Breaking News

Nizamabad News

ఘనంగా హనుమత్‌ జయంతి ఉత్సవాలు

  కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లోగల శ్రీషిర్టీ సాయి నిలయంలో బుధవారం వైశాఖ కృష్ణ దశమి సందర్బంగా శ్రీహనుమత్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, జై గురుదత్త పాదుకా పూజా జరిపారు. హనుమాన్‌ చాలీసాను 1116 సార్లు పారాయణం చేశారు. అనంతరం హారతి, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సాయి నిలయ ప్రతినిధులు రాధారెడ్డి, రాజమౌళి, రాధారమణి, పరమేశ్వర్‌, సీతారామారావు, భాస్కర్‌, జగదీశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

జైల్‌భరో పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన జైల్‌భరో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం పార్టీ నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకార్యక్రమం తలపెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తుల ...

Read More »

44 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్టీసి చక్రాలు కదలనున్నాయి

  – కార్మికుల్లో ఆనందోత్సాహాలు – జూన్‌ నుంచి అమలు నిజామాబాద్‌ అర్బన్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారంరోజులుగా కొనసాగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మెకు బుధవారం ఎట్టకేలకు తెరపడింది. సమ్మెతో అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం హైకోర్టు కార్మిక సంఘాలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కార్మిక సంఘ ప్రతినిదులతో ఈ మేరకు చర్చించారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినా కార్మిక సంఘాలు సమ్మె ...

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌

(13 May) హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు.. వారు డిమాండ్‌ చేసిన దానికన్నా ఒక శాతం అధికంగా ఇస్తూ 44 శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ సర్కార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించారు. కార్మిక సంఘాలతో చర్చలు సలఫలమైన అనంతరం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఇతర ఉద్యోగులతో పోల్చి చూస్తే ఆర్టీసీ కార్మికులకు అతి తక్కువగా జీతాలున్నాయని, ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశంతో కార్మికులకు 44 శాతం ...

Read More »

పుష్కర పనులను పరిశీలించిన ఆర్డీవో

  రెంజల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి పుష్కరాల పనులను బుధవారం బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ పరిశీలించారు. జూలై మాసంలో పుష్కరాలున్నందున పనులను వేగవంతం చేయాలని సదరు కాంట్రాక్టర్లకు సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేనియెడల పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం ధూపల్లి, రెంజల్‌, కందకుర్తి, నీలా గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. నీలా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలకుడు లేకపోవడంతో ...

Read More »

ఎంసెట్‌కు రవాణా సౌకర్యాలు సిద్ధం చేయాలి

  – వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నిజామాబాద్‌ అర్బన్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఎంసెట్‌ విద్యార్థులకు రవాణాకై ప్రత్యేక, ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈనెల 14న తెలంగాణలో ఎంసెల్‌ పరీక్ష నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో ఏర్పాట్లపై బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వరంగల్‌ నుండి ఈ వీడియో కాన్ఫరెన్సుకు హాజరైన ఉపముఖ్యమంత్రి ...

Read More »

వేగం ప్రాణాలు తీసింది

  – ఇద్దరు యువకుల దుర్మరణం ఆర్మూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. లారీ మృత్యుశకటమై వారిని కబళించింది. రహదారి రక్తసిక్తమైంది. వివరాల్లోకి వెళితే… ఆర్మూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన మణితేజ (19), ఆర్మూర్‌ శాస్త్రినగర్‌ కుచెందిన మనిష్‌రెడ్డి (18) కలిసి బుధవారం బైక్‌పై ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ వైపువెళ్తున్నారు. అంకాపూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఎంపి 20 జి 2527 ను వేగంగా ఢీకొనడంతో మణితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ...

Read More »

ఈయేడు 3.35 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం 3.35 కోట్ల మొక్కలను నాటడానికి లక్ష్యాన్ని నిర్దేశించినందున దానిని అధిగమించడానికి నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ సంబందిత అదికారులను ఆదేశించారు. బుధవారం ధర్పల్లి మండలంలోని నల్లవెల్లి, ఇంద్రనగర్‌ తాండా, దమ్మన్నపేట్‌ గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. దమ్మన్నపేట ఊర చెరువులో కొనసాగుతున్న మిషన్‌ కాకతీయ పనులను పర్యవేక్షించారు. ...

Read More »

మోసం చేసిన ఎన్ అర్ ఐ వరుడు

13-మే-2015-నిజామాబాద్ న్యూస్.ఇన్. మరో 24 గంటల్లొ పెళ్లి. వధువు ఇంట్లో పెళ్ళి పనులు అంతా పూర్తి అయ్యాయి. కాని వరుడు మాత్రం అమెరికా వెళ్లి ఇంకా రాలేదు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తునాడు. వివరాలొకి వెళ్తె నిజామబద్ జిల్ల కి చెందిన వెంకటెశ్వర రాజు కుమార్తిని అదే జిల్లకు చెందిన రామరాజు కుమరుడు నవనిత్ రాజుకి మార్చి 22న నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 14న పెళ్లి కుదుర్చుకునారు. పెళ్లి కార్డ్స్ అన్ని పంచెశాక వరుడు జంప్ అయిపొయడు. అమెరిక ...

