Breaking News

Columnists

‘జల్లికట్టు’బాటు!

చెన్నయ్‌ మెరీనా బీచ్‌లో వేలాదిమంది యువతీయువకులు చలికీ ఎండకీ సముద్రపు గాలికీ వెరవకుండా నాలుగురోజులుగా భీష్మించుకు కూర్చున్న దృశ్యం అద్భుతంగా ఉన్నది. నచ్చినవారు మాట్లాడుతుంటే మెచ్చినవారు చప్పట్లు కొడుతుంటే, ఉద్వేగం తప్ప ఏ మాత్రం ఉద్రిక్తత లేని ఆ వాతావరణం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ప్రజాసమస్యల మీద పదిమంది ఒక్కచోటచేరితే శాంతిభద్రతలంటూ లాఠీ విదిలించే పాలకులు ఈ దృశ్యం చూసి ఏమనుకుంటున్నారో? వేలమంది చేరినా అక్కడ ఏ ఉత్పాతమూ సంభవించలేదు. అంటువ్యాధులు సోకలేదు. కుర్రకారు ఎప్పటికప్పుడు రోడ్లనూ తీరాన్నీ శుభ్రపరుస్తూ గతంలో కంటే శుభ్రంగా కాపాడుతున్నారు. ...

Read More »

అన్నదాతకిది కాంతి లేని సంక్రాంతి

సంక్రాంతి దేశమంతా వేర్వేరు పేర్లతో చేసుకుంటున్నా తెలుగువారికి మాత్రం ఇది పెద్ద పండగేకాదు పెద్దల పండగ కూడా. తమ పెద్దలను స్మరించుకొని, గత స్మృతలుగుర్తుతెచ్చుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడపాల్సిన పండుగ ఇది. మరే పండుగలకు లేని విశిష్టత ఈ పండుగకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా సంక్రాంతికి కూడా తక్కువేమి చేయరు. అన్నిటికంటే మించి పల్లెసీమలకి ముఖ్యంగా రైతుల జీవనంతో ఈ పండుగ ముడిపడి ఉందనేది వాస్తవం. అందుకే పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగకు మాత్రం ...

Read More »

అమలుకాని ఆదేశాలెందుకు?

గత నాలుగౖెెదు సంవత్సరాలుగా తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలు అనావృష్టి తో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆల స్యంగా నైనా వర్షాలు కురిసాయి. అధికశాతం సాగునీటి వనరు లన్నీ కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గినా రబీలో ఆ నష్టాలను పూడ్చుకోవచ్చని రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో సాగుకు సమయాత్తంఅవ్ఞతున్న తరు ణంలో పెద్దనోట్లరద్దు పిడుగుపాటులా వారితలపై పడింది. అప్పులు ఇచ్చేసంగతి అలా ఉంచండి. తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తీసుకోలేని విచిత్ర పరి స్థితులు ఎదుర్కొంటున్నారు. రైతుల సంక్షేమమే ...

Read More »

చిచ్చురేపిన మణిపూర్‌ కొత్తజిల్లాల ప్రహసనం

ముఖ్యమంత్రిఒక్రమ్‌ ఇబోబిసింగ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటుచేయాలని తల పోస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాలు ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో మరో ఏడు జిల్లాలు ఏర్పాటుచేసి మొత్తం 16 జిల్లాలు చేయాలన్న ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ప్రభుత్వ నిర్ణయం కేవలం నాగాల ప్రాబల్యాన్ని అడ్డుకోడానికేనన్న వాదనకు బలం చేకూరుతోంది. అసోం,నాగాలాండ్‌, మి జోరమ్‌, మైన్మార్‌ సరిహద్దులుగా ఉన్న ఈ ఈశాన్య భారత్‌లోని చిన్నరాష్ట్రంలో మీటీలు,కుకీలు,నాగాలు బల మైన సామాజికవర్గాలుగా ఉన్నాయి. 60శాతంవరకూ ఉన్న మీటీలు తదితర వర్గాలు మణిపూర్‌లోయల్లోని నాలుగుజిల్లాల్లో విస్తరించారు మొత్తం తొమ్మిదిజిల్లాల్లో ఐదు ...

