Breaking News

Nizamabad News

కలెక్టర్‌కు ఆశ వర్కర్ల వినతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు మంగళవారం కామారెడ్డిలో ఆశ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు చేస్తున్నా ప్రబుత్వం నుంచితమకు గుర్తింపు లేకపోవడం సరికాదన్నారు. సమాజంలో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద భీమా, ...

Read More »

గణనాథునికి విశేష పూలతో అలంకరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్‌లోగల రామసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషునికి మంగళవారం పుష్పాలంకరణ చేశారు. 25 అడుగుల ఎత్తుగల భారీ గణనాథునికి వివిధ రకాల పూలతో అలంకరించారు. విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామసేన అధ్యక్షుడు శ్రీకాంత్‌, భక్తులు పాల్గొన్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో కుంకుమ పూజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద మంగలవారం మహిళలుభక్తి శ్రద్దలతో కుంకు మ పూజలో పాల్గొన్నారు. గణేష్‌ మండపం వద్ద సామూహిక కుంకుమపూజలో అధిక సంఖ్యలో బక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి, పట్టణ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్‌, ప్రసాద్‌, నవీన్‌, ప్రతినిధులు రాజేశ్వర్‌, రాజయ్య, కిషన్‌, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

యువజన సమాఖ్య గణేష్‌ వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి యేటా స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆద్వర్యంలో భారీ గణనాయకుని ఏర్పాటు చేస్తారు. అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్నదానం చేసినట్టు సమాఖ్య అధ్యక్షుడు రవిందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలోని షేర్‌ గల్లీలోగల యువసేన షేర్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాల ...

Read More »

భారతదేశానికి వేల సంవత్సరాల అపూర్వ చరిత్ర ఉంది

  – ప్రొపెసర్‌ నారాయణరావు డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ చరిత్ర మహోన్నతమైంది. మనది వేల ఏళ్ళ చరిత్ర. మన చారిత్రక వారసత్వ సంపద ఎన్నటికీ చెరగనిది అని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌ సభ్యులు ప్రొఫెసర్‌ నారాయణరావు అన్నారు. మంగళవారం భారతీయ చరిత్ర, సంస్కృతి అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌లో ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ చరిత్రను బ్రిటిషర్లు వక్రీకరించారని, మన చరిత్రను మనం సరైన ...

Read More »

తెవివిలో విజయవంతంగా క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 4 కి.మీ. క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు విజయవంతంగా ముగిశాయి. వర్సిటీ చరిత్రలో మొదటి సారిగా అంతర్‌ కళాశాలల క్రాస్‌ కంట్రీ పోటీలను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మమతలు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లోఉత్సాహంగా పాల్గొన్నారు. వర్సిటీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుంచి బయట ఎంట్రెన్సు గేట్ల ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధుల రూ. 2 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

Read More »

మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లిమ్రా మిలాప్‌ పీస్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకోకుండా ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సొసైటీ ప్రతినిధులు ...

Read More »

మానసిక వ్యాధితో యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీకి చెందిన దత్తాత్రి అనే యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతూ సోమవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తాత్రి 10వ తరగతి వరకు చదివి ఫెయిల్‌అయ్యాడు. ఇంకా వివాహం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా మానసిక వ్యాదితో బాధపడుతున్న దత్తాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Read More »

అంబరాన్నంటిన సాందీపని వినాయక నిమజ్జన సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన వినాయకుని సోమవారం నిమజ్జనంచేశారు. ఈసందర్బంగా విద్యార్తులు నిమజ్జన శోభాయాత్రలో విద్యార్థిని, విద్యార్తులు దాండియా నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. గణపతి బొప్పా మోరియా అంటూ కేరింతలు కొడుతూ నిమజ్జనానికి తరలారు. కళాశాలలో లడ్డూవేలంపాట నిర్వహించగా బిఎస్సీ విద్యార్తులు రూ. 6200 లడ్డూ తీసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిఇవోహరిస్మరణ్‌రెడ్డి, డైరెక్టర్‌ బాలాజీరావు, ప్రిన్సిపాళ్ళు ప్రవీణ్‌కుమార్‌, సాయిబాబా, అధ్యాపకులు రాజు, మనోజ్‌, బాలనర్సు, సంపత్‌కుమార్‌, శ్యాం, ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 30వ వార్డు వివేకానంద కాలనీలో మురికికాల్వల నిర్మాణం పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13వ ఆర్థికసంఘం నిధులు రూ. 5 లక్షలతో మురికికాల్వల నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన మురికికాలువలు చెడిపోవడంతో అదే స్థానంలో నూతనంగా కాలువలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ విజయ, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్‌యాదవ్‌, ఆనంద్‌, రవి, ...

