కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వార్తలను ప్రసారం చేసిన రెండు న్యూస్ చానెళ్ల ప్రతినిధులపై నేరేడ్ మెట్ పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసు ఎత్తి వేయాలని తెంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధిబృందం సోమవారం అందించిన వినతిపత్రంపై డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై తగు చర్యలు చేపట్టి న్యాయం చేకూర్చుతానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు విధి నిర్వహణలో పోలీసుల నుండి ఎదురవుతున్న ఆటంకాల ...
Read More »వారు ఇంటి గడప దాటడం లేదు…
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారంలో ఉన్నా లేకున్నా తన ఒంట్లో రక్తం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, సేవ చేయడానికి మంచి మనసు ఉండాలి కానీ పదవులు అక్కర్లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం మాచారెడ్డి, రామారెడ్డి మండలాలకు సంబందించిన పారిశుధ్య కార్మికులకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజల బాగోగులు చూడాల్సిన తెరాస నాయకులు, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ...
Read More »ఆరేపల్లి గ్రామంలో మాస్కుల పంపిణీ
నిజాంసాగర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంగవ్వ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలెవ్వరు కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితిలో రావాలనుకుంటే మాస్కులు ధరించి రావాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్.ఆంజయ్య, నాయకులు యటకారి నారాయణ, తదితరులు ఉన్నారు.
Read More »కూలీలకు మాస్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్న కూలీలకు సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కూలీలందరూ విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి పనులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి రథోడ్, సీసీ విగ్నేశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు వెంకటి, రాము, తదితరులు ఉన్నారు.
Read More »పంచాయతీ కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
నిజాంసాగర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉచిత బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పిచైర్మన్ ధఫెదర్ రాజు, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గరెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సాదుల, సొసైటీ ...
Read More »ఫంక్షన్ హాల్స్, పాఠశాలల్లో ధాన్యం నిలువ చేసుకోవచ్చు
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నుంచి జుక్కల్ నియోజకవర్గంలో జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని నిలువ చేయడానికి మార్కెట్ కమిటీ గోదాములను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఫంక్షన్ హాల్స్, పాఠశాల గదుల్లో ధాన్యం నిలువ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్‌కు సరిపడా రసాయనిక ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్యను కోరారు. సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ ...
Read More »ప్రతి దుకాణంలో ధరల పట్టిక అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరల పట్టిక ప్రతి దుకాణంలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ చాంబర్లో సోమవారం వ్యాపారస్తులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూరగాయలను మార్కెట్లో రైతు విక్రయించుకోవచ్చని సూచించారు. పండ్లు, కూరగాయలు మార్కెట్ లోనే విక్రయించాలని సూచించారు. కిరాణా వ్యాపారులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంట ...
Read More »చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శానిటీజర్లు, మాస్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మాస్క్‌లను శానిటీజర్లను కలెక్టర్‌కు ప్రతినిధులు అందజేశారు. శానిటీజర్లు, మాస్క్‌లను కలెక్టర్ శరత్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌కు ఇచ్చారు. వాటిని వైద్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గజవాడ రవి, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More »రెండ్రోజులుగా పాజిటివ్ కేసులు లేవు
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్‌కి సంబంధించి గత రెండు రోజులుగా జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని, శుక్రవారం పంపిన రిపోర్టర్‌లో, 59 శనివారం పంపిన రిపోర్టులో 51 నెగటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మొత్తం 105 నమూనాలు పంపగా వీటిలో శనివారం 44 నెగిటివ్ వచ్చాయని ఇంకా 61 లో ఆదివారం 59 నెగిటివ్ వచ్చినాయని, దీంట్లో మరో రెండు నివేదికలు రావాల్సి ఉందన్నారు. ...
Read More »ఆపరేషన్ కోసం వృద్ధుడికి రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దేవుని పల్లి గ్రామానికి చెందిన పెద్దోళ్ల రాజేశ్వరరావుకు (63) ఆదివారం అర్థరాత్రి ప్రమాదం జరగడంతో పట్టణంలోని రష్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి బిజెపి జిల్లా నాయకుడు విశ్వనాధుల మహేష్ గుప్తా సహకారంతో కామారెడ్డి పట్టణానికి చెందిన చీల శ్రీధర్ ఏ పాజిటివ్ రక్తాన్ని 20వ సారి ...