Read More »

రాజీనామా వెనుక ఆంతర్యం?

దేశంలో రాజకీయకారణాలతోకొందరు తమతమ పదవులనుంచి వైదొలుగుతుంటే మరికొందరు పాలకుల మైండ్‌గేమ్‌తో అసహనంపెరిగి తమ పాతవృత్తులనే ఎంచుకుని తప్పుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ దిశగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ రాజీనామా మరోసారి ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. గతంలో ఆర్‌బిఐగవర్నర్‌గా రఘురామ్‌రాజన్‌ పదవినుంచి దిగిపోయినవైనం ఎంత సంచలనానికి దారితీసిందో ప్రస్తుతం నజీబ్‌ జంగ్‌ రాజీనామా కూడా అంతేప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. దేశరాజధాని ఢిల్లీ కేంద్రపాలితప్రాంత రాష్ట్రంలో పాలకపార్టీకి కంటిమీ ద కునుకులేకుండాచేసిన వ్యక్తిగా నజీబ్‌జంగ్‌ పేరుతెచ్చు కున్నవ్యక్తి. ఢిల్లీప్రభుత్వ లెఫ్టినెంట్‌గవర్నర్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీతో ...

Read More »

‘లఘువుగా మారుతున్న ‘గురువు

ప్రొఫెసర్‌ వేధింపుల వల్ల వైద్యవిద్యార్థిని బలి, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారి విద్యార్థిని ప్రాణాలు బలిగొన్నాడు, గైడ్‌ వేధిం పుల కారణంగా దళిత విద్యార్థి ఆత్మహత్యయత్నం, అధ్యాపకుడు దూషించాడని అవమానభారంతో విద్యార్థిని బలవన్మరణం ఇలా ఒకే రోజున ఒకే దినపత్రికలో వచ్చిన వార్తాంశాలు ఇవి. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు, భారతీయ విద్యావిధానంలో సంస్కృతిలో ఒకప్పుడు గొప్పస్థానంలో నిలబడిన గురువ్ఞ ఉనికే నేడు ప్రశ్నార్థ కంగా మారుతోంది.ఒకప్పుడు ఎంతటి మహారాజు కొడుకైనా సామా న్య విద్యార్థిలాగా గురుకులాల్లో ఈత చాపలపై కూర్చుని విద్య ...

Read More »

రాహుల్‌ ఆరోపణలు

దేశ ప్రజలకు ఉపకరించే పార్లమెంటు సమావేశాలను ఎందుకూ కొరగాకుండా చేసిన అధికార, విపక్షాలు ఇప్పుడు సభ వెలుపల అమోఘంగా యుద్ధం చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ యుద్ధక్షేత్రంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్య విమర్శలు పతాకస్థాయికి చేరాయి. ఈ రాష్ట్రంలో తొలి రెండుస్థానాల్లో ఉన్న ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ కాంగ్రెస్‌లు ఎక్కువ వీరంగం వేయడాన్ని బట్టి ఈ యుద్ధం యూపీ ఎన్నికలకే పరిమితమైనది కాదని అనుకోవాలి. రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు ప్రభావమేమిటో నిగ్గుతేలాక, నరేంద్రమోదీ వేయబోయే ప్రతీ రాజకీయ ...

Read More »

బ్రిటన్‌ ఆంక్షలతో భారత్‌ ఐటికి చేటు!

UK visa భారతీయ వలసపౌరులపై బ్రిటిష్‌ప్రభుత్వం వీసా ఆంక్షలు కఠినతరం చేయడం వల్ల భార తీయ ఐటి కంపెనీలు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంక్లిష్టపరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భావనలో ప్రపంచ దేశాలున్న తరు ణంలో డేవిడ్‌కేమరూన్‌ వారసురాలిగా వచ్చిన థెరిసామే ప్రధానిగా వలసవీసా నిబంధనలనుప్రత్యేకించి భారతీ యుల కోసమే మార్పులుచేర్పులు చేయడం భారత్‌ ఐటి రంగానికి ఏమాత్రం నచ్చలేదు. పైగా దీనివల్ల బ్రిటన్‌లో సేవలందిస్తున్న భారత్‌ ఐటి కంపెనీలపై వత్తిడి మరింత పెరుగుతుంది. రెండోశ్రేణి ...

