Breaking News

Nizamabad News

వెంటనే డైట్‌ సెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలి

  నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డైట్‌ సెట్‌ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కౌన్సిలింగ్‌ నిర్వహించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసునాయక్‌ మండిపడ్డారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్తానిక దర్నాచౌక్‌లో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం వాసునాయక్‌ మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు 71 వేల మంది తమ క్వాలిఫై పత్రాలు పట్టుకొని కౌన్సిలింగ్‌ ...

Read More »

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

  రెంజల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన పెంట మాణిక్‌రావు (50) మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికుల సమాచారం. గత రెండేళ్ళ క్రితం భార్య కూడా మనస్తాపానికి గురై చనిపోయిందని, ప్రస్తుతం భర్త మాణిక్‌రావు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్రకారం… మాణిక్‌రావు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ...

Read More »

400 గృహ నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన

  – ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచన నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని నిరుపేదలకు నిర్మించనున్న 400 గృహాలకు శంకుస్థాపన జరగనున్నందున అన్ని ఏర్పాట్లను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సంబంధిత అదికారులను ఆదేశించారు. బుధవారం అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాతో కలిసి నాగారం ప్రాంతంలోని 300 క్వార్టర్స్‌, దొడ్డి కొమురయ్య కాలనీ, అసద్‌ బాబానగర్‌, నాయిబ్రాహ్మణ కాలనీ పరిసర ప్రాంతంలోగల ప్రభుత్వ భూమిని క్షుణ్ణంగా పరిశీలించి నివాస ప్రాంతాలకు ...

Read More »

పంజరంలో బందీగా పాలపిట్ట

మహావిష్ణనీువు కు ప్రతిరూపంగా భావించే ఈ పక్షి రాజన్ని దసరా పండగ రోజు దర్శనం చేసుకుంటే అద్ర్రుష్టామన్న ప్రజల విశ్వాసమే ఇప్పుడు దీని పాలిట శాపంగా మారింది నీలి నీలి రంగుల అందాలతో కనువిందు చేసే తెలుగు రాష్ట్రాల రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రమాదములొ పడింది రైతులకు మేలుచేయడములొ రైతు మిత్రపక్షులఅన్నింటిలోను పాలపిట్టదే అగ్రస్థానం పంటలను ఆశించే క్రిమికీటకాలతో పాటు ఛిన్న చిన్న పాములను సైతమ ఇవి వెంటాడుతుంటఈ అందుకే ఇవి రైతునేస్తాలుగా పేరుపొందినవిదసరా రోజు పాలపిట్టను చూడకపోతే ఏదో లోటుగా భావించి..ఎలాగైనా పండగ ...

Read More »

దసరా వచ్చిందయ్యో…. సరదా తెచ్చిందయ్యో….

  నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే… శ్రీ మాత్రే నమ:… ఎక్కడ విన్నా అమ్మవారి నామ పారాయణాలు, దేవి స్తోత్రమాలికలు భక్తిలో లీనం చేస్తున్నాయి. దసరా వచ్చింది… సరదా తెచ్చింది… ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే పుష్పోత్సవం బతుకమ్మ పండగతో సోమవారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి…. మరోవైపు ఆసేతు హిమాచలం జరుపుకునే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఉదయం నుంచి అత్యంత భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. వివిధ అమ్మవారి ...

Read More »

తీరని నీటి సమస్య

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతుంది. వేసవికాలం పోయినా వర్షాలు కురియకపోవడంతో భూగర్భజలాలు అంతరించిపోయి బోర్ల నుంచి చుక్క నీరు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీటికై పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునిసిపల్‌ అదికారులు పట్టణ వాసుల దాహార్తిని తీర్చడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కాని ఈ ట్యాంకర్లు రోజువారిగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా మునిసిపల్‌ పాలక వర్గం కట్టుదిట్టంగా ...

Read More »

ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిస్టించేందుకు వివిధ మండపాల వారు సర్వం సిద్దంచేశారు. మండపాల్లో అమ్మవారిని ప్రతిష్టించారు. మొదటిరోజు దుర్గామాతగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మండపాల వద్ద అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Read More »

జబర్ధస్త్‌ నా జీవితాన్ని మార్చేసింది

  – జబర్ధస్ట్‌ ఫేమ్‌ రచ్చరవి కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలతో సరైన గుర్తింపు లేని తనకు ఈటివిలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ తన జీవితాన్ని మార్చేసిందని జబర్ధస్త్‌ పేమ్‌ రచ్చరవి అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం నేషనల్‌ స్పోర్ట్స్‌ దుకాణాన్ని ప్రారంభించిన రవి అనంతరం విలేకరులతో మాట్లాడారు. జబర్దస్త్‌ ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిందన్నారు. తనతోపాటు చమ్మక్‌ చంద్ర, అప్పారావు, సుధీర్‌ తదితర కళాకారులకు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టిందన్నారు. నేడు ...

Read More »

పైప్‌లైన్‌ నిర్మాణం పనులు ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న పైప్‌లైన్‌ పనులను మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు 2 లక్షలతో పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు భట్టుమోహన్‌, కైలాస్‌ లక్ష్మణ్‌రావు, నాయకులు ప్రసాద్‌, పిట్ల వేణు, గోనె శ్రీనివాస్‌, ప్రబాకర్‌ యాదవ్‌, ఎ.ఇ. గంగాధర్‌, తదితరులున్నారు.

