Breaking News

Bodhan

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత …

Read More »

బోధన్ ఆర్డీవోగా సుధాకర్‌రెడ్డి

బోధన్: బోధన్ ఆర్డీవోగా 23 నెలలపాటు సేవలను అందించిన జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. బదిలీలకు సంబంధించిన ఆదేశాలను ఇద్దరు ఆర్డీవోలు అందుకున్నారు. ఫోన్‌ద్వారా సమాచారం అందుకున్న ఆదిలాబాద్ ఆర్డీవో బోధన్‌లో జాయిన్ అయ్యేందుకు సోమవారం ఉదయం వస్తున్నారు. సోమవారం శ్యామ్‌ప్రసాద్‌లాల్ రిలీల్ అయ్యి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. శ్యామ్‌ప్రసాద్‌లాల్ రెండేళ్ల పాటు బోధన్ ఆర్డీవోగా సేవలను అందించి ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రశంసలను అందుకున్నారు. …

Read More »

అధర్మ కాంటాల హవా..!

బోధన్ : రెండు రాష్ర్టాల సరిహద్దులోని సాలూర చెక్‌పోస్టులో వేబ్రిడ్జి పనిచేయకపోవడంతో సరుకుల రవాణాలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. లారీలు, ఇతర వాహనాల్లో ఓవర్‌లోడ్‌ను అరికట్టాలన్నా, వేబిల్లులో పేర్కొన్న సరుకుల పరిమాణంపై అనుమానాలు వచ్చినా ధర్మకాంటాలో తూకం వేయించాలి. తూకం వేయనిదే ఓవర్‌లోడ్, సరుకుల పరిమాణాలను అంచనా వేయడం కష్టం. రవాణా, వాణిజ్యపన్నుల శాఖల చెక్‌పోస్ట్‌ల్లో సరుకుల బరువుల నిర్ధారణకు ప్రాధాన్యత ఉంటుంది. బోధన్ మండలం సాలూర గ్రామం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో సరుకుల బరువులను తూయటానికి ధర్మకాంటాను ఏర్పాటు చేశారు. 1986లో ఈ …

Read More »

కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి

  బోదన్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం బోధన్‌ పట్టణంలో హరితహారం, జాతీయ ఉపాది హామీ పథకంపై డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది హరితహారం కార్యక్రమం వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, …

Read More »

సౌరశక్తితో నడిచే స్కూటర్ తయారీ

విజ్ఞాన్ ఇంజినీరింగ్ ఈఈఈ విద్యార్థుల ప్రతిభ భూదాన్ పోచంపల్లి : మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈఈఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా సౌరశక్తితో నడిచే స్కూటర్‌ను రూపొందించారు. ఈ వాహనం ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 50కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. దీని గరిష్ట వేగం 40 కేఎంపీహెచ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వాహనం వల్ల గాలి, శబ్ద కాలుష్యం ఉందడని, ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు. ఈ వాహనాన్ని తయారు చేసిన విద్యార్థులు, …

Read More »

చేపల మార్కెట్‌లో సందడి

బోధన్‌: మృగశిరకార్తే రోజు చేపలు తినాలనే సంప్రదాయం నేపథ్యంలో మంగళవారం బోధన్‌ చేపల మార్కెట్‌లో కొనుగోలుదారుల కోలాహలం కనబడింది. ఉదయం 10 గంటల నుంచి అమ్మకాలు కొనసాగాయి. ఆచన్‌పల్లి బైపాస్‌, సాత్‌పూల్‌, వారాంతపు సంత, శక్కర్‌నగర్‌లో ప్రజలు చేపల కొనుగోలుకు ఎగబడ్డారు. మంగళవారం పట్టణంలో వ్యాపారులు వారాంతపు సెలవు పాటిస్తారు. దుకాణాలు మూసి ఉండగా చేపల మార్కెట్‌ వద్ద ద్విచక్రవాహనాలు కిక్కిరిసి కనబడ్డాయి. ఒక్క రోజు సుమారు వెయ్యి కిలోల (టన్ను) చేపల అమ్మకాలు జరిగినట్టు అంచనా. రూ. 3 లక్షల విలువ చేపలను …

Read More »

ప్రజా ధనానికి లెక్కేది!

