Breaking News

Banswada

సిఎం సహాయనిధికి రూ.1,00,116 విరాళం

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) కి రూ.1,00,116 (ల‌క్షా నూట పదహారు రూపాయలు) బాన్సువాడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్‌ స్టేషన్‌ (పేట్రోల్‌ పంప్‌) యజమాని, వీరసేవ లింగాయత్‌ జంగం జిల్లా గౌరవ అధ్యక్షుడు సిద్దలింగయ్య స్వామి విరాళంగా అందజేశారు. శనివారం బాన్సువాడ పట్టణంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి చెక్‌ అందజేశారు.

Read More »

విద్యార్థి సహయం అభినందనీయం…

బాన్సువాడ, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల‌ రోజులుగా కరోనా వైరస్‌తో పేద ప్రజలు పనులు లేక నిత్యావసర సరకులు కొనుక్కోలేని వారికి విద్యార్థి శ్రీయ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. తన కుటుంబీకులు ఇచ్చిన ప్యాకెట్‌ డబ్బుతో, తన కుటుంబ తల్లీ, తండ్రి శివ, రేణుక ప్రోత్సహంతో వర్ని మండలం ఎస్‌.యెన్‌.పురం గ్రామ పంచాయతి పారిశుద్య కార్మికుల‌కు, పేద 150 కుటుంబాల‌కు 9 రకాల‌ కూరగాయ‌లు, మాస్కులు పంపిణి చేశారు. కార్యక్రమానికి విద్యార్థి శ్రీయ ఆహ్వానం మేరకు స్తానిక ...

Read More »

బాన్సువాడలో సమర్థవంతమైన చర్యల‌తో కరోనా కట్టడి చేయగలిగాం

బాన్సువాడ, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణం, మోస్రా మండల‌ కేంద్రంలోని కరోనా క్వారంటైన్‌ ప్రాంతాల‌లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పర్యటించారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై క్వారంటైన్‌లో ఉన్న వారితో పాటుగా, కరోనా పాజిటివ్‌తో చికిత్స తీసుకుని గాంధీ హాస్పిటల్‌ నుండి ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఇంటి దగ్గర ఉన్న వారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాల‌నీ, అరాఫత్ కాల‌నీ, మదీనా కాల‌నీ, మిస్రీ గల్లీ, ...

Read More »

వల‌స కార్మికుల‌కు ల‌యన్స్‌ క్లబ్‌ అన్నదానం

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ల‌యన్స్‌ క్లబ్‌ రామాయంపేట స్నేహ బందు ఆద్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారి మీద కాలినడకన సొంత ఊర్లకు వెలుతున్న 150 మంది వల‌స కార్మికుల‌కు అన్న దానం చేశారు. ల‌యన్‌ కే శ్రీనివాసరావు జోన్‌ చైర్మన్‌, ల‌యన్‌ బి.గురవయ్య జిల్లా చైర్మన్‌, ల‌యన్‌ ఎం దీప్‌ చందు కోశాధికారి ఆర్థిక సహకారంతో అన్నదానం చేశారు. ల‌యన్‌ వి. దామోదర్‌ రావు అధ్యక్షుడు, ల‌యన్‌ ఐ. రవీందర్‌ గౌడ్‌, ఎం ...

Read More »

ఆల‌య పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలోని తెలంగాణ తిరుమల‌ దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల‌ను శుక్రవారం శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

Read More »

వ్యవసాయ ఉత్పత్తుల‌ కొనుగోలుకు రూ. 30 వేల‌ కోట్లు

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రం, కోటగిరి మండలంలోని పోతంగల్‌, కోటగిరి, రాయకూర్‌ గ్రామాల‌లో సన్‌ ఫ్లవర్‌ గింజల‌ కొనుగోలు కేంద్రాల‌ను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. స్పీకర్‌ వెంట ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఉన్నారు. వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘాల‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల‌లో ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల‌ నుండి నేరుగా సన్‌ ఫ్లవర్‌ ...

Read More »

లాక్‌ డౌన్‌ పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ప్రజల‌ కష్టసుఖాల‌ను తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధుల‌తో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాల‌నీలో స్పీకర్‌ పర్యటించారు.   ఈ సందర్భంగా కాల‌నీలో స్పీకర్‌ మాట్లాడుతూ సమర్ధవంతమైన చర్యల‌తో ...

Read More »

బాన్సువాడలో 4 బైక్‌లు సీజ్‌

బాన్సువాడ, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలోని క్వారంటీన్‌ హాట్‌ స్పాట్‌ టీచర్స్ కాల‌నీ, మదీనకాల‌ని, తాడుకోల్‌ చౌరస్తా, అంబెడ్కర్‌ చౌరస్తా, పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తాలో డిఎస్పి దామోదర్‌ రెడ్డి పర్యటించి కాల‌నీ వాసులు ఎవరు ఇళ్లు విడిచి బయటకు రావద్దని, ప్రభుత్వ సూచనలు పాటించి సహకరించాల‌ని ప్రజల‌కు విజ్ఞప్తి చేసారు. రోడ్డుపై బైకుమీద ఇద్దరూ, ముగ్గురు ప్రయాణించడంతో వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 బైకుల‌ను సీజ్‌ చేశారు. సిఐలు మహేష్‌, టాటా బాబు, ...

