Breaking News

Nizamabad News

నోటుపుస్తకాల పంపిణీ

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల తహసీల్దార్‌ కార్యాలయంలో జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్ధులకు తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ నోట్‌ బుక్కులు, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, ఆర్‌ఐ గంగాధర్‌ రావు, వీఆర్వోలు, సంతోష్‌, భూమన్న, రాములు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Read More »

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉత్తమ సేవలు అందించిన శోభన్‌కు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రామ్మోహన్‌రావు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రెంజల్‌ మండల కేంద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా నియమితులై అనతి కాలంలోనే ఉపాధి హామీ కూలీల ప్రశంసలు అందుకున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధికారులు గుర్తించి మండల ఉత్తమ ఫీల్డ్‌ ...

Read More »

ఘనంగా సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు

బాన్సువాడ, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ సంతోషిమాత ఆలయంలో సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే గణపతి హోమము, అమ్మవారికి అభిషేకాలు, డోలారోహణ ప్రత్యేక పూజలు చేపట్టారు. సంతోషిమాత పల్లకి సేవ, ఊరేగింపు కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. పురోహితులు భాస్కర్‌ శర్మ, చంద్రశేఖర శర్మ, సంతోషి మాత ఆలయ అర్చకులు శ్రీనివాస రావు, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, గురు స్వాములు స్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Read More »

శాసనసభ ఆవరణలో పతాకావిష్కరణ

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట శాసనసభ్యులు టి.హరీష్‌ రావు, అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అన్నదాన సత్రం కార్యదర్శిగా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు చాట్ల రాజేశ్వర్‌ బాసర అన్నదాన సత్రం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వారు ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు షేర్ల లక్ష్మణ్‌, కార్యదర్శి సబ్బని కష్ణ హరి, శిలసాగర్‌, సబ్బని శంకర్‌, క్యాతం దూసా వెంకటస్వామి, సిద్ధిరాములు, పడిగే రాములు, జిల్లా వర్కింగ్‌ సెక్రటరీ బొమ్మ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాట్ల రాజేశ్వర్‌ మాట్లాడుతూ తనపై ...

Read More »

స్వతంత్ర స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి నగర్‌లోని కార్యాలయం వద్ద పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశభక్తితో స్వతంత్ర స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ నాయకులు ఉదయ్‌ కష్ణ, ఎర్రం విగ్నేష్‌, బంటు వసంత్‌, దిలీప్‌, కే.శ్రీనివాస్‌, దయాకర్‌ గౌడ్‌, రాజు, గోవర్ధన్‌, బిట్ల రవి, బాల్‌ రాజ్‌ నాయక్‌, దయాకర్‌ గౌడ్‌, ...

Read More »

ఉత్సాహంగా రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కెనడీ ఇంటర్నేషనల్‌ హైస్కూల్లో బుధవారం రక్షాబంధన్‌ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు పంచుకుంటూ పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులందరు కలిసి వైభవంగా రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Read More »

ఏకరూప దుస్తుల పంపిణీ

నిజాంసాగర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం మన ప్రభుత్వం విద్యావ్యవస్థలో సముచిత మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల చేయూతనిస్తూ ప్రోత్సహిస్తుదన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ చారి, జెడ్పిటిసి లక్ష్మీబాయి-రవీందర్‌ నాయక్‌, రమేష్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.

Read More »

సిఎం సహాయనిధి అందజేత

నిజాంసాగర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామానికి చెందిన జానకంపల్లి కాశయ్య కుమారుడు సాయిలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.17 వేల 500 చెక్కులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

దర్గా వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

నిజాంసాగర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామంలో గల ఖాజా బంజనమల్‌ బీదర్‌ దర్గాను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వెంట ఆత్మ కమిటీ చైర్మన్‌ రామావత్‌ రాంసింగ్‌, ఆత్మ మాజీ చైర్మన్‌ దిలీప్‌, మండల జడ్పిటిసి లక్ష్మీబాయి-రవీందర్‌ నాయక్‌, మండల ఎంపిడిఓ చారి, గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, ఉప సర్పంచ్‌ రాంచందర్‌, కల్హేర్‌ మండల పార్టీ అధ్యక్షులు కష్ణా రెడ్డి, రమేష్‌ చౌహాన్‌, ...

