Breaking News

Nizamabad News

12వ సాయంత్రం కల్లా ఆధార్‌ నివేదికలు పూర్తిచేయాలి

  – కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ బూత్‌లెవల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం కలెక్టర్‌ నగరంలోని శంకర్‌భవన్‌, ఐటిఐ, మాణిక్‌భవన్‌, పద్మశాలి వసతి గృహం, అలాగే ఎంపిడివో కార్యాలయంలోని 76,77,88,89,95,96,97,98, పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న స్పెషల్‌ క్యాంపు శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. ఆధార్‌నెంబర్లు, మొబైల్‌ నెంబర్లు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ...

Read More »

ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

  – కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10న నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌వోలకు వర్కు కేటాయించిన కేంద్రాల్లో ఉండి ఓటరు జాబితాల్లో పేర్లు మార్పులు, చేర్పులు, అలాగే కొత్తగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ఇచ్చి వివరాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ పట్టణ బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. గతంలో వెరిఫికేసన్‌ సందర్భంగా ఓటర్లకు సంబంధించి ఓటర్ల వివరాలు పరిశీలించాలని ...

Read More »

మంత్రికి కారోబార్ల వినతి

  నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కారోబార్లు శనివారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సుదీర్ఘంగా సమ్మె చేపట్టిన కారోబార్ల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని వారు మంత్రికి విన్నవించారు. కాంట్రాక్టు కారోబార్లను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం 15 వేల మంది కారోబార్లకు 8 ...

Read More »

ఆర్టీసి జేఏసి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన కార్మికులు

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి కార్మికుల సమ్మె నానాటికి తీవ్రమవుతోంది. కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మె చేస్తుండడంతో ఆర్టీసిపై పెనుభారం పడుతుంది. సమ్మె విఫలం చేయడానికి యాజమాన్యం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాక ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అయితే సంస్థ ఉన్నతాధికారులు మొండి వైఖరి అవలంబిస్తూ ఎలాంటి లాభాలు లేకున్నా 150 ప్రయివేటు బస్సులను, 40 ఆర్టీసి బస్సులను నడిపించినా ఫలితం శూన్యమైంది. సమ్మె ...

Read More »

పోలీసు స్టేషన్‌ను తనికీ చేసిన సిఐ

  రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీసుస్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా బోదన్‌ ఇన్‌చార్జి సిఐ రమేశ్‌బాబు తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడకుండా, పేకాట వంటి జూదాలను అరికట్టేవిధంగా చూడాలని ఎస్‌ఐకి సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రవి, సిబ్బంది తదితరలున్నారు.

Read More »

పలు వాహనాలకు జరిమానా

  రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత పురస్కరించుకొని రెంజల్‌ ఎస్‌ఐ డి.రవి ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా సరైన దృవీకరణ పత్రాలు లేని 15 వాహనాలకు 3 వేల రూపాయల జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం

  భీమ్‌గల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలం సికింద్రాపూర్‌ గ్రామ శివారులోని నాగం చెరువులో శుక్రవారం మిషన్‌ కాకతీయ కార్యక్రమం క్రింద చెరువు పనులను స్థానిక సర్పంచ్‌ జిన్న ధరణిజ శోభన్‌ ప్రారంభించారు. చెరువులో పూడికతీత పనులకు భూమిపూజ చేసిన అనంతరం మట్టి తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి సభ్యుడు గణేశ్‌, గోన్‌గుప్పుల సర్పంచ్‌ నరేశ్‌, ఇరిగేషన్‌ ఏఇ శ్రీనివాస్‌, విడిసి అధ్యక్షుడు కుమ్మరి గంగారాం, పెద్ద నాగేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐవైఎఫ్‌ ఛలో హైదరాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న చేపట్టిన ఛలో హైదరాబాద్‌ పోస్టర్లను ఏఐఎస్‌ఎప్‌, ఏఐవైఎప్‌ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని కార్యరూపం దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవేవో కారణాలు చెబుతూ ఉద్యోగాలు ఇవ్వకుండా కావాలనే దాటవేస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని ...

Read More »

10న కామారెడ్డి బల్దియాలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతెలంగాణ-స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10న కామారెడ్డి మునిసిపల్‌ ఆవరణలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి మునిసిపల్‌ పాలకవర్గ ప్రతినిధులతోపాటు వార్డు మెంబర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, స్వచ్చంద సంస్థలు, ఆర్‌డబ్ల్యుఎస్‌, మహిళా గ్రూపులు , రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పాల్గొనాలని కోరారు.

Read More »

రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం ప్రారంభం

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుభకరి ప్రాపర్టీస్‌ పేరిట రియల్‌ ఎస్టేట్‌ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కంపెనీ జిఎం సతీష్‌ మాట్లాడుతూ తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రిలో 40 నెలల సులభ వాయిదాల్లో మధ్యతరగతి వారికి ఇంటి స్థలాలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కంపెనీ ఎజిఎంలు శివకుమార్‌, నితిశ్‌, సంతోష్‌, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వం కార్మికులను రెచ్చగొట్టే విదానాలను మానుకోవాలి

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆర్టీసి కార్మికులను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని ఆర్టీసి కార్మికులు అన్నారు. ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఆర్టీసి డిపోపరిధిలోని బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణీకులు ప్రయివేటు వాహనాలను, రైళ్లను ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం జీతాలను పెంచి ఆర్టీసి కార్మికులకు 28 శాతం మాత్రమే పెంచుతామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ...