Read More »

కరాచీలో బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు

(13 May) : పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందగా, 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. కరాచీలోని సఫోరా చౌరంగి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు బస్సులోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. ప్రయాణికుల కణతలకు గురిపెట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడికి గురైన బస్సు ఇస్మాయిలీ సమాజానికి చెందినదిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ...

Read More »

7వ రోజుకు చేరిన ఆర్టీసి సమ్మె

  – రోడ్లెక్కని బస్సులు – ప్రయాణీకులకు తప్పని ఇక్కట్లు ఆర్మూర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరింది. ఆర్టీసి బస్సులు రోడ్లెక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఆర్మూర్‌ ఆర్టీసి డిపో ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డిపో ఎదుట ఆందోళన చేపడుతున్న ఆర్టీసి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం ...

Read More »

ఏడుగురి పేకాటరాయుళ్ల అరెస్టు

  ఆర్మూర్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని యోగేశ్వర కాలనీకి చెందిన ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. పట్టణంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై దాడిచేసి వారి వద్దనుంచి 12,170 రూపాయలు, పేకముక్కలను స్వాదీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోగాని, మండలంలోగాని ఇంకా ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని, దగ్గర్లోని పోలీసుస్టేషన్లో తెలపాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Read More »

ఆర్టీసి సమ్మె ఉధృతం – కామారెడ్డిలో బోనాలు, నిరసనలు

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. కార్మికులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం పట్టణంలో బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద పోతరాజు విన్యాసాలు చేశారు. బోనాలను ఉంచి రోడ్డుపై బతుకమ్మలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Read More »

రైతు భరోసా పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న తలపెట్టిన ఛలో కామారెడ్డి కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో శాసనమండల విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతుభరోసా పాద యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 14న సాయంత్రం 6 గంటలకు కామారెడ్డిలోని సిఎస్‌ఐ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. రైతుల్లో స్ఫూర్తినింపి వారికి భరోసా ...

Read More »

కేసీఆర్‌ది నయవంచక పాలన

  – శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసీఆర్‌ది నయవంచక పాలన అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఈనెల 14న రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో కామారెడ్డికి వచ్చిన ఆయన ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారం చేపట్టిన నాటినుంచి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా మోసపూరిత పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటర్‌గ్రిడ్‌, ...

Read More »

ఇన్‌చార్జి వైద్యాధికారిగా డాక్టర్‌ శుభాకర్‌ నియామకం

  భీమ్‌గల్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్‌చార్జి వైద్యాధికారిగా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామ వైద్యాధికారి డాక్టర్‌ శుబాకర్‌ను నియమిస్తూ డిడివో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టి క్లస్టర్‌ వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌బాబుకు సమాచారమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ఉద్యోగులకు తన సహకారాన్ని అందిస్తూ విధి నిర్వహణలో ముందుకు పోతామన్నారు. డాక్టర్‌ సందీప్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

Read More »

మట్టి టిప్పర్లను బైపాస్‌వైపు మళ్ళించాలి

  భీమ్‌గల్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్‌లు పట్టణంలోని ప్రధాన రహదారిలో వెళుతుండడం వల్ల ప్రమాదాలు జరగడమే కాకుండా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీమ్‌గల్‌ వార్డు సభ్యుడు సి.హెచ్‌.గంగాధర్‌ అన్నారు. ఈ విషయం ఆయన భీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారుల వెంబడి ఇళ్లు, వ్యాపార సముదాయాలు, స్కూళ్ళు ఉన్నందున అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. పైగా టిప్పర్లు ...

Read More »

డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

  డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను తెవివి రిజిస్ట్రార్‌ ఆర్‌.లింబాద్రి మంగళవారం ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి మొత్తం ప్రవేశాల ప్రక్రియను ఆగష్టు 31లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా పలితాలు తొందరగా వెలువడుతున్నందున డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పకడ్బందీగా క్రమపద్దతిలో నిర్వహించడానికి ఈ షెడ్యూల్‌ ప్రకటించినట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, డిప్యూటి డైరెక్టర్‌ ఎం.మమత, పరీక్షల అదనపు ...

Read More »

ఒక్కో ఇంటికి రూ.ఐదు లక్షలు

(12 May) తెలంగాణలో పేదలకు నిర్మించే ఇంటికి రూ.ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. పేదలపై ఒక్క రూపాయి భారం పడకుండా ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, పురపాలిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ..నగరాలు, పట్టణాల్లో పేదలకు ఇళ్లు కట్టించే విషయంపై దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 67 మున్సిపాల్టీల్లో జి+1, జి+2 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని చెప్పారు. కేంద్ర పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ...

Read More »

హైదరాబాద్‌లో గూగుల్‌ క్యాంపస్‌రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం

(12 May) హైదరాబాద్‌: గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అతిపెద్ద ప్రాంగణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మౌంటెన్‌వ్యూలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి గూగుల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ రాడ్‌ క్లిప్‌, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.వెయ్యికోట్ల పెట్టుబడితో రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్‌ ...

Read More »