నుండి కూలి పనుల కొరకు వలస వచ్చిన 20 కుటుంబాలకు మాజి జడ్పిటిసి ద్రోణావల్లి సతిష్ తన సొంత ఖర్చుతో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె పంపిణీ చేయించారు. తాను హైదరాబాద్ నుండి రాలేని పరిస్థితిలో జడ్పిటిసి స్వరూప శ్రీనివాస్, ఎంపీపీ రఘు, కోఆప్షన్ ఆరిఫ్ ఎంపిటిసి లక్ష్మి అంజయ్య, స్థానిక సర్పంచ్ గుమ్మ అంజవ్వ, పిఏసిఎస్ ...
Read More »మా సర్పంచ్ కనబడుట లేదు…
నిజాంసాగర్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం జక్కపూర్ గ్రామస్థులు, వార్డ్ మెంబర్లతో కలిసి పంచాయితీ భవనం ముందు ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జక్కపూర్ గ్రామస్థులు ఏకతాటిపై ఉండి గ్రామాన్ని అని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కంసవ్వను గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ సర్పంచ్‌గా ఎన్నికైన మొదటి ఆరు నెలలు మాత్రమే గ్రామంలో ఉండి తర్వాత హైదరాబాద్‌కు సర్పంచ్ మకాం మార్చారు. రెండు నెలలకోసారి వచ్చి గ్రామ సభ నిర్వహించి ...
Read More »