Breaking News

Nizamabad News

గణేష్‌ మండపం వద్ద ముగ్గుల పోటీలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డులో జైభీమ్‌ యూత్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండలి వద్ద రాత్రి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లికలు వేశారు. పోటీల్లో ఉత్తమ ముగ్గు వేసిన ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండలి ప్రతినిధులు సాయి, రాంచందర్‌, గోపాల్‌, నరేశ్‌, వేణు, సాయికుమార్‌, సంజయ్‌, ...

Read More »

విధులపై నిర్లక్ష్యం తగదు

  – వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి నెల దాదాపు 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, కాని కనీస కార్యక్రమాల అమలులో కూడా చాలా వెనకబడి ఉన్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పనితీరులో మార్పు రావాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చేందుకు ...

Read More »

ఎవరికి మామూలు ఇవ్వొద్దు

  – మద్యం లైసెన్సుదారులకు కలెక్టర్‌ విజ్ఞప్తి నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015-17 సంవత్సరానికి మద్యం విక్రయ లైసెన్సులు పొందినవారికి వారం రోజుల్లో పోస్టు ద్వారా పక్కాలైసెన్సులు అందుతాయని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. లైసెన్సులకై ఎక్సైజ్‌ కార్యాలయానికి రావద్దని సూచించారు. లైసెన్సులకై ఎవ్వరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన మద్యం లైసెన్సుల లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాలోని 130 మద్యం దుకాణాలకు ...

Read More »

బతుకమ్మ ఆటతో ఆశ వర్కర్ల నిరసన

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశావర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రోడ్డుపై బతుకమ్మ ఆడుతూ మంగళవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని దర్నాచౌక్‌లో తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 21 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. నిరసనలో భాగంగా ఆశావర్కర్లు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేదని ఆరోపించారు. కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సమస్యలన్ని సాధించేంత వరకు తమ నిరసన ...

Read More »

స్మార్ట్‌ సిటీగా నిజామాబాద్‌

  – ఎమ్మెల్యే గణేష్‌ గుప్త నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర అభివృద్దే తమ ధ్యేయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని కాలనీ సమస్యల పరిష్కారానికై పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 16వ డివిజన్‌ గాయత్రీనగర్‌లో 25లక్షల 70వేల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. అదే విధంగా అర్సపల్లిలోని బీటిరోడ్డు, పౌండింగ్‌ స్టోన్‌, సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు, ...

Read More »

బతుకమ్మ ఆడిన ఆశ వర్కర్లు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలను పరిస్కరించాలని కోరుతూ గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారతి, దివ్య, శైలజ,రాణి తదితరులున్నారు.

Read More »

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పండగలు జరుపుకొని సామరస్యంగా ఉండాలని బోధన్‌ రూరల్‌ సిఐ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గణపతి మండపాల వద్ద పేకాట, మద్యం సేవించినట్టయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిజెలకు బదులుగా భజనలతో శాంతియుతంగా నిమజ్జనం చేయాలని, ముందుగా యువత ...

Read More »

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామానికి చెందిన ఐతి సాయన్న (55) అప్పుల బాధ భరించలేక సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో అందరు నిద్రించిన సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బోదన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు రెంజల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రైతు ...

Read More »

రెంజల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో 20 శాతం మాత్రమే పంట సాగుచేశారని, 80 శాతం మంది రైతులు పంటలు వేసుకోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సభ సజావుగా సాగుతూ పలు శాఖలపై చర్చించారు. వైద్యశాఖలో మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ...

Read More »

శిక్షణకు హైదరాబాద్‌కు జూనియర్‌ అసిస్టెంట్లు .

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించేందుకు హైదరాబాదులోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్లకు 4 వారాల శిక్షణ ఇప్పించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రానా ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌, జిల్లా ఎంపిక కమిటీల రిక్రూట్‌మెంట్‌ లేదా కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు రెసిడెన్షియల్‌ కోర్సుగా ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. అయితే మూడు సంవత్సరాలలోపు ఉన్న సర్వీసు ఉన్నజూనియర్‌ అసిస్టెంట్లకే ...

