Breaking News

Nizamabad News

ఒంటికాలుపై నిలబడి గ్రామసేవకుల నిరసన

  కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూగ్రామ సేవకులు ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో కూర్చున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం గ్రామ సేవకులు, పారిశుద్య కార్మికుల పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందని ప్రశ్నించారు. ఉన్నవారికి మరిన్ని డబ్బులిస్తూ లేనివారికి కనీస జీతాలు ఇవ్వకపోవడం గర్హణీయమన్నారు. కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ప్రస్తుతం ఆ ...

Read More »

భిక్షాటన చేసి మునిసిపల్‌ కార్మికుల నిరసన

  కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శనివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. పట్టణంలో కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కార్మికులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎన్నికల తర్వాత వాటిని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. 20 రోజులుగా తాము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా ఆరోగ్యంలో ముందుండే మునిసిపల్‌ ...

Read More »

సిద్దులగుట్టపై భక్తుల సందడి

  ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి పుష్కరాల సందర్బంగా స్నానాలు ఆచరించి ఆర్మూర్‌ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దులగుట్టపై గల శివాలయం, రామాలయం, హనుమాన్‌, దుర్గామాత మందిరాల్లో పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తున్నారు. శుక్రవారం భారత్‌గ్యాస్‌ కంపెనీ సెంట్రల్‌ రీజినల్‌ మేనేజర్‌, సిఇవో డైరెక్టర్‌, నిజామాబాద్‌ సూపరింటెండెంట్‌, ఆర్మూర్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌లు సతీసమేతంగా సిద్దులగుట్టపైకి వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. నవనాథ సిద్దులగుట్టపై వచ్చిన ...

Read More »

ఘనంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

  ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలను మంత్రి కెటిఆర్‌ స్వగృహంలో ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రవు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కెటిఆర్‌ స్వగృహంలో శుభాకాంక్షలు తెలిపి, కేక్‌కట్‌ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కలకాలం పిల్లా పాపలతో ఆనందంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Read More »

శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు

  ఇందూరు, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది గాంచిన బాల్కొండలో హజరత్‌ సయ్యద్‌ షా అబ్దుల్‌ ఫత్హేబందగీ బాద్‌షా ఖాద్రీ రహమతుల్లా ఆలమిన్‌ హయిత్‌ ఏ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం నుంచి రెండ్రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్టు దర్గా సజ్జాద్‌ నషీన్‌ముతవల్ల అబ్దుల్‌ ఫతహే సయ్యద్‌ బందగీ బాద్‌షా రియాజ్‌ ఖాద్రి తెలిపారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనుందని, ఇది ఎంతో హర్షించదగ్గ ...

Read More »

సఫాయి కార్మికుల వినూత్న సమ్మె

  ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సఫాయి కార్మికులను నిజమైన దేవుళ్ళు అని పొగిడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్మికులు సమ్మెకు దిగి 24 రోజులు గడుస్తున్నా నిర్లక్ష్యం చేయడాన్ని ఐఎఫ్‌టియు జిల్లా ప్రదాన కార్యదర్శి దాసు తీవ్రంగా నిరసించారు. ప్రజా ఆరోగ్యానికి అహర్నిశలు శ్రమించే కార్మికుల పట్ల చులకన భావం తగదని, కెసిఆర్‌ తలకిందులుగా ఆలోచించడం మానుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌లోసఫాయి కార్మికులు తలకిందులుగా ఉంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ...

Read More »

సావెల్‌లో పుష్కర స్నానం చేసిన ప్రత్యేకాధికారి

  నిజామాబాద్‌ రూరల్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారధి తమ కుటుంబ సమేతంగా సావెల్‌ పుష్కర ఘాట్‌లో గురువారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గారి నేతృత్వంలో అహర్నిశలు కృషి చేసి తెలంగాణ వ్యాప్తంగా అద్భుత ఏర్పాట్లు చేసిందని వివరించారు. తెలంగాణలోని గోదావరి పుష్కర ఏర్పాట్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని పార్థసారధి తెలిపారు. ఇప్పటికే కోట్లాదిమంది తెలంగాణలో పుష్కర స్నానం ...

Read More »

సిఎం మాటలు కోటలు దాటుతున్నాయి

  – పనులు మాత్రం గడపదాటడం లేదు – హామీలను వెంటనే నెరవేర్చాలి – బిజెపి ఎమ్మెల్యే బంగారు లక్ష్మణ్‌ ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ ప్రజలకు అనేకమైన హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బంగారు లక్ష్మణ్‌ అన్నారు. గురువారం పుష్కర స్నానాలు ఆచరించి ఆయన ఆర్మూర్‌ రోడ్లు భవనాల అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుందని ప్రశంసించారు. ఇచ్చిన ...

Read More »

ఊర పండగకు 5 లక్షలు మంజూరు

  ఇందూరు, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఆగష్టు 2వ తేదీన నిర్వహించే ఊర పండగకు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయించినట్టు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢమాసం వర్షాకాలంలో జరుపుకునే ఊరపండగ ఎంతో పవిత్రమైందని, విశిష్టమైందని అన్నారు. 12 దేవతా మూర్తులను కొత్తగా ప్రతియేడు తయారుచేయించడం జరుగుతుందని, ఇందుకోసం వినియోగించే చెక్కను అడవినుంచి తీసుకువస్తారని చెప్పారు. సుఖ శాంతులతో, ...