Read More »

అలెప్పో విజయం

‘అలెప్పోను మరిచిపోకు’ అని అరుస్తూ టర్కీ రాజధాని అంకారాలో రష్యా రాయబారిని ఒక పోలీసు అధికారి కాల్చిచంపిన ఘటన సిరియా యుద్ధంలో రష్యా వ్యవహార శైలిని ముందుకు తెస్తున్నది. రష్యా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఒక ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆరంభించి, టర్కీతో స్నేహాన్ని రాయబారి తన ప్రసంగంలో ప్రశంసిస్తుండగా, వెనకనే నిల్చుని వున్న టర్కీ పోలీసు అధికారి ఆయనపై కాల్పులు జరిపాడు. చేతిలో తుపాకీ పట్టుకొని ఊగిపోతూ, నేలమీద పడివున్న రాయబారి మృతదేహాన్ని ఆడపాదడపా కాలుస్తూ, రష్యాకు వ్యతిరేకంగా అతడు పలువ్యాఖ్యలు చేశాడు. ...

Read More »

అణువిద్యుత్తే ఇక శరణ్యం

ప్రపంచంలో 16శాతం జనాభా మనదేశంలోనే ఉన్న ప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన బొగ్గు సహజ వాయువ్ఞ, చమురు తదితర శిలాజ ఇంధన వనరులు మనదేశంలో తక్కువగా ఉన్నాయి. 2006 నాటి అంచనా ప్రకారం ప్రపంచంలోని బొగ్గు నిల్వల్లో మనదేశం 1లక్ష 54వేల మిలియన్‌ టన్నులు బొగ్గు నిల్వలు కలిగి ఉంది. అంటే కేవలం ప్రపంచంలో ఏడు శాతం మాత్రమే నిల్వలు కలిగి ఉన్నాం. వీటిలో కేవలం 80వేల మిలియన్‌ టన్నులు మాత్రమే వెలికి తీసే అవకాశం ఉంది. ఏటా 1200 మిలియన్‌ టన్నుల చొప్పున ...

Read More »

బ్యాంకుల్లోకీ విస్తరించిన అవినీతి!

వీరు ఎంతగా అరచికేకలు పెడుతున్నారో అంతకు రెట్టింపుస్థా యిలో అవినీతి రాక్షసి దేశంలో అంతగా పెరిగిపోతు న్నది. ఇక్కడా అక్కడా అని లేదు పొగమంచులా ఎక్కడ వీలైతే అక్కడ విస్తరిస్తున్నది. తాజాగా బ్యాంకుల్లో బయటపడుతున్న అవినీతి పరా కాష్ఠగాచెప్పొచ్చు. ఇంతకాలం బ్యాంకులంటే సన్న,చిన్న, మధ్యతరగతి జనంలో కొంత విశ్వాసం ఉండేది. నమ్మ కం ఉండేది. కానీఇప్పుడు ఆ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో బయటపడుతున్న అవినీతి, అందులో ఉన్నతస్థాయిలో కొందరు బ్యాంకు అధికారులు నల్లధనస్వాములతో చేయి కలిపి కోట్లాది రూపాయల కొత్తనోట్లను తరలించడంతో అందరూ విస్తుపోతున్నారు.బ్యాంకుల్లో సీనియర్‌ ...

Read More »

గల్ఫ్‌లో డిజిటల్ మనీ

గల్ఫ్ దేశాలలో ఎలాంటి పన్నుల విధానం లేదు. ఇది ఈ దేశాల ప్రత్యేకత. పైగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కారణంగా సంపన్న పాశ్చాత్య దేశాల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల వాడకం ఇక్కడే ఉన్నది. అమెరికాలో ఇంటర్నెట్ వాడకం 87శాతం మాత్రమే కాగా బహ్రెయిన్లో 99శాతంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. గల్ఫ్‌లోని రెండు పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలలో మొబైల్ సిమ్ కార్డులన్నీ కూడా వినియోగదారుల వేలిముద్రలతో అనుసంధానం చేయబడి సురక్షి తంగా ఉన్నాయి. జనాభాలో ...

Read More »

ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం!

దివాలా బాటపట్టాల్సి వస్తుంది. ఇదేమి కొత్త విషయం కాదు. ఎన్నో సంస్థలు వ్యక్తులు ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనా వస్థకు చేరుకున్న ఉదాహరణలుకోకొల్లలు.వ్యక్తి విషయం లో దివాలా అనేది తీవ్రంగా పరిగణిస్తారు. ఒకరకంగా సమాజ బహిష్కరణకు గురైనట్లే.దివాలా తీసిన వ్యక్తిని కానీ, ఆ కుటుంబాన్ని కానీ సమాజం ఎలా చూస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వెచ్చిస్తున్న నిధులు వస్తున్న ఆదాయం పరిగణనలోకి తీ సుకొని పరిశీలిస్తే ఆ వైపు పయనిస్తుందే మోనని ఆందో ళన వ్యక్తమవ్ఞతున్నది.అప్పులమీద ...

Read More »

ప్రశ్నార్థకంగా జైళ్ల భద్రత?

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు భోపాల్‌ జైలు నుండి తప్పించుకోవడం ఆ తర్వాత కొన్ని గంటల్లోనే జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో చని పోవడం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పోలీసులు జరిపినట్లుచెప్తున్న ఎన్‌కౌంటర్‌పై సందేహాలున్నా అసలు అంత పటిష్టమైన భద్రతావలయం నుండి ఎనిమిది మంది ఎలా తప్పించుకోగలిగారనే ప్రశ్న ఉదయిస్తున్నది. అందులోనూ అదేదో చిన్న జైలు కాదు. భోపాల్‌లోని కేంద్ర కారాగారం అది. అక్కడ ఎంతో మంది సెక్యురిటీ గార్డులు వారిని పర్యవేక్షించే అధికారులు ఉంటారు. నిత్యం వెయ్యికళ్లతో ...

Read More »

నీతి ఆయోగ్‌ వ్యవసాయరంగాన్ని గట్టెక్కించేనా?

ఐదేళ్లలోవ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతు న్నది.వ్యవసాయరంగం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థి తుల్లో అది ఆచరణ సాధ్యమేనా? ప్రధాన మంత్రి ప్రక టనలు ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయి? తది తర అంశాలపై అన్నివర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వ్యవసాయరంగంలో సమగ్రమైన సంస్కరణల కోసం నీతి ఆయోగ్‌ మూడంచెల వ్యూహాన్ని రూపొందించింది. దీంట్లో మొదటిది మార్కెటింగ్‌ రంగంలో సంస్కరణలు, అడవ్ఞలపెంపకానికి సంబంధించిన నిబంధనల్లోమార్పు, భూములు లీజుకు ఇవ్వడం తదితర అంశాలున్నాయి. మూడంచెల ...

Read More »

ఆరెస్సెస్‌ మేధోమథనం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) హైదరాబాద్‌లో మూడురోజుల పాటు నిర్వహించిన అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాత కొత్త అంశాల కలయిక కనిపించింది. గోరక్షణ, రామజన్మభూమి ఇత్యాది అంశాల్లో గత వైఖరినే పునరుద్ఘాటించినా, కొన్ని అంశాల్లో ఈ సమావేశం వెలిబుచ్చిన అభిప్రాయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా దాని ఆలోచనల్లో వస్తున్న మార్పును సూచిస్తాయి. వామపక్షాలకు బుద్ధిచెపాల్సిందేనంటూ తొలిరోజే ఈ సదస్సు సంకల్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు. రాడికల్‌ జిహాదీ శక్తులకు అధికారంలోని ప్రభుత్వాలు అండగా ఉన్న కారణంగానే పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ...

Read More »

యుపి సమాజ్‌వాదీలో ముసలం!

