Breaking News

Nizamabad News

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్‌లకు స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల కంటే మునిసిపల్‌ ఎన్నికల పరిధి చిన్నగా ఉంటుందని, స్థానిక అభ్యర్థులు బరిలో ఉంటారని నిశిత పరిశీలన ఉంటుందని ...

Read More »

కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ విస్తృత ప్రచారం

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ 3, 4, 5, 28, 26, 29, 30, 31, 45, 46, 47 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని, యువతకు నిరుద్యోగ భతి ఇస్తానని ఎగ్గొట్టిన ప్రభుత్వం తెరాస అన్నారు. కేజీ నుండి పిజి ...

Read More »

ఎల్లారెడ్డి మునిసిపాలిటీపై తెరాస విజయకేతనం ఎగురవేస్తుంది

బాన్సువాడ, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌, ఎమ్మెల్యే జాజల సురేందర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు, తెరాస కార్యకర్తలతో కలిసి ఎల్లారెడ్డి పట్టణం లో ఇంటింటా మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోని అన్ని వార్డులు తెరాస గెలుచుకుని ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై విజయ కేతనం ఎగరువేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎంపి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

పల్స్‌ పోలియో విజయవంతం చేయండి

రెంజల్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో 19వ తేదీన నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్‌ క్రిస్టినా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె అన్నారు. మండలంలోని 89 సెంటర్లు ఏర్పాటు చేసి పల్స్‌ పోలియో చుక్కలను కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 150 మంది సిబ్బందితో ...

Read More »

కవిత కృషి వల్లే భీమ్‌గల్‌ మునిసిపాలిటిగా మారింది

భీమ్‌గల్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలోని 3,4,5,6 వార్డులలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీంగల్‌ గ్రామ పంచాయితీగా ఉంటే ఏడాదికి 5 లక్షలు వచ్చేవని వాటితో అభివద్ధి పనులు సాధ్యం కాలేదని అందుకే తాను మాజీ ఎంపి కవిత ద్వారా ప్రయత్నం చేసి మున్సిపాలిటీగా చేసుకున్నామన్నారు. భీంగల్‌ మున్సిపాలిటీకి కేటిఆర్‌ 25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ...

Read More »

ఎంఐఎం గెలిస్తే నిజామాబాద్‌ మరో భైంసా అవుతుంది

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పోరేషన్‌ మేయర్‌ పీఠాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని ఎంపి అర్వింద్‌ ధర్మపురి ఆరోపించారు. శనివారం నిజామాబాదులో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్న ఎంపి అర్వింద్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎంఐఎం గెలిస్తే నిజామాబాద్‌ మరో భైంసా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపికి ఓట్లేస్తే పెన్షన్లు ఆపేస్తామని టీఆరెస్‌ నేతలు భయ పెడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ లో బిజెపి, ఎంఐఎం మధ్యనే పోటీ ఉంటుందని ...

Read More »

ఎన్‌టిఆర్‌కు ఘన నివాళి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్ర పటానికి టిడిపి నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ దేగం యాదగౌడ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికి చెక్కు చెదరలేదని తెలిపారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ అర్బన్‌లో 16 మంది, బోధన్‌లో ఇద్దరు, ఆర్మూర్‌ నలుగురు తెలుగుదేశం పార్టీ ...

Read More »

నిజామాబాద్‌ను ఇందూరుగా మారుస్తాం

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌ నగరంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థుల తరపున రాజాసింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్‌ వద్ద రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ ఎన్నార్సి, సిఎఎ బిల్లులపై కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వీటి వల్ల మన దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒవైసి ...

Read More »

ప్రొఫెసర్‌ కాసీం అరెస్టును ఖండించండి

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కాసింని అరెస్టు చేయడాన్ని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) ఖండిస్తున్నదని రాష్ట్ర నాయకులు సుమన్‌ అన్నారు. శనివారం కుమార్‌ నారాయణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అవినీతి పాలనను విధానాలను ఎవరు ప్రశ్నించినా రాసిన ఆ ప్రశ్నించే గొంతుకలను జైల్లో నిర్బంధించే ఫాసిస్టు ...