Read More »

17వ రోజు కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె బుధవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. శిబిరంలో కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక వారిని మోసగించడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కేసీఆర్‌కు పుట్టగతులుండవని అన్నారు. కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ...

Read More »

కంపుకొడుతున్న ఆర్మూర్‌ పట్టణం

  ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో పట్టణంలో పారిశుద్యం అస్తవ్యస్తంగా మరింది. గత పక్షం రోజులుగా ఇళ్లలోని చెత్తతోపాటు మురికి కాల్వలు కూడా శుభ్రం చేసేవారు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి అందులోంచి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతోపాటు బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలన్ని పొంగిపొరులుతున్నాయి. అందులోంచి దోమలు, ఈగలు వచ్చి ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని పలువురు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం, మునిసిపల్‌ పాలకవర్గం స్పందించి డ్రైనేజీలను ...

Read More »

15వ రోజుకు చేరిన మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారంతో 15వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ గత పక్షం రోజులుగా సమ్మె కొనసాగుతున్నా అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.

Read More »

పట్టణంలోనే పుష్కర స్నానం

  ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కరాలలో భాగంగా పుష్కర ఘాట్లకు వెళ్లి స్నానాలు ఆచరించని వృద్ద, వికలాంగులకు పట్టణంలోనే పుష్కర స్నానం చేసేవీలును ఆర్మూర్‌ మునిసిపల్‌ పాలకవర్గం కల్పించింది. పుష్కర స్నానం కోసం గోదావరి నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఘాట్లకు వెళ్లి స్నానం చేయలేని భక్తులకు పాలకవర్గం ఏర్పాట్లు చేస్తుందని ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు తెలిపారు. వికలాంగులు, వృద్దులు ఈనెల 24వ తేదీన శుక్రవారం జంబి హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో స్నానాలు చేయవచ్చని ఆమె సూచించారు. ...

Read More »

ప్రగతిపనులు ప్రారంభం

  కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో బుధవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రగతి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సిసిరోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

పుష్కర స్నానం చేయడం అదృష్టం

  రెంజల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో అదృష్టమని నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. బుధవారం కందకుర్తి గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానం చేయడానికి వచ్చిన సందర్భంగా మాట్లాడారు. మనకు ప్రధాన ఆధారము నీరని, మన అవసరానికి ఉపయోగించుకుంటూనే పుణ్యతీర్థంపేరుతో నీటిని పూజిస్తామని, ఇందులో అమృతమైన ఔషద శక్తి కలిగి ఉండడం వల్ల అన్ని రోగాలు పోతాయనే భావన ప్రజల్లో ఉందన్నారు. భక్తులు పుస్కర స్నానంతో పునీతులు కావడానికి అధిక సంఖ్యలో ...

Read More »

16వ రోజు కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక వారిని మోసగించడం సిగ్గుచేటన్నారు. కార్మికుల ...

Read More »

ఎమ్మెల్యే ఏనుగు భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి తన నియోజకవర్గంలో దళితుల భూములను ఆక్రమించుకున్నారని దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ఏనుగు దురాక్రమణలపై మంగళవారం కామారెడ్డిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వెంకట్‌ హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ఏనుగు తన అధికారాన్ని పరపతిని వినియోగించుకొని దళితులకు సంబంధించిన భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రజా సంఘాల నాయకులపై ...

Read More »

పుష్కరాలను పరిశీలించిన డిఐజి

  రెంజల్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలంలోని తుంగిని పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి పుష్కరాల వ్యవస్థను మంగళవారం డిఐజి వై.గంగాధర్‌, డిఎస్పీ ఆనంద్‌కుమార్‌లు పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందున వారిని అభినందించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన భద్రత వివరాలను పరిశీలించి తెలుసుకున్నారు. ఆయన వెంట సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. పుష్కర స్నానాలు ఆచరించిన ...

Read More »

పుష్కరాల్లో ఈ నాలుగు రోజులే కీలకం

  – సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ కందకుర్తి వద్ద గోదావరి పుష్కరాలకు లక్ష 80 వేల మంది పాల్గొన్నట్టు తెలిపారు. వికలాంగులు, వృద్దులకు వీల్‌చైర్ల సహాయంతో ఘాట్ల వద్దకు చేర్చడంతో పాటు బస్టాండ్‌ వరకు 2 చిన్న ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిచే విడిచి, అక్కడున్న వారిని ఘాట్ల వద్దకు చేర్చడం జరుగుతుందని అన్నారు. పుష్కర ఘాట్లలో స్నానాలు చేసిన మహిళల ...

Read More »

పుష్కరాల్లో సేవాదృక్పథంతో ఆర్టీసి పనిచేస్తుంది

  రెంజల్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల, వర్గ, ప్రాంత, మత సంప్రదాయాలకు అతీతంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం సేవాదృక్పథంతో ఆర్టీసి యాజమాన్యం తరఫున బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసి ఎండి జి.రమణారావు తెలిపారు. మంగళవారం కందకుర్తి బస్టాండ్‌ ప్రాంతంలోని రద్దీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కందకుర్తి గోదావరి పుష్కర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు, ప్రజలు రవాణా సౌకర్యార్థం మంగళవరం బోధన్‌ నుంచి 59 బస్సులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ...

Read More »