Breaking News

Banswada

సన్నాహక సమావేశానికి ముమ్మర ఏర్పాట్లు

బాన్సువాడ, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ చేపట్టిన సన్నాహాక సమావేశానికి జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్‌ వద్ద ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న బుధవారం నిర్వహించే సమావేశానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ విచ్చేయనుండడంతో స్థానిక నాయకులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మాగి వద్ద సభా స్థలిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ...

Read More »

తెలంగాణ తిరుమలలో భక్తుల సందడి

బీర్కూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో శనివారం సందర్భంగా తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలయకమిటి ఛైర్మెన్‌ మురళి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 16వ వరకు శ్రీవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఐదు రోజులు అంకురార్పణ, ధ్వజారోహణ, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ధర్మకర్త శంబురెడ్డి, శాసన సభ ...

Read More »

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన సురేశ్‌రెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తెరాస నాయకులు, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పోచారం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట చెన్నమనేని రమేశ్‌ తదితరులున్నారు.

Read More »

బాన్సువాడలో విజయశాంతి రోడ్‌షో

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయిన్‌ విజయశాంతి రోడ్‌షో నిర్వహించారు. హెలికాప్టర్‌లో ఆమె బాన్సువాడకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాసుల బాల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గంగాధర్‌, తదితరులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని కొత్తబాది నుంచి ఆమె రోడ్‌షో నిర్వహించారు. మధ్యాహ్నం బాన్సువాడ అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆమె మాట్లాడారు. దోచుకుంటున్న దొరల పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్‌ అభ్యర్తి బాల్‌రాజును గెలిపించాలని ఆమె కోరారు. ...

Read More »

నసురుల్లాబాద్‌లో భాస్కర్‌రెడ్డి ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో పోచారం తనయుడు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస హయాంలో పేదలు, వృద్దుల కొరకు ఎంతో కృషి జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పించన్‌ పెంచి వృద్దులు, వికలాంగులకు మేలు జరిగిందని తెలిపారు. నసురుల్లాబాద్‌ మండల ఏర్పాటుకు పోచారం ఎంతో కృషి చేశారని వివరించారు. ఈ ప్రాంత అభివృద్దికి ఆయన ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని, మరోసారి అత్యధిక మెజార్టీతో పోచారంను గెలిపించాలని ...

Read More »

తెరాసకు ఓటు వేసి గెలిపించండి

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందించిన పథకాలు పేదల సంక్షేమం కోసమేనని బాన్సువాడ తెరాస అభ్యర్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన వర్ని మండలం ఎసన్‌పురం, చందూరు, చందూరు తాండా, గోవూరు, మోస్రా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధవారం బాన్సువాడలో నిర్వహించిన సిఎం సభలో చందూరు, మోస్రా గ్రామాలను మండలాలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఈ హామీతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ...

Read More »

పోచారం విస్తృత ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అదికార పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన సుడిగాలి ప్రచారం కొనసాగించారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచార సభ విజయవంతం కావడంతో మంచి ఊపుమీద ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ని మండలం సత్యనారాయణ పురం, తగిలేపల్లి, నాయక్‌ తాండా, కోటగిరి మండలం కొడిచెర, హంగర్గ, కారేగాం, టాక్లీ, వల్లభాపూర్‌ తదితర గ్రామాల్లో ...

Read More »

స్థాయిని మరిచి అబద్దాలాడిన మోడి

బాన్సువాడ, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చి నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడి విద్యుత్తు విషయంలో తన స్థాయిని మరిచి అబద్దాలాడారని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విరుచుకుపడ్డారు. బుధవారం బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్‌ ప్రసంగించారు. బాన్సువాడ అంగడిబజార్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ...

Read More »

నసురుల్లాబాద్‌ మండలంలో మంత్రి ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తలెత్తుకొని తిరిగేలా తెరాస ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బాన్సువాడ తెరాస అబ్యర్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నసురుల్లాబాద్‌ మండలంలోని నసురుల్లాబాద్‌, మైలారం, లింగంపల్లి తాండా, ఫకీర్‌ నాయక్‌ తండా, బొప్పాస్‌పల్లి, బీర్కూర్‌, తిమ్మాపూర్‌ తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతుల క్షేమం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని, దీంతోపాటు రైతులకు రైతుబీమా పథకం కల్పించిందని వెల్లడించారు. పేదల ...

Read More »

సిఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈనెల 28న జరగనున్న ఆపద్దర్మ ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. స్థానిక నాయకులు, పోలీసు అధికారులతో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి బజార్‌ ప్రాంతంలో సభాస్థలిని పరిశీలించి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 28న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వినడానికి ప్రజలు ...

