Breaking News

Columnists

ఉల్లిరైతుల కష్టాలు

అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా ఉంది రైతులు పరిస్థితి. రైతుల వద్ద ఉత్ప త్తులు ఉన్నప్పుడు ధరలు పాతాళలోకానికి పడిపోతున్నాయి. అదే ఉత్పత్తులు దళారుల వద్దకో, వ్యాపారుల గోదాములకో చేరిన తర్వాత ధరలు ఆకా శాన్ని అంటుతున్నాయి. ఏ పంటల ధరలు తీసుకున్నా ఇదే పరిస్థితి. రైతులు అమ్ముకుంటున్న ధరలకు విని యోగదారులు కొంటున్న ధరలకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. దేశవ్యాప్తంగా లెక్కకడితే ఈ వ్యత్యాసం కొన్ని వేలకోట్ల రూపాయలకు పెరుగుతుంది. దళారు లను, ఈ దగాను నియంత్రించేందుకు, నిరోధించేందుకు ...

Read More »

వైద్యవిద్యకే చికిత్స!

ఒకనాడు ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించి పూజించిన ‘సరస్వతి రానురాను అంగడి బొ మ్మగా మారిపోయింది. నేడువిద్య ఒక వ్యాపా రంగా రూపుదాల్చింది. విద్యనే కాదు విద్యార్థులతో సహా ఏకంగా విద్యాసంస్థలను అమ్ముకునే దురదృష్టపు రోజు లు దాపురించాయి. విద్యార్థులకు,తల్లిదండ్రులకు ధనభా రం మోయలేనంతగా పెరిగిపోతున్నది.పాలకుల అస మర్థత, అధికారుల చేతకానితనానికి, అవినీతికి నిదర్శ నంగా దేశ వ్యాప్తంగా విద్యావ్యాపారం మూడుపువ్ఞ్వలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపారంలోకి గతంలో సారా వ్యాపారం చేసేవారు, కాంట్రాక్టర్లు,కొందరు రాజకీయనాయకులు నేరుగా పాలు పంచుకుంటున్నారు.ముఖ్యంగా వైద్యవిద్య ...

Read More »

ఎన్నాళ్లీ తప్పుల ప్రశ్నాపత్రాలు?

మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడపదాట లేదన్నట్లుగా ఉంది పరీక్షల నిర్వహణలో పాల కుల వైఖరి.పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వ హిస్తామని,తప్పులులేకుండా,లీక్‌లకు అవకాశం లేకుండా జరుపుతామని పదేపదే పాలకులు ప్రకటిస్తున్నా ఆచర ణకు వచ్చేసరికి అవికాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. మరీముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు కీలకంగా ఉన్న ఎంసెట్‌ పరీక్షల విషయంలో గత పది,పదిహేనేళ్లుగా జరుగుతున్న తంతుచూస్తుంటే ఆవేదన కలగకమానదు. అరమార్కుతోటే విద్యార్థుల భవిష్యత్తే మారిపోతుంది. అలాంటి కీలకపరీక్షల విషయంలో నిర్వాహకులు ఎంత టి అశ్రద్ధవహిస్తున్నారో జరుగుతున్న పరిస్థితులు చెప్ప కనే చెబుతున్నాయి. వివిధకారణాలతో రెండుసార్లు నిర్వ ...

Read More »

కావేరి కార్చిచ్చు

కర్ణాటకను కావేరి వివాదం కుదిపేస్తున్నది. సోమవారం పతాకస్థాయికి చేరిన హింస కాస్తంత తగ్గుముఖం పట్టినప్పటికీ, అడపాదడపా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బెంగుళూరు కర్ఫ్యూలో కొనసాగుతుంటే, మాండ్య, మైసూరు జిల్లాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసు బృందాలు కలగలసి శాంతి స్థాపనకు కృషిచేస్తున్నాయి. తీవ్రహింస, విధ్వంసాలకు చలించిపోతూ ప్రధానమంత్రి చెప్పిన మంచిమాటలు, శాంతిభద్రతలను కాపాడే విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రకటించిన సంకల్పం ఈ కీలకదశలో అత్యంత అవశ్యమైనవి, ప్రశంసనీయమైనవి. దీనితోపాటుగానే, నీటి విషయంలో చేసిన రాద్ధాంతమూ, రేగిన విధ్వంసమూ పాతికవేలకోట్ల ...

Read More »

వినువీధిన మరో విజయం!

