Breaking News

Nizamabad News

పుల్వామా అమర వీరుల‌కు నివాళి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగపూర్‌లో శుక్రవారం అంగన్‌వాడి కేంద్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్వామా దాడుల‌లో మరణించిన వీరసైనికుల‌కు కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిటిజన్‌ డెవల‌ప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు మండ కో ఆర్డినేటర్‌ కాళిదాసు, గ్రామ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, అంగన్‌వాడి టీచర్‌ వైద్య ఉమారాణి, త‌ల్లులు ల‌క్ష్మి, జ్యోతి, భాగ్య, ఆయా ల‌క్ష్మి కేంద్రం పిల్ల‌లు పాల్గొన్నారు.

Read More »

సైనికుల త్యాగాలు వెల‌కట్టలేనివి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ, పీజీ కళాశాల‌లో పుల్వామా దాడిలో మరణించిన సైనికుల‌ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి మహమ్మద్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు భారత సైన్యంలో వివిధ హోదాలో పని చేయడం జరిగిందని, భారత సైన్యంలో పనిచేసే అవకాశం ల‌భించడం అదృష్టంగా భావించాల‌ని పేర్కొన్నారు. దేశం కోసం రాత్రింబవళ్లు ...

Read More »

ప్రతి సభ్యురాలు ఆర్థికంగా బల‌పడాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగపూర్‌ గ్రామంలో గ్రామ సంఘాల‌ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్‌ విజయ్‌ మాట్లాడుతూ ఖాతా నిర్వహణ సక్రమంగా నిర్వహించాల‌ని, ప్రతి సభ్యురాలు అర్ధికంగా బల‌పడాల‌ని, సభ్యులు 360 రూపాయలు చెల్లిస్తే రెండు ల‌క్ష‌లు, ఒక వేళ ప్రమాదవశాత్తూ మరణిస్తే రెండు ల‌క్ష‌లు చెల్లిస్తారని పేర్కొన్నారు. సభ్యుల‌ గ్రూపు నిర్వహణ పరిశీలించారు. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కరంపూడి అన్నపూర్ణ, కార్యదర్శి వనిత, సి.ఏ ల‌క్ష్మి, వనిత, సంతోషి, సహాయకురాలు ...

Read More »

గేదెల కాపరుల‌ను మింగిన చెరువు

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం కొర్పల్‌ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గేదెల‌ను మేపే ఇద్దరు యువకులు వాటిని కడిగేందుకు నీటిగుంటలోకి దిగి, దురదృష్ట‌వశాత్తు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే…కొర్పల్‌ గ్రామానికి చెందిన యువకులు గుట్టమీది రాజు (16), ఎక్కనోల‌ దిలీప్‌ (12) గేదెల‌ను మేపుతుంటారు. కాగా ఎప్పటిలాగే గురువారం వీరిరువురూ గేదెల‌ను మేపేందుకు వెళ్లారు. అదే సమయంలో గేదెలు నీటి గుంటలో దిగాయి. దీంతో దిలీప్‌, రాజు కూడా నీటి గుంటలోకి ...

Read More »

ప్రజాప్రతినిధుల సహకారంతోనే ప్రగతి పనులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, ఆకుపచ్చగా మారాలంటే ప్రజాప్రతినిధుల‌ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సందర్భంగా భోజన విరామం అనంతరం ఆయన జడ్పీటీసీలు, ఎంపీపీల‌తో మాట్లాడుతూ, రాష్ట్రంలో పల్లె ప్రగతి వెల్లివిరియడానికి గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఆకుపచ్చగా కనిపించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయవల‌సి ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ...

Read More »

అంకాల‌మ్మ ఆల‌యంలో జడ్పి ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవిపేట్‌ మండలం కమలాపూర్‌ గ్రామంలో గురువారం జరిగిన అంకాల‌మ్మ, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చెర్మన్‌ దాదన్న గారి విఠల్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్‌ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా సర్పంచుల‌ ఫోరమ్‌ అధ్యక్షుడు ఏటిఎస్‌ శ్రీనివాస్‌, నర్శింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

పార్టీల‌కతీతంగా ప్రజల‌ కోసం పని చేద్దాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వానికి, ప్రజల‌కు మధ్య వారధిగా అందరం కలిసి పని చేద్దామని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కూడా హాజరైన ఈ సమావేశం సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ, నీటిపారుదల‌, వ్యవసాయం, మార్కెటింగ్‌ మార్క్‌ఫెడ్‌, పశుసంవర్ధక శాఖ, తదితర శాఖల‌పై ...

