Breaking News

Nizamabad News

అందరి సహకారంతో ట్రాఫిక్‌ సమస్య అధిగమిస్తాం

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్యగా మారిందని, వ్యాపారస్తులు, ప్రజలు, అధికారులు అందరి సహకారంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమిస్తామని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై కామారెడ్డి పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌లో మంగళవారం సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డులోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు సంబంధించి గతం నుంచి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ. 6 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లోనూ ప్రగతి పనులు చేపడతామని, అన్ని వార్డులకు సమంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, నాయకులు చంద్రశేఖర్‌, ఇమ్రాన్‌, అక్బర్‌, లక్ష్మణ్‌, ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుకు బంగారు భవిత

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక అయిన రైతుకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని పొందుర్తి, రాజంపేట్‌, పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేశారు. అనంతరం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ ...

Read More »

జూన్‌ 5 వరకు రైతు అవగాహన సదస్సులు

  – ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకొని అధిక ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ రైతులకు సూచించారు. మంగళవారం మోర్తాడ్‌ మండలంలోని తడ్‌పాకల గ్రామంలో మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతిలో సాగు పద్ధతులను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అనుబంధ అధికారుల నుంచి సలహాలు పొందాలన్నారు. రైతు అవగాహన ...

Read More »

జీవనభృతి పంపిణీ

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, గోవింద్‌పేట్‌, పలు గ్రామాల్లో బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతి మంగళవారం పంపిణీ చేశారు. ఉదయం నుంచే భృతి పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. వరుస క్రమంలో నిలబడి వారికిచ్చిన పాసు పుస్తకాలతో జీవనభృతి పొందారు. పంపిణీ అధికారులు అర్హులైన వారినుంచి బ్యాంకు పుస్తకాలు చూసి వేలిముద్రలు సేకరించి డబ్బులను అందజేశారు. మండుటెండలో సైతం పంపిణీ జరగడంతో చేసేదేం లేక వారు ...

Read More »

మహిళలకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చైన్‌ స్నాచర్లతో అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రాజారాంనగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మహిళలకు చైన్‌ స్నాచింగ్‌ దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ మహిళలకు దొంగల బారిన పడకుండా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు దొంగల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దొంగలు ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు ...

Read More »

స్వదేశానికి విచ్చేసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమెరికా పర్యటన ముగించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు స్వదేశానికి విచ్చేశారు. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యేలకు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఇన్‌చార్జి యానాద్రి భాస్కర్‌తో పాటు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు.

Read More »

‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ ప్రారంభించిన కలెక్టర్‌

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులకు రైతు చైతన్య సదస్సులు వేదికలుగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి రైతు చైతన్య సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ సదస్సులు ఈనెల 26 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహిస్తున్నామని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి నూతన ...

Read More »

లీడర్ల కొంపముంచిన కెసిఆర్‌ ప్రకటన… స్వేచ్చ హైదరాబాద్‌లో తొలగనున్న ప్లేక్సీ గోల

నిజామాబాద్‌, మే 24 : తమ్ముడు రేపు ఎమ్మెల్యే వస్తున్నాడు తెలుసు కదా. అన్న ఫోటో, నా ఫోటో మంచిగా కనిపించాలి, ఒక నాలుగు ప్లేక్సీలు కట్టించు అని ప్రజాప్రతినిధి అనుచరుడి ఫోన్‌ కార్యకర్తకు. ఇప్పుడు ఈ తిప్పలు కెసిఆర్‌ స్వచ్చ హైదరాబాద్‌ ప్రకటనతో తప్పేటట్లు ఉన్నాయి. గడప దాటితే చాలు ఎదోక లీడర్‌ పేరుతో రాతలు… ప్రకటనలు.. ప్లేక్సీలు… ఇవన్ని ఇప్పుడు ఎక్కడ కనిపించవద్దని, ముందుగా నా ప్లేక్సీలను తీసియండి. ఇలా హైదరాబాద్‌ అంతా స్వచ్చంగా కనిపించాలి అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ...

