Breaking News

Bheemghal

వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తి సిద్ధం

భీమ్‌గ‌ల్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటించారు. ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడీ చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నింపడానికి ఫీడర్ చానల్ లో కొంత భాగము పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉండటంతో పైప్ లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ...

Read More »

భీమ్‌గల్‌ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపల్‌ కేంద్రంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల‌కు మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయిన పనులు త్వరగా పూర్తి చేయాల‌ని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి అధికారిక నివాసంలో భీంగల్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మల్లెల‌ రాజశ్రీ ల‌క్ష్మణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, ఏ.ఈ రఘుతో పట్టణ అభివృద్ధి పనుల‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...

Read More »

మంత్రి కెటిఆర్‌ వల్లే ఇంత అభివృద్ధి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల‌ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. గురువారం జాగిర్యాల్‌ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన భవనం ప్రారంభోత్సవం, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యంలో కొత్త జెసిబి నడిపి ప్రారంభించారు. లింబాద్రి గుట్ట డబుల్‌ బిటి రోడ్డు ప్రారంభం, బాచన్‌ పల్లి వీడీసీ భవనం ప్రారంభం, ముచ్కూర్‌లో నూతన జిపి భవనం, పిహెచ్‌సి ...

Read More »

విశ్వబ్రాహ్మణ సంఘం మండల‌, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలోని శివగల్లీలో విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో శనివారం భీమ్‌గల్‌ మండలానికి చెందిన విశ్వబ్రాహ్మణులు అందరు కూడా తమ ఐక్యత చాటడం కోసం శనివారం తమ విశ్వబ్రాహ్మణ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ఉదయం 8:30 గంటల‌ నుండి సాయంత్రం నాలుగు గంటల‌ వరకు కొనసాగింది. ఇందులో భీమ్‌గల్‌ మరియు బింగల్‌ మండలం క్రింద ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొన్నారు.

Read More »

అయ్యప్పస్వామికి విశేష పూజలు

భీమ్‌గల్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ శ్రీ అయ్యప్పస్వామి మందిరంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త శ్రీ అయ్యప్ప స్వామి పుట్టిన రోజు 28వ తేదీ ఆదివారం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల‌కు స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడతాయని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు. కావున భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల‌రని కోరారు.

Read More »

లింబాద్రిలో భక్తుల‌ రద్దీ

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల‌ క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల‌ తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల‌కు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...

Read More »

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బారుకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం దరఖాస్తు దారుల‌ సమక్షంలో ప్రగతిభవన్‌ కలెక్టరేట్‌లో డ్రా తీశారు. ఇందులో బద్దం రాకేశ్‌ విజేతగా నిలిచి బార్‌ దక్కించుకున్నారు. మిగిలిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌ మునిసిపాలిటి, ఆర్మూర్‌ మునిసిపాలిటీలో నోటీఫై చేయబడిన కొత్త బార్లకు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల‌ ప్రకారం తర్వాత డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్‌ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్‌ ...

Read More »

భక్తుల‌తో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల‌ క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల‌ నుండి దర్శనాల‌ రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల‌ తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తుల‌కు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...

Read More »

చాలా రోజుల తర్వాత స్వామి వారి దర్శనం

భీమ్‌గల్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబచాల క్షేత్రం 10 వతేదీ శనివారం ఉదయం 9 గంటలకి పున: ప్రారంభం అయింది. చాలా రోజుల తర్వాత దేవస్థానం తెరుచుకోవటంతో భక్తుల తాకిడి పేరుగనుంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 9 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు సానిటైజర్‌ మరియు సామాజిక ...

Read More »

భక్తుల‌కు గమనిక…

భీమ్‌గల్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింబాద్రి గుట్ట పైన శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవాల‌యము కేవల‌ము 10 నుండి 65 సంవత్సరముల‌ మధ్య వయసు కల‌ భక్తుల‌ దర్శనాల‌కై మాత్రమే అనుమతించబడినట్లు దేవాదాయ శాఖ సహాయ కమీషనర్‌ సోమయ్య పేర్కొన్నారు. వేరే ఎటువంటి కార్యక్రమమునకు, వంటలు భోజనాల‌కు అనుమతి లేదని, అతిక్రమించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని వివరించారు.

