Breaking News

Nizamabad News

బల్దియాలో ఘనంగా కాలోజీ జయంతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించే తత్వం కాలోజీ నుంచి నేర్చుకోవాలని అన్నారు. మరుగునపడిపోతున్న తెలంగాణ బాషను తన సహజ కవిత్వంలో వాడి వెలుగులోకి తెచ్చాడని కొనియాడారు. భాషకు ఊపిరులూదిన ఘనత ప్రజాకవి కాలోజీయేనన్నారు. ఉద్యమం పేరు చెబితే ...

Read More »

కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం పట్ల ఆర్మూర్‌ పట్టణంలోని విద్యుత్‌ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్‌ కార్యాలయం ఎదుట మంగళవారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు పద్దతిని విడనాడాలని, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగుల నాయకులు శ్రీహరి, స్వామి, నరేందర్‌ నాయక్‌, ఇంద్రకరణ్‌, ఆనంద్‌, ప్రతాప్‌, గంగారాం, ...

Read More »

ఎంకాం కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంకాం కోర్సులో స్పాట్‌ అడ్మిషన్ల కోసం ఈనెల 10వ తేది వరకు ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపాల్‌ సబ్దార్‌ ఆస్కారీ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్తులు తమ ఒరిజినల్‌, జిరాక్సు సర్టిఫికెట్లతో కళాశాల పనివేళల్లోసంప్రదించాలన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, అయితే అర్హులని స్పష్టం చేశారు.

Read More »

పోరాట వారోత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల గోడప్రతులను మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా అణిచివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిరంకుశ పాలనను వ్యతిరేకించిన వీరులను స్మరించుకోవడానికి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. వారోత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read More »

ఆటోవాలాలు టాప్‌ నెంబర్లు కలిగి ఉండాలి

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ఆటోలు టాప్‌నెంబర్లు కలిగి ఉండాలని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. ఆటోలకు టాప్‌ నెంబర్లు లేనివారు సంబంధిత పోలీసు స్టేషన్‌ నుంచి నెంబర్లు విధిగా పొందాలని చెప్పారు. నెంబర్లు ఉన్న ఆటోలు, లేని ఆటోలు కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైవర్ల వివరాలు, యజమానులతో కూడిన నోటీసు బోర్డును సీటు వెనక భాగంలో ప్రయాణికులందరికి కనిపించేవిధంగా అమర్చుకోవాలని చెప్పారు. ఈ నోటీసులు ప్రభుత్వం ...

Read More »

మహిళ అదృశ్యం – కేసు నమోదు

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రాజారాం నగర్‌కు చెందిన రాసూరి గంగాధర్‌ భార్య ఈనెల 4వ తేదీన అదృశ్యమైనట్టు ఆర్మూర్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ రవికుమార్‌ మంగళవారం తెలిపారు. సిఐ కథనం ప్రకారం… రాసూరి గంగాధర్‌ తన భార్య పిల్లలతో ఆర్మూర్‌ హౌజింగ్‌ బోర్డుకాలనీలో అద్దెకు ఉంటున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గంగాధర్‌ తన పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తన భార్య ఇంటికి తాళం వేసి ...

Read More »

వైభవంగా శివపార్వతుల పల్లకీసేవ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి శివపార్వతుల విగ్రహాలను ముస్తాబు చేసి పల్లకీలో వైభవంగా ఊరేగించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు జరిపారు. భక్తులు వేలాది సంఖ్యలో ఊరేగింపును తిలకించారు. అంతకుముందు ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు లింగారెడ్డి, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌, నర్సింలు, నర్సయ్య, మోహన్‌రెడ్డి, నర్సాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా గురువులకు పాదపూజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో మై విలేజ్‌ -మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో మంగళవారం సహజ ఆనంద యోగా గురువర్యులు ఆచార్య రమేశ్‌ నేతృత్వంలో తల్లిదండ్రులకు, గురువులకు పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా పాఠశాల ఆవరణలో రమేశ్‌ గురూజీ యోగా విజ్ఞాన శిబిరం నిర్వహించి విద్యార్థులకు యోగాసనాలతో పాటు మానవతా విలువలు, సంస్కారం గురించి నేర్పించారు. శిబిరంలో భాగంగా ఆఖరి రోజున విద్యార్థుల చేత పాదపూజ ...