Read More »

అలకమానినా అరికెల

నిజామాబాద్‌, మే 24 : నిజామాబాద్‌ టిడిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఎట్టకేలకు అలకపానుపు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో అలకపానుపు ఎక్కిన సంగతి తెలిసిందే కదా. దీనికి తోడు అరికెల అనుచరులు ఏకంగా నిజామాబాద్‌ టిడిపి జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. దీనిని పార్టీ అధిష్టానం సిరియస్‌గా తీసుకొని శనివారం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా పిలిపించుకొని చర్చించారు. అరంగంటకు పైగా చర్చించిన అనంతరం అరికెల శాంతించారు. దీనిపై ...

Read More »

ఆరోగ్యశ్రీకి గోవా అవార్డు

హైదరాబాద్‌, మే 24 : విద్య, ఆరోగ్య రంగాల్లో అబివృద్ది సవాళ్లపై గోవాలో జరిగిన ఎలెట్స్‌ నాలెడ్జీ ఎక్సేంజ్‌-2015 సదస్సులో తెలంగాణ ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సేవలను గుర్తించి ప్రత్యేక అవార్డును అందజేసారు. వైద్య రంగంలో చేస్తున్న సేవలకు గానూ గోవా గవర్నర్‌ మృదుల సిన్హా ఈ అవార్డును ప్రదానం చేసారు. ఉత్తరప్రదేశ్‌ కలిసి గోవా ఈ సదస్సును నిర్వహించింది.

Read More »

ఐర్లాండ్‌లో గే వివాహాలకు అనుమతి

డబ్లిన్‌, మే 24 : ముంబాయిలో నిన్న ఏకంగా ఓ తల్లి స్వలింగ సంపర్కుడైన కొడుకు వరుడు కావాలని ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఏన్నో తరహాలో స్పందన వస్తుంది. కానీ ఐర్లాండ్‌ దేశం ఏకంగా స్వలింగ సంపర్కులు వివాహాలు చేసుకోవచ్చని రెఫరెండం చేసింది. దీనికి గానూ అక్కడ పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం కోసం ఎన్నికలు నిర్వహించి మరి ఈ రెఫరెండం తీసుకురావడం విశేషం. ఇలా చట్టం తీసుకురావడం ప్రపంచలోనే ఐర్లాండ్‌ 19వ దేశంగా, ఐరోపా ఖండంలో 14వ దేశంగా గుర్తింపు పొందింది. ...

Read More »

11 ఏళ్లకే డీగ్రీ పట్టా… అమెరికా అధ్యక్షుడి ప్రశంస

లాస్‌ఎంజిల్స్‌, మే 24 : పేరు తనిష్క్‌ అబ్రహాం, వయసు 11 ఏళ్లు ఆటపాట తప్పా మరేమి తెలియదు. కానీ భారతజాతికి చెందిన ఈ బుడతడు అమెరికాలో డిగ్రీ పట్టా తీసుకున్నాడు. ఇదేమిటీ అనుకుంటున్నారా… అవును ఏకంగా ఆమెరికా అధ్యక్షుడు బారాక్‌ఒబామానే స్వయంగా లేఖ ద్వారా ప్రశంసించారు. కాలిఫోర్నియాలొని ఆమెరికన్‌ రివర్‌ కాలేజ్‌ నుంచి ఫారిన్‌ లాంగ్వెజ్‌స్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ల్లో డిగ్రీ పొందాడు. నాలుగేళ్ల వయసులోనే అమెరికాలో మేదావుల సోసైటీగా పేరున్న ఎంఈఎన్‌ఎస్‌ఏలో చోటు సంపాదించాడు. గతేడాది స్టేట్‌పరీక్షల్లో పాసై, హైస్కూల్‌ డిప్లోమా పొందెందుకు ...

Read More »

25 నుంచి ఇంటర్‌ సప్లి పరీక్షలు… డీగ్రీ కాలేజీల యాజమాన్యల రగడ

నిజామాబాద్‌, మే 24 : సచ్చినోడి పేళ్లికి వచ్చిందే కట్నం ఉన్నట్లు ఉంది ఇప్పుడు డిగ్రీ కళాశాలల పరిస్థితి జిల్లాలో. ఎందుకు అనుకుంటున్నారా… ఈనెల 25 నుంచి ఇంటర్‌మిడియట్‌ సంప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి కదా. ఈ పరీక్షల్లో ఇంటర్‌ విద్యార్థులతో పరీక్షలు రాయించి డీగ్రీలో తమ కళాశాల్లోనే చెర్చుకోవడానికి ఇప్పుడు అర్థం అయింది కదా. ఈనెల 25 నుంచి జూన్‌ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. మార్చి 9 నుంచి 23 వరకు జరిగిన పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఇప్పుడు మరోసారి ...