Read More »రక్తదానానికి యువత ముందుకు రావాలి
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్లడ్ డొనేషన్‌కు యువత ముందుకు రావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీశాఖ కాంప్లెక్స్‌లో అటవీశాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడం జరిగిందని, ఇటువంటి సమయంలో రక్తం అవసరమున్న రోగులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అటవీశాఖకు సంబంధించిన ఉద్యోగులందరూ అందరికి ఆదర్శమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ...
Read More »ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధికి 51 వేల విరాళం
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయనిధికి 51 వేల చొప్పున విరాళాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి అందజేశారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షులు పి నారాయణ రెడ్డి, కన్వీనర్ పి బాల నరసింహులు, కో చైర్మన్ కె.వి.రమణ, కో-కన్వీనర్ తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 40 వేల రెండు వందల రూపాయల చెక్కును అశోక టవర్స్ యజమానులు కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో భాస్కరరావు, దత్తాత్రి, వివేకానంద ...
Read More »సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్ రావు సూచనల మేరకు వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసినట్టు రామారెడ్డి మండల అధ్యక్షుడు లక్కాకుల నరేష్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా పని చేస్తున్న వైద్య సేవలు మరువలేనివన్నారు. కేంద్ర, రాష్ట్ర ...
Read More »మే 7 వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ మరింత విస్తృతం కాకుండా నిరోధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మే 7 వరకు లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా, కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తి గొలుసు ఎక్కడికక్కడ ఆగి పోయే విధంగా, వ్యాధి బారిన పడ్డ వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే విధంగా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ...
Read More »అనాధలకు అంగన్వాడి టీచర్ చేయూత
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలోని లింగపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ వైద్య.ఉమారాణి ఓ సాధారణ ఉద్యోగి… తనకు తోచినంత సాయం చేస్తూ అనాథలకు చేయూతనందిస్తున్నారు… ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో బట్టల దుకాణాలు మూసి ఉండడంతో ఇంట్లోని కాటన్ చీరలతో మాస్కులు కుట్టి ఉచితంగా పంచి పెడుతున్నారు. సోమవారం 40 మాస్కులు తయారుచేసి కామారెడ్డి మునిసిపాలిటీలోని 35 వార్డులో, విద్యుత్ నగర్ కాలనీ, 12వ వార్డులో పేదలకు మాస్కులు అందించారు. అలాగే పేద పిల్లలకు ...
Read More »ఇప్పటి వరకు 2996 వాహనాల సీజ్
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ (కోవిడ్ – 19) నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ రేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ వెల్లడిరచారు. ఇందులో భాగంగా కర్ప్యూ ప్రతీ రోజు సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కర్ప్యూ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగరాదని, రాష్ట్ర ప్రభుత్వ ...
Read More »7 వేల 655 వలస కూలీలకు సహాయం
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కొత్తగా 7655 మంది వలస కూలీలకు సహాయం అందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 11 వే 61 మంది వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంకా 7 వేల 655 మంది వలస కూలీలను ...
Read More »ఆసుపత్రుల లాగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులకు ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాలలో ఆసుపత్రుల్లో ఏ రకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అవన్నీ కూడా తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా భవనాలను గుర్తించడంతో పాటు ప్రతి ఒక్కరికి వేరువేరుగా గదులు ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా వారిలో ఎవరికైనా వ్యాధి వ్యాప్తి చెంది ఉంటే అక్కడే ఉండే ఇతరులకు వైరస్ సంక్రమించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు ...
Read More »కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జంగంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఆదివారం పరిశీలించారు. క్రమపద్ధతిలో ధాన్యం కోతలకు ఏఈఓలు అనుమతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ధాన్యాన్ని తేమశాతం చూసే విధానాన్ని పరిశీలించారు. రైతులు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. వచ్చేవారం ధాన్యం కొనుగోలు వేగవంతం అవుతాయని రైతులు ...
Read More »జర్నలిస్టులకు శానిటైజర్ల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆదివారం డిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ జర్నలిస్టులకు ఉచితంగా శానిటైజర్, మాస్కులను పంపిణీ చేశారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టల సేలు మరవలేనివని కొనియాడారు. అంతేకాక ఎటువంటి జీతాలు లేకుండా సమాజ సేవకే అంకితమయ్యే జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. మాస్కులు, శానిటైజర్‌తో పాటు జర్నలిస్టుల చిన్న చిన్న ఖర్చులకు ...
Read More »