Breaking News

Nizamabad News

రాత్రుళ్ళు సైతం నీటి సరఫరా

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో నీటి సమస్య తీవ్రతరమైంది. బోర్లలో నీరులేక తాగడానికి గుక్కెడు మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పాలకవర్గం నాలుగు రోజులు గడుస్తున్నా ట్యాంకర్‌ పంపకపోవడంతో నీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి 12 గంటలకు నీటి సరఫరా చేయడంతో నిద్రలేక ప్రజలు నీరు పట్టుకున్నారు. పాలకవర్గం సరైన సమయంలో నీటి సరపరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read More »

కొనసాగుతున్న సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు నరేందర్‌ తెలిపారు. గురువారం ఆయన ఆద్వర్యంలో పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నూతనంగా 200 మందికి సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనలో ప్రజలు భారతీయజనతా పార్టీవైపు చూస్తున్నారని, అందులో భాగంగానే సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

ఛలో మెట్‌పల్లి గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25న తలపెట్టిన ఛలో మెట్‌పల్లి బహిరంగ సభ గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. భారతీయ విద్యార్థి మోర్చా, భారత్‌ ముక్తిమోర్చాల ఆధ్వర్యంలో ఛలో మెట్‌పల్లి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకమవ్వాల్సిన అవసరముందన్నారు. వెనకబడిన కులాల వారందరిని ఐక్యం చేసేందుకు వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి బాఫూలే విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుందన్నారు. దీనికి ...

Read More »

ప్రతిపక్షనేత స్వాగతానికి భారీ సన్నాహాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సన్మానించేందుకు కాంగ్రెస్‌ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ గురువారం కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ నుంచి షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్వాపూర్‌లో జెండా ఆవిష్కరణ చేయించి అనంతరం అక్కడినుంచి కామారెడ్డి వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో షబ్బీర్‌అలీకి పార్టీ, వివిధ సంఘాల ...

Read More »

బంగారు తెలంగాణ సాధనలో…

  ముందంజలో జాగృతి.. – తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి ముందుండి పోరాడుతుందని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలంగాణ సాదనలో ముందుండి పోరాడారని అన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం 48 గంటలు నిరాహార దీక్షచేసి దేశంలో ఎక్కడాలేనివిధంగా అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ...

Read More »

విశ్వకర్మ భగవాన్‌ను సందర్శించుకున్న విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని వివ్వకర్మ గుట్టను విశ్వబ్రాహ్మన జిల్లా అధ్యక్షులు నరహరి, సెక్రెటరీ రామ్మోహన్‌ చారీలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. వారితోపాటు విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు సొక్కుల మోహన్‌, సెక్రెటరీ ఆనంద్‌, క్యాషియర్‌ సుంకం నర్సయ్య, విఠలయ్య, నాగయ్య, నాగుల వినోద్‌కుమార్‌, ముత్తన్న, హన్మాండ్లు తదితరులున్నారు. Nizamabad District President Narahari Visited Vishwakarma Temple Bheemgal.

Read More »

ప్రమాదకరంగా మారుతున్న బడాభీమ్‌గల్‌ రోడ్డు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని భీమ్‌గల్‌ నుండి బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్డు ఇరువైపులా గుంతలుగా తయారై సంవత్సరాలు గడిచినా సంబంధిత పాలకులకు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి వెళ్లే రోడ్డు ఇలా ఉంటే పల్లెల్లో రోడ్లు ఎలా ఉంటాయో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఒక నిదర్శనమేనని వాహనదారులు అంటున్నారు. భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని బెజ్జోరా, బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్లు ఇలా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ...

Read More »

నేడు విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి రానున్న జిల్లా అధ్యక్షులు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విశ్వకర్మగుట్ట, విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు నరహరి, సెక్రెటరీ రామ్మోహన్‌చారిలు నేడు మంగళవారం రానున్నట్టు విశ్వకర్మ భగవాన్‌ ఆలయ కమిటీ అధ్యక్షులు సోక్కుల మోహన్‌ విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్త విశ్వబ్రాహ్మణులు భారీగా భీమ్‌గల్‌ లోని విశ్వకర్మ గుట్టకు ఉదయం 8 గంటలకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు సుదర్శన్‌చారి, నాగయ్య, సుంకం నర్సయ్య, విఠల్‌, ...

