Breaking News

Nizamabad News

రూ. 14.32 కోట్లు పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 165 మంది లబ్ధిదారులకు మంగళవారం సుమారు 1 కోటి 65 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో గత 11 నెలల్లో 1470 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 32 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభరక్‌ చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

సమస్యలు లేకుండా ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు రబీకి ఎరువులను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, సహకార మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీకి కావలసిన ఎరువులపై ముందుగానే ఇండెంట్‌ పంపించాలని, సాగు విస్తీర్ణాన్ని దష్టిలో పెట్టుకొని ఎరువులు తక్కువ కాకుండా పంపేలా ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. ...

Read More »

బ్రాహ్మణుల అభివద్ధికి కషి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌గానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా వారి అభివద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉంటూ బ్రాహ్మణులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటానికి ముఖ్యమంత్రి చేత ఆదేశాలు జారీ చేయడం తను సాధించిన ...

Read More »

బిసి రుణాలు మంజూరు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ కార్పొరేషన్‌ లోన్‌ వెంటనే మంజూరు చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ దువ్వాలనరేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో బిసి కార్పొరేషన్‌ అధికారి జన్సీరాణికి వినతిపత్రం అందజేశారు. 2017, 2018 లో బిసి కార్పొరేషన్‌ లోన్‌ కొరకు దరకాస్తు చేసుకున్న వారికి ఇంత వరకు లోన్‌ మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి వెళితే ...

Read More »

ఆర్‌టిసి కార్మికులకు బియ్యం పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న నిజామాబాద్‌ 1,2 డిపోలకు చెందిన ఆర్టీసి కార్మికులకు నిజామాబాదు జేఏసి ఆద్వర్యంలో మంగళవారం 10కిలోల చొప్పున 20 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు భాస్కర్‌, యాదగిరి, వనమాల కష్ణ, వి.ప్రభాకర్‌, దండి వెంకట్‌, రమేష్‌ బాబు, సుధాకర్‌, వి.గోదావరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాదు దర్నా చౌక్‌లో ఆర్టీసీ కార్మికుల దీక్షలు 46వ రోజు కూడా కొనసాగాయి. మంగళవారం ...

Read More »

ప్రతి ఒక్కరు సోదరభావాన్ని అలవరుచుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సోదరభావాన్ని అలవర్చుకోవాలని వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ శిక్షణ విభాగం జాతీయ సమన్వయకర్త, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో మంగళవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నిజామాబాదు నగరంలోని ఎస్‌వి డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీహరి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. భిన్న మతాలు సంస్క తులకు నిలయం భారత దేశం అని చెప్పారు. ...

Read More »

ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ద్వితీయ గంగారెడ్డి మెమోరియల్‌ ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంటును ఐఎంఏ మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కవితారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో అద్భుతమైన నైపుణ్యం ఉందని నైపుణ్యాన్ని వెలికితీసే భాగంలో కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ, గంగారెడ్డి మెమోరియల్‌ ట్రస్టు వారు కలిసి ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంటును గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం చాలా హర్షణీయమన్నారు. విద్యార్థులు ఆటల్లో వారి సమయాన్ని కేటాయిస్తే ...

Read More »

బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేయరాదు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు, దూమపానం చేయరాదని, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాలయాలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో పొగతాగవద్దని, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కామారెడ్డి జనహిత భవనంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమ జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ ప్రాంతం పొగాకు రహితంగా నిర్దేశించడమైనది’ అనే బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. ...

Read More »

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా 46వ రోజు సడక్‌ బంద్‌కు వెళ్లకుండా ఇంటి వద్ద ఏఐటియుసి జిల్లా కార్యదర్శ ఎల్‌.దశరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా దశరథ్‌ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని అన్నారు.

Read More »

గౌరీ శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శ్రీ గౌరీ శంకర ఆలయం గాయత్రీ విద్యుత్‌ నగర్‌ దేవునిపల్లిలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకములు, అన్నపూజ నిర్వహించారు. ఆలయ పూజారి నరసింహరావు పంతులు ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళలు స్వామివారిని పూజించి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సంధ్య, శ్రీలత, సుధా, మమత, విమల, స్వరూప తదితరులున్నారు.

Read More »

సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా వికార్‌ పాషా

రెంజల్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామ సర్పంచ్‌ వికార్‌ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వికార్‌ పాషా మాట్లాడుతూ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సర్పంచులందరికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయసహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో వుంటానన్నారు.

