Breaking News

Nizamabad News

నెట్ లో ‘సర్దార్ ‘ టైటిల్ సాంగ్ వచ్చిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – బాబి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ – గబ్బర్ సింగ్’. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ అంటూ నెట్ లో ఓ సాంగ్ తెగహడావిడి చేస్తుంది..నిజానికి ఇది చిత్రంలోనేదనా, లేక ఫాన్స్ క్రియేట్ చేసిందో తెలియదు కానీ నెట్ లో , సోషల్ మీడియా లో మాత్రం ‘సర్దార్’ టైటిల్ సాంగ్ అంటూ షేర్ చేస్తున్నారు. “గబ్బర్ సింగ్..సింగ్..సింగ్ ” అంటూ సాగే ఈ సాంగ్ వినడానికి చాల బాగుంది..ఇక పోతే ఈ టైటిల్ ...

Read More »

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids అంటారు . ఇది జంతు జీవనానికి ప్రధానమైనది . మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము . ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు ...

Read More »

రోడ్లు ఊడ్చి ఆశల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకపోవడం గర్హణీయమన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం కింద రూ. 15 వేలు చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మకు వినతి పత్రం ...

Read More »

7వ వార్డులో సిసిరోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌లో సోమవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు 4 లక్షలతో సిసి రోడ్డు పనులను చేపట్టినట్టు ఆమె చెప్పారు. పనులు నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, ఏఇ గంగాధర్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌, వాజిద్‌, ఆంజనేయులు, నర్సింలు, బాలకృష్ణ, సుజాత, రేణుక తదితరులు ...

Read More »

బస్సు, బైక్‌ ఢీ -ఇద్దరికి తీవ్ర గాయాలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంకోల్‌ క్యాంపులో బాన్సువాడ- నిజామాబాద్‌ ప్రదాన రహదారిపై ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. బైరాపూర్‌ గ్రామానికి చెందిన సాయిలు, సందాని అనే వ్యక్తులు పని నిమిత్తం బాన్సువాడకు వెళ్లి తిరిగి వస్తుండగా బోధన్‌ నుంచి బాన్సువాడకు వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొనడంతో కల్లు సాయిలు తలకు తీవ్ర గాయాలయ్యాయని, సందాని అనే వ్యక్తికి కాళ్లు, చేతులు విరిగి, తలకు కూడా గాయాలయ్యాయని క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రయివేటు ఆసుపత్రికి ...

Read More »

బతుకమ్మ ఆటలతో ఆశల నిరసన

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యల పరిష్కారం కొరకు మండలంలోని ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె సోమవారంతో 13 వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా సోమవారంబతుకమ్మలు ఆడుతూ, పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంఏర్పడిన తర్వాత కాంట్రాక్టు పోస్టులు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు ఉండవని తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశ వర్కర్లపై వివక్ష చూపడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలిప్పిస్తామన్న ...

Read More »

శాంతి, సంతోషాలతో పండగలు జరుపుకోవాలి

  – సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టన ప్రజలు పండుగలను శాంతిపూర్వకంగా, సామరస్యంగా, సంతోషంగా జరుపుకోవాలని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ప్రగతిభవన్‌లో ముస్లిం, హిందూ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో మాట్లాడుతూ గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని చేస్తున్న ఏర్పాట్లకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని తెలిపారు. పండుగల సమయంలో విద్యుత్తు, తాగునీరు, తదితర సదుపాయాలు సమృద్ధిగా సమకూర్చుతామశ్రీని తెలిపారు. మనలోగల అపోహలను, సంకుచిత ...

Read More »

బాలికల హాస్టల్‌ సమస్యపై ఆర్డీవోకు వినతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రాంతంలోని బిసి బాలికల కళాశాల హాస్టల్‌లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్‌ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ బిసి బాలికల వసతి గృహాల్లో కనీస అవసరాలైన నీటి వసతి సైతం లేకపోవడంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు స్వంత భవనం సైతం లేకపోవడం, రెగ్యులర్‌ వార్డెన్‌ లేకపోవడం గర్హణీయమన్నారు. ...

Read More »

విద్యార్థుల్లో దేశభక్తి భావం పెంపొందాలి

  – ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరి కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో దేశభక్తి భావం పెంపొందాలని ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరి అన్నారు. ఏబివిపి ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌కె డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాగత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి మానసిక బలం తప్పకుండా ఉండాలని, అప్పుడే విద్యార్థులు తమ గురించి, కుటుంబం గురించే కాకుండా దేశం కోసం కూడా ఆలోచించగలుగుతారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ...

Read More »

ఘనంగా ఆంజనేయస్వామికి పుష్పాలంకరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలోగల ఆంజనేయస్వామికి సోమవారం పుష్పాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శివునికి అన్నపూజ, ఏకాధశ రుద్రాభిషేకం, అస్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాస మహోత్సవ పూర్ణాహుతి సందర్భంగా లలితా జ్యోతిషాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసినట్టు అర్చకులు రమేశ్‌ శర్మ తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు సాయిదీక్షిత్‌, గంజ్‌ వర్తక సంఘం అధ్యక్షులు లక్ష్మిపతి, కార్యదర్శి శ్రీనివాస్‌, రాజరాజేశ్వర్‌, భక్తులు పాల్గొన్నారు.

