Breaking News

Banswada

అభివృద్ధి ప్రభుత్వ నినాదం

  -మంత్రి పోచారం బాన్సువాడ, ఫిబ్రవరి 04: తెలంగాణ రాష్ట్ర అభివృద్దియే ప్రభుత్వ నినాదం అని, అందు కోసమే అహర్నిశలు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన బాలికల వసతిగృహం, పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల వసతిగృహ భవనాలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, సంక్షేమ రంగాలకు అదిక ఫ్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. సిఎం కె.చంద్రశేఖర్‌ రావు మేధావులతో చర్చించి పేద ప్రజల ...

Read More »

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి

  -డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన ...

Read More »

గల్ఫ్‌లో ఇబ్రహీంపేట్‌ వాసి మృతి

  బాన్సువాడ, జనవరి 12; బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్‌ గ్రామానికి చెందిన దేవారం సంజీవ్‌రెడ్డిని(31) గల్ప్‌లో ప్రమాదశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. దేవారం సంజీవ్‌రెడ్డి ఏడాది క్రితం సౌదీ అరెబియాలోని జిద్దా సమీపంలో అల్‌-ఖాదరి కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. కంపెనీ వాహనంలో పనికి వెళ్తుండగా బుధవారం ప్రమాదం జరిగి మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన సహచరుని ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. అక్కడ కంపెనీ ప్రతినిధులతో మరణవార్త ధ్రువీకరించుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ...

Read More »

కోర్టు ముందు యువతి ఆత్మహత్యాయత్నం… న్యాయం చేయాలని వినతి… విద్యార్థి సంఘం నేతపై ఆరోపణ

నిజామాబాద్‌ క్రైం, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ప్రేమ విఫలమైందన్న కారణంతో ఒ యువతి జిల్లా న్యాయ స్థానం సాక్షిగా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విద్యార్థి సంఘంలో కీలక కార్యకర్తగా పని చేస్తూ సంఘ నాయకుడిని ప్రేమించిననని, తనను కాదు అనడంతోనే ఈ సంఘటనకు పాల్పడినట్లు చెబుతుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామానికి చెందిన ఓ యువతి జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌కాలనీ నివాసం ఉంటూ డిగ్రీ తౄతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె ఓ విద్యార్థి సంఘంలో ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

    బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ ...

Read More »

జిల్లాలో ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం – వాణిజ్య పంటల వైపు అడుగులు

ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం -వాణిజ్య పంటల వైపు అడుగులు నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయరంగంలో అభివృద్ధి పథంలో కొనసాగేందుకు వనరులు వున్నా అనుకున్నంత మేరకు పురోగతి సాధించ లేకపోతుంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి నిజాంసాగర్‌, అలీసాగర్‌ ప్రాజక్టులతో పాటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొంత వరకు వుంది. అయితే గత దశాబ్దాలుగా నిజాంసాగర్‌, అలీసాగర్‌ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిలువ లేక జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి. ...

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

అదిగో చిరుత… ఇదిగో జాడ వృద్ధి చెందుతున్న సంతతి

బాన్సువాడ, డిసెంబర్‌,22 . అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కాదు ఇది నిఖార్సయిన నిజం. కాకతీయుల కాలం నాటీ కౌలాస్‌ కోటలో చిరుతలు సంచరిస్తున్న ఆనవాళ్ళు స్పష్టమవుతున్నాయి. జిల్లా తోపాటు పోరుగునే ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుంచి వలసవచ్చిన వాటిలో ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. బోధన్‌, కామారెడ్డి డివిజన్‌ల అటవీ క్షేత్రాల పరిధిలో దశాబ్దకాలంగా చిరుతల సంతతి వృద్ది చేందుతోంది. దట్టమైన అడవులు విస్తరించి ఉండటంతో పాటు జీవనీనికి అనువుగా మారుతోంది పోరుగునా మహరాష్ట్ర, కార్ణటక ప్రాంతాలు మొదలు ...

Read More »

మేట్రో పనులకు క్వారీ పరిశీలన

Hyd Metro Rail

బాన్సువాడ, డిసెంబరు 18; హైదరాబాద్‌లోని మేట్రో రైలు పనులకు అవరసమగు ఇసుక గురించి స్థానికంగా ఉన్న ఇసుక క్వారీలను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌, దామరంచ, బీర్కూర్‌, బర్గంగెడిగి, శివారుల్లోని ఇసుక క్వారీలను పరిశీలించారు. ఇసుక నాణ్యతతో పాటు స్థానికంగా ఎవైన సమస్యలు తలేత్తుతాయా అని ఆరా తీసారు. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖనిజ, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, భూగర్భ జల శాఖ అధికారులు ఉన్నారు.

Read More »

‘మహా’ఫార్మా సెజ్‌ కు చేదు గుళిక…. ఫార్మా పరిశ్రమలను ఆకర్శిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

బాన్సువాడ, డిసెంబరు 6. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం ఔత్సాహికుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ని’బంధ’నాలను పరళీరృతం చేస్తూ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఓ కరంగా ఎర్రతివాచి పరిచిందనే చెప్పాలి. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంతప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలోనే కారుండా అంర్జాతీయ స్థాయిలో ఔత్సాహికులను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వైపు దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే అన్ని వసతులను జాప్యం లేకుండా ఇచ్చేందుకు ఆయా శాఖల అధాకారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ...