Read More »

పదోన్నతి పొందిన ఉద్యోగికి సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ ఆడిటర్‌గా పనిచేసి ఎస్‌టివోగా పదోన్నతి పొందిన నవీన్‌ కుమార్‌ను మంగళవారం పిఆర్‌టియు కామారెడ్డి డివిజన్‌ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్‌ సీనియర్‌ ఆడిటర్‌గా ఉత్తమ సేవలు అందించి ఎస్‌టిఓగా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. మరింత ఉన్నత స్తాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు నాయకులు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రావు, నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, పోచయ్య, సంగారెడ్డి, సంతోష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించారు. అంగన్‌వాడి ప్రతినిదులు, ఉపాధ్యాయులు పోషకాహారం గురించి వివరించారు. ఆకుకూరలు, పచ్చ కూరగాయలు, పాలు, పండ్లు, నువ్వులు, బెల్లం, తదితర ఆహార పదార్థాలను సమ పాళ్ళలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయని, వాటిని సంపూర్ణ ఆహారం అంటారని సూచించారు. ఇవి తీసుకోవడం వల్ల గర్భిణీలకు బరువు పెరగడంతో పాటు బాలింతలకు ...

Read More »

వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ మండలీల నిర్వాహకులు, ప్రజలు వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో గణేష్‌ మండలీల నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేస్‌ ఉత్సవాల నిర్వహణలో కామారెడ్డికి మంచి పేరుందని, దాన్ని అలాగే కొనసాగించాలని సూచించారు. మండపాల వద్ద స్పీకర్ల ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు వహించాలని, విద్యుత్‌ సరఫరా ఆగకుండా వీధి దీపాలు వెలిగేలా చూసుకోవాలన్నారు. ...

Read More »

వ్యవసాయ రైతులకు సూచనలు

  భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని భీమ్‌గల్‌ సహాయవ్యవసాయ సంచాలకులు శంకర్‌రావు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు మూల విత్తనం గురించి వివరించారు. రైతులు ఈ విత్తనాన్ని వాడుకుని ఆర్థికంగా దిగుబడులు సాధించాలని కోరారు. రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ ప్రసాద్‌, ఎఇవో సాయిరాం, రైతులు పాల్గొన్నారు.

Read More »

తెలుగు అధ్యయనశాఖ 3వ అధ్యాపకుల సమావేశం

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ 3వ అధ్యాపకుల సమావేశం యూనివర్సిటీ కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌, తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు డాక్టర్‌ కనకయ్య మాట్లాడుతూ 2006లో యూనివర్సిటీ స్తాపనతో తెలుగు అధ్యయనశాఖ ప్రారంభమైందన్నారు. ప్రతి సంవత్సరం అనేక సాహిత్య చర్చలతో పాటు అధ్యాపకుల సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సాహితీ మంజీర డిగ్రీ ప్రథమ సంవత్సర పాఠ్య గ్రంథాన్ని చదవడం వల్ల తెలంగాణ సాహిత్యంపై విద్యార్థికి ...

Read More »

ఇసుక క్వారీలను తనిఖీచేసిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూగర్భ జలాలకు నష్టంకలగకుండా అనుమతులు ఇచ్చిన చోటనే, అనుమతించిన మేరకే ఇసుక తవ్వేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటుచేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, మైనింగ్‌, భూగర్భ జల విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి కోటగిరి మండలం కారేగాం, బీర్కూర్‌ మండల కేంద్రం, బిచ్కుంద మండలం పుల్కల్‌ గ్రామాల మధ్య మంజీర నదిలో పట్టా భూముల్లో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలను పరిశీలించారు. ...