వి నువీధిన భారత్‌ మరో విజయం నమోదు చేసింది. వాతావరణ శాస్త్ర అధ్యయనం కోసం మరింత ఖచ్చితత్వంతో కూడిన విస్తృత స్థాయి పరిశో ధనలు నిర్వహించేందుకు చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది.ఇప్పటివరకూ వివిధ ఉపగ్రహా లు ప్రవేశపెట్టిన శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగకేంద్రం తాజాగా జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతం కావ డంతో మరో విజయాన్ని నమోదుచేసి ప్రపంచ ఖగోళ పరిశోధనలు చేస్తున్న సంస్థలకు తలమానికంగా నిలి చింది.ఇప్పటివరకూ వాతావరణ పరిశోధనలకోసం ఆరు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో అవసరమైన అన్ని వనరులను సమీకరిస్తోంది. అవసరమైన సమాచారాన్ని ...

Read More »

రక్షణ సంపత్తికి కీలక ఒప్పందం

భారత్‌ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత ధృఢపడటంతోపాటు రక్షణ రంగంలో కూడా పటిష్టబంధం ఏర్పడింది. ఇప్పటికే భారత్‌లోని పలురక్షణరంగ అవసరాలకు అమె రికా బాసటగా నిలుస్తోంది. మరికొన్నింటికి జాయింట్‌ వెంచర్లు రూపంలో భారత్‌కు రానున్నది. ఈదశలో ఇరు దేశాలమధ్య సైనికసేవల పరస్పర మార్పిడి ఒప్పందం (లెమోఆ) అత్యంత కీలకంగా మారింది. రక్షణమంత్రి మనోహర్‌ పారిక్కర్‌, అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్‌ కార్టర్లు ఈ ఒప్పందంపై సంతకాలుచేసారు. భవిష్యత్తు మిలిటరీ ఒప్పందాలకు ఈ లమోవా కీలకం కానున్నట్లు అంచనా. అయితే భారత్‌ సార్వభౌమత్వంపై ...

Read More »

పడకేసిన వాతావరణ పరిశోధన?

వేషం,భావం కంటే చెప్పే మాటలు ఎంత వరకు విశ్వసనీయంగా ఉంటాయనే దానిని బట్టే వ్యక్తులపై కానీ,సంస్థలపై కానీ నమ్మకం ఏర్పడి అనుమానం పెరిగి అనుసరణీయం అవుతాయి. బాధ్య తలు పెరిగేకొద్దీ మాటలకు విలువ పెరుగుతుంది. సంస్థ లైతే మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ సంస్థల నుండి వెలువడే అంచనాలు, మాటలు, కోట్లాది మంది జీవనానికి ముడిపడి ఉంటాయి. ఇందులో ఏమా త్రం విఫలమైనా వీటిపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారవ్ఞతోంది. భార తదేశంలో ఇప్పటికీ అధికశాతం జనాభా వ్యవసాయరం గం ...

Read More »

టోల్‌గేట్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం

మానవ సుఖానికి సంతోషానికి అభివృద్ధి దోహదం కావాలి.సుఖంకోసమే అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తాం. రోడ్లు అభివృద్ధికి సోపానాలు అనేది అందరికి తెలిసిందే. మరి ఈ సోపా నాలే మృత్యుమార్గాలైతే ఎవరితో చెప్పుకోవాలి?ఎక్కడి నుంచి అన్వేషించాలి?రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదాల్లో మరణించినవారికి సంబం ధించిన సన్నిహితులు, బంధువ్ఞలు గుండెలు బాదుకొని ఏడ్చేవారిని చూసి కన్నీరుసైతం ఘనీభవించే స్థితికి చేరు కున్నామనిపిస్తున్నది.మంగళవారంరాత్రి రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం సుతారిగూడా ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ ప్లాజావద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిదిమంది యువ కులు మరణించారు. ...

Read More »

ఇస్రో విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతున్నది. భవిష్యత్ తరం ‘స్ర్కామ్‌జెట్‌’ రాకెట్‌ ఇంజన్‌ పరీక్షలో ఆదివారం అది సాధించిన విజయం అద్భుతమైనది. స్వదేశీ పరిజ్ఞానంతో పలు రోదసి ప్రయోగాల్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఈ సంస్థ, ప్రథమ ప్రయోగంలోనే ఈ పరీక్ష గట్టెక్కడం అసామాన్యమైనది. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరప్‌ అంతరిక్ష సంస్థలకు మాత్రమే దక్కిన ఈ విజయాన్ని, వాటికంటే తక్కువ వ్యయంతో భారత్ సాధించగలగడం గర్వించదగ్గది. పునర్వినియోగ రాకెట్ల రూపకల్పనతో అంతరిక్ష రవాణాను కారుచవుకగా మార్చి, అంతర్జాతీయ మార్కెట్‌లో బలంగా ...

Read More »

అధిక ఫీజులపై అదుపేదీ?

