Breaking News

Nizamabad News

నిర్లక్ష్య వైఖరిని సరిదిద్దుకున్న పోలీసులు

  డిచ్‌పల్లి, మార్చి 25 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో సోమవారం రాత్రి బ్రహ్మంగారి దేవాలయంలో దుండగులు చోరికి విఫలయత్నం చేశారు. గ్రామస్తులు గమనించి వెంబడించి పట్టుకొనే ప్రయత్నంలో ఇద్దరుదుండగులు తప్పించుకున్నారు. ఈ విషయమై మంగళవారం ఉదయం పోలీసులకు పిర్యాదుచేశారు. ఎస్‌ఐ ముజీర్‌ ఆర్‌ రహమాన్‌ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఇందల్వాయి రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని నిలదీయగా సోమవారం రాత్రి దొంగతనానికి ప్రయత్నించింది నేనేనని, తనతో పాటు మరోవ్యక్తి శ్రీను ...

Read More »

డైరీ లెక్కలను తేల్చేదెవరు

  నిజామాబాద్‌, మార్చి 25 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, ఆరోగ్యం, పాడి పశువుల సంక్షేమం, ఆరోగ్యాల విషయమై బుధవారం నగర శివారులోని సారంగాపూర్‌లో నిజామాబాద్‌ డెయిరీ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి నిజామాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.రమేశ్‌ హాజరుకాకపోవడంతో సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు మండిపడ్డారు. ఈ సమావేశం కొరకు వారంరోజుల క్రితమే జిఎంతో చర్చించగా 25న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆయన తీర్మానించడం జరిగిందని సంఘం అధ్యక్షులు సజ్జా భాస్కర్‌రావు తెలిపారు. జిఎం హాజరుకాకపోవడంతో ...

Read More »

కార్పొరేషన్‌ మెట్లెక్కుతున్న బకాయి వ్యాపారులు

  నిజామాబాద్‌, మార్చి 25 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఆయన పన్నులు వసూలు చేయడంలో దిట్ట… పన్ను బకాయిపడ్డ వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు… ట్రేడ్‌ టైసెన్సులు లేకుండా వ్యాపారం చేయాలంటే బెంబేలెత్తుతున్నారు.. హుండీలు నింపుకునేది ఏడుకొండలవాడైతే… ప్రజల పన్నులతో ప్రభుత్వ ఖజానాను మాత్రం నింపేది మాత్రం మా ఇందూరు మునిసిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు సారేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని బస్టాండ్‌లో బుధవారం ఆకస్మికంగా తనికీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడి 50 దుకాణాలకు ట్రేడ్‌ లైసెన్సు లేకపోవడంతో అక్కడికక్కడే పన్నులు ...

Read More »

దేశంలోనే ఆదర్శగ్రామంగా కందకుర్తి

  – ఎంపి కవిత రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్ళలో కందకుర్తి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామంలో పార్లమెంటు ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందకుర్తి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేయడం జరిగిందని, వచ్చే రెండేళ్ళలో గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆదర్శ గ్రామంగా ...

Read More »

క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి

  – నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరైన పద్దతిలో మందులు వాడితే క్షయ వాధిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ అన్నారు. ప్రపంచ టి.బి . దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఉందని, నివారించడంతోపాటు, నయం చేయడానికి ప్రజలకు విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ...

Read More »

ఆహారభద్రత కార్డు @ 1000/-

  రూ. పది ఇస్తే ఫాం, రూ. వెయ్యి ఇస్తే ఆహారభద్రత కార్డు నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సాక్షాత్తు తహసీల్‌ కార్యాలయ ప్రాంగణంలో రూపాయలు పది ఇస్తే ఆహారభద్రత కార్డు ఫారం నింపి, అనంతరం రూపాయలు వెయ్యి ఇస్తే ఆహారభద్రత కార్డు ఇప్పిస్తామని బయట కూర్చున్న దళారులు ప్రజలను మభ్యపెడుతూ వారి అవసరాలను సొమ్ము చేసుకుంటున్న సంఘటన తహసీల్‌ కార్యాలయం వద్ద వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నగరం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, నిరక్షరాస్యులను ...

Read More »

తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌నాయకత్వంలో తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తూ నగరంలోని స్థానిక ధర్నాచౌక్‌ వద్ద ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర సభ్యులు గంగాధర్‌ మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల కేసీఆర్‌ నాయకత్వంపై ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో దండయాత్ర కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈనెల 27న అన్ని మండలాల్లో ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల వేతనాలు పెంచండి

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మి నాయకులు మల్యాల గోవర్ధన్‌ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులకు వేతనాల పెంచడంతోపాటు జిపిఎస్‌ అకౌంట్ల ద్వారా ...

Read More »

తెవివి బిఇడి కళాశాలలో సింపోజియం

  డిచ్‌పల్లి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని బిఇడి కళాశాల సింపోజియం నిర్వహించారు. మంచి విద్యను అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం జరుగుతుందని ప్రొపెసర్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రామాణిక విద్య, నిర్వహణ వ్యాప్తి, బిఇడి పాఠ్యాంశాలపై దాని ప్రభావం అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ప్రసాద్‌ ప్రసంగిస్తు తెవివి బిఇడి శాఖకు తాను డీన్‌గా ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కోర్సును ప్రారంభించడంలో తెవివి ...

