Breaking News

Nizamabad News

మండలంలో ఘనంగా వినాయక నిమజ్జనం

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, బోర్గాం, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న స్వామివారు అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలివెళ్లిపోయారు. కందకుర్తి గ్రామంలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గోదావరి కళాబృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రధానవీదుల గుండా శోభాయాత్ర సాగింది. అనంతరం గ్రామ పరిసరాల్లోని గోదావరిలో నిమజ్జనం చేశారు. స్థానిక సర్పంచ్‌ కలీంబేగ్‌ ఏర్పాటు చేసిన కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ...

Read More »

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు విద్యార్థుల ఎంపిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్తాయి హ్యాండ్‌బాల్‌ క్రీడలకు రెంజల్‌ మండల పాఠశాలకు చెందిన విద్యార్థులు శృతి, శ్రీలత, అనిల్‌లు ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరామ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌లు తెలిపారు. ఈనెల జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్‌బాల్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రస్తాయికి ఎంపికైన విద్యార్థులను మాడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్‌ కాంబ్లే, జైనుద్దీన్‌, అయేషా సుల్తానాలు ఉన్నారు.

Read More »

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో గోడ పత్రిక విడుదల చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో కెసిఆర్‌ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమయ్యాక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ...

Read More »

నిర్దేశించుకున్న లక్ష్యాల పూర్తికి 30 రోజుల ప్రణాళిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో ప్రగతిని సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో కామారెడ్డి డివిజన్‌కు జిల్లా పరిషత్‌ సీఈవో కాంతమ్మ , ఎల్లారెడ్డి డివిజన్‌కు డిపీఓ నరేష్‌, బాన్సువాడ డివిజన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తారని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డులలో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు ఈ నెల ...

Read More »

డిసిసి ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ నాయీమ్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ నయీమ్‌ పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి అనేక రకాలుగా సేవలందిస్తు, పార్టీని బలపరుస్తూ చైతన్య పరిచారు. ప్రజలకు ఉపయోగపడి ప్రయోజనాలను ప్రతి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందే విధంగా అనేక సేవలు అందించారు. తెరాస ప్రభుత్వంలో సామాజిక దక్పథంతో సేవలు అందించినా పార్టీ గుర్తించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌ ...

Read More »

డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లో డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో గల పూల కుండీలను పరిశీలించి వాటిలో నీరు నిల్వ ఉంటే తొలగించారు. డ్రైనేజీలో దోమలు నివారణకు సంబంధించిన మందును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోనూ, ఇళ్లలోనూ, ఇంటి పరిసరాలలోను పూల కుండీలు, పాత డబ్బాలు, పాత బకెట్లు, కొబ్బరి ...

Read More »

మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ అరెస్ట్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నారాయణఖేడ్‌లో రైతు రుణమాఫీ, యూరియా కొరత, రైతు బంధు విడుదల కొరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. తొందరగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరాయస్వామి, మాజీ జడ్పీటిసి నిరంజన్‌, మాజీ ఎంపీపీ రామారావు, నాగల్గిద్ద మండల్‌ అధ్యక్షుడు, మణిక్‌ రావు ...

Read More »

పకడ్బందీగా 30 రోజుల ప్రణాళిక

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిజాంపేట్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. శాసన సభ్యులు యం.భూపాల్‌ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోగల కందకాలలో నీరు నిలువ ఉండడంతో సర్పంచ్‌ జగదీశ్వర్‌ చారి తయారు చేయించిన బాబుల్స్‌ నీటి గుంతలలో దోమల లార్వా చనిపోవడానికి వేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి, రోగుల ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ...

Read More »

గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోనూ, దర్పల్లి మండలం కేంద్రంలోను, ఇందల్వాయి మండలం తిర్మన్‌ పల్లి గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వీధులలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. దుబ్బాక గ్రామంలో జిల్లా ...

Read More »

జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థుల ప్రతిభ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడా పోటీలలో ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన 8 మంది పాల్గొనగా ఇద్దరు విద్యార్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ జిల్లా సంక్షేమ పాఠశాలల కన్వీనర్‌ జి. మహేందర్‌ తెలిపారు. అండర్‌ 19 హ్యాండ్‌బాల్‌ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఇదిలా ఉండగా దోమకొండ సంక్షేమ గురుకుల పాఠశాలలో 8న జరిగిన జిల్లా స్థాయి ...

