Breaking News

Nizamabad News

ఇండ్ల పట్టాల కొరకు కలెక్టర్‌కు వినతి.

ప్రజావాణి-3   నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; మాక్లూర్‌ మండలం మాణిక్‌భండార్‌ గ్రామానికి చెందిన మహాలక్ష్మినగర్‌ (వాగుగడ్డ) వాసులు తమకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 120 కుటుంబాల వారిమి గత 20 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నామని, స్తానికంగా మాకు ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, ఓటర్‌ కార్డులు ఉన్నాయని అయిన ఎన్ని సార్లు చెప్పిన అధికారులు గాని, ప్రజాప్రతినిధులుగాని మా గోడు వినడం లేదని మీరైనా మా భాదను అర్తం చేసుకొని మాకు ...

Read More »

18వ రోజుకు చేరిన నిరవదిక సమ్మె.

  వేతన ఒప్పందం అమలు చేయాలని కలెక్టర్‌కు వినతి. నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ సుక్‌జిత్‌ స్టార్చ్‌మిల్స్‌ కార్మికులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసారు. యూనియన్‌ అద్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ మేము గత 18 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్నామని అయినప్పటికి యాజమాన్యం గాని, కార్మిక శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. మాకు జులై .. 2014 నుండి వేతన ఒప్పందం అమలు కావలసి ఉందని, మేము గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, పక్క ...

Read More »

దడువాయిలను మార్కెట్‌ ఉధ్యోగులుగా గుర్తించాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; మార్కెట్‌ యార్డులో ముఖ్య భూమికను పోశిస్తున్న దడువాయిలను మార్కెట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా దడువాయి యూనియన్‌ ఆద్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా దడువాయి యూనియన్‌ అద్యక్షుడు లవంగ అశోక్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రనికి పూర్వం నైజాం కాలంనుండి దడువాయి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో వ్యవసాయ మార్కెట్‌కి వచ్చే రైతుల భాగోగులు చూస్తు చిన్న చిన్న తూకం చార్జీలపై ఆధార పడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా మమ్ములను ...

Read More »

రిసోర్స్‌ టీచర్‌ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జనవరి 12; తెలంగాణ సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌కె) సహిత విద్య విభాగం ఆద్వర్యంలో ఐఈ రిసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ) ఖాళీల భర్తికీ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ అధికారి శ్రీనివాస చారి ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సర్వశిక్ష అభియాన్‌ సహిత విద్య విభాగం జిల్లా కో-ఆర్డినేటర్‌ రామ్మోహన్‌ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 ఖాళీలు ఉన్నాయని వీటిని కాంట్రాక్ట్‌ పద్దతిన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భోదించడంలో శిక్షణ పొంది స్పెషల్‌ ...

Read More »

16 నుంచి శ్రీ శతచండీ మహయజ్ఞం

  నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 12; లోక కల్యాణార్థం 54వ హోమ కుండములతో శ్రీ శతచండి మహయజ్ఞం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్‌లోని స్వయంబు నవశక్తిపీఠం పీఠాధిపతి, యజ్ఞ సంస్థాపక అధ్యక్షుడు కిషన్‌మహరాజ్‌ చెప్పారు. నగరంలోని గుర్బాబాదిరోడ్‌లో గల వ్యాస్‌భవన్‌లో ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు 54 హోమ గుండాలతో శ్రీ శత చండీయూగ సహీత లక్ష కుంకుమ, పుష్పార్చన, విశ్వశాంతి మహయజ్ఞం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. 16న ప్రణవ పతాకావిష్కరణతో వివిధ పూజా కార్యక్రమాలు, ...

Read More »

గల్ఫ్‌లో ఇబ్రహీంపేట్‌ వాసి మృతి

  బాన్సువాడ, జనవరి 12; బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్‌ గ్రామానికి చెందిన దేవారం సంజీవ్‌రెడ్డిని(31) గల్ప్‌లో ప్రమాదశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. దేవారం సంజీవ్‌రెడ్డి ఏడాది క్రితం సౌదీ అరెబియాలోని జిద్దా సమీపంలో అల్‌-ఖాదరి కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. కంపెనీ వాహనంలో పనికి వెళ్తుండగా బుధవారం ప్రమాదం జరిగి మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన సహచరుని ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. అక్కడ కంపెనీ ప్రతినిధులతో మరణవార్త ధ్రువీకరించుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ...

Read More »

25న హిందూ సమ్మేళనం

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; విశ్వహిందూ పరిషత్‌ ఇందూరు శాఖ ఆద్వర్యంలో ఈ నెల 25న హరిచరణ్‌ మార్వడి పాఠశాలలో విశ్వహిందూ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు పాశ్చిమాంధ్రప్రాంత కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం పరిషత్‌ కార్యలయంలో కార్యక్రమ ఏర్పాట్లుపై కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. సమ్మేళనంలో పెద్దఎత్తున హనుమన్‌ ఛాలీసా పారాయణ యజ్ఞం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందూరు హిందూ బందువులందరూ అధిక పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, కార్యదర్శి పిట్ల కౄష్ణ తదితరులు పాల్గోన్నారు.