Read More »

బూటకపు మాటలతో కాలం గడుపుతున్న కెసిఆర్‌…. ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ

బోధన్‌, 24: అధికారంలోకి రావడం కోసం కెసిఆర్‌ బూటకాపు మాటలు చెప్పి కాలం గడుపుతున్నరని, అధికారంలోకి వచ్చిక మాట తప్పడమే కాకుండా దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నరని ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బోధన్‌ వచ్చిన అయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రంగారెడ్డి జిల్లాలో ఓ గిరిజన బాలికపై ఆత్యాచారం చేసి హత్య చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మరోపక్క ప్రభుత్వ పని తీరును ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో మహిళకు ...

Read More »

కూలిన లిప్టు… తప్పిన ముప్పు …. మంత్రి తనయుడికి, రాష్ట్ర అధికారికి వీరిగిన కాలు

ఆర్మూర్‌, మే 24 : నిర్లక్ష్యం ఫలితంగా భవన లిప్టు కూలింది… అదృష్ట వశాత్తు ప్రాణపాయం లేకపోయిన కాళ్లు చేతులు విరగోట్టుకున్నారు. గాయాలపాలయ్యారు. ఇందుల్లో మంత్రి తనయుడు, రాష్ట్ర స్థాయి అధికారులు ఉండటం విశేషం. ఈ సంఘటం ఆర్మూర్‌ పట్టణంలో వర్ష అపార్ట్‌మెంట్‌ శనివారం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ పార్థసారధి తల్లి ఇటీవలే ఆర్మూర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈయనను పరామర్శించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి వెంకట్‌రాంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు సురేందర్‌రెడ్డిలు ...

Read More »

వ్యక్తిగత కక్షలతో 18 హత్యలు… బానుడి ప్రతాపంతో 64 చావులు… శవాల కుంపటిగా జిల్లా

18 మంది హత్య… 64 మంది వడదెబ్బ చావులు నిజామాబాద్‌ ప్రతినిధి, మే 24 : రోజు రోజుకు మనుషుల మధ్య, మనసుల మధ్య పెరుగుతున్న దూరం, వ్యక్తిగత కక్షలతో హత్యల పరంపర పెరుగుతుంది. ఎవరి వ్యక్తిగతం వారిదే అయిన ఎవరికి అనుమానం రాకుండా హత్య చేసి జిల్లాలో మానవత్వం కరువైందనిపించేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో కనివిని ఎరగని రితీలో మూడు రోజుల్లోనే రెండు హత్యలు జరుగుతున్నాయి. ఈ నెల వ్యవధిలోనే 18 మంది వ్యక్తిగత కక్షలకు బలి అయ్యారు. పోలీసులు సైతం ...

Read More »

జీవనభృతి కోసం లొల్లి… లొల్లి…

  – సిబ్బందిని నిలదీసిన బీడీ కార్మికులు కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవనభృతి కోసం కామారెడ్డి పట్టణంలో ప్రతీరోజు లొల్లి లొల్లి జరుగుతుంది. అర్హులైన లబ్దిదారులు కార్యాలయం చుట్టు రోజు చక్కర్లు కొట్టినా తమకు జీవనభృతి ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపడుతున్నారు. శనివారం కామారెడ్డి పోస్టాఫీసు కార్యాలయం వద్ద జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా తమకు ఆధార్‌ నెంబరు లేదని, ఎస్‌కెఎస్‌లో పేరులేదని, ఏదో ఒక సాకు చెప్పి తిప్పి ...

Read More »

వడదెబ్బతో వృద్ధుడి మృతి

  కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డుకు చెందిన అన్నేపల్లి చిన్నబూదయ్య (55) అనేవృద్దుడు శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పుల కారణంగానే బూదయ్య మృతి చెందినట్టు కాలనీవాసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వెళ్ళగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుల కళ్ళలో ఆనందం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకే మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రారంభించినట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో శనివారం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలోని చెరువులు నిరాదరణకు గురై వ్యవసాయం దిగుబడులు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లోని సారవంతమైన ...

Read More »