Read More »

శాంతియుతంగా పండగలు జరుపుకోవాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల, మతాలకు అతీతంగా, తారతమ్య భేదాలు లేకుండా అందరూ సమానంగా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. మంగళవారం రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్‌ఐ రవికుమార్‌ మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి అల్లర్లకు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా గ్రామస్తులు ఐకమత్యంగా వినాయక చవితి, బక్రీద్‌ పండగలను జరుపుకోవాలని ఆయన అన్నారు. ఆకతాయి అల్లర్లకు పాల్పడుతూ అవాంచనీయ సంఘటనలు జరిగితే కేసులు ...

Read More »

ఇసుక డంపులు స్వాధీనం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా శివారులో రహస్యంగా నిలువ చేసిన ఇసుక డంపులపై మంగళవారం తహసీల్దార్‌ తమ సిబ్బందితో ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు. నీలా శివారులోఎటువంటి అనుమతులు లేకండా అక్రమంగా రవాణాకు పాల్పడుతూ పంట పొలాల్లో ఇష్ట రాజ్యంగా నిలువ చేసిన ఇసుక నిల్వలను తహసీల్దార్‌ వెంకటయ్య, రెంజల్‌ ఎస్‌ఐ రవి, ఎడపల్లి ఎస్‌ఐ ఆసీఫ్‌, ఆర్‌ఐలు క్రాంతికుమార్‌, ముజీబ్‌లు ఇసుక నిలువలను ప్రొక్లెయిన్‌ ద్వారా తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా డంప్‌ ...

Read More »

బిసి కులాలకు ఉప ప్రణాళిక బడ్జెట్‌ను కేటాయించాలి

  ఇందూరు, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వెనకబడిన కులాల ఐక్యకార్యాచరణ సమాఖ్య ఆధ్వర్యంలో బిసి కులాల సమరభేరిని మంగళవారం స్థానిక మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బిసి కులాలకు ఉప ప్రణాళిక బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలన్నారు. బిసి కులాల ఫెడరేషన్‌కు ఎక్కువ నిదులను టార్గెట్‌ను పెంచేవిధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకు రుణాల కొరకు బ్యాంకుల అనుమతి ఇప్పించడానికి ప్రత్యేక ప్రభుత్వాధికారిని నియమించాలని ...

Read More »

స్ప్రే ఉపయోగించినపుడు మనం కొంచెం జాగ్రతగా ఉండాలి

నిజామాబాద్ న్యూస్.ఇన్ 8-9-2015 . ఈ వీడియో లో ఉన్న వ్యక్తి కార్ లో ఎయిర్ ఫ్రెష్నర్ కొట్టి తరువాత సిగరెట్ట్ వెలిగించడానికి లైటర్ ని ఉపయోగించాడు . వెంటే కార్ అంతటా మంటలు వ్యాపించాయి. మనం ఉపయోగించే అన్ని రకముల స్ప్రే బాటిల్స్ లో LPG  గ్యాస్ వాడడం జరుగుతుంది. . వీటిని చిన్న పిల్లలకి దూరంగా ఉంచలి. ఈ వీడియో అందరికి పంపించండి . జాగ్రత పడతారు.

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 29వ వార్డులో సోమవారం మురికి కాల్వ నిర్మాణ పనులు మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షల వ్యయంతో మురికి కాల్వల నిర్మాణం చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రగతి పనులు చేపట్టి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గోనె సునిత, కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, నర్సింలు, బట్టు ...

Read More »

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

  – నగర మేయర్‌ ఆకుల సుజాత నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణిలు,బాలింతల సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారమే ముఖ్యమని, తద్వారా తల్లి,బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నగర మేయర్‌ ఆకులసుజాత తెలిపారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌భవన్‌లో ఐసీడీఏస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ముఖ్యంగా గర్భిణిలు రక్తహినతతో భాదపడటం మూలంగానే పుట్టే పిల్లలు తక్కువ బరువుతో, పూర్తిగా ఆరోగ్యవంతంగా లేకుండా జన్మించడానికి కారణమన్నారు. పిల్లలకు ...

Read More »