Read More »

సర్వసభ్య సమావేశంలో తైబజార్‌ లొల్లి

  ఆర్మూర్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ సర్వసభ్య సమావేశం సోమవారం రసాభాసాగా మారింది. ముందుగా మునిసిపల్‌ కమీషనర్‌సివిఎన్‌ రాజు ఉగాది శుభాకాంక్షలు తెలిపి సభ ప్రారంభించారు. అంతలోనే మునిసిపల్‌ ప్రతిపక్ష ఫ్లోర్‌ లీడర్లు తైబజార్‌ వేలం పాట విషయాన్ని లేవనెత్తి రచ్చ రచ్చ చేశారు. తైబజార్‌ టెండర్లను మునిసిపల్‌ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా పత్రికా ప్రకటన చేయకుండా ఎలా నిర్వహిస్తారని కమీషనర్‌ను ప్రశ్నించారు. వెంటనే టెండరును రద్దుచేసి తిరిగి ఓపెన్‌ టెండర్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో కమీషనర్‌ ...

Read More »

కరెంటు కోతలతో ఎండిన పంటలు

  – ఆందోళనలో అన్నదాతలు – అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు -అక్కరకు రాని ప్రభుత్వం – విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్తితి రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక రైతన్న… అన్నంపెట్టేవాడు అన్నదాత… అనే యోధాన యోధులు మన రాజకీయ నాయకులు ఎన్నికలపుడు నిలువెత్తు ప్రశంసలతో అన్నదాతను ముంచెత్తుతారు. కానీప్రశంసలు కురిపించిన వారే నేడు అన్నదాతకు అ్కరకు రాకుండా ఏదోరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఖరీఫ్‌లో పంటలు వేసుకోవాలని ...

Read More »

భగత్‌సింగ్‌ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: భగత్‌సింగ్‌ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. భగత్‌సింగ్‌ 84వ వర్ధంతిని ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి గ్రామంలోని భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు దశరథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌లు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన గొప్ప వ్యక్తి భగత్‌సింగ్‌ అని కొనియాడారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవులు కలిసి బ్రిటీష్‌ ...

Read More »

సాగు, తాగునీటి ఎద్దడికి సత్వరచర్యలు చేపట్టాలి

-సిపిఎం డిమాండ్‌ కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ఉన్నాయని, వేసవి కాలంలో ప్రజలు తాగునీరు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్య పరిష్కారం కోసం ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ...

Read More »

వచ్చే ఏడాదిలోగా ఇంటింటికి కుళాయి నీరు

  – మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఏడాదిలోగా ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిసరఫరా చేసి నీటి ఎద్దడి సమస్యను పరిస్కరిస్తామని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. పట్టణంలో సోమవారం బతుకమ్మ కుంట, వడ్డెర కాలనీ, రంగాచారి కాలనీ, సైలానీబాబా, తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి ఏడాదిలోగా నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని ...

Read More »

కామారెడ్డి బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణ బంద్‌కు సోమవారం వ్యాపారస్తులు ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. మునిసిపల్‌ లో పనిచేస్తున్నఓ కార్మికుడు వ్యాపారస్తునిపై దాడిచేయడాన్ని నిరసిస్తూ వ్యాపారస్తులు సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు స్వచ్చందంగా దుకాణాలు మూసి బంద్‌ పాటించారు. పట్టణంలోని సుభాష్‌రోడ్డు, గంజ్‌, స్టేషన్‌రోడ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని దుకాణాలను మూసి ఉంచారు. వ్యాపారస్తులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్టీవో కార్యాలయానికి తరలివెళ్లారు. అనంతరం ఆర్టీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు ...

Read More »

ప్రజావాణికి రెండు ఫిర్యాదులు

రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండలం తహసీల్‌ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి రెండు ఫిర్యాదులు వచ్చాయని ఈ ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్‌ వెంకటయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

నేడు మండలానికి ఎంపి కవిత రాక

రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు మండలంలోని కందకుర్తి, ధూపల్లి గ్రామాలకు జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ధూపల్లిలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఎంపి దత్తత గ్రామమైన కందకుర్తి గ్రామాన్ని సందర్శించి పుష్కర పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మండల తెరాస అధ్యక్షులు పాశం సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 36వ డివిజన్‌లో భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి మల్యాల గోవర్దన్‌ మాట్లాడుతూ 36వ డివిజన్‌లో అర్హులైన వారందరికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని వారన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవో 58 ప్రకారం ఇళ్ళ పట్టాలు వారికి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులను ...

Read More »

చెరువునుంచి అక్రమంగా మట్టి తరలింపు

బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేశాపూర్‌ గ్రామ చెరువు నుంచి మట్టిని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అధికారుల కన్నుగప్పి అక్రమంగా భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గూపన్‌పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్‌. నారాయణరెడ్డి అనే వ్యక్తి సోమవారం తహసీల్దార్‌ రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కంఠేశ్వర్‌ శివారుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లక్ష రూపాయలు గుత్తాగా కొని వేల ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ఈ ...

Read More »

సమస్యలుంటే ఫోన్‌ చేయండి

  డిచ్‌పల్లి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపిపి దాసరి ఇందిర, జడ్పిటిసి కూరపాటి అరుణ, ఎంపిడివో, తహసీల్దార్‌ పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని సమస్యలపై సమష్టి సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలు ఆయా శాఖల వారితో ముఖాముఖి చర్చించారు. సమస్యలపై అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు సహకార సంఘం డైరెక్టర్లు, ఆయాశాఖల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఏ గ్రామంలో సమస్యలున్నా వెంటనే ...

Read More »