Breaking News

Nizamabad News

ఇంటర్వూలకు హాజరైన పీఎంఈజీపీ అభ్యర్థులు

  నిరుధ్యోగుల అభ్యున్నతి కొరకు ప్రారంబించనడిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ముఖాముఖీ నిర్వహించారు. బుధవారం ఎజేసీ ఛాంబర్‌లో జిల్లా టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశమై 67 మంది అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. 25 మంది యువతులు, 42 మంది యువకులు హజరయ్యారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వైఎల్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు రూ.25 లక్షల వరకు, సేవా సంస్థలు నెలకోల్పడానికి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారాన్నరు. గ్రామీణ ...

Read More »

రబీలో ఆరుతడి పంటలనే వేయాలి- జెడిఎ నర్శింహ

  వర్షలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్వవసాయ అధికారుల సూచనలను పాటించి లాభాలు పొణదాలని తెలిపారు. రబీలో రైతులు తక్కువ నీటీ వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఆరుతడి పంటలనే సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహ అన్నారు. బుదవారం మండలంలో శ్రీరాంపూర్‌, చిట్టపూర్‌ తదితర గ్రామల్లో ఆయన పర్యటించి జోన్న, ఆవాలు, మొక్కజోన్న తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో మాట్లాడారు. అలాగే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు వేసుకోవాలని సూచించారు. యంత్రలక్ష్మీ కింద 33% ...

Read More »

బిచ్కుందలో గృహహింస కేసు నమోదు

  జిల్లాలోని బిచ్కుమద మండలంలో గృహహింస కేసు నమోదంది. వివరాలలోకి వెలితే రంగారెడ్డి జిల్లాకు చెందిన జంగం నరేష్‌ అనే వ్యక్తిపై గౄహహింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు బిచ్కుంద ఎస్సై ఉపెందర్‌రెడ్డి తెలిపారు. బిచ్కుంద మండలం శాంతాపూర్‌కు చెందిన సుజాతను సంవత్సరం క్రితం రంగారెడ్డి జిల్లా కోడూర్‌ మండలం గోంగుపల్లికి చెందిన నరేష్‌ వివాహం చేసుకున్నాడని తెలిపారు. కోన్ని రోజుల నుంచి సుజాతను నరేష్‌ వేధిస్తుండడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నరేష్‌పై గృహహింస చట్టం కింద కేసునమోదు ...

Read More »

బాల్య వివాహాలు చేస్తే కేసులు పెట్టండి

  -జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రకాస్‌ నిజామాబాద్‌, జనవరి 7; గర్బిణిలు, బాలింతలు అంగన్‌వాడి కేంద్రానికి తప్పకుండా రావాలని, ఇక మీదట శిశు మరణాలు జరగడానికి వీలులేదని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. బుధవారం పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలొ శిశు మరణాలు అదికంగా జరగడానికి కారణాలను విశ్లేషించారు. ప్రభుత్వం ఒక పూట సంపూర్ణ భోజనం పథకం, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తున్నందున గర్బిణిలు ఆంగన్‌వాడీ కేంద్రాలకు తప్పకుండా హాజరై ఎఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లు, వైధ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు ...

Read More »

యువతలో మార్పు రావాలి

-ఎమ్మెల్యే బిగాల -నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 7; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; యువతలో మార్పుతో పాటు చైత్యనం కలిగించడం ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యతనేనని, అందుకు ప్రతి ఒక్కరు బాద్యతగా వ్యవహారించాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త అన్నారు. ఇందూరు యువసేన అసోసియేషన్‌ అధ్వర్యంలో బుధవారం ఉమెన్స్‌ కాలేజీలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితులుగా అర్బన్‌ యమ్‌.ఎల్‌.ఎ బిగాల గణేష్‌గుప్తా, నిజామాబాద్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా ఉండలని, అర్థరాత్రి ...

Read More »

కిడ్నాప్‌ కేసులో నలుగురికి ఏడేళ్లు జైలు

బోధన్‌ న్యాయస్దానం తీర్పు బోధన్‌, జనవరి 7; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; బాలిక కిడ్నాప్‌ కేసులో నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు బోధన్‌ న్యాయస్థానం తీర్పు వెలువడింది. బోదన్‌ మండలంలోని హంగర్గా గ్రామానికి చెందిన నలుగురు నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షను విదిస్తూ బోధన్‌లోని అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయముర్తి ఎస్‌. గోవర్థన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. వారిపై కిడ్నాప్‌ కేసుతో పాటు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడి చేసినట్లు పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసు ...

Read More »

ప్రముఖ రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి అస్వస్థత

  పలువురు ప్రముఖుల పరామర్శ నిజామాబాద్‌, జనవరి 7; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌; ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ కేశవరెడ్డికి అస్వస్థత గురయ్యారు. గత15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయనను ఇటీవల జిల్లా కేంద్రం ఖలీల్‌వాడీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చెర్పించారు. ఆయన గతంలో డిచ్‌పల్లి విక్టోరియా ఆసుపత్రిలో చర్మవ్యాధి నిపుణుడిగా పనిచేసి పదవీ విరమణ పోందారు. నిజామాబాద్‌. ఆర్మూర్‌లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇతనికి భార్య ధీరమతి, ఇద్దరు పిల్లలున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు… తెలుగు సాహిత్యరంగంలో ప్రముఖ ...