Read More »

గృహ నిర్బంధంలో లేకపోతే డిఎస్‌పికి తెలపాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అన్ని వర్గాల‌ ప్రజలు సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బాన్సువాడ ఎంపీడీవో కార్యాల‌యంలో శనివారం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల‌, రాష్ట్రాల‌, జిల్లాల‌ నుంచి వచ్చిన వ్యక్తుల‌ను గృహనిర్బంధంలో ఏప్రిల్‌ 28 వరకు ఉంచాల‌ని సూచించారు. వైద్య సిబ్బంది ప్రతినిత్యం ఇంటింటా పర్యవేక్షణ చేయాల‌ని కోరారు. గృహనిర్బంధంలో ఇతర దేశాల‌ నుంచి వచ్చిన వ్యక్తులు లేకపోతే వారి సమాచారం ఆర్‌డిఓ, డిఎస్‌పికి తెలియజేయాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలో కరోనా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. బాన్సువాడ ఆర్‌డివో కార్యాల‌యంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూట కాల‌నీలో పర్యటించాల‌ని సూచించారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, సంచార వాహనాల‌ ద్వారా ప్రజల‌కు అందే విధంగా చూడాల‌ని కోరారు. ఇతర రాష్ట్రాల‌ నుంచి దేశాల‌నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండేవిధంగా అధికారులు చూడాల‌ని పేర్కొన్నారు. ...

Read More »

పోచారం ట్రస్టు ద్వారా 25 కిలోల‌ ఉచిత బియ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో తెల్ల‌ రేషన్‌ కార్డు లేని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం అందని పేదల‌ను గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల‌ దేవస్థానం వద్ద స్పీకర్‌ పోచారం పేదల‌కు బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

Read More »

పోచారం ట్రస్టు ద్వారా ఉచిత బియ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిదిలోని పేదవారు ఒక్కరూ కూడా అన్నం లేక ఆకలితో బాదపడకూడదని, తెల్ల‌ రేషన్‌ కార్డు లేని పేదల‌ను గుర్తించి పోచారం ట్రస్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి 25 కిలోల‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో బుధవారం స్పీకర్‌ విలేకరుల‌తో మాట్లాడారు. పనులు లేక పేదలు, కూలీలు కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ...

Read More »

ఘనంగా జననేత పుట్టినరోజు సంబరాలు

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకల్లో టి.ఆర్‌.ఎస్‌ యువనాయకుడు దేశాయిపేట్‌ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. టి.ఆర్‌.ఎస్‌ పార్టీ కార్యాల‌యంలో స్థానిక నాయకుల‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటి రోగుల‌కు పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో, బీడీ కార్మికుల కాల‌నీలో మొక్కలు నాటి నీరుపోశారు. తరువాత బాన్సువాడ పట్టణంలో రిల‌యన్స్‌ ట్రెండ్‌ ...

Read More »

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శనివారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 5గంటలకు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి గహప్రవేశం నిర్వహించారు. అనంతరం తన సతీమణి పుష్పతో కలసి నూతన గ హంలో పాలు పొంగించి గణపతిపూజ, వాస్తు పూజ, హోమం, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం అధికారులతో కలసి అధికారికంగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని స్పీకర్‌ పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ...

Read More »

మునిసిపాలిటి అధ్యక్ష, ఉపాధ్యక్షులకు సన్మానం

బాన్సువాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులు జంగం గంగాధర్‌, షేక్‌ జుబేర్‌ను బాన్సువాడ మండల సర్పంచ్‌ ల ఫోరమ్‌ తరపున సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మండల సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షుడు నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Read More »

బాసరకు పాదయాత్ర

బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సరస్వతి మాల ధారణ స్వాముల బాసర పాద యాత్రను సరస్వతి ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి మంగళవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. మాల ధారణ స్వాములతో పాటు బాన్సువాడ ఎంపీపీ నీరజ రెడ్డి కూడా స్వాములతో పాదయాత్రలో పాల్గొంటూ బాసర వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి వరకు బోధన్‌ చేరుకొని అక్కడ రాత్రి బసచేసి బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం వరకు బాసర చేరుకుంటామని ...

Read More »

అయ్యప్ప స్వామికి 25 తులాల వెండి కిరీటం

బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారికి కిరీటం నిమిత్తం బాన్సువాడ పట్టణానికి చెందిన కొత్త నారాయణ దంపతులు 25 తులాల వెండిని అయ్యప్ప సేవా సమితికి అందజేశారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధి గురువినయ్‌ కుమార్‌, ఆలయ కోశాధికారి ధనగారి కష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

జోరుగా ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జీ బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. తెరాస ప్రభుత్వం వచ్చాక బాన్సువాడ పట్టణంలో కనీవినీ ఎరగనంత పెద్దఎత్తున అభివద్ధి జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింతగా అభివద్ధి జరగడానికి తెరాస ...

Read More »

ఎల్లారెడ్డి మునిసిపాలిటీపై తెరాస విజయకేతనం ఎగురవేస్తుంది

బాన్సువాడ, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌, ఎమ్మెల్యే జాజల సురేందర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు, తెరాస కార్యకర్తలతో కలిసి ఎల్లారెడ్డి పట్టణం లో ఇంటింటా మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోని అన్ని వార్డులు తెరాస గెలుచుకుని ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై విజయ కేతనం ఎగరువేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎంపి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

పోచారం భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14,15,16,17వ వార్డులలో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ వార్డ్‌లలో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని భాస్కర్‌ రెడ్డి కోరారు. ఆయన వెంట జంగం గంగాధర్‌, నందు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »