Breaking News

Nizamabad News

ఆర్థిక మంత్రి ఈటెలను పరామర్శించిన తెవివి రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండ్రోజుల క్రితం మానకొండూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సోమవారం పరామర్శించారు. సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని ఉదయం ప్రత్యేక వార్డులో పలకరించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. యువకుడు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రావతరణ తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా తెలంగాణను ఆర్థికాభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ...

Read More »

నీటి ట్యాంకర్‌ కిందపడి బాలుడి మృతి

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సంతోస్‌నగర్‌ కాలనీలో ఆదివారం మునిసిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌కిందపడి వీరూసింగ్‌ (3) బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… మునిసిపల్‌ నీటి ట్యాంకర్‌ నీరు సరఫరా చేయడానికి సంతోష్‌ నగర్‌ కాలనీకి వెళ్ళింది. కాలనీలోని నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ ప్రాంతంలో నిర్మించుకున్న గుడిసెలో లకన్‌సింగ్‌ అనేవ్యక్తి తన భార్య జ్యోతికర్‌, కుమారుడు వీరూసింగ్‌తో కలిసి ఉంటున్నారు. లఖన్‌సింగ్‌ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సంతోష్‌నగర్‌ కాలనీ వాసులకు నీటి ...

Read More »

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు

  డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సగానికిపైగా బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండానే నడుపుతున్నారు. పాఠశాలల నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలు బహిరంగంగా బోర్డులపై ఉంచాల్సి ఉండగా ఏ ఒక్క పాఠశాల కూడా ఈ విషయాన్ని పాటించడం లేదు. విద్యార్తులకు కావాల్సిన అన్నిరకాల వస్తువులు పాఠశాలల్లోనే విక్రయాలు చేస్తున్నారు. కనీస వసతులు లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయులను, విద్యార్థులను దోపిడి చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం పీపీఎఫ్‌ ...

Read More »

ఎమ్మెల్యేపై అసత్య ప్రకటనలుచేసిన వ్యక్తి అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు పి.శి.భోజన్న వాట్సప్‌లో ఎమ్మెల్యేపై అసత్య ప్రకటనలు, పుకార్లు పోస్టు చేస్తూ, తెరాస పార్టీ కార్యకర్తలందరిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాడని తెరాస పార్టీ జిల్లా కార్యదర్శి మేకల సురేశ్‌ ఫిర్యాదుమేరకు భోజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు.

Read More »

ఆర్మూర్‌ పోలీసులపై చర్యలు తీసుకోవాలి

  ఆర్మూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఉదయం 7.30 గంటలకు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌, సంతోష్‌కుమార్‌, ఇద్దరు కానిస్టేబుళ్ళు డిఎస్పీ ఆకుల రాంరెడ్డి ఆదేశాల మేరకు మఫ్టీలో తన ఇంటికి వచ్చి అక్రమంగా తనను అరెస్టు చేశారని ఆర్మూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భోజన్న తెలిపారు. ఎలాంటి తప్పు చేయకున్నా తనను అక్రమంగా అరెస్టుచేసినందుకు ఆర్మూర్‌ పోలీసులపై నిజామాబాద్‌ డిజిపి, హైదరాబాద్‌ ఐజి, న్యూఢిల్లీ ఎస్సీ కమీషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తాను ఎలాంటి ...

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం

  బీర్కూర్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని పెద్ద చెరువులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువులో నీరు వృధా పోకుండా చెరువుకు రెండు వైపులా 350 మీటర్ల పొడవునా గోడ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అంకోల్‌ గ్రామం నుంచి సంగం గ్రామం వరకు 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించి ...

Read More »

టియస్‌టియస్‌ అత్యవసర సమావేశం….

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియస్‌.టి.యఫ్‌ జిల్లా శాఖ అత్యసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాల్‌ సింగ్‌ హజరై ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘకార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలపైన ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా విమర్శించారు. పాఠశాలలు తెరిచినా పుస్తకాలు కరువు, సర్విస్సు రూల్స్‌ లేక పదోన్నతులు చేపట్టాలని, పిఆర్‌సి బాకాయిలు బుకాయింపులతో సరిపేట్టడం, ...

Read More »

ఇంట్లోకి చొరబడి.. కత్తులతో బెదిరించి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 13నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గౌతమ్‌నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం గౌతమ్‌నగర్‌లోని ఒక ఇంట్లో చొరబడిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వారిని కట్టేసి రూ. 80వేల నగదు, 6 తులాల బంగారం దోచుకున్నారు. అంతేకాకుండా మారుతికారుతో ఉడాయించారు. స్థానికుల సహాయంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read More »

గన్నారంలో మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు

  – గన్నారంలో కలకలం – గ్రామస్తుల ఆందోళన – ఆకతాయిల పనే అంటున్న పోలీసులు డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు సర్కిల్‌ పరిధిలోని గన్నారం గ్రామంలో మావోయిస్టు పేరుతో వాల్‌పోస్టర్లు వెలిసిన సందర్భంగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో బస్టాండ్‌, సుభాష్‌ విగ్రహం, గాంధీ విగ్రహం మూడుచోట్ల సిర్నాపల్లి ఏరియా దళం (పీపుల్స్‌వార్‌) పేరిట హెచ్చరికలు చేసిన పోస్టర్లు శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. ఇది మావోయిస్టుల పనేనా లేదా ...

