Breaking News

Business

కామారెడ్డిలో ఎయిర్‌టెల్‌ 4జి

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే వేగవంతమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి కోట్లాది మంది వినియోగదారులు కలిగిఉన్న ఎయిర్‌టెల్‌ సంస్థ వినియోగదారులకు మరింత సులభంగా డాటా కాల్స్‌ను అందజేసేందుకుగాను 4జి సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగానే బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌, మెదక్‌ జోనల్‌ బిజినెస్‌ మాన్‌ విక్రం చంద్‌ ఎయిర్‌టెల్‌ 4జి సేవలను కేక్‌ కట్‌చేసి ప్రారంభించారు. వినియోగదారులకు అతిచౌకగా కాల్స్‌తోపాటు డైలీ 1 జిబి డేటాను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 349 …

Read More »

ఆధార్‌లేకుంటే ఖాతాల నిలిపివేత

ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ హెచ్చరిక ఏప్రిల్‌ 30 వరకు గడువు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) బహుపరాక్‌.. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేశారా? లేకుంటే ఏప్రిల్‌ 30లోపు మీ బ్యాంకుకు నో యువర్‌ కస్టమర్‌ (కెవైసి) వివరాలతోపాటు ఆధార్‌ నెంబర్‌ను కూడా అందజేయండి. లేని పక్షంలో ఆ ఖాతాను బ్యాంకు అధికారులు స్తంభింపజేస్తారు. ఈ నిబంధన బీమా పాలసీలు, షేర్ల ఖాతాలకు కూడా వర్తిస్తుంది. 2014 జూలై నుంచి ఆగస్టు 2015 వరకు తెరిచిన అన్ని ఖాతాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదాయం …

Read More »

కీలక దశలో జిఎస్‌టి

పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదమే తరువాయి జూలై ఒకటి నుంచి అమలు! కీలకమైన నాలుగు జిఎస్‌టి బిల్లులను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పరోక్ష పన్నులకు సంబంధించి గత స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా చెబుతున్న జిఎస్‌టి పార్లమెంట్‌ ముంగిటకు రావడంతో అమలు ప్రక్రియ తుదిదశకు చేరిందని చెప్పవచ్చు.   న్యూఢిల్లీ: అవరోధాలన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులు పార్లమెంట్‌ను చేరాయి. జూలై ఒకటి నుంచే జిఎస్‌టి అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రస్తుత …

Read More »

ఆన్‌లైన్‌లో నయా వ్యాపార అవకాశాలు

ఇపుడంతా ఆన్‌లైన్‌ మయయే. ఇంట్లో/స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. కాలు బయట పెట్టకుండానే కావలసిన వస్తు, సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో మీకూ ఏదైనా ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలని ఉందా? అయితే ఈ ఐడియాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి. ఆహార వ్యాపారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం క్రమంగా ఊపందుకుంటోంది. ఉద్యోగాలు చేసే చాలా మందికి ఇంట్లో వండుకునే తీరిక ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కోరిన టైమ్‌కి పసందైన వంటకాలు …

Read More »

జన్‌ధన్ భారం వల్లనే..పెనాల్టీలకు ఎస్‌బిఐ సమర్థన

ముంబై : ఖాతాల్లో కనీస నెలవారి నిల్వలు లేకుంటే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ… ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ఏమాత్రం చలించలేదు. పైగా తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. ప్రభుత్వం పురమాయింపుపై లక్షల సంఖ్యలో తాము పేదల కోసం జన్‌ధన్‌ ఖాతాలను తెరవాల్సి వచ్చిందని, ఈ ఖర్చులన్నీ భరించాలంటే, ఇతర ఖాతాదారులు తమ ఖాతాల్లో తాము సూచించిన విధం గా కనీస నిల్వలను ఉంచాల్సిందేనని ఎస్‌బిఐ పేర్కొంది. లేదంటే జరిమానా వసూలు చేస్తామని …

Read More »

నంబర్‌ 1 ముకేశే…

 సంపద విలువ 1.74 లక్షల కోట్లు.. 132 మంది దగ్గర రూ.26.26 లక్షల కోట్ల ఆస్తులు న్యూఢిల్లీ :ఒక పక్క కోట్లాది మంది దరిద్ర నారాయణులు. మరోపక్క కుబేరులను తలదన్నే శ్రీమంతులు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి ఇది. ఇప్పటికిపుడు లెక్కిస్తే మన దేశంలోనూ వంద కోట్ల డాల ర్లు (సుమారు రూ.6,700 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులన్న 132 మంది బిలియనీర్ల సంపద విలువ 39,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,26,499 కోట్లు) వరకు ఉంటుందని తాజాగా వెలువడిన ‘హురున్‌ …

Read More »

హోండా కొత్త యాక్టివా 4జి

ధర రూ.50,730  న్యూఢిల్లీ : సరికొత్త లుక్‌, కలర్లు, ఫీచర్లు, మరింత భద్రతా సదుపాయాలతో కూడిన సరికొత్త యాక్టివా 4జి (నాలుగోతరం) స్కూటర్‌ను హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 110సిసి ఇంజన్‌ కలిగిన ఈ ఆటోమెటిక్‌ స్కూటర్‌ బిఎస్‌4, ఎహెచ్‌ఒ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర 50,730 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో 110 సిసి ఆటోమెటిక్‌ స్కూటర్ల మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోందని, ఈ మార్కెట్లో తమ …

Read More »

సమ్మెతో బ్యాంకింగ్‌ సేవలకు విఘాతం

ఎటిఎంలు ఖాళీ.. నిలిచిపోయిన  రూ.22 వేల కోట్ల చెక్‌ క్లియరెన్సులు  న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఎటిఎంల్లో నగదు లేకపోవటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన ఒక రోజు సమ్మె పూర్తిగా విజయవంతమైందని, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక్క బ్యాంక్‌ అధికారికంగా కార్యకలాపాలు సాగించలేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (ఎఐబిఈ) ప్రకటించింది. సమ్మె కారణంగా మంగళవారం బ్యాంకులు పనిచేయవని ప్రకటించటంతో ప్రజలు …

Read More »

నోకియా 3310 మళ్లీ వస్తోంది..

ధర రూ.3,500 వచ్చే త్రైమాసికంలో విడుదల రెండో త్రైమాసికంలో మూడు స్మార్ట్‌ఫోన్లు బార్సిలోనా: కొన్నేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్‌ను ఊపేసిన నోకియా 3310 ఫీచర్‌ ఫోన్‌ మళ్లీ రాబోతోంది. కొత్త రూపం, ఫీచర్లతో వచ్చే త్రైమాసికంలో దీన్ని హెచ్‌ఎండి గ్లోబల్‌ విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర సుమారు 3,500 రూపాయలు ఉండనుంది. పదేళ్ల కాలానికి నోకియాతో బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎండి గ్లోబల్‌.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన నోకియా 6, నోకియా 5, నోకియా …

Read More »

భారత్‌కు విదేశీ పాలు!

దేశీ ఉత్పత్తి పెరగకుంటే నాలుగేళ్లలో దిగుమతులపైనే ఆధారం పశుగ్రాసం కరువవడంతో తగ్గుతున్న పాల ఉత్పత్తి ఉదయాన్నే పిల్లలకు పాలు, పెద్ద వాళ్లకు చాయ్‌… భోజనంలో నెయ్యి, పెరుగు, తాగడానికి మజ్జిగ.. ఇలా పాలు, పాల పదార్థాల వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. ఇదేస్థాయిలో పాల ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. డిమాండ్‌కు తగిన స్థాయిలో పాల ఉత్పత్తి లేకుంటే రానున్న కాలంలో విదేశీ పాలను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందని ప్రభుత్వ గణాంకాల స్పష్టం చేస్తున్నాయి. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్ సమీప …

Read More »