Breaking News

Banswada

పర్యాటకుల కోసం బోట్‌

బాన్సువాడ, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం బోట్‌ ఏర్పాటు చేశారు. కాగా నూతన బోట్‌ను ఆదివారం రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్‌ వెంట పలువురు తెరాస నాయకులు, ఆలయ అర్చకులు ఉన్నారు.

Read More »

సృజనాత్మకతకు పుస్తకాలు దోహదపడతాయి

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా సజనాత్మకతను, సామాజికాంశాలపై అవాగాహన పెంచుకునేందుకు ఇతర పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని జడ్‌పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ అన్నారు. బోధన్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో సోమవారం మౌలానా అబుల్‌ కలాం జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కాగా ప్రదర్శనను రజిత ఎల్లయ్య యాదవ్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ...

Read More »

గ్రంథాలయం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుళ్లబాద్‌ మండలం మైలారం గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని దేశాయిపెట్‌ పిఏసిఎస్‌ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌, నసురుళ్లబాద్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు మజిద్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »

కోటగిరిలో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ పట్టణ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ వైద్య బందం అంకం ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి ...

Read More »

శాసనసభ ప్రాంగణంలో ఎస్‌బిఐ

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నవీకరించిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ శాఖను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్‌ రావు, శాసనసభ్యులు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, ఎస్‌బిఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాష్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ...

Read More »

మీసేవా కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుళ్లబాద్‌ మండలం బొమ్మనదేవపల్లి గ్రామంలో ”దుర్గా ఆన్‌ లైన్‌ మీసేవ” కేంద్రాన్ని దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షులు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నసురుళ్లబాద్‌ ఎంపీపీ విట్టల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, లక్ష్మి నారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీ సేవ నిర్వాహకులు దుర్గాసింగ్‌ పాల్గొన్నారు.

Read More »

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధి లోని కల్కి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ అభివద్ధి పనులను దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సర్పంచ్‌లు శ్రావణ్‌, నారాయణ రెడ్డి, రఘు, నాయకులు వెంకట్‌ రాంరెడ్డి, ఎజాజ్‌, భాస్కర్‌, పాతబాలు, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశాయిపేట్‌ సొసైటీ పరిధిలోని సోమేశ్వర్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సోమేశ్వర్‌, సర్పంచ్‌ పద్మ మొగులయ్య, ఎంపీటీసీ రమణ, సర్పంచ్‌లు శ్రావణ్‌, నారాయణ రెడ్డి, నాయకులు వెంకట్‌ రాంరెడ్డి, ఎజాజ్‌, భాస్కర్‌, పాతబాలు, ప్రవీణ్‌ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మొగులయ్య, రాజిరెడ్డి ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Read More »

నిజాంసాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యం

బాన్సువాడ, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం దేశాయిపేట్‌, పోచారం గ్రామాలలో ”దేశాయిపేట్‌ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం” ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ...

Read More »

బాన్సువాడలో ప్రత్యేక కార్యాచరణ

బాన్సువాడ, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెత్త రహిత, రోగ రహిత బాన్సువాడ కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఎన్‌జివో కాలనీలో మురికి కాల్వలను, సిసి రోడ్లను పరిశీలించారు. మురికి కాలువలలో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలలో గ్రామ పంచాయితీ పాలక ...

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కెజివిపి కొత్తబాధి పాఠశాలను ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం కెజివిపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా పప్పులో పురుగులు ఉండడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ మూడు నెలల నుండి నిర్వహించడం లేదని, సరకులు నాసిరకంగా పురుగులు పట్టి ఉన్నాయని గమనించారు. విషయం డిఈఓకు ఫోన్‌లో వివరించారు. ఆమె వెంట తిర్మలాపూర్‌ సర్పంచ్‌ రఘు, మల్లారెడ్డి, సాయిలు, ఎంఈ ఓ తదితరులు ఉన్నారు.

Read More »

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హాన్మాజిపెట్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. వారి వెంట జెడ్పీటిసి పద్మ గోపాల్‌ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని రైతులెవరు అధైర్యపడవద్దని ఎంపిపి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మండల రైతు సమన్వయసమితి అధ్యక్షులు సంగ్రామ్‌ నాయక్‌, సర్పంచ్‌ సుభాష్‌, ఎంపీటీసీ ...

Read More »

ధ్వజస్తంభ పున: ప్రతిష్ట

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలోని రామాలయంలో ధ్వజ స్థంబ పునప్రతిష్ట కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఆలయంలోని పురాతన ధ్వజస్థంభం నేలకొరగడంతో నూతన ధ్వజస్తంబాన్ని పునప్రతిష్టించారు. ఆలయకమిటి ఆధ్వర్యంలో వేద పండితులు జపాల భాస్కర శర్మ హోమము జరిపించారు. కార్యక్రమంలో ఎంపిపి దొడ్ల నీరజ, వెంకట్‌ రాం రెడ్డి దంపతులు, గ్రామపెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More »

శాసనసభ సభ్యునిగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సైదిరెడ్డితో అసెంబ్లీ లోని తన చాంబర్‌లో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రులు మహముద్‌ మహ్మద్‌ ఆలీ, గుంతకండ్ల జగదీశ్వర్‌ రెడ్డి, ...

Read More »

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడ నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప దీక్ష స్వాముల బందానికి జండా ఊపి స్పీకర్‌ ప్రారంభించారు.

Read More »

బంగారు బాన్సువాడగా తీర్చిదిద్దుతాం

బాన్సువాడ, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎన్‌జివోస్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, సింధి గల్లీ, జెండా గల్లీ, బండ గల్లీలలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలను చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో ప్రస్తుతం నివసిస్తున్న జనాభా 40,000 అదేవిధంగా ప్రతిరోజూ బాన్సువాడ పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారు 20,000 మంది ...

Read More »

మొక్కలు నాటిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రీన్‌ చాలెంజ్‌లో బాగంగా శనివారం శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జె.సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ చాలెంజ్‌లో బాగంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మొక్కలను నాటి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన స్పీకర్‌ పోచారం అసెంబ్లీ ఆవరణలో ఆరు మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రీన్‌ చాలెంజ్‌కు కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ...

Read More »

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

బాన్సువాడ, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాదించిన విజయానికి ప్రతీక దీపావళి అని, మనసులోని అందకారం తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేది దీపావళి పండుగ అన్నారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని స్పీకర్‌ తెలియజేశారు. నరక చతుర్దశి, దీపావళి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్పీకర్‌ కోరారు.

Read More »

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో ”బాన్సువాడ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం” ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే 35 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ...

Read More »

స్వదేశానికి స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారిక విదేశీ పర్యటన ముగించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా స్పీకర్‌ ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరిగిన 64 వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌ నుండి బయలుదేరి వెళ్ళారు. అనంతరం యూరప్‌లో పర్యటించి లండన్‌ నుండి శనివారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వదేశానికి విచ్చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విమానాశ్రయంలో ...

Read More »