Breaking News

Nizamabad News

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, నాయకులు రాజేందర్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, ...

Read More »

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిద ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో నగేశ్‌, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ భాస్కర్‌, స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జాతీయజెండా ఆవిష్కరించారు. బిజెపి, తెరాస, కాంగ్రెస్‌, తెదేపా, సిపిఐ, సిపిఎం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం,శ్రీసాయిసుధ ...

Read More »

సుందరంగా ముస్తాబైన కార్యాలయాలు

  ఆర్మూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబయ్యాయి. పట్టణంలోని పోలీసు స్టేషన్‌, ఎంపిడివో కార్యాలయం, తహసీల్‌ కార్యాలయం, మునిసిపల్‌ కార్యాలయాలకు రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించి సుందరంగా ముస్తాబు చేశారు.

Read More »

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  ఆర్మూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్‌ 2వ తేదీ నాటికి ఏడాది పూర్తికావడంతో మొదటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తొలి ఆవిర్భావ వేడుకలను అట్టహసంగా జరుపుకున్నారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఒకరినొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రోడ్డుపై ...

Read More »

9న పిఆర్‌టియు ధర్నా

  బోధన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 9వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద పిఆర్‌టియు ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌ను, విద్యాశాఖమంత్రిని కోరినా సమస్యల పట్ల పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్సును రూపొందించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. పిఆర్సీ ...

Read More »

అవతరణ వేడుకలకు జిల్లా కళాకారులు

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఔత్సాహికులైన వివిధ రంగాలకు చెందిన కళాకారులు వెంటనే సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ,నిజామాబాద్‌ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. జిల్లా నుంచి వివిద రంగాలకు చెందిన 500 మంది కళాకారులకు 7వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ...

Read More »

నేటి నుంచి 8వ తేదీ వరకు మోడల్‌ స్కూల్లో ప్రవేశాలు

  రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు మోడల్‌ పాఠశాలలో చదువగోరు విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 రుసుము, బిసి, ఓసిలకు రూ. 100 రుసుముతో ఆన్‌లైన్‌ చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ చెన్నప్ప తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ ప్రింట్‌ను ఈనెల 9వ తేదీన మోడల్‌ స్కూల్లో అందజేయాలని అలాగే 14న రాత పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 11 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 18వ ...

Read More »

5న కాలుష్య నియంత్రణ దినోత్సవం

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన, బాలబాలికల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజనీరు రవికుమార్‌ అన్నారు. ఇందులో భాగంగా 3వ తేదీన జిల్లా బాలభవన్‌లో ఉదయం 10.30 గంటలకు బాలబాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌, రాతపరీక్ష పోటీలు జరుపుతున్నట్లు ...

Read More »

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

  రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాధించుకున్న స్వరాష్ట్ర సాధన నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు జాతీయ జెండాలు ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. మండల నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు.

Read More »

7న జిల్లా మహాసభ

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీన తెలంగాణ అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్‌ పోగుల నగేశ్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నగరంలోని టీఎన్జీవో హోంలో 7వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి సుద్దపల్లి సుధాకర్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ...

Read More »

అవతరణ ఉత్సవాల్లో సాహిత్య కార్యక్రమాలు

  డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్బంగా నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 3న మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం, జూన్‌ 4న సాయంత్రం 6 గంటలకు అష్టావధానం, జూన్‌ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు పోతన విజయం సాహిత్య రూపకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, ఈ ...

Read More »

బంగారు తెలంగాణ సాధనే లక్ష్యం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం చేయడంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్తానిక పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల ...

Read More »

మోదీ రోల్‌ మోడల్‌, అభివృద్దియే నినాదం…. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ

నిజామాబాద్‌ ప్రతినిధి, జూన్‌ 2 : దేశాన్ని అభివృద్ది దిశలో తీసుకు వెళ్లడంలో మోదీ ముందు వరుసలో ఉన్నారు. గుజరాత్‌ లో మోదీ రోల్‌ మోడల్‌గానే దేశం అభివృద్ది జరుగుతుందని, అందుకు ఈ ఏడాది పాలననే సాక్ష్యం అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చాన ఆయన బిజెపి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభి, జన కళ్యాణ్‌ పర్వ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర అనంతరం ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ దేశానికి చేసింది శూన్యమని, కాంగ్రెస్‌ కారణంగానే దేశంలో ...

Read More »

ఎమ్మెల్సీగా ఆకుల లలిత…. తొలి మహిళ ఎమ్మెల్సీగా గుర్తింపు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన తొలి మహిళగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు ఆకుల లలితకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో దిగి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు ఆకుల లలిత. రాజకీయ గురువు అయిన డి.శ్రీనివాస్‌పైనే పట్టు సాధించి ఎమ్మెల్సీ టికెట్‌ తెచ్చుకోవడమే కాకుండా ఎన్నికల్లో గెలుపొంది మండలిలోనే ప్రత్యేకంగా నిలిచారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు జరుపుకుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి నాలుగు నెలలుగా డిల్లీ నుంచి ...