Read More »

విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం

నందిపేట్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం కౌల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎన్టీఆర్‌ కాలోనిలో బత్తుల ప్రసాద్‌ ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఇల్లు దగ్దమైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనలో మూడు లక్షల రూపాయలు, 5 తులాల బంగారం, ఇంట్లో టివి, ఫర్నీచర్‌, పూర్తిగా బట్టలు దగ్దమయ్యాయి.

Read More »

ప్రముఖ వైద్యులు వనం దేవిదాస్‌ మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాకు చెందిన సీనియర్‌ వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్‌ వనం దేవిదాస్‌ (81) మరణించారు. నిజామాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. నిజామాబాదులో మంచి సర్జన్‌గా పేరున్న డాక్టర్‌ దేవిదాస్‌ వైద్యవత్తి కొనసాగిస్తూనే సామాజిక స్వచ్చంద సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అందరి మన్ననలు పొందారు. డాక్టర్‌ దేవిదాస్‌ తన భార్య వనం చంద్రసేన పేరిట పేదల పెళ్ళిళ్ళ కోసం వందలాది మందికి పుస్తెమట్టెలు ...

Read More »

ఆర్‌టిసి సమ్మెకు మద్దతుగా ట్రాన్స్‌ జెండర్‌ వెల్పేర్‌ సొసైటీ

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికింది. సోమవారం నిజామాబాదులో జరుగుతున్న ఆర్టీసి దీక్షా శిబిరానికి సొసైటీ సభ్యులు వచ్చి మద్దతు తెలిపారు. బిక్షమెత్తి సేకరించిన రూ.2 వేలు ఆర్టీసి కార్మికులకు ట్రాన్స్‌ జెండర్లు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ సొసైటీ నాయకులు అలక, జరీనా, గంగా, రక్ష తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ అందజేత

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బండి లక్ష్మన్‌ కుమారుడు మెదడు వాపు వ్యాధితో బాధ పడుతున్నాడు. హాస్పిటల్‌ చికిత్స ఖర్చులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహయంతో సియం రిలీఫ్‌ ఫండు ద్వారా 60 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన చెక్కును సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కునింటి రవి, సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు చిన్న రెడ్డి, మల్ల రెడ్డి, తెరాస కార్యకర్తలు లోక లక్ష్మణ్‌, బోర్‌ రాజా రెడ్డి, విట్టం విట్ఠల్‌, బండి రాజు, ...

Read More »

జనవరి 8 నుండి వైదిక పురోహిత శిబిరము

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్షగురుకులము-బ్రాహ్మమహావిద్యాలయము ఆధ్వర్యంలో పూజ్య శ్రీ స్వామి బ్రహ్మానంద సరస్వతి అధ్యక్షతలో వైదిక పురోహిత శివిరము ఏర్పాటు చేసినట్టు ఆచార్య వేదమిత్ర ఒక ప్రకటనలో తెలిపారు. తిథి:పుష్య శుక్ల త్రయోదశి బుధవారము నుండి పుష్య కష్ణ ద్వితీయ ఆదివారము వరకు అనగా 8 జనవరి నుండి 12 జనవరి వరకు శిబిరం ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు ఆ పైబడిన వారు పాల్గొనవచ్చని శిబిరంలో వసతి, భోజనం ఉచితంగా అందజేయబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9848853383 నెంబర్‌లో ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి పెండింగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పలు విషయాలపై అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆస్తుల వివరాలను ఇప్పటికే శాఖలను కోరడం జరిగిందని, వెంటనే నివేదికలను అందించాలని ఆయన ...

Read More »

పర్యాటకుల కోసం బోట్‌

బాన్సువాడ, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం బోట్‌ ఏర్పాటు చేశారు. కాగా నూతన బోట్‌ను ఆదివారం రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్‌ వెంట పలువురు తెరాస నాయకులు, ఆలయ అర్చకులు ఉన్నారు.

Read More »

సామాజిక సేవా కార్యక్రమాల్లో నిజామాబాద్‌ ప్రథమస్థానం

…, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం నిజామాబాదు జిల్లా శాఖ వరుసగా మూడోసారి ప్రథమస్థానంలో నిలిచింది. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సంస్థ సమీక్ష సమావేశంలో ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా శాఖలకు పురస్కారాలు అందజేసింది. తెలంగాణ ఆంద్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలో అత్యధికంగా కార్యక్రమాలు చేసిన నిజామాబాద్‌ జిల్లా వరుసగా మూడవసారి ప్రథమ స్థానం సాదించగా జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లును వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ...

Read More »

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఏఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్శి వై.ఓమయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతుందన్నారు. 43 రోజులుగా ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోక పోగా, కార్మిక సంఘాల నాయకులతో చర్చించక పోగా, శాంతి యుతంగా గాందేయ మార్గంలొ సమ్మె చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ప్రధాన ...

Read More »