Read More »

వివేకానందుడి బాటలో నడుద్దాం

  -నగర మేయర్‌ సుజాత నిజామాబాద్‌, జనవరి 12; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; స్వామి వివేకానందుని జీవితాన్ని యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని, అయన అడుగు జాడల్లో నడవాలని నిజామాబాదు నరగ మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. స్వామి వివేకానందుని 152వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్‌ అంబేద్కర్‌ భవన్‌లో నెహ్రూ యవ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ యువజనోత్పవాన్ని నిర్వహంచారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్‌ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశ సంప్కృతి, ...

Read More »

అనాధ బాలికకు ఆశ్రయం

-అమ్మకానికి పెట్టిన పినతండ్రి -రూ.2 లక్షలకు విక్రయ ప్రయత్నం -తప్పించుకున్న బాలిక -ఏల్లారెడ్డి, జనవరి 12; అన్న ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం తమ్ముడు తండ్రిలా చూడాల్సిన చిన్నారిని ఏకంగా అమ్మకానికి పెట్టాడు. తల్లిదండ్రులు లేని చిన్నారిని ఆదారించాల్సింది పోయి మద్యవర్తుల ద్వారా బాలసదన్‌లో ఉన్న చిన్నారిని తెప్పించి అమ్మె ప్రయత్నాలు చేసాడు. సదరు చిన్నారి చాకచాక్యంగా తప్పించుకొని గ్రామ పంచాయతీ అధికారుల చెంతకు చెరింది. దీంతో అసలు రంగు బయట పడిన పినతండ్రి వ్యవహారం ఇది. నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన ...

Read More »

కౌన్‌ బన్‌ రహాహౖాె కరోడ్‌పతి?

  విశ్వామిత్రుడు స్రుష్టించిన త్రిశంకు స్వర్గంలో దేవతలంతా సమావేశమయ్యారు.నవ్వులు,కేరింతలతో ఉల్లాసంగా ఉన్నారు.అక్కడ కౌన్‌బనేగా కరోడ్‌పతి తరహాలోనే సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న ఇంద్రుడు ప్రశ్నలుసంధిస్తుంటే దేవతలు ఉత్సాహంగా జవాబులిస్తున్నారు.లక్షలాది రూపాయలు గెలుచుకుంటున్నారు.వారిని మరింత ఉత్సాహానికి గురిచేస్తూ నోరూరించే ప్రశ్న వేశాడు.మరో మూడు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో జరగనున్న సంక్రాంతికి ప్రజలు ఎక్కువగా ఏరకమైన తినుబండరాలు తయారు చేస్తారు….(ఎ)నువ్వులుండలు, (బి)అరిసెలు, (సి)చక్కెరకేళీలు, (డి)సకినాలు….ఈ పేర్లు చెవిన సోకగానే దేవతలు తమకు నైవేద్యంగా రానున్న వంటకాల రుచులను ఊహించసాగారు.పక్కనే ఉన్న ఇంద్రుడి సతీమణి ‘బంగారం మీ కోసమే’ కార్యక్రమం నిర్వహిస్తోంది.అక్కడ ...

Read More »

పేదల స్థలాలు క్రమబద్దీకరణ

  …కలెక్టర్‌లను ఆదేశించిన రెవెన్యు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రగతినగర్‌, జనవరి 9: పేద ప్రజలకు భూముల క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బీఆర్‌ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాధారణ పరిపాలన భవనం నుంచి ఆయన వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. పేద ప్రజలకు అభ్యంతరాలు లేని 125 చదరపు గజాలలోపు నిర్మాణాలను క్రమబద్దీకరించాలన్నారు. క్రమబద్దీకరణ చేసుకునే వారు సంబంధిత తహశీల్‌ కార్యాలయంలో ధరఖాస్తులు సమర్పించి రశీదు పొందాలన్నారు. ఆక్రమణలను రెవెన్యూ పర్యవేక్షణలోని సిబ్బంది పరిశీలిస్తుందని ...

Read More »

జన్నెపల్లి ఎస్‌ఎస్‌ఆర్‌లో సంక్రాంరతి సంబరాలు

నవీపేట్‌, జనవరి 10,   నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నవీపేట మండలంలోని జన్నెపల్లి ఎస్‌ఎస్‌ఆర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌లో శనివారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎస్‌ఆర్‌ వివిధ సంస్థల అధినేత మారయ్య గౌద్‌ మాట్లాడుతూ పండగలు మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెబుతాయని అందులో భాగంగానే ప్రతీ సంవత్సరం ప్రతీ పండగను, విద్యార్థులకు పండగ విశిష్టతను తెలియజేయడం కోసం పాఠశాaలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగుర వేసారు. ఈ కార్యక్రమంలో హరితా గౌడ్‌, ప్రిన్సిపల్‌ ...