Read More »

ఆర్‌టివోలో 14 వందల కేసుల పరిష్కారం… వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదుల స్వీకరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 7: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; రవాణ సదుపాయాలపై రోడ్డు ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయం(ఆర్టీఏ)లో వినియోగదారుల కోసం ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ 80967 50054 నెంబర్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిపై నిజామాబాద్‌ డీటీసీ జీ.సీ.రాజారత్నం ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు 1500లకు పైగా ఫిర్యాదులు రాగా వాటిలో 1,445 కేసులను పరిష్కరించామన్నారు. ఆగస్టు 1, 2014న హెల్ప్‌లైన్‌ సౌకర్యం జిల్లాలో ప్రారంభమైందని, అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు, ...

Read More »

ఎం.పి కవితకు స్వల్ప అస్వస్థత

నిజామాబాద్‌, జనవరి 07, నిజామాబాద్‌ న్సూస్‌ డాట్‌ ఇన్‌: నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల అలుపు ఎరగకుండా ప్రయాణాలు చేస్తు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రసంగాలు చేయడంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడాలోని యశోద హాస్పిటల్‌లో మంగళవారం మద్యాహ్నం చేరారు. జలుబు, జ్వరం లక్షణాలతో ఎంపీ కవిత స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం ఎంపి కవితను డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ కవిత అనారోగ్యానికి గురి కావడంతో ...

Read More »

రాష్ట్రంలో జిల్లా యువజన హవా… రాష్ట్రస్థాయిలో 14మందికి ప్రశంసలు… జాతీయస్థాయికి ఎంపిక

నిజామాబాద్‌, జనవరి 5: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; తెలంగాణ రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో జిల్లా యువత తమ సత్తాను చాటింది. అంచనాలకు మించి దూసుకెళ్లి వాహ అనిపించారు. రాష్ట్ర స్థాయిలో 14 మందికి ప్రంశసలు అందుకోగా, ముగ్గురు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఈసారి యువజనోత్సవాల్లో జిల్లా కిర్తి. మరోపక్క ఇక్కడి నుంచి జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు సిద్దమైంది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో 3,4 తేదీల్లో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు జరిగాయి. ఇందులో జిల్లా నుంచి 24 అంశాల్లో జిల్లాకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ...

Read More »

హరితవనమే లక్ష్యం కావాలి… ఒఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌

నిజామాబాద్‌, జనవరి 06, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: జిల్లాలో ప్రతి ఒక్కరు హరితవనాల మీదా దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఉద్యమంలా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర హరితహారం ఓఎస్‌డీ ఐఎస్‌ఎఫ్‌ ప్రియంక వర్గీస్‌ జిల్లాలోని అటవీ శాఖ అధికారులకు, యంపిడిఓలకు ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జిల్లాలో తెలంగాణాకు హరిత హారం కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలను, ప్రగతిని అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతతో హరితహారం అమలు ...

Read More »

మా గోడు వినిపించుకోండి సారు….

– ఎంపిడివో కార్యాల‌యం ఎద‌ట ద‌ర్న ఆర్మూర్, జ‌న‌వ‌రి05 : అర్హులైన వారంద‌రికీ పించ‌న్ లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలోని ఎంపిడీవో చంబ‌ర్ ముందు మండ‌లంలోని పిప్రి, రాంపూర్ గ్రామాల‌కు చెందిన అర్హులైన వృద్దులు, వితంతువులు, విక‌లాంగులు ద‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారికి పించ‌న్ లు అంద‌డం లేద‌ని వారు అదికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త రెండు నెల‌లు గా అదికారుల చుట్టు, స్థానిక నేత‌ల చుట్టు తిరిగినా వారు ...

Read More »

ర‌సాభ‌స‌గా స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

  ఆర్మూర్, జ‌న‌వ‌రి 05 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని స్థానిక మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో సోమ‌వారం ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య ఆద్య‌క్ష‌త‌న‌ స‌ర్వ‌స‌భ్య స‌మావేవం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం ఆద్యాంతం ర‌సాభ‌స‌గా కొన‌సాగింది. మండ‌లంలొని వివిధ గ్రామాల ఎపిటిసీలు అదికారుల వైక‌రిని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మండ‌లంలో అర్హులైన ల‌బ్దిదారుల‌కు పించ‌న్ లు అందించ‌డం లో అధికారులు, ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వారు ఆరోపించారు. స‌ర్వే నామ మాత్రం గా చేసి అదికారులు, వాటిని చెల్లించ‌క‌లేక ప్ర‌భుత్వం గోరంగా విఫ‌ల‌మైంద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ...

Read More »

హ్యాపి న్యూఇయ‌ర్……

-న‌యాసాల్ న‌యా జోష్ -నూత‌న సంవ‌త్స‌రానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు ఆర్మూర్, జ‌న‌వ‌రి 01 : గ‌త 2014 సంవ‌త్స‌ర‌నికి వీడ్కోలు ప‌లికి, నూత‌న 2015 సంవ‌త్స‌రానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ‌త సంవ‌త్స‌ర‌పు తీపి అనుభూతుల‌ను నెమ‌రువేసుకుంటూ, కొత్త సంవ‌త్స‌రం కోటి ఆశ‌ల‌తో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికారు. డిసెంబ‌ర్ 31 సంవ‌త్స‌ర‌పు చివ‌రి రోజు కావ‌డంతొ పాత సంవ‌త్స‌రానికి ఘ‌నంగ వీడ్కోలు ప‌లికారు. దీంతో ప‌ట్ట‌ణమంతా న‌యా జోష్ నింపుకుంది. కొత్త రాష్ర్టం కోటీ ఆశ‌ల‌తో ముందుకు ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

    బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ ...

Read More »