Read More »

30 రోజుల ప్రణాళికతో గాంధీజి కలలుగన్న గ్రామస్వరాజ్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతి గ్రామపంచాయతీ పోటీతత్వంతో పనిచేసి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు పరచాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన 30 రోజుల కార్యాచరణ గ్రామ సభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పనుల గురించి మండల అభివద్ధి అధికారి వెంకటేశం వివరించారు. గ్రామానికి వైకుంఠధామం స్థలం సాంక్షన్‌ అయిందని, డంపు యార్డ్‌ స్థల సేకరణ ...

Read More »

రాశివనాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం రాశివనంలోని జిమ్‌ పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ పరిశీలించారు. జిమ్‌ చుట్టూ పూల మొక్కలు, కదంబం, పారిజాతం మొక్కలు నాటి అందంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్‌ అధికారులకు ఆదేశించారు. అనంతరం రాశి వనాన్ని పరిశీలించి పార్క్‌ మధ్యలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను, విద్యుత్‌ లైన్లను తీసివేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్చార్జి కమిషనర్‌ చందర్‌ నాయక్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ...

Read More »

ఘనంగా చాకలి ఐలమ్మ 35వ వర్దంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద టిఆర్‌ఎస్‌ యూత్‌ పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్‌ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ వర్దంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆడవారిని చిన్నచూపు చూసే సమయంలో తుపాకి చేత బట్టి దొరలకి, పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాముల ...

Read More »

హమాలీలు ఐక్యం కావాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని ఏఐటియుసి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజు హాజరై పోస్టర్లు ఆవిష్కరించారు. హమాలి లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మొదటి మహాసభలు సెప్టెంబర్‌ 20, 21, తేదీల్లో హైదరాబాద్‌లోని కాచిగూడ ఓయూ హోటల్‌ ఆవరణంలో, జాతీయ మహాసభ ఇందిరాపార్కు వద్ద కార్మికుల భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. హమాలి కార్మికుల జాతీయ మహాసభల పోస్టర్లను కామారెడ్డిలోని ...

Read More »

గణేశ్‌ నిమజ్జనం సందర్బంగా ముస్లింల అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా లింగాపూర్‌ గ్రామంలో ముస్లింలు అన్నదానం చేశారు. ఇలాంటి కార్యక్రమం గ్రామంలో మొదటి సారిగా నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ముస్లింలను అభినందించారు. అన్ని పండగలు ఇలాగే కలిసి మెలిసి నిర్వహించుకోవాలని కోరారు.

Read More »

నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగాయపల్లి గ్రామంలో గణేష్‌ మండపాల యువ సమాఖ్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలు జరగకుండా చూడాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అందరూ ఒకరికొకరు సహకారం అందించుకోవాలని ర్యాలీలో భాగంగా యువతకు సూచించారు. ర్యాలీలో గ్రామ సర్పంచ్‌, యూత్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బైపాస్‌రోడ్‌లో వడ్లుర్‌ బైపాస్‌ వద్ద కారు టైర్‌ పేలి పల్టీలు కొట్టింది. సైడ్‌ రెళింగ్‌ ఉండడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు శ్రీహరి, సుశాంత్‌ రెడ్డి, గణేష్‌, బసంత్‌లు కామారెడ్డికి చెందిన వారు. కాగా వీరికి స్వల్ప గాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More »

పద్మశాలి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం అఖిల భారత పద్మశాలీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పద్మశాలీ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ పద్మశాలీ రాష్ట్ర యువజన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అవ్వరి భాస్కర్‌ను, రాష్ట్ర అధ్యక్షులుగా, గుండెటి శ్రీధర్‌ను రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పీవీ రమణ నేతను స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా, గంజి వంశీని ట్రెజరర్‌గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Read More »

సైనికులకు ఘనసన్మానం

రెంజల్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని గౌరీశంకర్‌ గణేష్‌ మండలి 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెంజల్‌ గ్రామానికి చెందిన సైనికులకు ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ ముఖ్య అతిథిలుగా హాజరై ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికుల కషి మరువలేనిదని, వారికి సన్మాన సభను గౌరీశంకర్‌ గణేష్‌ మండలి వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ...

Read More »

గణేశ్‌ మండపాల వద్ద అన్నదానం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గణపతి ఉత్సవాల సందర్బంగా పలు గణేష్‌ మండపాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా శివసాయి కూరగాయల మార్కెట్‌ ఆధ్వర్యంలో, గజానంద్‌ యూత్‌, ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో అన్నదానాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్మూర్‌ కూరగాయల వర్తక సంఘం ఆద్యక్షుఢు గంగన్‌ స్వామి మాట్లాడుతూ ప్రజలకు, భక్తులకు ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్వామి, సరోజ, బాజమ్మ, భాస్కర్‌, రాజు, ...

Read More »