Breaking News

Nizamabad News

అర్హులైన దళితులకు మూడెకరాల భూమి ఇప్పించాలి

నిజామాబాద్‌, మార్చి 16   నిజామాబాద్‌ న్యూస్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన దళితులందరికి మూడెకరాల సాగుభూమిని ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాటను తాను నిలబెట్టుకోవాలని కోరుతూ నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం డీకంపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల రామస్వామి క్యాంపునకు చెందినవారు సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు ఎలాంటి వ్యవసాయ బూములు, ఆస్తిపాస్తులు లేవని తెలిపారు. గత 50 ఏళ్ళ నుంచి రామస్వామి క్యాంపులో ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ శిబిరం

నిజామాబాద్‌, మార్చి 15 కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో ఉచిత ఆక్యుప్రజర్‌ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మోకాళ్ళ నొప్పులు, మెడ, నడుమునొప్పి, కాళ్ళ తిమ్మిర్లు, బిపి, తదితర వ్యాధులున్న రోగులకు ఆక్యుప్రజర్‌ విధానంతో చికిత్స అందించారు. ప్రజలు ఆక్యుప్రజర్‌ విధానాన్ని వినియోగించుకొని రోగాలనుంచి ఉపశమనం పొందాలని డాక్టర్‌ పి.కె.చౌదరి సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు నరేశ్‌ కుమార్‌, ప్రతినిధులు గంగాధర్‌, లింబాద్రి, గోపి, రమేశ్‌, శ్యాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : కామారెడ్డి పట్టణంలోని 15, 16 వవార్డుల్లో పలు అభివృద్ధి పనులు ఆదివారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 15వ వార్డులో లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను, 16వ వార్డులో సిసి రోడ్డు, డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసి ఛైర్మన్‌ జగన్నాథం, కౌన్సిలర్లు భూంరెడ్డి, మోహన్‌, అంజద్‌, ...

Read More »

వాణి విద్యాలయంలో ఘనంగా స్పోర్ట్య్‌ డే

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : పట్టణంలోని వాణి విద్యాలయంలో స్పోర్ట్స్‌డే ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలు రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. చిన్నారులు వివిధ వేషధారణలో చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువును కష్టంగా గాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి కె.వెన్నెల తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వుల గింజలపై రాసి ...

Read More »

చిన్నారులకు జిల్లా స్థాయి అబాకస్‌ పోటీలు

నిజామాబాద్‌, మార్చి 15   నిజామాబాద్‌ న్యూస్‌ : నిజామాబాద్‌ నగరంలోని రెండవ జిల్లా స్థాయి అబాకస్‌ పోటీలను ఆదివారం స్తానిక వైస్రాయ్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి యొక్క సామర్థ్యాలను, ప్రతిభా పాటవాలను పెంపొందించడం కొరకు అబాకస్‌లో వారి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ విషయమై నవ్యభారతి గ్లోబల్‌ స్కూల కరస్పాండెంట్‌ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నూతనోత్తేజం, వేగం తదితర అంశాలు పెంచే అవకాశం అబాకస్‌ ద్వారా కలుగుతుందన్నారు. ఈ పోటీ సమాజానికి దీటుగా తమ పిల్లలను ...

Read More »

వినియోగదారునిగా హక్కులు తెలుసుకోవాలి

నిజామాబాద్‌, మార్చి 15   నిజామాబాద్‌ న్యూస్‌ : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం ప్రగతిభవన్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారుల ఫోరం, వినియోగదారుల సంఘాల సమాఖ్య సభ్యులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ వినియోగదారులకు చట్టాల పట్ల అవగాహన కల్పించి, ప్రశ్నించే తత్వం, గట్టిగా మాట్లాడే తత్వం అలవరుచుకునేందుకు చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల ప్రయోజనాల కోసం అనేక రకాల ...

Read More »

గ్రామీణ డాక్‌ సేవక్స్‌ సమ్మె

నిజామాబాద్‌, మార్చి 15   కామారెడ్డి న్యూస్‌ : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టినట్టు ఆలిండియా డాక్‌ సేవక్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు యూసుఫ్‌ అలీ తెలిపారు. కామారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు పనిచేయించుకుంటూ డాక్‌ సేవకులను తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు శ్రమ దోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ...

