Breaking News

Nizamabad News

తెలంగాణకు హరితహారం

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళ హాస్టళ్ల స్థలాన్ని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం హరితహారంలో బాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు ఉన్నారు.

Read More »

కలాం ఆశయాలను సాకారం చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ, సాంధీపని డిగ్రీ కళాశాల సంయుక్త ఆద్వర్యంలో శనివారం అబ్దుల్‌ కలాం వర్దంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో యువ చైతన్య స్పూర్థి ర్యాలీ నిర్వహించారు. 83 మీటర్ల జాతీయ జెండాతో సాందీపని కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని సాంధీపని కళాశాల డైరెక్టర్‌ బి.బాలాజిరావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఆశయాలను సాకారం చేయాల్సిన బాద్యత నేటి యువతపై ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక, అణ్వస్త్ర ...

Read More »

ఆశయాల ఆచరణే గాంధీజీకి అసలైన నివాళి

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీజీ మార్గంలో నడిచి ఆయన ఆశయాలను అనుసరించడమే ఆయనకు అసలైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఇందూర్‌ భారతి రచయితల సమాఖ్య స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను శనివారం కంఠేశ్వర్‌లోని మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కాలానుగుణంగా, సాంకేతికంగా, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ ఆశయాల పరంగా, ఆలోచనల పరంగా ...

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్‌, వాడ వాడ కాంగ్రెస్‌ జెండా కార్యక్రమం నిర్వహించనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో శనివారం నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ స్థాయికి అభివద్ధి చెందినా, సౌకర్యాలు మాత్రం ...

Read More »

కార్గిల్‌ అమరవీరులకు నివాళి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబివిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కోవ్వత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూర్వ ఏబివిపి రాష్ట్రాధ్యక్షులు రణజిత్‌ మోహన్‌ మాట్లాడుతూ కార్గిల్‌ యుద్దంలో విజయం సాధించి నేటికి 20 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్‌ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్‌ తిప్పికొట్టి నేటికి 20 ఏళ్లు గడిచిందన్నారు. ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాక్‌ ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని ...

Read More »

భవిష్యత్‌ తరాలకు మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ తరాల వారికి మొక్కల ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ సుధా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే గాక వాటిని రక్షించి పెద్దది చేసే బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు. నగర శివారులోని సారంగాపూర్‌ గ్రామ అటవీ ప్రాంతంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ మరియు సిరివెన్నెల గ్రీన్‌ సొసైటీ వారి సంయుక్తంగా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ...

Read More »

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఆలూరు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందించారు. కాగా మండలంలో టీకాల కార్యక్రమం శుక్రవారంతో ముగిసిందని మండల పశు సంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం, పాడి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తంలో సుమారు 8500 పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయడం జరిగిందని ప్రభాకర్‌ తెలిపారు. వివిధ ...

Read More »

పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

నిజాంసాగర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను అడిషనల్‌ ఎస్‌పి అన్యోన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదస్థితిలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ సాయన్న, సిబ్బంది ఉన్నారు.

Read More »

ఆడపిల్లకు అండగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

నిజాంసాగర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లకు అండగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌ మండలంలోని సంజీవ రావు పేట గ్రామానికి చెందిన భూమయ్యగారి మనుమరాలు లక్ష్మికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అందజేశారు. అనంతరం భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తుందన్నారు. ఆడపడుచులకు అండగా ఉండేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ...

Read More »

హజ్‌యాత్ర ఎంతో ప్రాముఖ్యతమైంది

నిజాంసాగర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన అబ్దుల్‌ రహూఫ్‌ సతీ సమేతంగా హజ్‌ యాత్రకు బయలుదేరుతున్నందున వారిని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యాత్ర సజావుగా సాగి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. మన నియోజకవర్గం అభివద్ధితో సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

Read More »

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని వెంకటాపూర్‌ కిషన్‌ నాయక్‌ తండా గ్రామాలలో రెట్టింపు అయిన ఆసరా పెన్షన్‌లను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డికి మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వం వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బోదే కాళ్ళ వారికి, వితంతువులకు, బీడీ మరియు గీత, చేనేత కార్మికులకు సమాజంలో సముచిత స్థానం కల్పించింది ...