Read More »

దుర్గా సేవాదళ్‌ గణేష్‌ వద్ద కుంకుమ పూజలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్‌ రోడ్డులోగల దుర్గసేవాదళ్‌ గనేష్‌ మండపం వద్ద మంగళవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంక్యలో కుంకుమ పూజలో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సేవాధళ్‌ అధ్యక్షులు నిఖిల్‌రావు, ప్రతినిధులు వినయ్‌, రాజేశ్‌, బైరయ్య, అనిల్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

ఆర్యవైశ్య అధ్యక్షునికి కౌన్సిలర్ల సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కైలాష్‌ శ్రీనివాస్‌రావున మంగళవారం కామారెడ్డిలో మునిసిపల్‌ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్లు మోతె కృష్ణాగౌడ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాష్‌ లక్ష్మణ్‌, ముప్పారపు ఆనంద్‌, భూంరెడ్డి, అంజద్‌, ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, సునీత, యాదమ్మ, విజయ, పద్మ, లక్ష్మి, ప్రభాకర్‌ యాదవ్‌ తదితరులు శ్రీనివాస్‌రావును సన్మానించిన వారిలో ఉన్నారు.

Read More »

కలెక్టర్‌కు ఆశ వర్కర్ల వినతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు మంగళవారం కామారెడ్డిలో ఆశ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు చేస్తున్నా ప్రబుత్వం నుంచితమకు గుర్తింపు లేకపోవడం సరికాదన్నారు. సమాజంలో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద భీమా, ...

Read More »

గణనాథునికి విశేష పూలతో అలంకరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్‌లోగల రామసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషునికి మంగళవారం పుష్పాలంకరణ చేశారు. 25 అడుగుల ఎత్తుగల భారీ గణనాథునికి వివిధ రకాల పూలతో అలంకరించారు. విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామసేన అధ్యక్షుడు శ్రీకాంత్‌, భక్తులు పాల్గొన్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో కుంకుమ పూజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద మంగలవారం మహిళలుభక్తి శ్రద్దలతో కుంకు మ పూజలో పాల్గొన్నారు. గణేష్‌ మండపం వద్ద సామూహిక కుంకుమపూజలో అధిక సంఖ్యలో బక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి, పట్టణ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్‌, ప్రసాద్‌, నవీన్‌, ప్రతినిధులు రాజేశ్వర్‌, రాజయ్య, కిషన్‌, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

యువజన సమాఖ్య గణేష్‌ వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి యేటా స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆద్వర్యంలో భారీ గణనాయకుని ఏర్పాటు చేస్తారు. అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్నదానం చేసినట్టు సమాఖ్య అధ్యక్షుడు రవిందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలోని షేర్‌ గల్లీలోగల యువసేన షేర్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాల ...

Read More »

భారతదేశానికి వేల సంవత్సరాల అపూర్వ చరిత్ర ఉంది

  – ప్రొపెసర్‌ నారాయణరావు డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ చరిత్ర మహోన్నతమైంది. మనది వేల ఏళ్ళ చరిత్ర. మన చారిత్రక వారసత్వ సంపద ఎన్నటికీ చెరగనిది అని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌ సభ్యులు ప్రొఫెసర్‌ నారాయణరావు అన్నారు. మంగళవారం భారతీయ చరిత్ర, సంస్కృతి అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌లో ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ చరిత్రను బ్రిటిషర్లు వక్రీకరించారని, మన చరిత్రను మనం సరైన ...

Read More »

తెవివిలో విజయవంతంగా క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 4 కి.మీ. క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు విజయవంతంగా ముగిశాయి. వర్సిటీ చరిత్రలో మొదటి సారిగా అంతర్‌ కళాశాలల క్రాస్‌ కంట్రీ పోటీలను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మమతలు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లోఉత్సాహంగా పాల్గొన్నారు. వర్సిటీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుంచి బయట ఎంట్రెన్సు గేట్ల ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధుల రూ. 2 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

Read More »

మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లిమ్రా మిలాప్‌ పీస్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకోకుండా ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సొసైటీ ప్రతినిధులు ...

Read More »