Read More »

ఓయూ ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్ట్‌

హైదరాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఖాసింను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన ప్రొఫెసర్‌ ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరిగాయి. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రొఫెసర్‌ ఖాసింను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్‌కు ...

Read More »

పోచారం భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14,15,16,17వ వార్డులలో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ వార్డ్‌లలో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని భాస్కర్‌ రెడ్డి కోరారు. ఆయన వెంట జంగం గంగాధర్‌, నందు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

సదాశివపేట మునిసిపాలిటి తెరాస కైవసం చేసుకుంటుంది

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఎంపీ బి.బి పాటిల్‌, జాహీరాబాద్‌ ఎమ్మెల్యే మానిక్‌ రావు, సదాశివపేట మున్సిపాలిటీకి పోటీచేస్తున్న తెరాస కౌన్సిలర్‌ అభ్యర్థులు, తెరాస కార్యకర్తలు సదాశివపేట మునిసిపల్‌ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులు తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More »

నట్టల నివారణ మందుల పంపిణీ

రెంజల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బాగేపల్లి గ్రామంలో సర్పంచ్‌ సాయిలు ఆధ్వర్యంలో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. రెండో విడత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న గొర్రెలు మేకలకు మందులు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్‌ విట్టల్‌ మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయడం ద్వారా నట్టల బెడద తగ్గి ఆకలి పెరగడం ద్వారా గొర్రెలు, మేకలకు రోగ నిరోధక శక్తి ...

Read More »

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ 49, 42, 41, 18 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో అభివద్ధి శూన్యమని, కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీ పూర్తిగా అవినీతి మయమైందన్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్‌ కౌన్సిలర్‌ టాక్స్‌ కట్టాల్సి వస్తుందని, ఎంతో కష్టపడి తాను ...

Read More »

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్వయంసేవకులు దండ, నియుద్ధ, ఆటలు, సమత తదితర ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విభాగ్‌ సహ సేవాప్రముఖ్‌ వంగల వేణుగోపాల్‌ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో సంఘటిత సమాజం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. హిందూ సంఘటన ద్వారానే దేశం పరమవైభవ స్థితికి చేరుతుందన్నారు. ఇటువంటి గొప్ప సందేశంతో మున్ముందు సంఘ ...

Read More »

స్వర్ణకార సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2020 సంవత్సరం క్యాలెండర్‌ను నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ ధర్మపురి శుక్రవారం నిజామాబాదులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ యువజన సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీపాల్‌ చారి, సంఘం ప్రతినిధులు చంద్రశేఖర చారి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

భీమ్‌గల్‌ అభివృద్ది కోసం ఓటు వేయాలి

భీమ్‌గల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 1,2,8,10 వార్డుల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అనంగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు. కేసీఆర్‌ కోసం, తన కోసం జరుగుతున్న ఎన్నికలు కావని భీంగల్‌ మున్సిపాలిటీ అభివద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. భీంగల్‌ పట్టణంలో ఇంటింటికి ...

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగాలి

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పలు అంశాలపై జిల్లా అధికారులతో కన్వర్జెన్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటడం, ధాన్యం కొనుగోలు, తదితర విషయాలపై పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి పిప్రి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. కళాశాలలో ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. స్ట్రాంగ్‌ రూముల్లో కౌంటింగ్‌ హాల్లో ఏ విధంగా ఏర్పాటు చేయాలో సూచనలు జారీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి వేరువేరుగా ...

Read More »

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ భీమ్‌గల్‌లో పర్యటించి మునిసిపల్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రంగా ఎంపిక చేసిన జూనియర్‌ కళాశాలలో పర్యటించి పరిశీలించారు. ఇక్కడ కౌంటింగ్‌ హాల్స్‌ స్ట్రాంగ్‌ రూముల ప్రణాళికను పరిశీలించారు. రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌, ఓటర్‌ స్లిప్పులు పంపిణీకి మొదటి ...

Read More »