Read More »

షీ టీం కవితా సంపుటి ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య షీ టీం అనే కవిత సంపుటి రచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా డి.ఎస్‌.పి (సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) ల‌క్ష్మి నారాయణ చేతుల‌ మీదుగా కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సాహిత్య పరంగా షీ టీం, డయల్‌ 100 మీద కవితాత్మకంగా రాసినందుకు శేషారావును పలువురు అభినందించారు. గతంలో శేషారావు ఓటరు శతకం, తదితర రచనలు చేసి ప్రముఖ కవిగా పేరుగాంచారు.

Read More »

అంగన్‌ వాడి కేంద్రాల‌ తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండంలోని పేపరిమిల్‌, కందకుర్తి గ్రామాల్లోని అంగన్‌వాడి కేద్రాల‌ను బుధవారం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రమీల‌రాణి తనిఖీ చేశారు. అంగన్‌వాడి కేంద్రాల‌కు వచ్చే పిల్ల‌ల‌కు, గర్భిణిల‌కు, బాలింతల‌కు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం ఏ మేరకు అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. పోషక విలువల‌తో కూడిన ఆహార పదార్థాల‌ను అందిస్తూ వాటి ప్రాముఖ్యత తెల‌పాల‌ని, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల‌ల‌కు ప్రతి నెల‌ బరువు సూచిక తోపాటు క్రీడల‌ను పోషకాహార పదార్థాల‌ను అందిస్తూ వారి ఎదుగుదల‌కు కృషి ...

Read More »

ఐఐటీ నీట్‌ క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులు

బీర్కూర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల‌ పాఠశాల‌ విద్యార్థులు 18 మంది రాష్ట్ర స్థాయి ఐఐటీ నీట్‌ కాంప్‌కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల‌ కృషి, విద్యార్థుల‌ పట్టుదల వ‌ల్ల ఇంతటి ఫలితం దక్కినట్టు పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు త్వరలోనే భువనగిరి జిల్లా ఆనంతారంలో ప్రారంభించబడే పాఠశాల‌లో చేరుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌ను ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, ఏటిపి రఘునాథ్‌ అభినందించారు. 8వ, 9వ తరగతి ...

Read More »

ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈశ్వరీయ బ్రహ్మకుమారిల‌ ఆద్వర్యంలో నిజామాబాదులో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరాన్ని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ బుదవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనారోగ్య, మానసిక సమస్యకు గురవుతున్న వారికి ధ్యానం, ఆధ్యాత్మిక భావన ప్రశాంతతను కలిగిస్తుందని అన్నారు. ప్రజలు ధ్యాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో రాజయోగిని కుల్దీప్‌ బహన్‌జీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామపంచాయతీల‌కు ట్రాక్టర్‌ల అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి సొంత ట్రాక్టర్‌ కలిగి ఉండాల‌నే ల‌క్ష్యంతో ట్రాక్టర్‌ల‌ను కొనుగోలు చేయడం జరుగుతుందని మండల‌ ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారి గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ ప్రజాపరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం వీరన్నగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, పేపర్‌మిల్‌ గ్రామాల‌కు మంజూరైన ట్రాక్టర్‌ల‌ను తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ గోపాల‌కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీల‌కు ట్రాక్టర్‌ను అందజేయడం అభినందనీయమని ట్రాక్టర్‌ల‌తో పాటు ...

Read More »

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్‌ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. ఎల‌క్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వడంతో పాటు గల్ప్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి, 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హుల‌ని తెలిపారు. మరిన్ని వివరాల‌కు యెండల‌ టవర్స్‌ సమీపంలోని ప్రధానమంత్రి కౌశల్‌ ...

