Breaking News

Banswada

బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

  బాన్సువాడ, మార్చి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో ఆదివారం పంపిణీ చేశారు. వర్ని, బాన్సువాడ మండలం జక్కల్‌దాన్‌ తాండా, పాత బాన్సువాడకు చెందిన ముగ్గురికి చెక్కులు అందజేశారు. మంత్రి వెంట స్థానిక నాయకులు అంజిరెడ్డి, ఎంపిపి రేష్మా, ఎజాజ్‌, తదితరులున్నారు.

Read More »

తోపుడు బండ్ల ఆందోళన

  బాన్సువాడ, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో ప్రధాన రహదారి పక్కన ఉండే తోపుడు బండ్ల వ్యాపారులు శనివారం ఆందోళన చేపట్టారు. తమ బండ్లకు సంబందించి వ్యాపారాల ఏర్పాటుకు ఇతర వ్యాపారస్తులు అభ్యంతరం తెలపడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి బస్టాండ్‌ వద్ద తోపుడు బండ్ల వ్యాపారులు గత కొన్నేళ్ళుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చిరు వ్యాపారులకు స్థలం కేటాయించకపోవడం ఆందోళనకు దారితీసింది. కొందరు వ్యాపారస్తులు నాయకులను ఆశ్రయించగా బస్టాండ్‌ పక్కన ఉన్న ...

Read More »

జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

  బాన్సువాడ, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని సాయికీర్తి, భారతరత్న ప్రయివేటు కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటితోపాటు విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట స్థానిక సిబ్బంది ఉన్నారు.

Read More »

ఘనంగా మార్కండేయ జయంతి

  బాన్సువాడ, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో శనివారం మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పద్మశాలి సంఘంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. శనివారం ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి జంగం విజయ, నాయకులు గంగాధర్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు

  బాన్సువాడ, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది, సంక్షేమ పథకాలను సమాన దృస్టితో పేదల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిడ్డంగులు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

  బాన్సువాడ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాన్సువాడ ప్రాంతంలో శ్రీరామ ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడలోని చారిత్రక ప్రధానమైన రామాలయంలో పెద్ద ఎత్తుననవమి వేడుకలునిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హనుమాన్‌దీక్షా స్వాములు, భజరంగ్‌దళ్‌, ఇతర సంఘాల ఆద్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు విల్లంబులు, కత్తులు ధరించి నినాదాలు చేస్తు నృత్యాలు చేయడం అందరిని ఆకట్టుకుంది. రాముడు, హనుమంతుడు వేషధారణతో ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రధాన రామాలయంతోపాటు ...

Read More »

ఘనంగా శివరాత్రి

  బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. బాన్సువాడ ప్రాంతంలోని ప్రధాన శివాలయాలు భక్తులతో సందడి సంతరించుకున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాన్సువాడ మండలం బోర్లం, బీర్కూర్‌ మండలం సోమేశ్వర ఆలయం, పిట్లం మండలం రామేశ్వర ఆలయం, ఇదే ప్రాంతంలోని రాజరాజేశ్వర, బుగ్గ రామేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బాన్సువాడ ప్రాంతంతోపాటు సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక, మెదక్‌ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమేశ్వర ఆలయానికి ప్రత్యేక బస్సులు ఆర్టీసి ...

Read More »

బాన్సువాడలో స్పెషల్‌ డ్రైవ్‌

  బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, భవన పన్నుల వసూళ్ళపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆదాయం, అభివృద్ది ప్రజల నుంచి వచ్చే ఇంటిపన్ను, దుకాణాల పన్నులపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు సకాలంలో తమతమ బకాయి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు రమేశ్‌, రాము, దుర్గాప్రసాద్‌, అనిత, దత్తురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

పనిచేయని ఎటిఎంలు… ఇబ్బందుల్లో ప్రజలు..

  బాన్సువాడ, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రాంతంలో ఐదారు రోజులుగా ఎటిఎంలు మూతపడి ఉండడం ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో నగదు అందుబాటులోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎటిఎంల ద్వారా కొద్దో గొప్పో డబ్బు వస్తే వెసులుబాటుగా ఉండేది. కొన్ని రోజులుగా ఎటిఎంలు పనిచేయకపోవడం డబ్బుకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బ్యాంకుల ద్వారా డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి ప్రజలు బారులు తీరిఉండడం కనిపిస్తుంది. ఈ క్రమంలో డబ్బు అవసరమున్నవారికి అవస్థలు పడాల్సిన పరిస్తితి ...

Read More »

చలితో సాగుకు ఇబ్బంది…

బాన్సువాడ,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదారురోజులుగా చలి తీవ్రత పెరగడం ఖరీఫ్‌ సాగును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వరి సాగుచేసే రైతులకు ఇబ్బంది ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఇపుడు వరి నారుమళ్ళు వేస్తే సక్రమంగా మొలకెత్తలేని పరిస్తితి ఉంటుంది. దీంతో రైతులకు ఇబ్బంది ఎదురవుతుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు మేలు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. చలి తీవ్రత వల్ల గతంలో నారుమళ్ళకు ఇబ్బంది కలిగిన అనుభవాలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు ...