Read More »

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత

భీమ్‌గల్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ల‌క్ష్మీనరసింహ వైన్స్‌ యజమాని రాకేష్‌ చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌ తన సిబ్బందితో వైన్స్‌ యజమాని ఇంటిపై దాడి చేశారు. 24 ఎంసి మద్యం సీసాలు 375 ఎంఎల్ కల‌వి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే అమ్ముడుపోయిన మద్యానికి సంబంధించిన డబ్బు 5 ల‌క్షల‌ 50 వేల‌ రూపాయల‌ నగదు కూడా స్వాధీనం చేసుకొని భీంగల్‌ ...

Read More »

లింబాద్రి నర్సింహస్వామి దేవస్థానం తరఫున ఆహార వితరణ

భీమ్‌గల్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా 350 మంది యాచకుల‌కు, పేదవారికి శనివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More »

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాతల‌ కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు 350 మంది యాచకుల‌కు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేశామన్నారు.

Read More »

శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా సోమవారం 350 మంది యాచకుల‌కు, పేదవారికి మధ్యాహ్న భోజన వితరణ చేశారు. అంతే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More »

లింబాద్రి నృసింహస్వామి ఆల‌యం తరఫున భోజనం వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా, 300 మంది యాచకుల‌కు, పేదవారికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున ఆదివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో 650 మందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేపట్టారు. కార్యక్రమంలో ఆల‌య ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

650 మందికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భోజన వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌కనుగుణంగా, భీంగల్‌ మున్సిపల్‌ కార్యాల‌యం వారు నిర్వహించిన ‘‘అన్నదాత’’ కార్యక్రమానికి 300 మంది యాచకుల‌కు, పేదవారికి శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో 650 మందికి మధ్యాహ్న భోజన సరఫరా నిర్వహించినట్టు ఆల‌య ప్రతినిధులు ...

Read More »

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి ఆశీర్వాదముచే, శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరుపున లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు ఆల‌యం తరఫున ఆహార పంపిణీ చేస్తున్నట్టు ఆల‌య ప్రతినిధులు తెలిపారు. భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు జాగిర్యాల్‌, రామన్నపేట్‌, పురాణిపేట్‌, బెజ్జోర గ్రామాల‌కు దేవస్థానం నుండి మధ్యాహ్న ...

Read More »

శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్ధానం తరఫున భోజనం పంపిణీ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగత్‌ గురువులైనటువంటి శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ తీర్థ శ్రీపాదుల‌వారి మంత్రాక్షతల‌ ఆశీర్వాదముతో శ్రీనింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్ధానం తరఫున కరోనా బాధితుల‌కు, సేవకుల‌కు భోజనం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదల‌కు, విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి, కరోనాతో పోరాడుతున్న వివిధ శాఖల‌కు గురువారం అన్నదానం చేశారు. భీంగల్‌ పరిసర ప్రాంతాల‌తో పాటు ...

Read More »

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ఆశీర్వాదంతో, శ్రీ ఉత్తరాది మఠానికి చెందిన ప్రతినిధులు రెండ్రోజుల‌ నుండి లాక్‌ డౌన్‌ బాధితుల‌కు ఆహార పంపిణీ (పులిహోరా) చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం వైద్య సిబ్బంది, రెవెన్యూ, మునిసిపల్‌ సిబ్బందికి లింబాద్రి ల‌క్ష్మీ నరసింహ స్వామి ఆల‌యం తరపున 125 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో భాగంగా సామాజిక దూరం పాటిస్తు తమ వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ 300 ...

Read More »

భీమ్‌గల్‌ అభివృద్ది కోసం ఓటు వేయాలి

భీమ్‌గల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 1,2,8,10 వార్డుల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అనంగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలన్నారు. కేసీఆర్‌ కోసం, తన కోసం జరుగుతున్న ఎన్నికలు కావని భీంగల్‌ మున్సిపాలిటీ అభివద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. భీంగల్‌ పట్టణంలో ఇంటింటికి ...

Read More »