Read More »

కవిత్వంలో ప్రతి అక్షరం ఆయుధం అవ్వాలి

నిజామాబాద్‌, మార్చి 15 – ప్రజాకవి సి.హెచ్‌.మధు కామారెడ్డి న్యూస్‌ : రచయిత కవిత్వంలోని ప్రతి అక్షరం ఆయుధమై తిరగబడాలని ప్రజాకవి సి.హెచ్‌. మధు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో యువకవి ధర్పల్లి సాయికుమార్‌ రచించిన ‘అశ్రుగీతం’ కవితా సంపుటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధిక్కారం కవి సహజ నైజమని, కవికి ఆలోచనతోపాటు అక్రోశం, ఆవేశం కూడా అవసరమని అన్నారు. సామాజిక రుగ్మతల పట్ల కవికి ...

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎపివో దేవిసింగ్‌

నిజామాబాద్‌, మార్చి 15   రెంజల్‌ న్యూస్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షరభారతి మిషన్‌ ఏర్పాటు చేసింది. 6వ దశ నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను ఆదివారం మండలంలోని 11 గ్రామాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. ఏపివో దేవిసింగ్‌ దూపల్లి, రెంజల్‌, వీరన్నగుట్ట, నీల, బోర్గాం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మండలంలో 690 మందికి గాను 616 మంది పరీక్షలు రాసినట్టు మండల కో ఆర్డినేటర్‌ వినోద్‌ తెలిపారు.

Read More »

సిఐటియు ఆద్వర్యంలో అభినందన సభ

నిజామాబాద్‌, మార్చి 14 ఆర్మూర్‌ న్యూస్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచినందువల్ల శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌, అంగన్‌వాడి హెల్పర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిఐటియు నాయకులు వెంకటేశ్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అంగన్‌వాడ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించడం, రిటైర్‌మెంట్‌ సౌకర్యం కల్పించి రూం రెంట్‌ షరతులు లేకుండా అమలు చేయాలని దాని కనుగుణంగా ఇవ్వాలని, ...

Read More »

ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటరుకు మూడు ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చి 14   ఆర్మూర్‌ న్యూస్‌ : ప్రతి శనివారం పట్టణంలోని సబ్‌డివిజనల్‌ కార్యాలయంలో సబ్‌ డివిజనల్‌ అధికారి రాంరెడ్డి ఆద్వర్యంలో నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటరుకు ఈ వారం మూడు ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన చెప్పారు. వచ్చిన మూడు ఫిర్యాదుల్లో ఒక కేసును పరిష్కరించి మిగిలిన రెండు కేసులను వచ్చే వారానికి వాయిదా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Read More »

రాష్ట్రం మారినా పేర్లు మారలేదు

నిజామాబాద్‌, మార్చి 14   నిజామాబాద్‌ న్యూస్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంతవరకు వారి రాష్ట్రం పేరు తెలిసి కూడా మైమరిచిపోయి అటువైపు కన్నెత్తి చూడని అధికారులు మన నిజామాబాద్‌ నగరంలో ఉండడం హాస్యాస్పదం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పలు ప్రభుత్వ కార్యాలయాల నామఫలకాలపై ఇంకా రాష్ట్రాల పేర్లను మార్చకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ నామ ఫలకాలు ఎక్కడో మారుమూల ఉంటే ఎవ్వరు పట్టించుకునేవారు కాకపోవచ్చు. కానీ నగరం నడిబొడ్డున ...

Read More »

నన్ను జర పట్టించుకోండ్రి

నిజామాబాద్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ : అలో సారూ! నన్ను జర గుర్తువట్టిండ్రా? ఏం గుర్తువెట్టుకుంటరో ఇయ్యాలిటి దినంల గ ఈమేళ్లో, గీమేళ్లో గాని , పేసుబుక్కులచ్చిన సంది నన్ను యాడగుర్తువెట్టుకుంటుండ్రు. గదే పదేళ్ళ కిందైతే నానోట్ల చేతువెట్టంగానే మీ వోళ్ళు మంచిగుండ్రా, ఏం జేత్తుండ్రు, ఎట్లున్నరు అన్నది దబ్బున తెలుస్తుండే. కానీ గిప్పుడైతే నన్ను చెత్తకుప్పకంటే హీనంగ చూస్తుండ్రు. మరి గట్లనే నన్ను మొర్లపొంటి, పెంటకుప్పలపొంటి ఇడుస పెట్టుడే గాకుండ, గాళ్ళు, గీళ్ళు అచ్చుకుంట ఉమిసి పోతుండ్రు. మరి మీమీద గట్లనే ...

Read More »

కలెక్టర్‌ పనితీరు బాగుంది.