Read More »

వర్ని మండలంలో పోచారం ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం వర్ని మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని పాత వర్ని, రాజీపేట, ఫారం, శ్రీనగర్‌, శంకోర తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది, రైతు సంక్షేమం తెరాసతో సాధ్యమని మంత్రి వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి సాగుపెట్టుబడి రైతులకు జీవితబీమా సౌకర్యం కల్పించిందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ది, ...

Read More »

బాన్సువాడలో భాస్కర్‌రెడ్డి ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండ్రి తరఫున ఆయన పట్టణంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. పాత బాన్సువాడలోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్దితోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఇతర నాయకులు ...

Read More »

దుర్కిలో పోచారం ఎన్నికల ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని దుర్కి తదితర గ్రామాల్లో బుధవారం ఆపద్దర్మ మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలతోపాటు రైతు సంక్షేమానికి కెసిఆర్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పేర్కొన్నారు. ...

Read More »

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ మండలం దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. తన తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆయన బాన్సువాడ మండలంలో సోమవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతోపాటు మండలంలోని గుడ్మి గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల కోసం, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులున్నారు.

Read More »

నామినేషన్‌ దాఖలు చేసిన పోచారం

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద్దర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన స్థానిక సరస్వతి మందిరం, అయ్యప్ప ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. తనకు కలిసొచ్చిన సెంటిమెంట్‌గా ఉన్న అంబాసిడర్‌ కారులో ఆనవాయితీ ప్రకారం వెళ్లి నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్‌ అధికారి వెంకటేశం నామినేసన్‌ పత్రాలు అందించారు. స్థానిక నాయకులు ఆయనకు మద్దతు నిలువగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ...

Read More »

రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బాన్సువాడ, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు క్షేమంగా ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి బాగుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఎల్లయ్య చెరువు, వీక్లిమార్కెట్‌ ఆవరణలో బుధవారం రైతులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. రైతు కుటుంబాలు కన్నీరు కార్చకుండా ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి బాగుంటుందని ఆయన వెల్లడించారు. దీనికోసమే రైతులకు అవసరమైన పనిముట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ...

Read More »

స్థల పరిశీలన

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడలో జరగబోయే ట్రాక్టర్‌ మేళా కొరకు స్థానికంగా స్థల పరిశీలన చేశారు. అంగడిబజార్‌లోగల ఎల్లయ్య చెరువు వద్ద వేదిక నిర్మాణం కొరకు కామారెడ్డి జిల్లా డిఎవో నాగేందర్‌, ఎడిఎ చంద్రశేఖర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. వీరి వెంట బాన్సువాడ మునిసిపల్‌ కమీషనర్‌, ఏవోతో పాటు తెరాస పట్టణ కార్యదర్శి నార్ల ఉదయ్‌ ఉన్నారు.

Read More »

సిబ్బందికి తగిన వేతనాలు ఇవ్వాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు పద్దతిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి నిబంధనల ప్రకారం వేతనాలు అందించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో బాన్సువాడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం ఆసుపత్రి వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న సానిటేషన్‌, సెక్యురిటి సిబ్బందికి పండగలు, జాతీయ, ఆర్జిత సెలవులు అమలు చేయాలని తెలిపారు. సిబ్బంది పనిచేస్తున్న సదరు కాంట్రాక్టు సంస్థకు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఏఐటియుసి ...

Read More »

రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ-కామారెడ్డి ప్రధాన రహదారి విస్తరణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. మండలంలోని మండి సడక్‌ వద్ద అటవీప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక నాయకులను నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు. రూ. 12 కోట్లతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలు చేయాలని మంత్రి అన్నారు. నిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

ప్లాస్టిక్‌ నిరోధానికి కమీషనర్‌ చర్యలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై బాన్సువాడ మునిసిపల్‌ కమీషనర్‌ జి.గంగాధర్‌ చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా ఆయన పలు వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైన్స్‌, ఇడ్లిసెంటర్‌లు, హోటళ్లు, కూరగాయల విక్రయాలు, పాన్‌షాప్‌లు, కిరాణ దుకాణాలు, మటన్‌ వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్న ఆయా వ్యాపారస్తులపై జరిమానాలు విదిస్తున్నారు. దీంతోపాటు డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఆరుబయట చెత్త వేయకుండా ఉదయం ...

Read More »