Read More »

నీరు, గాలి, తిండి స్వచ్చంగా ఉంటేనే ఆరోగ్యం

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలు శుభ్రంగా ఉంటేనే కుటుంబాల్లో అనారోగ్యాలు దూరమవుతాయని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పకుండా నిర్మించుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం స్తానిక నూతన అంబేడ్కర్‌ భవన్‌లో నగరపాలకసంస్థ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్చభారత్‌- స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా యుజిడిలేని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ...

Read More »

తెలంగాణ అభివృద్ది కి సహకరించాలని ప్రదాని శ్రీ నరేంద్ర మోడిని కోరిన నిజామాబాద్ ఎంపీ

8-05-2015 తెలంగాణ అభివృద్ది కి సహకరించాలని ప్రదాని శ్రీ నరేంద్ర మోడిని కోరిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత.   తెలంగాణ కు సంబందించిన వివిధ అంశాలలో సానుకూలంగా స్పందించి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ప్రదాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత కోరారు. నేడు డిల్లీలోని ప్రధాని కార్యాలయంలో వారితో సమావేశమైన శ్రీమతి కవిత రాష్ట్రానికి సంబందించిన ముఖ్య అంశాలను ప్రధాని దృశ్టికి తెచ్చారు. 1) విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాన లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ...

Read More »

నేటి సూక్తి

దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి – డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

Read More »

పొంచిఉన్న మరో ‘భారీ’ భూకంపం

-నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ తీవ్రత న్యూఢిల్లీ: నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు నేపాల్లో వచ్చిన భూకంపై తీవ్రత 7.9గా ఉంది. త్వరలో మరో భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018కి అటు ఇటుగా ఈ భారీ భూకంపం ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ భూకంపం కూడా సెంట్రల్ హిమాలయాల్లో ఉండవచ్చునని చెబుతున్నారు. తదుపరి ఆ భారీ భూకంపం హిమాలయాల్లోనే ఉండవచ్చునని, దాని ప్రభావం బాగా ఉంటుందని చెబుతున్నారు. నేపాల్లో వచ్చిన భూకంపం తీవ్రత 7.9గా ఉందని, తదుపరి ...

Read More »

వినియోగదారులపై అకాల వర్షాల ప్రభావం

  బాన్సువాడ, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అకాల వర్షాల దెబ్బతో కూరగాయల పంటలక తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గిపోయి మార్కెట్‌లో కొరత ఏర్పడింది. వినియోగదారులనుంచి కొనుగోలు పెరగడంతో సరిపడా మార్కెట్లో కూరగాయలు అందుబాటులో లేకుండాపోయాయి. ముఖ్యంగా స్తానికంగా సాగయ్యే ఆకుకూరలు, తీగజాతి కూరలు, ఉల్లిగడ్డలు అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. ఇటీవల వరకు ...

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో విజయ్‌ జూనియర్‌ కళాశాల జయకేతనం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయ్‌జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్టు కరస్పాండెంట్‌ ప్రజ్ఞా గంగామోహన్‌ తెలిపారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాదించినట్టు ఆయన చెప్పారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఆర్మూర్‌ డివిజన్‌ 2వ ర్యాంకు సాధించినట్టు ఆయన చెప్పారు. ఎంపిసిలో డి.శుభశ్రీ 978, ఎన్‌.సుష్మ-950, బైపిసిలో వినీల-935, సిఇసిలో వంశీకృష్ణ-919 మార్కులు సాదించినట్టు ఆయన వివరించారు.

Read More »

వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, పిప్రి, ఆలూర్‌, ఆర్మూర్‌ పట్టణంలోని ఒడ్డెర కాలనీలోగల పాఠశాలల్లో వెనక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవి శిక్షణ తరగతులు సర్పంచ్‌లు బండ లక్ష్మణ్‌, విజయలక్ష్మి, కళాశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. పెర్కిట్‌ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఇవో రాజగంగారాం మాట్లాడారు. ఇందులో 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న వెనకబడిన విద్యార్తులు హాజరవుతున్నారని, ఈ తరగతులు ...

Read More »

చైన్‌స్నాచర్ల విజృంభణ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో చైన్‌ స్నాచర్లు విజృంభిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకొని వారి ప్రతాపాన్ని చూపుతున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా రోడ్లపై తిరగాలంటే జంకుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆర్మూర్‌ పట్టణంలోని యోగేశ్వర్‌ కాలనీలో కట్కం అరుంధతి అనే మహిళ వద్ద నుంచి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయినట్టు బాధితురాలు ...

Read More »

యానంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో రైతు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించటానికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read More »