Read More »

మంజీరమ్మకు సంకెళ్ళు ఎడారిగా గోదారి… ఉత్తర తెలంగాణకు నీటి కొరత… పొరుగు రాష్ట్రల జలదోపీడీ

(కె.పండరీనాథ్‌ – బాన్సువాడ) ——————- పొరుగు రాష్ట్రాల జల దాహానికి అంతులేకుండా పోతోంది. అక్రమ ప్రాజెక్టులను నిర్మించి మహారాష్ట్ర గోదావరి నీటిని బంధించి ఉత్తర తెలంగాణాను ఎడారిగా మారిస్తే మరోవైపు తామేమి తక్కువ కాదన్నట్లుగా కర్ణాటక రాష్ట్రం గోదావరి ఉప నది మంజీర ప్రవాహానికి అడ్డుకట్టలు కట్టి నీటిని ఒడిసి పడుతోంది. బ్యారేజీల పేరుతో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా అక్రమ ప్రాజెక్టులను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసుకుంటున్నాయి. మహా అక్రమ కట్టడాలపై మన వాళ్ళు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకపోగా కర్ణాటక నోరు ...

Read More »

ముంగీసల ప్రాణాలకు ముప్పు-వెంట్రుకల కోసం వేట

బాన్సువాడ, నవంబర్‌ 28, నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ఆధునిక హంగులు అడవుల్లోని వన్యప్రాణుల మనుగడకు ముప్పుగా మారాయు. భారీ భవంతులు, కార్పోరేట్‌ కార్యాలయాల్లోని గోడలను ఆధునీకరించడానికి అందమైన పెయింటింగులను విరివిగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు బ్యూటీపార్లర్‌ల సంస్కృతి గ్రామాలకు విస్తరించింది. ఈ రెండు పరిణామాలు పొలాల్లో తిరుగుతూ పాముల సంచారాన్ని నిరోధిస్తున్న ముంగీసల పాలిట ముప్పుగా మారుతున్నాయు. సర్పాలలాంటి విషప్రాణులను వేటాడే ముంగీసలు మనుషల చేతుల్లో హతమవుతున్నాయు. ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారాలు చేసే కొందరు ముంగిసల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. వాటిని వేటాడి వెంట్రుకలను ...

Read More »

బాన్సువాడ ప్రాతంలో సిద్ధమవుతున్న వరినారు.

బాన్సువాడ, 23. కరువు పరిస్ధితులను ఎదుర్కొని ఖరీఫ్‌ నుంచి గట్టెక్కిన రైతులు రబీ పంట సాగుకు సందిగ్ధత పడుతున్నారు. పాతాళానికి దిగజారి పైకి రానంటున్న భూగర్భ జలాలు, నీరు లేక వెలవెల బోతున్న నీటి వనరులు సాగుకు భరోసా ఇవ్వలేక పోతున్నాయు. మరో వైపు నిలకడలేక ఏడు గంటలు కరెంటు రైతులను ఏడిపిస్తోంది. బోధన్‌ ప్రాంతంలో ప్రధానంగా నీటి వనరులు ఆధారంగా పంటలు సాగవుతాయు. జిల్లా జీవన గర్ర నిజాంసాగర్‌ ఈయేడు నిండలేదు. సాగర్‌ ఆయకట్టును ఆదుకుంటుందని నిర్మంచిన సింగూర్‌ జంట నగరాల త్రాగునీటి ...

Read More »

బాధల చెరకు – మద్దతు ధర కరువు – కూలీల కొరత – యాజమన్యాల ఇష్టరాజ్యం

బాన్సువాడ, (పండిరినాథ్‌), నవంబర్‌18: ఆహారదాన్యలకు మద్దతూ ధర అందిస్తూ ఆపంటల సాగుదారుల మోములో ఆనందాన్ని నింపుతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు వాణిజ్యపంటలపై చిన్నచూపు చూస్తున్నాయి. యేడాది óకాలంగా కష్టించి పంటసాగుతో పదుగురికి తీపీ పంచుతున్న చెరకు రైతులు తాము చేదును చవిచూస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపుతుండగా పెరుగుతున్న సాగు ఖర్చులతో చెరకు రైతులు ఆర్ధికంగా కుదేలవుతున్నారు. పలు కారణాలతో ఇప్పటికే సాగు విస్తీర్ణము తగ్గుతుండగా ప్రస్తుత పరిస్థితులు దీన్ని మరింత దిగజారుస్తున్నాయి. బోధన్‌ డివిజన్‌ చెరకు సాగుకు అంతర్జాతీయ ఖ్యాతీ ఉంది. ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌ నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను తప్పదోవ ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు – మంత్రి పోచారం

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం  బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌  నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను  తప్పదోవ ...

Read More »