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. బాబా§్‌ు, అబ్బా§్‌ుమధ్యనెలకొన్న అగాథాన్ని పూడ్చేందుకు తండ్రి ములాయంసింగ్‌ చేస్తున్న యత్నా లు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. సమాజ్‌వాదీపార్టీ కీలక నేత అమర్‌సింగ్‌, తన సోదరుడు శివపాల్‌యాదవ్‌నే బలపరిచిన ములాయంసింగ్‌ తనయుణ్ణి సిఎం పదవి నుంచి తప్పించేదిలేదని, మరొకరికి ఇచ్చేదిలేదని తెగేసి చెప్పినా ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌మాత్రం అవమా నం జరిగిందంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు. పైగా తన పుట్టినరోజున ఏర్పాటైన సమావేశంలో తండ్రి, బాబా§్‌ు ల ఆశీర్వాదం అందుకున్న అఖిలేష్‌ పార్టీలోనికి తిరిగి వ చ్చిన ...

Read More »

బ్రిక్స్‌వేదికగా వ్యూహాత్మక అడుగులు!

భూభారత్‌కు చిరకాల మిత్రునిగా ఉన్న సోవియట్‌ రష్యావైఖరిపై భారత్‌ అప్రమత్తంగా వ్యవహరి స్తోంది. గోవావేదికగా జరుగుతున్న ఎనిమిదవ బ్రిక్స్‌దేశాల సదస్సులో పాక్‌ భారత్‌ సరిహద్దుల్లోని ఉద్రి క్తతల నేపథ్యంలో ఆదేశంతో కలిసి రష్యా సైనిక కవాతు లు నిర్వహించడం, పైగా ఎన్‌ఎస్‌జికూటమి, మసూద్‌ అజహర్‌ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌ ను వ్యతిరేకిస్తున్న చైనాతో రష్యా చెలిమి వంటి వాటిపై తన వైఖరిని భారత్‌ రష్యాకు స్పష్టంచేయనున్నది. ఐదు దేశాల మధ్య ఇన్‌ఫ్రారంగంలో భారీ ప్రాజెక్టులకు నాంది పలకడం, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల సమీక్ష, ...

Read More »

రామనామం

అయోధ్యలో ‘రామాయణం మ్యూజియం’ నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయంలో రాజకీయం లవలేశమైనా లేదంటే ఎవరూ నమ్మరు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను స్వాగతించవలసిందే కానీ, ఇందుకు కేంద్రం ఎంచుకున్న స్థలకాలాదుల్ని చూసినప్పుడు కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ మాటల్లో విశ్వాసం కలగదు. వివాదాస్పద రామజన్మభూమి స్థలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో, పాతిక ఎకరాల్లో ఈ మ్యూజియం తలపెట్టడంతో, రామమందిరం నిర్మాణం డిమాండ్‌ మళ్ళీ రాజుకుంటున్నది. ఉమాభారతి, వినయ్‌ కతియార్‌ ఇత్యాది నాయకులు ఇలా లాలీపాప్‌లతో సరిపెట్టవద్దంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా ‘నమో’ ...

Read More »

కిగాలి ఒడంబడిక

భూతాపాన్ని వేగంగా పెంచే శీతలీకరణ వాయువుల (హైడ్రో ఫ్లోరో కార్బన్స్‌-హెచ్‌ఎ్‌ఫసీ) వినియోగాన్ని దశలవారీగా తొలగించే లక్ష్యంతో రువాండా రాజధాని కిగాలిలో 197 దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఏసీలు, ఫ్రిజ్‌లు, కార్లు తదితరాల్లో శీతలం కలిగించేందుకు వినియోగించే యంత్ర పరికరాలు హెచ్‌ఎ్‌ఫసీ వాయువుల ఆధారంగా నడుస్తాయి. అయితే కార్బన్‌డై ఆక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, నీటి ఆవిరి వంటి ఇతర హరిత గృహ వాయువులు (గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్‌) కంటే హెచ్‌ఎ్‌ఫసీలు కొన్ని రెట్లు ఎక్కువ భూతాపం కలిగిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ...

Read More »