Breaking News

Armoor

ఆర్మూర్‌ పిఎస్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ

ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సోమవారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కర్తన్‌ భూషన్‌ అనే వ్యక్తిని సన్మానించారు. భూషన్‌ గత కొన్ని సంవత్సరాలుగా గుర్తు తెలియని, కుళ్ళిపోయిన శవాలను బయటకు తీయడంలో పోలీసు వారికి సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఆయన్ను పోలీసు శాఖ ఆద్వర్యంలో సన్మానించారు. అలాగే ఆర్మూర్‌ డిఎస్పీ కార్యాలయంలో భీమ్‌గల్‌ సిఐ రమణరెడ్డి పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో …

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత …

Read More »

ఆర్మూర్‌ నియోజకవర్గ జాగృతి మహిళా కన్వీనర్‌గా వాణి

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ తెలంగాణ జాగృతి మహిళా కన్వీనర్‌గా పోహర్‌ వాణి నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలక్ష్మి మహిళా సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జాగృతి ఆర్మూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ నూకల విజయ్‌ కుమార్‌, బాల్కొండ నియోజకవర్గ మహిళా కన్వీనర్‌ రమాదేవి, ఆర్మూర్‌ మండల కన్వీనర్‌ రాచర్ల దశరథ్‌, చౌకెలింగం, సంఘం సభ్యులు చైకి నీరజ, పద్మ, గీత, విజయ, జ్యోతి, పోసాని, శ్యామల, సమత, మమత, …

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్థానికులు గమనించారు. సుమారు 70 సంవత్సరాల వృద్దుడు మృతి చెంది కనిపించడంతో పెర్కిట్‌ విఆర్వో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఐదేళ్ల నుంచి పెర్కిట్‌ గ్రామంలో భిక్షాటన చేస్తు ఉండేవాడని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసినవారు ఆర్మూర్‌ సిఐ 9440795411, లేదా ఎస్‌ఐ 94407 95434 కు సమాచారం అందించాలని …

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఒకరోజు జైలుశిక్ష

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లి చౌరస్తాలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్బంగా షేక్‌ మోహినుద్దీన్‌ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్న విషయాన్ని గమనించి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా సెకండ్‌ క్లాస్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ దత్తయ్య ఒకరోజు జైలుశిక్ష విదిస్తు తీర్పునిచ్చినట్టు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. Email this page

Read More »

నిందితునికి రెండ్రోజుల జైలుశిక్ష

ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటోతో విద్యార్థిని ఢీకొన్న కేసులో నిందితునికి రెండ్రోజుల జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడింది. వివరాల్లోకి వెళితే ….మార్చి 21 న ఆర్మూర్‌ మామిడిపల్లి కమాన్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పల్లి గ్రామానికి చెందిన పింజ అరుణ్‌ కొడుకు సంతోష్‌ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా జక్రాన్‌పల్లికి చెందిన రాంచందర్‌ అనే వ్యక్తి ఆటోతో ఢీకొనడంతో కేసు నమోదు చేశారు. కేసు విచారణ అనంతరం మంగళవారం నిందితుడు రాంచందర్‌కు రెండ్రోజుల …

Read More »

మిషన్‌ భగీరథకు జిల్లాకు రూ. 2650 కోట్లు

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆర్మూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులకై రూ. 2650 కోట్లు ఖర్చు అవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆర్మూర్‌ మండలం కొమన్‌పల్లి గ్రామంలో పైపులైన్ల కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ కార్యక్రమమైన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. మూడు రోజుల్లో …

Read More »

ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం

ఆర్మూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈత, ఖర్జూర మొక్కల పెంపకంతో గౌడకులస్తుల చేతివృత్తి పనిలో భాగంగా గీతవృత్తి ఉపాధి పెరగడంతో పాటు స్వచ్చమైన కల్లును ప్రజలకు అందించే అవకాశం గౌడకులస్తులకు దక్కుతుందని అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతకుమారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణాతో కలిసి డిచ్‌పల్లి మండలానికి చెందిన యానంపల్లి, ఆర్మూర్‌ మండలానికి చెందిన ఫతేపూర్‌, చేపూర్‌ గ్రామాల్లోని చెరువు కట్టలపై నాటిన ఈత, ఖర్జుర చెట్లను పరిశీలించిన తదుపరి ఈత, ఖర్జుర మొక్కలను …

Read More »

కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు

  – డిఎస్‌పి రాంరెడ్డి ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్‌ డిఎస్‌పి ఆకుల రాంరెడ్డి అన్నారు. కేజ్‌వీల్‌ వాహనాలు రోడ్లపై నడిపి నాశనం చేస్తున్నారని, దీంతో డ్రైవర్‌పై, యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఆర్మూర్‌ పట్టణంలో రహదారిపై ఆవులు, ఎద్దులు విచ్చలవిడిగా వదిలి పెడుతున్నారని, వాటి వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని అన్నారు. పలుమార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. …

Read More »

మానస హైస్కూల్‌లో ఘనంగా హరితహారం

  ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోని మానస హైస్కూల్‌ ఆవరణలో బుధవారం హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డిఎస్‌పి ఆకుల రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా సిఐ సీతారాం, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, షేక్‌ యాకూబ్‌ హాజరై మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్‌పి మాట్లాడుతూ అమ్మ మనకు జన్మనిస్తే చెట్లు మనకు పూనర్‌జన్మనిస్తున్నాయని ఆయన అన్నారు. చెట్ల వల్ల మనం స్వచ్చమైన గాలిని, వాతావరణాన్ని …

Read More »