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట టిజివిపి ధర్నా

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ టిజివిపి ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి కొత్త బస్టాండ్‌నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ఆర్డీవోకు వినతి సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ అమరుల త్యాగఫలం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం నిర్వహించని ...

Read More »

భారతీయ సంస్కృతిని పరిరక్షించాలి

  – మైసూరు గణపతి సచ్చిదానంద పీఠాధిపతి సచ్చిదానంద స్వామి కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని మైసూరు గణపతి సచ్చిదానంద పీఠాధిపతి సచ్చిదానంద స్వామి అన్నారు. కామారెడ్డి శివారులోని దత్తాత్రేయ నవనాథ క్షేత్రానికి సోమవారం స్వామి విచ్చేశారు. అక్కడ నిర్వహించిన గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ...

Read More »

మట్టి గణపతులను పూజించాలి

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మట్టి గణపతులను పూజించాలని, ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ అన్నారు. మట్టి గణపతుల వల్ల పర్యావరణ కాలుష్యం కలగదని చెప్పారు. సోమవారం ఆర్మూర్‌లోని మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె ముఖ్య అతితిగా పాల్గొని ప్రసంగించారు. సమాఖ్య మహిళలు మట్టి గణపతులను ఉపయోగించేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. ఇందువల్ల పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని ఆమె కోరారు. సమావేశంలో పట్టణ ఏరియా ...

Read More »

శాంతి కమిటీ సమావేశం

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి పాల్గొని ప్రసంగించారు. గణేస్‌ మండపాల నిర్వాహకులు, ఆయా పార్టీల నాయకులు హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు మండళ్ళ నిర్వాహకులు తీసుకోవాలన్నారు. డిజెలకు అనుమతి లేదని, నియమాలను ప్రతి మండలి వారు పాటించాలని అన్నారు. ...

Read More »

ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 22వ వార్డులో 100 కెవి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెరాస హయాంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఆర్మూర్‌ మునిసిపల్‌ అబివృద్దిలో దూసుకుపోతుందని అన్నారు. ఇందుకు సహకరిస్తున్న ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుద్దేటి రమేశ్‌, విద్యుత్‌ ఎఇ నటరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మట్టి విగ్రహాలే పర్యావరణానికి శ్రేయస్కరం

  – విద్యార్థుల ర్యాలీ ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలే ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజలు దోహదపడాలని మండలంలోని మామిడిపల్లి కృష్ణవేణి పాఠశాల విద్యార్థుళు ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయకులు వినియోగించాలని వారు కోరారు. పిఓపితో తయారుచేసిన మూర్తుల వల్ల చెరువులు, కుంటల్లో ఏళ్ళ తరబడి కరగకుండా పోతుందని, అందువల్ల చెరువులు ఇంకిపోతాయని వారు చెప్పారు. ర్యాలీ మామిడిపల్లి నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరక కొనసాగింది. ఇందులో మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, ...

Read More »

సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో అధికారుల నిర్లక్ష్యం తగదు

  నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 14వ ఆర్థిక సంఘం ద్వారా 26 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని, ఈ మొత్తాన్ని తాగునీరు, పారిశుద్యం, తదితర కార్యక్రమాలకు వినియోగించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా డివిజన్‌, మండల స్తాయి అధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. తాగునీరు, తెలంగాణ హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, వరి సాగు దృవపత్రాలు, ఆధార్‌ సీడింగ్‌, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ...

Read More »

ఆశల వినూత్న నిరసన

  రెంజల్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 13 రోజులుగా కొనసాగుతున్న ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె సోమవారంతో 13వ రోజుకు చేరింది. మండలంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణ శుభ్రం చేసి, పిచ్చి మొక్కలు తొలగించి ఆశ వర్కర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందని, తమ సేవలను గుర్తించి పనికి తగిన వేతనాన్ని అందివ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కార్యక్రమంలో శైలజ, రాణి, ...

Read More »

సమాచార చట్టం పరిరక్షణ సమితి రెంజల్‌ శాఖ ఎన్నిక

  రెంజల్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో సోమవారం సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి రెంజల్‌ శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా జలీల్‌ బేగ్‌, రంజిత్‌, ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు, జాయింట్‌ సెక్రెటరీగా కిరణ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా రవింద్రబాబు, కోశాధికారిగా ప్రణయ్‌ రాజు, కార్యవర్గ సభ్యులుగా నీరడి రమేశ్‌,బాలకృష్ణ, సాయిలు, పెద్దులు, సలహాదారులుగా రమణాగౌడ్‌లను ఎన్నుకున్నారు.

Read More »

దొంగ నోట్లను కనిపెట్టండిలా?

ఇటీవల కాలంలో తరచూ పోలీసులు దొంగనోట్ల ముఠాను గుట్టు రట్టు చేశారంటూ వస్తున్న వార్తలను మనం చాలానే చూశాం. అంతేకాదు భారత్‌లో దొంగనోట్లను ముద్రించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. దీంతో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా 500, 1000 రూపాయల దొంగ నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. బ్యాంకులో మీరు నగదు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మీ నోట్లు సరైనవా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరువకూడదు. ఈ నేపథ్యంలో దొంగనోట్లకు అసలు నోట్లకు మధ్య ఉన్న ...

Read More »