Read More »

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా జిల్లాకు నియమించబడిన బి.చంద్రశేఖర్‌ బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ఆర్‌డివోలు వెంకటయ్య, గోపి రామ్‌, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డివోలు, కలెక్టరేట్‌లోని పలు విభాగాల‌ పర్యవేక్షకులు, సెక్షన్‌ క్లర్కుల‌తో సమావేశమయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి కలెక్టర్‌ గారికి సపోర్ట్‌గా విధులు నిర్వహిద్దామని ఒక టీమ్‌గా పని ...

Read More »

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం క్యాసంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌ రాజు సందర్శించారు. ఇందులో భాగంగా పదవ తరగతి విద్యార్థుల‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు రాసే విధానాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్ల‌ల‌కు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాల‌ని, కష్టంతో కాదు ఇష్టంతో చదవాల‌ని సూచించారు. తరువాత ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల‌ సమావేశంలో మాట్లాడుతూ ఉత్తేజం కార్యక్రమం క్రింద ఇచ్చినటువంటి అన్ని ఉత్తర్వుల‌ను తూ.చ తప్పకుండా ...

Read More »

కరోనా మందుల‌ పంపిణీ

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కల్కి ఆయంలో ప్రతి మంగళవారం అన్నదానంలో భాగంగా 16వ వారం నిర్వహించారు. అన్నదాతగా బిబీపేట గ్రామానికి చెందిన ఇల్లందు శ్రీనివాస్‌ దంపతులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ చందు మాట్లాడుతూ అమ్మ భగవాన్‌ మానవ సేవాసమితి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ప్రపంచాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న కరోనా వైరస్‌ ...

Read More »

ఇటుక బట్టి యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల‌ కేంద్రంలో వెంకట్‌ అనే ఇటుక బట్టి యాజమాన్యం బా ల కార్మికుల‌తో బల‌వంతంగా పని చేయిస్తూ వారి తల్లిదండ్రుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆర్‌ఎస్‌పి జిల్లా బృందంగా తాము సందర్శించి వెంకటేశ్వర్లు ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని రెమ్యాషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహ అన్నారు. నిబంధనల‌కు విరుద్ధంగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుపై చర్య కోసం స్థానిక పోలీసు వీఆర్వోని ఇటుక బట్టీ వద్దకు పిల‌వడం జరిగిందని, ఈ ...

Read More »

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం గ్రామానికి చెందిన చిక్కే గంగారాం, కశిగొండకు చెందిన 30 గొర్రెల‌పై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి. రోజు మాదిరిగానే గొర్రెలు షెడ్డులో నిద్రిస్తున్న సమయంలో కుక్క‌లు దాడి చేయడంతో కొన్ని చనిపోయాయి. మరికొన్ని గాయాల‌తో కొట్టుమిట్టాడుతున్నట్లు గమనించిన పెంపకం దారులు వెంటనే పశువైద్యాధికారుల‌కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో పెంపకం దారులు ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గోర్లు ...

Read More »

వరి పంట సందర్శించిన శాస్త్రవేత్తు

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండంలోని నీలా, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లోని రైతు పండిస్తున్న వరి పంటను మంగళవారం ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బృందం సభ్యు సందర్శించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించిన శాస్త్రవేత్తు పంటకు అగ్గు తెగును గుర్తించారు. ఈ సందర్భంగా రుద్రూర్‌ పరిశోధన కేంద్రం సభ్యు జలెందర్‌ నాయక్‌, వై.స్వాతి, రమ్య రాథోడ్‌ మాట్లాడారు. పంటకు అగ్గి తెగు సోకినందువ్ల రైతు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆకుపై ...

Read More »

పోటీ పరీక్షకు ఫ్రీ కోచింగ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుకు ఉపాధ్యాయ పోటీ పరీక్షకు బిసి స్టడీ సర్కిల్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ ఇస్తున్నట్టు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాకు చెందిన బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుకు గురుకు ఉపాధ్యాయ పోటీ పరీక్షకు 60 రోజు పాటు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వబడుతుందని అన్నారు. గతంలో ప్రకటించిన దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఆసక్తి గ అభ్యర్థు స్టడీసర్కిల్‌ ...

Read More »