Read More »

అసంపూర్తిగా నిలిచిన డ్వాక్రా సంఘం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మహిళా డ్వాక్రా గ్రూపు సంఘం కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద మంజూరైన భవనం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రామంలో డ్వాక్రా మహిళాలకు నెలవారి సమావేశాలు నిర్వహించేందుకు భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని డ్వాక్రా సంఘాల మహిళలు పేర్కొంటున్నారు. భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘ భవనం పట్టించుకున్న ...

Read More »

ఈటల రాజేందర్ కారు బోల్తా

మానకొండూరు : మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా… శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్ ...

Read More »

గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం

కువైట్ తెలంగాణ సభలో లో ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గల్ఫ్ తన ఎనిమిదో నియోజకవర్గం అన్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి – కువైట్ తెలంగాణ సమితి ఆద్వర్యంలో జూన్ 11న కువైట్ లోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆవరణలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ తొలి వార్షిక సభలో శ్రీమతి ముఖ్య అతిథిగా పాల్ఘొన్నారు. తెలంగాణకు ఆవతల ఉన్న మరో తెలంగాణ గల్ఫ్ అని, ...

Read More »

ఎస్‌బిహెచ్‌లో సర్టిఫికెట్ల పంపిణీ

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఆర్‌బిఐ జనరల్‌ మేనేజర్‌ రాజు, ఎల్‌డివో ఏ.పుల్లారెడ్డి, మేనేజర్‌ మురళీధర్‌ శుక్రవారం సందర్శించారు. 131 మల్టీఫోల్‌ సర్వీసింగ్‌ బ్యాచ్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల అనుభవాలను తెలుసుకొని వారికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో జిఎం . బిఎం మాట్లాడుతూ చాలా మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన వారందరు జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా మంచిపేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ...

Read More »

బైక్‌, బోరువీల్‌ వాహనం ఢీ – ఒకరు మృతి

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం బస్టాండ్‌ ఎదుట శుక్రవారం ఉదయం ఆటో, బోరువీల్‌, బైక్‌ ఢీకొన్న సంఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్టు డిచ్‌పల్లి ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… మండలంలోని దూస్‌గాం తాండాకు చెందిన అంగోత్‌ రాము (23) డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌ వెళుతుండగా ఆటోను తప్పించబోయి బోర్‌వీల్‌ వాహనానికి ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలైన రామును స్థానికులు గమనించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి ...

Read More »

పుష్కర పనులు వేగవంతం చేయాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కర ఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కలెక్టర్‌ ఏ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హెచ్‌ఆర్‌డి అధికారులు, ఘాట్ల ఇన్‌చార్జి అధికారులతో కందకుర్తి పుస్కర ఘాట్లలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పుష్కర ఘాట్లకు, శివాలయానికి వేరువేరుగా దారిని ఏర్పాటు చేయాలని, పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమన్నారు. పనులను ...

Read More »

పుష్కర నిర్మాణ పనులు 30 వరకు పూర్తిచేయాలి

  – జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కరాల ఘాట్‌ ఇన్‌చార్జి అధికారులు సంబంధిత ఘాట్లలో ఇతర అదికారులతో సమన్వయం చేసుకొని నిర్వహించవలసిన పనులపై నివేదించాలని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో పుష్కరాల విధులు నిర్వహించే అధికారులతో రెండోరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరాల ఘాట్ల వద్ద పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ తదితర పనులు పూర్తి అయ్యే దశలో ఉన్నాయని, కొన్ని పూర్తి చేసి మరికొన్ని చివరి ...

Read More »

విద్యుత్‌ ఏఇగా నటరాజ్‌

  ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ విద్యుత్‌ ఎఇగా నటరాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

  ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్‌ సద్దార్‌ అస్కరీ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోదన చేయడం జరుగుతుందని, అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తమ కళాశాలలో ఉన్నట్టు ఆమె చెప్పారు. ఎల్‌ఎఎసిడి గుర్తింపు గల ఏకైక కళాశాల అని పేర్కొన్నారు.

Read More »

బోధనేతర సిబ్బందితో రిజిస్ట్రార్‌ సమావేశం

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం బోధనేతర సిబ్బందితో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ చాంబర్‌లో జరిగిన సమావేశంలో బోధనేతర సిబ్బందికి ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, విధి నిర్వహణ ఎలా చేయాలి తదితర అంశాలపై చర్చించారు. ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేయాలనే అంశంపై త్వరలోనే ఒకరోజు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌ జాకీర్‌ అహ్మద్‌ఖాన్‌, ఆడిట్‌ అధికారి, సూపరింటెండెంట్‌ సాయాగౌడ్‌, భాస్కర్‌, జ్యోతి, సరిత, తదితరులున్నారు.

Read More »