Read More »

మరింత విస్తతంగా సహకార బ్యాంకు సేవలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులకు, ప్రజలకు మరింత విస్తతంగా సేవలు అందించాలని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బి, శాసనసభ వ్యవహారాలు, రవాణా శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం కోటి 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఆర్థికంగా పలు ...

Read More »

సమస్యలు పరిష్కరిస్తాం

నిజాంసాగర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్కంపల్లిలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి తనయుడు యువనాయకులు రోషన్‌ రెడ్డి శుక్రవారం పర్యటించారు. నారాయణఖేడ్‌ ప్రాంతంలో నివసస్తున్న ప్రజల సాధక బాధకాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, నాయకులు చేస్తున్న అభివద్ధికి ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ అభివద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆయన వెంట గ్రామస్తులు, నాయకులు తదితరులున్నారు.

Read More »

కలెక్టర్‌ కార్యాలయాన్ని గ్రీనరీ చేయాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్న కలెక్టర్‌ కార్యాలయం చుట్టు 8 ఎకరాల్లో హరితహారంలో భాగంగా పూలు, పండ్ల మొక్కలు నాటి గ్రీనరీ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 బ్లాకులు ఏర్పాటు చేసి అధికారులకు వాటి బాధ్యత అప్పగించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో పాంఫాండ్స్‌ నిర్మాణం, చుట్టు ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాట్లు, ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడం, ...

Read More »

అమ్మ ఒడి, మాతా శిశు సంరక్షణ సేవలను సమర్థంగా అందించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఒడి పోషణ అభియాన్‌, మాతా శిశు సంరక్షణ సేవలను సిబ్బంది సమర్థవంతంగా అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఐసిడిఎస్‌, వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. శుక్రవారం జనహితలో అమ్మఒడి, మాతా శిశు సంరక్షణ సేవలపై ఆయా శాఖలతో సమీక్షించారు. ఆ శాఖల ప్రగతిపై సమీక్షించారు. అంగన్‌వాడిల ద్వారా తల్లి, పిల్లలకు పోషక పదార్థాలు సమర్థవంతంగా అందించాలని, మాతృ శిశు మరణాలు జరగకుండా శ్రద్ద వహించాలని సూచించారు. గర్భిణీలను 12 వారాలలోపు ...

Read More »

భూ రికార్డుల సమస్యలు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల సమస్యలపై నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన 19 ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఫోన్‌ ఇన్‌ ద్వారా భూ రికార్డుల సమస్యలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, భూ రికార్డుల తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోగులకు మెరుగైన సేవలందించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వైద్యులు మెరుగైన సేవలందించాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. అన్ని విభాగాల సిబ్బంది ఉన్నారా లేదా, ఏఏ విభాగాల్లో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారన్న దానిపై తనిఖీ చేశారు. అన్ని వార్డుల్లో పర్యటించి పారిశుద్యాన్ని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి కందుతున్న వసతులు, ...

Read More »

ఉద్రిక్తంగా మారిన ఛలో ప్రగతిభవన్‌

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిడిఎస్‌యు చేపట్టినబి ఛలో హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించొద్దని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులు ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛలో ప్రగతి భవన్‌ (హైదరాబాద్‌) కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి, వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. అరెస్టయిన వారిలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్‌, బోయినపల్లి రాము, ...

Read More »

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

బీర్కూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని నెమలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌వైకెసి వాలంటీర్‌ సునీల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ 1999 సంవత్సరంలో 77 రోజుల పాటు కార్గిల్‌ యుద్ధం జరిగిందని, యుద్ధంలో భారత జవానులు వీరోచితంగా పోరాడి 526 మంది జవాన్‌ల ప్రాణత్యాగాలతో కార్గిల్‌ యుద్ధంలో విజయం సాదించారన్నారు. నేటికి 20 సంవత్సరాలు పూర్తిచేసుకుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జులై ...

Read More »

బోనాల పండగ ప్రకృతి ఆరాధన

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోనాల పండుగ అంటే ప్రకతి ఆరాధనకు చిహ్నమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ముందు గల జై భవాని దుర్గామాత ఆలయంలో టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి కలెక్టర్‌ బోనాల పండుగ ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుండి కలెక్టరేట్‌ లోపల వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి అనంతరం కలెక్టర్‌, చైర్మన్‌ మాట్లాడారు. బోనాల ...

Read More »