Read More »

జిల్లాలో 2నుంచి రాష్ట్ర అవతరణ వారోత్సవాలు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిజామాబాద్‌ జిల్లాలో ఈనెల 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసారు. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉదయం 8 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి కార్యక్రమాలను ప్రారంభించారు. పోలీసు పరేడ్‌ గ్రౌడ్‌లో…. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక అవిష్కరణ, మార్చు ఫాస్టు ఉదయం 9.30కి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల సందేశం ఉదయం 10కి శకటాల ప్రదర్శన ఉదయం 10.30కి సాంస్కృతిక ...

Read More »

మే31 ప్రపంచ పోగాకు నిషేదిత దినోత్సవం ఐఎంఏ కరపత్రం విడుదల

నిజామాబాద్‌, మే 31 : ప్రపంచ పోగాకు నిషేదితదినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) పోగాకు వాడకం వల్ల నష్టాలను వివరిస్తూ ఓ కరపత్రంను విడుదల చేసింది. ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గుప్త, కార్యదర్శి డాక్టర్‌ కవితారెడ్డి, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ విశాల్‌, ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌లు కరపత్రమును విడుదల చేసారు. కరపత్రం ద్వారా పొగాకు తయారీ, ఉపయోగించే పదార్థాలు, శరీరానికి ఏవిధంగా హానిచేస్తుంది, ఇది అలవాటైనవారు ఎలా మాన్పించే ప్రయత్నం చేయాలి, తదితర ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ...

Read More »

బౌద్ద సన్యాసిగా మిస్‌ ఇండియా రన్నరఫ్‌

ముంబాయి, మే 31 : ఉన్నత స్థాయిలో అందరు గుర్తించేలా, పలువురిలో మెరిసేలా ఉండటం మహిళలకు ఓ కళ. అ కళ సాధన కోసం ఆమె మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లి రన్నరఫ్‌గా నిలిచింది. అ తర్వాత సినిమా నటిగా, మోడిల్‌గా దేశంలోనే ఓ గుర్తింపు తెచ్చుకుంది. కాని సడన్‌గా కనుమరుగు అయి బౌద్ద సన్యాసినిగా అవతారమెత్తారు. సదాసిదగా రెండు జతల బట్టలు, ఒక జత చేప్పులే అస్తిగా ఆమె స్థిరా పడ్డారు. ఆమెనే బర్ఖామదన్‌. హిమాలయాల ప్రాంతానికి చెందిన మొట్టమొదటి బౌద్ద సన్యాసినిగా ...

Read More »

తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్ర

అదిలాబాద్‌, మే 31: అతని పేరు దుర్గం వినయ్‌కుమార్‌, ఊరు పెద్దబండ, మండలం సిర్పూర్‌(టి), జిల్లా అదిలాబాద్‌. డీగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసాడు. ఇతను చేసిన పని ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇచ్చిప తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్రను రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సుమారు నెల రోజులుగా 20 వేల 700 ఆకులపై చరిత్రను రాసి 230 తెల్ల కాగితాలపై అతికించాడు. ఈ తంగేడు ఆకులపై రాసిన తెలంగాణ చరిత్రకు మంచి గుర్తింపు రావాలని, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ...

Read More »

వైట్‌హౌస్‌లో రహెమన్‌ జయహో

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రహమాన్‌కు వైట్‌ హౌజ్‌లో అరుదైన గౌరవం దక్కింది. రహమాన్‌ జీవిత విశేషాలతో కూడిన దూపొందించిన జయహో డాక్యుమెంటరీని వైట్‌ హౌస్‌లో ప్రదర్శించారు. అయన సంగీతంలో చూపించిన ప్రతిభ, వైవిద్యం, వ్యక్తిగత జీవితం, వృత్తి, ప్రవృత్తి విశేషాలతో దర్శకుడు ఉమేష్‌ అగర్వాల్‌ డాక్యుమెంటరీని రూపొందించారు. అస్కార్‌ గుర్తింపు నుంచి గ్రామీణ పురస్కారాల వరకు అన్నింటిని పొందుపరడం విశేషం. ఈ మేరకు వైట్‌హౌస్‌ గౌరవంపై రహమాన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

Read More »

ఈ ఏడాది పెద్ద జోక్‌ టిడిపి జాతీయ పార్టీ కావడం …. టిఎస్‌ శాసన మండలి నేత షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌, మే 31 : టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం ఈ ఏడాది అతి పెద్ద జోక్‌ అని కాంగ్రెస్‌ తెలంగాణ శాసన మండలి పక్షనేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన జాతీయ పార్టీగా గుర్తింపు కావాలంటే కనీసం నాలుగు రాష్ట్రల్లో పార్టీ పని చేస్తు ఉండాలని అన్నారు. అక్కడి ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు రావాలని అన్నారు. ఇవివే లేకుండా టిడిపిని జాతీయ పార్టీగా గుర్తింపు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 425 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ...

Read More »