Breaking News

Banswada

నష్టపరిహారంపై నివేదిక

బాన్సువాడ, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండ్రోజుల క్రితం బాన్సువాడ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన పంటపై వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు నష్టపరిహారంపై నివేదిక తయారుచేశారు. ఈవో వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు పంటల పరిశీలన చేశారు. 600 ఎకరాల్లో మొక్కజొన్న, 90 ఎకరాల్లో ఇతర పంటలు నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. హనుమాజిపేట, చింతల నాగారం, తదితర ప్రాంతాల్లో వారు పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ...

Read More »

రెడ్డి సంఘం సమావేశానికి మంత్రికి ఆహ్వానం

బాన్సువాడ, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే రెడ్డి సంఘం సమావేశానికి ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లాలోని రెడ్డి సంఘం ప్రతినిధులు ఉన్నారు.

Read More »

‘డబుల్‌’ పేరిట అక్రమ ఇసుక దందా

– 14 ట్రాక్టర్లను సీజ్‌ చేసిన పోలీసులు – ఇసుక మాఫియాకు ముచ్చెమటలు – అక్రమ దందాపై డిఎస్పీ, ఆర్డీఓలు సీరియస్‌ బాన్సువాడ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాల పేరిట సాగుతున్న అక్రమ ఇసుక రవాణా దందాకు బాన్సువాడ పోలీసు అదికారులు చెక్‌పెట్టారు. దేశాయిపేట్‌ గ్రామంలో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణ పనుల కోసం దొడ్డిదారిన వేబిల్లులు పొంది ఇసుకను మాత్రం అక్కడ దిగుమతి చేయకుండా మరో ప్రాంతంలో ఇసుకను దిగుమతి చేయడాన్ని పోలీసులు కనుగొన్నారు. ...

Read More »

ఎండుతున్న పంట… రైతు కడుపు మంట

బాన్సువాడ, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టు కింద లేని వరిపంటల పరిస్థితి దయనీయంగా మారింది. బోరుబావుల నుండి నీటి చుక్కలు రాకపోవడంతో వాటిపై ఆధారపడి వేసుకున్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నీళ్ళు లేక పంటలు రాక రైతుల కడుపు మండిపోతుంది. బోర్లు ఎత్తిపోవడంతో రైతులు సాగునీటిని అందించే పరిస్థితి లేక పంట కోసేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జలాల్‌పూర్‌, లక్ష్మాపూర్‌, శంకోరా, రాజపేట శివారు ప్రాంతాల్లో వరిపంట దాదాపుగా ఎండిపోయింది. ఆ ప్రాంత రైతులు తీవ్ర ...

Read More »

దప్పిక వేదన

  – కనిపించని చెక్‌డ్యాంలు – నిరుపయోగంగా నీటి తొట్టెలు, ముందస్తు చర్యలేవి…? బాన్సువాడ, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భానుడు భగ్గుమంటుండడంతో భూమ్మీద జీవించే జీవరాశులు దాహంతో అలమటిస్తున్నాయి. దప్పిక తీర్చుకునే మార్గాలు లేక గొంతెండిపోయి విలపిస్తున్నాయి. వాటికి తాగేందుకు నీటి జాడలు కనిపించక జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గొంతు తడార్పుకోవాలన్న తపనే తప్ప వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న బెంగ కనిపించడం లేదు. వన్య ప్రాణుల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అటవీశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేయలేకపోయింది. ...

Read More »

శ్రీరామనవమికి ముస్తాబైన రామాలయం

  బాన్సువాడ, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని శ్రీరామాలయం అందంగా ముస్తాబైంది. ఆలయాన్ని నిర్మించి ఈ యేడాదితో 25 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు చూడముచ్చటగా అలంకరించారు. రామనవమిని పురస్కరించుకొని భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. నవమి ఉత్సవాలలో భాగంగా శ్రీరాములోరి జయంతి, సీతారాముల కళ్యాణోత్సవం, పట్టాభిషేకం కార్యక్రమాలు వైభవోపేతంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధ్యక్షుడు రమాకాంత్‌, నిర్వాహకులు లక్ష్మినారాయణ, మూర్తి, ఫాల్గుణ్‌లు తెలిపారు.

Read More »

పది పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

  బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని సిందూ విద్యాలయంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పర్యవేక్షించారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్‌ రాకతో అలర్ట్‌ కలెక్టర్‌ బాన్సువాడలో పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ ...

Read More »

అమరవీరులకు నివాళి

  బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ రాంనారాయణ్‌ ఖేడియా డిగ్రీ కళాశాలలో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. 1931 మార్చి 23న లాహోర్‌ కేంద్ర కర్మాగారంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసినందుకు గాను నిరసిస్తూ సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ రామసుబ్బారెడ్డి అన్నారు. అందులో భాగంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను మననం చేసుకున్నారు. కార్యక్రమంలో గంగాధర్‌, విఠల్‌, శ్రీనివాస్‌, యాదయ్య, దేవీదాస్‌, గిరిధర్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

క్యాన్సర్‌ వ్యాధిపై పరిశోధన

  బాన్సువాడ, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలపై చేపట్టాల్సిన కొత్త పద్దతులపై ఈనెల 21,22 తేదీల్లో పరిశోధనలు చేయనున్నట్టు రాంనారాయణ్‌ ఖేడియా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామసుబ్బారెడ్డి తెలిపారు. పరిశోధనలకు డిగ్రీ కళాశాల వేదికగా ఏర్పాటు చేశామని, దీనికి ముంబయి, ఫూణే, హైదరాబాద్‌ ప్రాంతాల నుండి ప్రముఖ పరిశోధకులు విచ్చేస్తున్నట్టు ఆయన వివరించారు. పరిశోధనలో భాగంగా చికిత్సపై విద్యార్థుల సమక్షంలో అవగాహన ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. పరిశోధన కర్తలైన డాక్టర్‌ శర్మ అవధూత్‌ బావరే, రీటా ...

