Breaking News

Nizamabad News

ప్రారంభమైన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 వేల మంది విద్యార్తులు మొత్తం 27 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 ...

Read More »

మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని 28వ వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో గురువారం జ్యోతి సమాఖ్య మహాజనసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభాకర్‌ హాజరై మాట్లాడారు. మహిళా సమాఖ్యలు ప్రబుత్వం అందించే రుణాలు వినియోగించుకొని తద్వారా లబ్దిపొందాలని అన్నారు. సమావేశంలో 2014-15 సంవత్సరానికిగాను జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి చర్చించారు. ఆడిట్‌ రిపోర్టు చదివి వినిపించారు. ఈయేడాదివార్షిక నివేదికను నిర్ణయించారు. ...

Read More »

జూన్‌ 29 బిఇడి వార్షిక ఫీజుచెల్లింపు చివరితేది

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బిఇడి రెగ్యులర్‌ 2014-15 వార్షిక పరీక్షలు అలాగే 2013-14, 2012-13 బ్యాచ్‌ల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఫీజు చెల్లింపు జూన్‌ 29 వరకు చివరి తేది అని వర్సిటీ పరీక్షల నియంత్రణ అదనపు అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 200 రూపాయల అదనపు రుసుముతో జూలై 6వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read More »

అతర్‌ సుల్తానా, మూసా ఖురేషీలకు ఉర్దూ అకాడమిచే అరుదైన గౌరవం

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అతర్‌ సుల్తానా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మూసా ఖురేషిలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం జరిగినట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉర్దూ భాషా సెమినార్‌లో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలకు నాలుగువేల రూపాయల నజరానా, ప్రశంసాపత్రాలు పొందినట్టు తెలిపారు. అతర్‌ సుల్తానా నిజాం నవాబుల కాలంలో ఉర్దూ భాష అభివృద్ది, సాహిత్యంలో ...

Read More »

ప్రయివేటు పాఠశాలలపై చర్యలకు వినతి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజన్‌లోని ప్రయివేటు పాఠశాలల్లో యూనిఫారం, పుస్తకాలు, షూస్‌ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆమ్‌ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆప్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ రాణా ప్రతాప్‌ మాట్లాడుతూ ప్రయివేటు స్కూళ్లలో కక్కుర్తి దందాను కొనసాగిస్తున్నారని, పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి వ్యాపారం చేయడానికి వీలులేదని తెలిసి యూనిఫాంలు, పుస్తకాలు, తదితరాలు విక్రయించడం గర్హణీయమన్నారు. ఈ వ్యాపారంపై విద్యాశాఖాధికారులు ...

Read More »

ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బానుప్రసాద్‌ మాట్లాడుతూ 1996 తెలంగాణ ఉద్యమం నాటినుంచి నేటి ఉద్యమం వరకు సాయిబాబా కీలకపాత్ర పోషించారన్నారు. నాటి కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల పోరాటంలో మద్దతుగా నిలిచిన సాయిబాబాను జీర్ణించుకోలేక మావోయిస్టుతో సంబంధాలున్నాయని చిత్రీకరించి అరెస్టు చేయడం ...

Read More »

మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థికంగా ఎదగాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరుచుకొని తద్వారా ఆర్థికంగా ఎదగాలని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఐకెపి అర్బన్‌, మెప్మాలోని బిస్మిల్లా సమాఖ్య సంఘాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాటికి ఐదేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా సమఖ్య ప్రతినిధులు మహాజనసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఛైర్‌పర్సన్‌ ప్రసంగించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ...

Read More »

ఆర్మూర్‌లో చైన్‌ స్నాచింగ్‌

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి జాతీయ రహదారి 44పై లక్ష్మి అనే మహిళ మెడ నుంచి బుధవారం గుర్తు తెలియని దుండగులు రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించినట్టు బాధితురాలు తెలిపారు. బుధవారం మెంట్రాజ్‌పల్లి నుంచి ఆర్మూర్‌ వైపు ఆటోలో వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఆమె మెడనుంచి బంగారు గొలుసును అపహరించినట్టు బాధితురాలు తెలిపారు.

Read More »

ప్రభుత్వ బాలికల పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రిన్సిపల్‌ కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటపుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యతను పెంపొందించేలా విద్యాబోధన చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

Read More »

తెవివి ఆంగ్ల విభాగాధిపతిగా డాక్టర్‌ కె.వి.రమణాచారి

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధిపతిగా డాక్టర్‌ కె.వి. రమణాచారి నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని, ఈమేరకు నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డాక్టర్‌ రమణాచారికి అందజేశారు. మొత్తం యుజి, పిజిలో కలిపి 15 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన రమణాచారి గతంలో కాకతీయ యూనివర్సిటీలో కూడా తాత్కాలిక ప్రతిపాదికన బోధించిన అనుభవం ఉంది. ఆంగ్ల భాషలో భారతీయ రచనలు, బ్రిటీష్‌ లిటరేచర్‌లో స్పెషలైజేషన్‌ ...