Read More »

హనుమాన్‌ మందిరంలో శిఖర ప్రతిష్ట

  బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో ప్రఖ్యాతి గాంచిన పెద్ద హనుమాన్‌ మందిరంలో బుధవారం 30వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు హనుమాన్‌ ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శిఖర ప్రతిష్ట, ధ్వజస్థంభ, దత్తాత్రేయ, నవగ్రహాలను ప్రతిష్టాపన చేయనున్నట్టు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాల్లో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామిజీ, మెదక్‌ జిల్లా తొగుట చిన్నస్వామి శ్రీగురు ...

Read More »

రైతులకు తప్పని ఇక్కట్లు…

  బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్ల కష్టాలు రైతులను ఇక్కట్లకు గురిచేస్తుంది. నోట్ల కొరత వల్ల రబీసాగును ప్రభావితం చేయగా ఖరీఫ్‌ పంటల విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కష్టాలకోర్చి ఖరీఫ్‌లో సాగుచేసిన పంటల దిగుబడులు ప్రస్తుతం చేతికందుతున్నాయి. వరి దాన్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను నిషేదించడం రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నరైతులు ఇళ్లవద్ద, పొలల వద్దనే ధాన్యం విక్రయిస్తారు. వీరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ...

Read More »

ధరలపై ప్రభావం…

  బాన్సువాడ, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్ల రద్దు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న జనానికి ధరల ప్రభావం శరాఘాతంగా మారింది. ముఖ్యంగా కూరగాయల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. చిల్లర నోట్ల కొరత వల్ల రవాణా స్థంభించడంతో కూరగాయల కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతుంది. నిన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 నుంచి ...

Read More »

రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు

  బాన్సువాడ, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం కొత్త జిల్లాలను అట్టహాసంగా ఏర్పాటు చేసినప్పటికి, సరైన రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. బాన్సువాడ డివిజన్‌ను ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో కలిపింది. ఇదివరకు నిజామాబాద్‌ జిల్లాలో ఉండగా ఈ ప్రాంత ప్రజలు తమ అవసరాల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లేవారు. ఇక్కడినుండి రవాణా సౌకర్యం ఉండడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం బాన్సువాడ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాలో కలిపారు. దీంతో బాన్సువాడతోపాటు బిచ్కుంద, ...

Read More »

విత్తనాల కోసం రైతు ఎదురుచూపు

  బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగట్లో అన్నీ ఉన్నా… అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. నీటి వనరుల్లో పుష్కలంగా నీరున్నా బోరుబావుల్లో నీరు ఎగిసి పడుతున్నా రైతులు సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీటి కొరత లేకున్నప్పటికి రబీ సాగు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆశించిన స్థాయిలో సాగు ముందుకు సాగడం లేదు. ఓవైపు విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ...

Read More »

జిల్లా కోసం కొనసాగుతున్న ఆందోళన

  బాన్సువాడ, అక్టోబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జిల్లా సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో పక్షం రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. బాన్సువాడ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రతిరోజు వివిధ పార్టీల నాయకులు, కులసంఘాలు రోజువారి వంతుల వారిగా దీక్ష చేస్తున్నారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు చేస్తే జుక్కల్‌, బాన్సువాడతో పాటు సంగారెడ్డి జిల్లాలోని కంగిటి, కల్లేరు మండలాలకు అనుకూలంగా ఉంటుందని దీక్ష చేపడుతున్న నాయకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు రోజుకో రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ...

Read More »

ధాన్యం దళారుల పాలు…

  బాన్సువాడ, అక్టోబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నమాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఖరీఫ్‌ దిగుబడులు చేతికందుతున్న తరుణంలో ధాన్యం కొనుగోలుకు దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విధిలేని పరిస్థితిలో రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకొని దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రతియేటా దళారుల మోసాలు వెలుగుచూస్తున్నప్పటికి ప్రభుత్వం రైతులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారినే ...

Read More »

ఘనంగా బతుకమ్మ

  బాన్సువాడ, అక్టోబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో బతుకమ్మ వేడుకలు జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం బాన్సువాడలోని చైతన్యకాలనీ, పాత బాన్సువాడ తదితర ప్రాంతాల్లో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పువ్వులు, కాగితపు బతుకమ్మలు తయారుచేసి పలుచోట్ల బొడ్డెమ్మలు ఆడారు. జాగృతి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆట ఆడారు. స్తానిక నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Read More »

ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  బాన్సువాడ, అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్‌లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ చోట్ల దేవి మండపాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. బాన్సువాడలోని విద్యాజ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్‌ శంభురెడ్డి దంపతులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆలయ నిర్మాణ కర్తల్లో ఒకరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి ఉత్సవాలు ...

Read More »

వాగులో కారు గల్లంతు

  – ప్రయాణీకుల ఆచూకి లభించలేదు బాన్సువాడ అక్టోబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం కారేగాం శివారులోని వాగులో శనివారం కారు గల్లంతైన సంఘటనలో ఐదుగురి ఆచూకి లేకుండాపోయింది. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తోంది. పిట్లం, కర్ణాటకల మధ్య రోడ్డు కీలకంగా ఉంటుంది. మెదక్‌జిల్లా కంగిటి మండలం తడకల్‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం స్వంత కారులో పిట్లంలోని ఆసుపత్రికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. జంగం రాజు అనే ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ...

Read More »