Read More »

బిజెపి గూటికి ప్రముఖవైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణమే గాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యరంగంలో సేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌ ఆదివారం తన అనుచరులతోకలిసి హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలో చేరినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని వెల్లడించారు.

Read More »

డిఎం పోకడకు నిరసనగా ధర్నా

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డిపో మేనేజర్‌నియంతృత్వ పోకడను నిరసిస్తూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ డిపో మేనేజర్‌ కార్మికులపై తన అక్కసును వెళ్లబోస్తున్నారని ఆరోపించారు. పనవేళల కంటే ఎక్కువగా పనిచేయిస్తూ కార్మికులపై దుర్బాషలాడుతూ తనకిష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని వారికి రావాల్సిన సెలవు దినాలను సైతం వారిని పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్‌ఎం దీన్ని గ్రహించి డిఎంపై చర్యలు తీసుకోవాలని ...

Read More »

పేద క్షత్రియులకు బియ్యం పంపిణీ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని నిరుపేద క్షత్రియులకు ఆర్మూర్‌ క్షత్రియ యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం లక్ష్మినారాయణ మందిరంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్షత్రియ యువజన సమాజ్‌ నాయకులు మాట్లాడుతూ నిరుపేద క్షత్రియులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షత్రియులు అన్నిరంగాల్లో రాణించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ్‌ సభ్యులు నివేదన్‌, అల్జాపూర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌పట్టణంలో బిజెపి సభ్యత్వ నమోదు ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్‌ తెలిపారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా 300 మందికి సభ్యత్వం చేయించి వారికిరసీదులు అందజేశారు. అనంతరం నరేందర్‌ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనవైపు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, అందుకే బిజెపి సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువ నమోదు ...

Read More »

ప్రజావాణికి 66 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఈవారం ప్రజావాణికి 66 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ శ్రీధర్‌ వెల్లడించారు. అందులో రెండు భూమికి సంబంధించినవి కాగా, ఒకటి తాగునీటి సమస్య, 63 ఎఫ్‌ఎస్‌సికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Read More »

పరిశ్రమల స్థాపనకు సత్వర చర్యలు తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలపరిమితి వరకు వేచిచూడకుండా పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పరిశ్రమల అనుమతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించి సరైన నమూనాలో దరఖాస్తులు చేసుకునేవిధంగా చూడాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ...

Read More »

వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ జోగుపండగ

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ జోగు పండగ కార్యక్రమాన్ని సోమవారం గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రతియేడు అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఈ యేడు సైతం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని గ్రామంలో డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగించారు. మహిళలు మంగళహారుతులతో అమ్మవారికి పూజలు జరిపారు. ఉత్సవాలకు గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.

Read More »

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద సంవత్సరాల తర్వాత తిరిగి శనివారం అమావాస్య రావడంతో ఈ విశిష్టతనుగుర్తుంచుకొని ప్రజలు ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు శివారులోగల దోబిఘాట్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జాన్కంపేట్‌ వద్దగల అష్టముఖి కోనేరు, నర్సింహస్వామిని దర్శించుకోవడానికి భారీగా బయల్దేరారు.

Read More »

రైతులను ఆదుకోవాలి …

  – బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి. ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ...

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామ శివారులో నిజామాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొని గంగాధర్‌ (60) మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం పలు అభివృద్ధి పనులుప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలతో చేపట్టిన మురికి కాల్వల నిర్మాణం, నాన్‌ ప్లాన్‌ నిదులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి రోడ్దు పనులు, బిఆర్‌జిఎప్‌ నిదులు రూ. 2 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ...

Read More »

రైతుల ఆత్మహత్యలు తెరాస పుణ్యమే…

  – టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగానే 700 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి టిడిపి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాటల్లో చెప్పిన పనులు చేతల్లో ఏమాత్రం చూపడం లేదని, ...

Read More »