బోధన్‌ పట్టణం : మున్సిపల్‌ కమిషనర్లు దయ చేసి అడ్వాన్సుల విధానానికి స్వస్తి పలకాలి. అత్యవసరమైతే తప్పితే అడ్వాన్సుల జోలికి వెళ్లొద్దు. ఇదీ పురపాలక శాఖలో ఉన్నతాధికారులు తరచూ కమిషనర్లకు చెప్పే హితవు. ఇందుకు ఒక కారణం ఉంది. అడ్వాన్సుల పేరిట నిధుల దుర్వినియోగానికి ఆస్కారమెక్కువని పలు సందర్భాల్లో రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో వెలుగు చూసిన అవతవకలు ఒక కారణం. పైగా ఉద్యోగులకు సైతం అడ్వాన్సుల విధానంతో చిక్కులు తప్పవన్నది మరో కారణం. బోధన్‌ మున్సిపాలిటీలో మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది …

Read More »

మైదానంలా బెల్లాల్‌ చెరువు

చరిత్రలో ఎండిపోని చెరువుగా పేరుగాంచిన బోధన్‌ మండలం బెల్లాల్‌లోని బెల్లాల్‌ చెరువు కొత్త చరిత్రను సృష్టించుకుంది. ఆ పుణ్యం ఎవరు కట్టుకున్నా ఇప్పటి వరకు ఉన్న రికార్డు కాస్తా చెరిగిపోయింది. మైదానాన్ని తలపిస్తున్న బెల్లాల్‌ చెరువు పుర ప్రజల దాహార్తిని తీర్చలేనని చేతులెత్తేసింది. పురపాలక సంఘం యంత్రాంగం ఎంత భగీరథ ప్రయత్నాలు సాగించినా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరకు బురదనీటిని సైతం పిండుకుందామని చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా లేకుండా పోయాయి. చెరువులోని 2 అడుగుల మట్టం వద్ద నిల్వ ఉన్న సుమారు 20 ఎంసీఎఫ్‌టీ …

Read More »

బోధన్‌లో మన కుటుంబం

బోధన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్‌ఎస్‌సీ విద్యార్థ్ధులకు వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రత్యేక తరగతుల సందర్భంగా వారికి అ ల్పాహారం అందించే గోరు ముద్ద కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్ అవతరణ దినోత్సవం సందర్భం గా మన కుటుంబం పేరిట మరో వినూ త్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనాథ పిల్లలకు భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని ఎస్‌ఎస్‌సీ వరకు చదివించటమే లక్ష్యంగా వారిని ప్రైవేట్ పాఠశాలల యజమానులకు దత్తత ఇవ్వడం పథకం ఉద్దేశం. గురువారం రెవెన్యూ డివిజనల్ …

Read More »

చక్కెర కార్మికుల భిక్షాటన

బోధన్‌: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో కలలతో తాము భాగస్వామ్యం తీసుకోగా, పాలకులు ఉద్యోగాలు తొలగించి తమను భిచ్చగాళ్లను చేశారని నిజాం చక్కెర మిల్లు కార్మికులు నిరసన తెలిపారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో వారు పరిశ్రమ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు భిక్షాటన చేసి ప్రజలకు తమ గోస వెళ్లబుచ్చారు. బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెబుతున్న పాలకులు అందులో నిజాం షుగర్స్‌ను తొలగించారా? అని ప్రశ్నించారు. ఆవిర్భావ వేడుకలో పాల్గొనాల్సిన తమను అడుక్కునే స్థితికి తీసుకొచ్చారని వాపోయారు. ఉద్యోగాలు …

Read More »