Read More »

భారీ వినాయకునికి భారీగా భక్తులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌రోడ్డులో బిడిఎస్‌ఎస్‌ గణేష్‌ మండలి ఆద్వర్యంలో ప్రతిస్టించిన 20 అడుగుల భారీ వినాయకుని దర్శించేందుకు భక్తులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వినాయకుని చేతిలో 51 కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఉంచారు. కామారెడ్డి ప్రాంతంనుంచేకాకుండా వివిధ మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. బిడిఎస్‌ఎస్‌ గణనాథుడు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గణేష్‌ మండలీల నిర్వాహకులు ఉదయం, సాయంత్రం వేళ వినాయకుని వద్దప్రత్యేక పూజా ...

Read More »

ఆశ వర్కర్ల పిల్లలతో నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రబుత్వం పట్టించుకోకపోవడాన్నినిరసిస్తూ సోమవారం తమ పిల్లలతో కలిసి సమ్మెలో బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా కుటుంబాలను రోడ్డుకీడుస్తుందన్నారు. అధికారంలోకి రాక ముందు కాంటాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని నిలబెట్టుకోకపోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే తమను క్రమబద్దీకరించాలని రూ. 15 వేల కనీస వేతనం చెల్లించాలని ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ బిఇడి ఫలితాల వెల్లడి

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గత ఆగష్టులో ముగిసిన బిఇడి పరీక్ష పలితాలను సోమవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి విడుదల చేశారు. మొత్తం 1404 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1136 విద్యార్తులు ఉత్తీర్ణత సాధించారని ఆయన అన్నారు. 80.91 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వివరించారు. బాలురు 77.37 శాతం ఉత్తీర్ణత కంటే బాలికల 82.49 శాతం ఉత్తీర్ణత మెరుగ్గా ఉందన్నారు. తక్కువ సమయంలో పరీక్ష పలితాలు విడుదల చేసినందుకు పరీక్షల ...

Read More »

జిల్లాలో 896 డంపింగ్‌ యార్డులు, 739 స్మశాన వాటిక పనులు మంజూరు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదర్శ గ్రామాల నిర్మాణంలోభాగంగా శానిటేషన్‌ను మెరుగుపరిచేందుకు జిల్లాలో 896 డంపింగ్‌ యార్డులు, 739 స్మశాన వాటికలు ఏర్పాటుకు, పనులు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, మండల స్తాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాకలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి డంపింగ్‌ యార్డుకు రూ. 63,106 లతో పనిదినాలు, ప్రతి ...

Read More »

2015-16 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవాలి

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు 2015-16 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల కొరకు విద్యార్తులు ఉపకార వేతనాల రినివల్స్‌, కొత్త విద్యార్తుల ఉపకార వేతనాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కాపీలను రెండు సెట్లు వర్సిటీ కార్యాలయంలో స్కాలర్‌షిఫ్‌ సెక్షన్‌ ఇన్‌చార్జికి అందజేయాలని తెలిపారు. అక్టోబర్‌ 30వ తేదీనాటికి చివరి తేదిగా నిర్ణయించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకయ్య తెలిపారు.

Read More »

ప్రజావాణికి 3 ఫిర్యాదులు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల తహసీల్‌ కార్యాలంయలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 3 ఫిర్యాదులు అందినట్టు తహసీల్దార్‌ వెంకటయ్య చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

మంగళవారం మండల సర్వసభ్యసమావేశం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు, సమావేశానికి మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పలు శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఆర్మూర్‌లో సిపిఎం మహాసభ

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని ఎంఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం సిపిఎం ఉత్తర తెలంగాణ జిల్లాల మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ మహాసభల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

Read More »

సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దులగుట్టపై సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున కొండపైకి నడిచివెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గుట్ట భక్తులతో కిటకిటలాడుతుంది.

Read More »