Read More »

ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు

  కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో దేవి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ ఆలయంలో అమ్మవారికి తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు అమ్మవారి ఊరేగింపు నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గణేష్‌, శేఖర్‌, తోటయ్య, రాజు, మల్లేశ్‌, శంకర్‌, రాములు, తదితరులున్నారు.

Read More »

శారదాదేవి ఆలయంలో ఘనంగా పూజలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌బోర్డులోగల శ్రీశారదా దేవి ఆలయంలో దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారు జగత్‌ప్రసూతిక మంగళగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కామారెడ్డి డివిజన్‌లో ఏకైక శారద క్షేత్రంగా విరాజిల్లుతున్న అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గణపతి హోమం, నవగ్రహ యజ్ఞం, కుంకుమార్చనలతో పాటు బతుకమ్మలు, దాండియా ఆటలు ఆడినట్టు తెలిపారు.

Read More »

టిజివిపి ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో పలు ప్రయివేటు పాఠశాలలు బతుకమ్మ, దసరా సెలవుల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తుండగా మంగళవారం టిజివిపి నాయకులు తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 10 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించగా కొన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్దంగా పాఠశాలలు నడుపుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి సంకెళ్లు వేస్తున్నారన్నారు. ఉప విద్యాధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ...

Read More »

రుణమాఫీ చేయాలని ఎన్‌డిసిసి బ్యాంకు మేనేజరుకు వినతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కామారెడ్డి ఎన్‌డిసిసి బ్యాంకు మేనేజరుకు టిడిపి నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణ మాఫీని తక్షణమే వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ చేయకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రుణమాఫీ చేసి రైతులకు తిరిగి రుణాలు ఇవ్వాలని ...

Read More »

16న తెవివిలో స్పాట్‌ అడ్మిషన్లు

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని 19 కోర్సుల్లో ఖాళీగా ఉన్న 170 పిజి విద్యార్థుల సీట్లను ఈనెల 16న సెమినార్‌ హాల్‌, యూనివర్సిటీ కాలేజ్‌లో జరిగే స్పాట్‌ అడ్మిషన్లలో భర్తీ చేయనున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ విభాగం అధికారులు పేర్కొన్నారు. అలాగే భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌లోని 4 కోర్సుల్లో ఖాళీగా ఉన్న 39 సీట్లను కూడా ఇదే తక్షణ ప్రవేశాల్లో భర్తీచేయనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. కాగా ఓయు పిజి సెట్‌ ఎంట్రెన్సులో ...

Read More »

భువనగిరిలో అనుమతిలేని వెంచర్లను కూల్చివేసిన అధికారులు

  యాదగిరిగుట్ట, అక్టోబర్‌ 9 యాదగిరిగుట్ట న్యూస్‌ డాట్‌ కామ్‌ : భువనగిరిలో ఎట్టకేలకు అనుమతిలేని వెంచర్లను అధికారులు స్పందించి ఒకేసారి వెంచర్లపై మెరుపుదాడి చేసి నేలకూర్చారు. రియల్టర్లు, లబ్దిదారులు దిక్కుతోచని పరిస్థితిలో లబోదిబోమని మొత్తుకుంటున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు, ప్రహరీగోడ, వీధి లైట్లు, తార్‌రోడ్లు మొత్తం వెచ్చించి అభివృద్ది చేస్తే అనుమతిలేదని ధ్వంసం చేయడంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అనుమతి లేనివెంచర్లను కొనుగోలు చేయకూడదని చెప్పినా లబ్దిదారులు కొనుగోలు చేశారని ఒకపక్క అదికారులు ఆరోపిస్తున్నారు. వెంచర్లను స్వర్గధామంగా తయారుచేసి ...

Read More »

బంద్‌కు గిరిజన విద్యార్థి సంఘం మద్దతు

  నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన అక్టోబరు 10 శనివారం రోజున బంద్‌కు గిరిజన విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెతావత్‌ వాసునాయక్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్‌టిలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని అన్నారు. తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ...

Read More »

తాండావాసులు ఉపాధిహామీని వినియోగించుకోవాలి

  రెంజల్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి పరిస్తితుల్లో వర్షాలు లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతుండడం గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి కనీసం నూరు రోజుల ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని ఆలోచించారని జిల్లా కలెక్టర్‌ అన్నారు. ఈ మేరకు కమ్మర్‌పల్లిలోని మానాల గ్రామాన్ని సందర్శించారు. గ్రామం చుట్టు 14 తాండాలు ఉన్న కేవలం 500 మంది మాత్రమే ఉపాధి పనుల్లో పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటే రోజుకు ...

Read More »

కంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయరాదు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నేడు మీ గ్రామ ప్రజల ఆరోగ్యం నిమిత్తం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో స్త్రీలకు, చిన్నపిల్లలకు, కంటి జబ్బులకు, గుండెకు, ...

Read More »

భక్తిశ్రద్దలతో సామూహిక కుంకుమార్చనలు

  కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఇందిరాచౌక్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి భక్తిశ్రద్దలతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణమూర్తి, సంఘం ప్రతినిదులు విష్ణు, రాజ్‌కుమార్‌, రాజు, భాస్కర్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, తదితరులున్నారు.

Read More »

10న రాష్ట్ర బంద్‌

  – వామపక్ష పార్టీల పిలుపు కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 10 శనివారం రోజున వామపక్ష పార్టీల ప్రజాస్వామిక ఆధ్వర్యంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్టు నాయకులు తెలిపారు. శుక్రవారం మునిసిపల్‌ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితిలు, కరువు, అప్పుల బాధతో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇచ్చిన హామీల మేరకు ...

Read More »