Breaking News

Birkoor

తెరాసలో పలువురి చేరిక

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం మండలంలోని పలు అభివృద్ది పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మల్లెల …

Read More »

ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆద్వర్యంలో దాతల విరాళాలతో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైలపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బీర్కూర్‌లో నార్ల భరత్‌రాజ్‌ విగ్రహదాతగా హనుమాన్‌ ఆలయ కమిటీలో దుర్గామాతను ఏర్పాటు చేశారు. మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఆలయం వరకు అమ్మవారిని ఘనంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. గురుస్వామి రత్నకంటి ప్రకాశ్‌ ఆద్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత …

Read More »

జోనల్‌ స్థాయి క్రీడాకారుల ఎంపిక

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అండర్‌-14, 17 బాలురు, బాలికల కబడ్డి, ఖోఖో ఎంపిక జడ్పిహెచ్‌ఎస్‌ మద్నూర్‌లో ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఉంటుందని ఎంఇవో రాములు తెలిపారు. జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల ఆసక్తిగల అర్హులైన క్రీడాకారులు ఎంపికకు హాజరుకావాలని సూచించారు. పిడి రాజాగౌడ్‌, పిడి సాయిలులకు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. Email this page

Read More »

18 నుంచి బతుకమ్మ చీరల పంపినీ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర మహిళలకు నజరానాగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఈనెల 18వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు గ్రామ సర్పంచ్‌ నర్సయ్య తెలిపారు. ఈనెల 18 నుంచి గ్రామంలోగల చౌకధరల దుకాణంలో చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన యువతుల నుంచి అన్ని వర్గాల వారికి పంపిణీ చేస్తామని, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు పేరు నమోదై ఉండాలన్నారు. 18, 19, 20 మూడురోజుల …

Read More »

ప్రజాకవి కాళోజీ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో శనివారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, మండల అభివృద్ది కార్యాలయంలో భరత్‌కుమార్‌, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాళోజీ జీవితం గురించి, భాష గురించి వక్తలు మాట్లాడారు. కాళోజీ రచనలు, తెలంగాణ ఉద్యమంలో కాళోజీ పాత్ర గురించి వివరించారు. Email this …

Read More »

వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల విరాళంతో నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం స్వామివారికి ప్రీతిరోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు ఏర్పాటు చేశారు. అన్నదాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. Email this page

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ వారి ఆద్వర్యంలో మంగళవారం బీర్కూర్‌ గ్రామాలలో 54 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9 మందికి మోతి బిందు ఉన్నట్టు గుర్తించి వారిని ఆపరేషన్‌ నిమిత్తం బోధన్‌ లయన్స్‌ ఆసుపత్రికి తరలించినట్టు క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. Email this page

Read More »

బీర్కూర్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తపస్‌ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘనంగా సన్మానించారు. సన్మానం పొందినవారిలో రమేశ్‌, టి.శంకరయ్య, ఏ.గంగరాజు, పద్మ, రంగమ్మ ఉన్నారు. ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించినట్టు తపస్‌ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌, జిల్లా కార్యదర్శి రవింద్రనాథ్‌ ఆర్య, వెంకట్రావు, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

నేడు తపస్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తపస్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుందని సంఘం ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. మాజీరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నట్టుతెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభివృద్దికి కృసి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్టు తెలిపారు. వారిలో ముత్యాల రమేశ్‌, అయిత్‌వార్‌ గంగరాజు, తంజాల శంకరయ్యగౌడ్‌, గాడెరంగడి పద్మ, రాయ రంగమ్మ ఉపాధ్యాయులను సన్మానించనున్నట్టు తెలిపారు. Email …

Read More »

ఈతవనాల పెంపకంతో గౌడకులస్తుల అభివృద్ది

  బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈతవనాలు నాటి పెంచడంతో గౌడ కులస్తులు అభివృద్ది చెందుతారని మీర్జాపూర్‌ గౌండ్ల సంఘం అధ్యక్షుడు గంగరాజుగౌడ్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో మంగళవారం ఈతవనాల మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడకులస్తులు అందరు ఏకం కావాలని పేర్కొన్నారు. గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. Email this page

Read More »