-గుజరాత్‌ ఎన్నికల ప్రధాన అధికారి నిజామాబాద్‌ న్యూస్‌ : ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ నంబరును అనుసందాన ప్రక్రియకు దేశం లోనే జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైందని, దీనిని కలెక్టర్‌ డి. రోనాల్డ్‌ రాస్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గుజరాత్‌ ఎన్నికల ప్రధాన అధికారి అనితా కార్వాల్‌ అభినందించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈపీఐపీ కార్డుకు ఆధార్‌ సీడింగ్‌ జిల్లాలోని తోమ్మిది నియోజక వర్గాలలో ఏవిధంగా చేస్తున్నారో కలెక్టర్‌ వివరించారు. ఆధార్‌ సీడింగ్‌ 99.78% పూర్తి అయ్యిందని, జిల్లాలో ...

Read More »

పేరుకే సర్పంచ్‌

నిజామాబాద్‌, మార్చి 14 – బంధుగుణం పాలన రెంజల్‌ న్యూస్‌ : ఒకచోట భర్త, మరోచోట కొడుకు ప్రజల చేతిలో పాలన అంటే… మనకు గ్రామ స్థాయిలో గుర్తుకొచ్చేది పంచాయతీ. మనమధ్య తిరుగుతూ మన సమస్యలు తెలుసుకుంటూ పరిపాలించే ప్రజాప్రతినిధి సర్పంచ్‌ ఇలాంటి నిర్వచనాలతో పనిలేకుండా పేరుకు సర్పంచ్‌ పాలన, బంధువులదనేది అమలైతే? అవును అదే జరుగుతుంది. డమ్మి సర్పంచ్‌ భర్తలు.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్నది ఎవరంటే మహిళా సర్పంచ్‌ల భర్తలు, కొడుకులు, డమ్మి అభ్యర్థులుగా నిలబడి గెలుపొందినవారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 ...

Read More »

టెన్త్‌ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చి 14 రెంజల్‌ న్యూస్‌ : 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన నూతన సిలబస్‌, నూతన పరీక్షా విధానం వల్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి డిఇవో శ్రీనివాసచారి ఆధ్వర్యంలో అదికారుల బృందం ఆయా మండల కేంద్రాలకు వెళ్లి ఉపాధ్యాయులతోపాటు అధికారులకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 25 నుంచి 10వ తరగతి ...

Read More »

5వ రోజుకు చేరిన పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె

నిజామాబాద్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ : కేంద్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయిస్తు సరైన వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుందంటూ ఆలిండియా పోస్టల్‌ ఎంప్లాయిస్‌ గ్రామీణ ఢాక్‌ సేవక్‌ సంఘం నిజామాబాద్‌ డివిజన్‌ అద్యక్షులు ఏ.సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని హెడ్‌పోస్టాఫీసు ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారంతో 5వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జిల్లా కేంద్రంతోపాటు సిరికొండ, డిచ్‌పల్లి మండల కేంద్రాల్లో ఏఐజిడిఎస్‌ చేపట్టిన సమ్మె కొనసాగుతుందని ...

Read More »

ఈనెల 16 నుంచి 18వరకు ప్లంబర్‌ కార్మికుల బంద్‌

నిజామాబాద్‌, మార్చి 14   నిజామాబాద్‌ న్యూస్‌ : ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు నిజామాబాద్‌ జిల్లాలో పనిచేసే ప్లంబర్‌ కార్మికులు వారి సమస్యల పరిష్కారానికై పనులు నిలిపివేస్తున్నట్టుగా నిజామాబాద్‌ ప్రయివేటు ప్లంబర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో పాదరక్షలు మొదలు తలకు పెట్టుకునే కొబ్బరి నూనె వరకు ధరలు పెరుగుతున్నాయన్నారు. కానీ తమ కార్మికుల రోజువారి కూలీ మాత్రం పెంచడం లేదన్నారు. ప్లంబర్‌ వృత్తిపై సరైన ...

Read More »

ఘనంగా వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, మార్చి 14   బాల్కొండ న్యూస్‌ : బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తెరాస ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పోచంపాడ్‌ ఎంపిపి అర్గుల రాధా, పార్టీ మండల అధ్యక్షులు శ్యామ వెంకటరెడ్డి కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ...

Read More »

అలరించిన మనోవైకల్య ,  అందుల , బదిరుల విన్యాసాలు 

ఘణంగా గా కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల  కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి విద్యార్ధి సమాఖ్య జిల్లా కన్వీనర్ పసుల చరణ్ ఆద్వర్యం లో స్థానిక కళా భారతి లో ఘనంగా జరిగాయి . ప్రభుత్వ అందుల పాటశాల , ప్రభుత్వ బదిరుల పాటశాల , మనో వికాస కేంద్రం , బాలసదన్ , ఆనంద నిలయం , సహాయ అనాదాశ్రమం లోని విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది . మర్రిపెల్లి ...

Read More »