Read More »

పిజి కోర్సులు తిరిగి ప్రవేశపెట్టడం పట్ల టిజివిపి హర్షం

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలో ఈ (2019-2020) విద్యా సంవత్సరం నుండి పీజీ (ఎంఎస్‌డబ్ల్యు, ఎంకాం, ఎంఎ ఎకనామిక్స్‌, ఎంఎ తెలుగు) నాలుగు పీజీ కోర్సులు ఎత్తివేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నోటీసు పంపింది. ఈ విషయమై టీజీవిపి స్పందించి కోర్సులు యధావిధిగా నడపాలని స్థానిక కలెక్టర్‌ సత్యనారాయణకు, ఉన్నతాధికారులకు విన్నవించగా నూతనంగా వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, ఉన్నతాధికారుల సహకారంతో నాలుగు పీజీ కోర్సులు మరల ప్రవేశ పెట్టడం పట్ల టీజీవిపి ...

Read More »

పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలి

రెంజల్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్లుగా వీరన్నగుట్ట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న బుచ్చమ్మను పనుల నుంచి తొలగించారనే ఆవేదనతో మతి చెందిందని, కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం వీరన్నగుట్ట గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మతురాలి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని వామపక్షాలు పట్టుపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మతురాలి కుటుంబ సభ్యులు, వామపక్ష సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. సర్పంచ్‌ను అరెస్ట్‌ చేసి మతురాలి ...

Read More »

పశువుల దాణా పంపిణీ

నందిపేట్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే పశువుల దాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి వకిడి సంతోష్‌ అన్నారు. బుధవారం పశువైద్యశాఖ అద్వర్యంలో తల్వేద గ్రామ రైతులకు సబ్సిడీపై మంజూరైన దాణా బ్యాగులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పోషకాలు ఉండే దాణాను విరివిరిగా వాడితే పశువులు ఆరోగ్యంగా ఉండి వ్యవసాయ పనులకు బాసటగా నిలుస్తాయని ఎంపిపి సంతోష్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యుడు హన్మంత్‌ ...

Read More »

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన ఆవిష్కరణల ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను నూతన ఆవిష్కర్తలను తమ ఆవిష్కరణలను నమోదు చేసుకోవలసిందిగా గతంలో కోరడం జరిగింది, కాగా నిజామాబాదు జిల్లాలో 15 ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలను నమోదు చేసుకున్నారన్నారని, అందులో 8 ఆవిష్కరణలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎనిమిది ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.

Read More »

ఘనంగా రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షాబంధన్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. 15 ఆగష్టున రాఖీ పండగ కావడంతో ఆయా సంస్థలు రాఖీలు ధరించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు కళాశాలల్లో విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా, మనం ఈ దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రక్షాధారణ చేశారు. అలాగే బ్రహ్మకుమారీలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు ...

Read More »

బిటి రోడ్డు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం బీడి వర్కర్స్‌ కాలనీ, జయశంకర్‌ కాలనీలో రూ. 4 కోట్లతో నిర్మించిన బిటి రోడ్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ప్రారంభించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

సాటాపూర్‌ నర్సరీని సందర్శించిన ఎంపీడీవో

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీలోని ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు సూచించారు. ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తమ పైనే ఉందని, ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట ఈసి శరత్‌ చంద్ర, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గంగాధర్‌ ఉన్నారు.

Read More »

వాసర్‌ గ్రామంలో హరితహారం

నిజాంసాగర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గపూర్‌ మండలంలోని వాసర్‌ గ్రామంలో హరితహరం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మహరెడ్డి భూపాల్‌ రెడ్డికి పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమావత్‌ రామ్‌ సింగ్‌, మండల జెడ్పీటీసీ రాఘవ రెడ్డి, ఎంపీపీ జార. మైపాల్‌ రెడ్డి, ...

Read More »

ఎమ్మెల్యే పరామర్శ

నిజాంసాగర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ – మండలంలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌ గౌడ్‌ భార్య మరణించినందున వారి కుటుంబ సభ్యులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట మండల జెడ్పీటీసీ భూపతి, విజయరామరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ రవీందర్‌, గ్రామపార్టీ అధ్యక్షులు అమర్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో ఆవిష్కరణల సంస్కతికి ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఇన్నోవేషన్‌ ఎగ్జిబిషన్‌ను ఆగష్టు 15 వ తేదీన ప్రారంబిస్తున్నారు. ఆసక్తి గల వారు తమ తమ సొంత జిల్లాల్లో వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. తెలంగాణ ప్రభుత్వం నెలరోజుల క్రితం ప్రారంభించిన కార్యక్రమానికి మొత్తం 500 దరఖాస్తులు వచ్చాయి. అందులో 360 ప్రదర్శనకు అర్హత సాధించడం జరిగింది. అలాగే 220 షార్ట్‌ లిస్ట్‌ చేయడం జరిగింది. ...

Read More »