Read More »

ఆటోడ్రైవర్లుకు యూనిఫాం తప్పనిసరి

  పార్కింగ్‌ బాధ్యత యాజమాన్యాలదే ఆక్రమణలను తొలగించాలి నిజామాబాద్‌ క్రైం, జనవరి 9: ప్రతి ఆటో డ్రైవర్‌ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్‌ సీఐ శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఆటో వాలాలు తమ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమ వెంటే ఉంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వద్ద వాహానలు ...

Read More »

లోగుట్టు?

నిజామాబాద్‌, జనవరి 10,   నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు చివరకు ఏం తేల్చనున్నారు…….. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించి ఒక్కసారిగా ఎందుకు నిలిప వేశారు…115 భవనాలకు నోటీసులు ఇచ్చిన బల్దియా…ఓ వైద్యుడి బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేయడంతో ఈ తంతును ముగించేసిందా…..! నిజామాబాద్‌, జనవరి 9: నిజామాబాద్‌ నగరంలో ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. కార్పొరేషన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు, కూల్చివేతల పరంపర యగ్నంలా సాగుతుందని భావించిన తరుణంలో ఆరంభశూరత్వంగా మిగలడం పట్ల ...

Read More »

‘నిజాం షుగర్స్‌’ను కాపాడుకుందాం

  …రైతుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తా …బోధన్‌లో చెరుకు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌, జనవరి 9: ఐక్యతతో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని కాపాడుకుందామని, రాజకీయాలకతీతంగా నిలిచి ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకువద్దామని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్‌ శివారులోని అప్నా ఫంక్షన్‌హాల్‌లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన చెరుకు రైతుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యె మాట్లాడుతూ రైతుల సంక్షెమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ ప్రైవేటీకరణ రద్దుకు నిర్ణయం ...

Read More »

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అగ్రగామిగా నిలబెడతాం

బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆర్మూర్‌, జనవరి 09, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: భారతీయ జనతా పార్టీని దేశంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయించి భారత దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా నిలబెడతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక రోడ్డు భవనాల అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేకలరుల సమావేశంలో ఆయన మాట్టాడారు. గురువారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన విజయవంతం అయినట్లు ఆయన ...

Read More »

అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్దీకరణ

భూములపై జివో విడుదల కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 9; ప్రభుత్వ భూములకు ఎటువంటి అభ్యంతరాలు లేకుంటేనే, అది అర్హులైన వారికి మాత్రమే క్రమద్దీకరణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జివో ఎంఎస్‌ 58 ప్రకారం 125 గజాలలోపు ప్రభుత్వ భూమిలో ఇళ్లు, నివాసం ఏర్పర్చుకున్న పేద ప్రజలకు క్రమబద్దీకరణ చేసుకోవడానికి నిర్ణేత దరఖాస్తు ద్వారా సంబంధీత అధికారిని సంప్రదించాలని సూచించారు. జీవో ఎంఎస్‌ 59 ప్రకారం ...

Read More »

గోల్డ్‌మెడల్స్‌ విజేత శ్రీరాంను అభినందించిన ఎస్పి.

  రాష్ట్రస్థాయి ఉషూ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన శ్రీరాంను ఎస్పీ చంద్రశేఖరరెడ్డి అబినందించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి చైన్‌ చువాన్‌, జియాన్‌షూ, క్వాన్‌, డ్యూయల్‌ విభాగాలలో బంగారు పతకాలు సాధించాడు. బెస్ట్‌ప్లేయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. శ్రీరాం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్ధార్‌ సింగ్‌ కుమారుడు.బుధవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని కలిశాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీరాం భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాక్షించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు సాధీంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ ...

Read More »

విసి నిర్ణయం అవగాహణ రాహిత్యానికి నిదర్శనం

  తెలంగాణా యూనివర్సిటీ మాజీ ఇన్‌వార్జి వీసీ శైలజా రామయ్యార్‌ నిర్ణయం అవగాహణ రాహిత్యానికి నిదర్శనమని టీచర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌(యూటీడబ్ల్యూఏ) ఖండించింది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలను తెలుసుకోకుండా తెయూ మాజీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ను సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్య అని అన్నారు. బుధవారం వర్సిటీలో నిర్వహించిన సమావేశం అనంతరం విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు తప్పుచేస్తే ముందుగా నోటిఫికేషన్ల ఇవ్వకుండా సస్పెండ్‌ చేయటం పొరపాటు చర్యగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కనకయ్య, డాక్టర్‌ ...

Read More »

జిల్లాలో అర్థనారి షూటింగ్‌ సందడి

  జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో బుధవారం అర్థనారి షూటింగ్‌ను నిర్మాతలు కార్లపు కౄష్ణ, రవికుమార్‌ కెమెరాస్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అర్ధనారి సినిమా షూటింగ్‌ నిజామాబాద్‌ జిల్లాలోనే పూర్తి స్థాయిలో జరుపుకోంటుందన్నారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్‌లో జిల్లా నుంచి వందల మంది ఆర్టిస్టులను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ విజయవంతంగా ముగింపు దశకు త్వరలోనే చేరుకుంటుందని చెప్పారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ బానుశంకర్‌, శ్రీనివాస్‌, ...

Read More »