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  – సంయుక్త కలెక్టర్‌ రాజారాం నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెంగ్యు, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సంబంధిత అదికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణపై బుధవారం అదనపు జేసి చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కారణాల వల్ల ఈ వ్యాధులు ప్రబలడంపై ప్రజలకు అవగాహన కల్పించి నివారించడానికి ...

Read More »

గురువారం నుంచి డిగ్రీ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం 18వ తేదీ నుంచి తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు మొదలవుతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 27 వేల మంది విద్యార్థులు, 27 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు రాస్తారని తెలిపారు. జూలై 8 వరకు జరుగుతాయని విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. అన్ని పరీక్షా ...

Read More »

12 అడుగుల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, గోదాముల్లో కూడా మొక్కలను నాటడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు / కమీషనర్‌ శరత్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరితహారంపై సంబంధిత వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న స్థలాలకు అనుకూలంగా 12 అడుగుల మొక్కలను నాటడానికి ...

Read More »

సీఎం కేసీఆర్ ముక్కుసూటి తనానికి తలవంచుతున్నా-దర్శకుడు రాంగోపాల్‌వర్మ

  -ఆంధ్రా పౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా! సీఎం కేసీఆర్ ముక్కుసూటి తనానికి తలవంచుతున్నా -ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తీరుపై మండిపాటు -ట్విట్టర్‌లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు ముంబై, జూన్ 16: ఓటుకు నోటు కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుతో తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమకాలీన పరిస్థితులపై సందర్భోచితంగా సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టే వర్మ తాజాగా ట్విట్టర్‌లో చంద్రబాబుపై విమర్శల పరంపరను కొనసాగించారు. జాతీయస్థాయిలో ఆంధ్రా ప్రజలను ...

Read More »

మునిసిపల్‌ గేటును పునరుద్దరించాలి

  ఆర్మూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌లోగల మునిసిపల్‌ కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి గోడను నిర్మించారు. దీనికి ఎంఆర్‌పిఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మునిసిపల్‌ పాలకవర్గ అవివేకాన్ని వారు ఎత్తిచూపారు. ఈ సందర్బంగా మంగళవారం ఎంవైఎస్‌ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు మాట్లాడుతూ మునిసిపల్‌ కార్యాలయానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అన్ని మతాల ప్రజలు మునిసిపల్‌కు ఎన్నో పనుల నిమిత్తం వస్తూ, పోతూ ఉంటారని, వారందరి మనోభావాలను గౌరవించి ప్రజల అవసరాల ...

Read More »

ఏఐకెఎంఎస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం

  ఆర్మూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో మంగళవారం ఏఐకెఎంఎస్‌ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడం బాదాకరమన్నారు. ఖరీఫ్‌లోనైనా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్‌, దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలి

  ఆర్మూర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొని రైతులను పూర్తిగా విస్మరించిందని సిఐటియు నాయకులు అన్నారు. మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథిగృహంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కార్యవర్గం ఈనెల 19న తహసీల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడప్రతులను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

తెవివిలో ఇంజనీరింగ్‌ కళాశాల కోసం మంత్రికి వినతి

  డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టడానికి అవసరమైన అనుమతుల కోసం సహాయం చేయడానికి విజ్ఞప్తి చేయడానికి జిల్లాకు చెందిన క్యాబినెట్‌ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి కలిశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకంగా ఫుడ్‌ టెక్నాలజి కోర్సుకు సంబంధించిన కళాశాల మంజూరు చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రుద్రూరులో ఏర్పాటు చేయబోయే ఫుడ్‌ టెక్నాలజి కళాశాల ద్వారా విద్యార్థి లోకానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆ కోర్సు ...

Read More »

21న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనాలి

  డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని సెక్రెటరీ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 21వ తేదీన నిర్వహించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌లను ఆదేశించారు. వర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లందరు 21వ తేదీ జూన్‌ రోజున ఉదయం 6.30 గంటలకు విశ్వవిద్యాలయానికి విచ్చ యోగాలో పాల్గొనాలని, వాలంటీర్లందరు పాల్గొనేవిదంగా చూడాలని రిజిస్ట్రార్‌ సూచించారు. విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేసే ...

Read More »