Read More »

కళ్యాణలక్ష్మి సహాయం పెంపుపై హర్షం

  బాన్సువాడ, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద అందించే లబ్దిని పెంచుతున్నట్టు సిఎం కెసిఆర్‌ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమైంది. ప్రస్తుతం అందిస్తున్న రూ. 75,116 లను లక్షా 116లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న అంశాన్ని హర్షిస్తు మంగళవారం బాన్సువాడ పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయం ముందు సిఎం, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద పెండ్లిడు అమ్మాయిలకు ఈ పథకం వరంగా మారిందన్నారు. ...

Read More »

మీసేవా కేంద్రం ప్రారంభం

  బాన్సువాడ, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలో మీసేవా కేంద్రాన్ని ఆర్డీవో రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మీసేవా ద్వారా సేవలు ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం బాన్సువాడ మునిసిపాలిటి పరిధిలోని మురికి కాలువలను పరిశీలించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. అక్కడినుండి బాన్సువాడ శివారులో బలహీన వర్గాలకు నిర్మిస్తున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More »

22న మండల పూజ

  బాన్సువాడ, మార్చి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ హనుమాన్‌ దీక్షా మండల పడిపూజ ఈనెల 22న నిర్వహిస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సోమవారం దీక్షకు సంబంధించిన గోడప్రతులను దేశాయ్‌పేట్‌ సింగిల్‌విండో ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల ఆవరణలో పడిపూజ ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లోని హనుమాన్‌ దీక్షా స్వాములు అధిక సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు.

Read More »

అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీలను పూజించే దేశం మనదని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. పేదింటి యువతులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తు ...

Read More »

ఎస్‌ఆర్‌ఎన్‌కె కళాశాలలో మహిళా దినోత్సవం

  బాన్సువాడ, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కళాశాలలో గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌, ఎస్‌ఆర్‌ఎన్‌కె ఉమెన్‌ ఎంపవర్‌ డిపార్టుమెంట్‌ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ, డాక్టర్‌ సంగీత, నిజామాబాద్‌ కార్పొరేటర్‌ చాంగుబాయి, షీ టీం హెడ్‌కానిస్టేబుల్‌ భుజిబాయి, సిడిపివో అనురాధ, గిరిజ గాయత్రి, వాజిడ్నగర్‌ హెచ్‌ఎం దుర్గాబాయిలను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ మహిళా దినోత్సవ ...

Read More »

గోదాములు నిర్మించాలి

  బాన్సువాడ, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పరంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడలో ర్యాలీ నిర్వహించారు. గోదాముల నిర్మాణంతోపాటు హమాలీల సమస్యలు పరిష్కరించి వారికి సరైన వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు, ప్రతినిదులు హనుమాండ్లు, భూమయ్య, విఠల్‌ నాయక్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైతుల సందేహాలకు శాస్త్రవేత్తల సమాధానాలు

  బాన్సువాడ, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలు సందేహాలు నివృత్తి చేసేందుకు బుధవారం బాన్సువాడలో రైతులతో శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఏరువాక శాస్త్రవేత్త నవీన్‌కుమార్‌, రుద్రూర్‌ శాస్త్రవేత్త ప్రభాకర్‌రెడ్డిలు హాజరై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. పంటల సాగులో మెళకువలు, సలహాలు అందించారు. ప్రస్తుతం వరిపంటకు అగ్గితెగులు సోకుతుందని, దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్గితెగులు నుంచి పంటను రక్షించేందుకు రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని ...

Read More »

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  బాన్సువాడ, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ జన్మదిన వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే జన్మదిన వేడులు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎడపల్లి, నవీపేట, బోధన్‌కు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాసలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం వేదికపై ప్రజల, నాయకుల సమక్షంలో కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ...

Read More »

వినాయక మందిరానికి భూమిపూజ

  బాన్సువాడ, మార్చి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో వినాయక మందిర నిర్మాణానికి సోమవారం సర్పంచ్‌ వాణి విఠల్‌ భూమిపూజ నిర్వహించారు. పాత బాన్సువాడలో వినాయక మందిర నిర్మాణానికి ప్రజలతో పాటు కాలనీ వాసులు కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటీ కన్వీనర్‌ అంజిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More »

తెరాసలో చేరిక

  బాన్సువాడ, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కోనాపూర్‌కు చెందిన ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆదివారం చేరారు. బాన్సువాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆద్వర్యంలో తెరాసలో చేరారు. వీరికి మంత్రి గులాబి కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కోనాపూర్‌కు చెందిన తెరాస నాయకులతో పాటు మండల కన్వీనర్‌, తదితరులున్నారు.

Read More »

వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

  బాన్సువాడ, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికారు. మూడురోజుల పాటు బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తున్నారు. మంత్రి వెంట నాయకులు అంజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నార్ల సురేశ్‌, గంగాధర్‌ తదితరులున్నారు.

Read More »