ఊదురుగొట్టం వాడు ఊదుతూ ఉంటే చల్పా రుడు గొట్టం వాడు చల్లార్పుతున్నట్లుగా ఉంది ఫీజుల విషయంలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు పాలకులు వ్యవహరిస్తున్న తీరు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలుతప్పవని పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలకు నోటీసులు కూడా ఇస్తున్నారు. అయినా ఇవేమి పట్టనట్టు తమనేమి చేయ వన్నట్టుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు అయి తే గతఏడాది కన్నా ఇప్పటికీ ఫీజులు రెట్టింపు చేశారు. మరికొన్ని ...

Read More »

సుప్రీం హితవు!

ప్ర‌జాజీవితంలో ఉన్నవారు విమర్శలకు తలొగ్గాల్సిందేనంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు చెప్పిన హితవు అనేకమంది పాలకులకు వర్తిస్తుంది. ఆమెకూ, ఆ రాష్ట్రానికీ సంబంధించి ప్రత్యేకించి చేసిన వ్యాఖ్యలతో పాటు న్యాయస్థానం మరికొన్ని మంచిమాటలూ చెప్పింది. ‘పరువునష్టం’తో ఎదుటివారిని భయపెట్టడం ద్వారా విమర్శనూ, అసమ్మతినీ తొక్కిపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దన్నది. ‘దేశద్రోహం’ మాదిరిగానే, ‘పరువునష్టం’ కూడా దుర్వినియోగమవుతున్న తరుణంలో అనేకమంది ఉద్యమకారులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నట్టుగా దీనిని సివిల్‌ నేరంగా మార్చడంలో నష్టమేమున్నదో న్యాయవేత్తలు ఆలోచించాలి.                   ప్రభుత్వాన్నీ, అధికార యంత్రాంగం పనితీరునూ తప్పుపట్టినవారిపై పరువునష్టందావా వేస్తూపోతుండటం ...

Read More »

ఏది నరకం?

‘రాజద్రోహం’ మళ్ళీ రంగంమీదకు వచ్చింది. ఇటీవలే అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మీద ఆ నింద పడిన తరువాత, ఇప్పుడు కన్నడ నటి రమ్య మీద అదే ఆరోపణతో న్యాయస్థానంలో ఓ ఫిర్యాదు దాఖలైంది. స్వాతంత్య్రదినోత్సవానికి రెండురోజుల ముందు బెంగుళూరులో కశ్మీరీ కుటుంబాలతో ఆమ్నెస్టీ నిర్వహించిన ఒక సదస్సులో పాకిస్థాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు హోరెత్తాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సంస్థపై రాజద్రోహం కేసు పెట్టారు. పాకిస్థాన్‌ నరకం కాదని అన్నందుకు ప్రజారంగ అనే సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ...

Read More »

ఒమ్రాన్‌: వీడని విషాదం

గత ఏడాది సెప్టెంబరులో టర్కీ తీరంలో బొక్కబొర్లాపడివున్న మూడేళ్ళ అయిలాన్‌ కుర్ది మృతదేహాన్ని చూసి యావత ప్రపంచం కన్నీరు పెట్టుకుంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోతున్న సిరియానుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పడవెక్కిన ఆ చిన్నారి కుటుంబం టర్కీప్రాదేశిక జలాల్లో మునిగిపోవడంతో ఆ పిల్లవాడి శవం ఒడ్డుకుకొట్టుకొచ్చింది. నాలుగు లక్షలమంది శరణార్థుల విషాదస్థితికి సంకేతంగా మారి అంతర్జాతీయంగా జనాగ్రహాన్ని రగల్చింది. అతని చిత్రం అంతవరకూ శరణార్థుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తూ వచ్చిన కొన్ని దేశాల హృదయాలను రవ్వంత కరిగించగలిగింది కానీ, సిరియా అంతర్యుద్ధాన్ని మాత్రం అంతం చేయలేకపోయింది. ఇప్పుడు, ...

Read More »

ప్రజలకు దూరమవుతున్న ప్రభుత్వ వైద్యం

సీజన్‌ మారినప్పుడుల్లా విజృంభిస్తున్న దోమలు వాటి వల్ల ప్రబలే రోగాలతో లక్షలాది మంది విలవిలలాడుతున్నారు. విషజ్వరాలేమీ కొత్త కాదు. వర్షాకాలం ఆరంభంతో పాతనీరుపోయి కొత్త నీరు రావడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటికే విషజ్వరాల బారిన పడి బీదాబిక్కి ధనిక అని తేడా లేకుండా అల్లాడిపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్ప త్రులు,ప్రభుత్వ దవాఖానాలు అన్ని కిటకిటలాడిపోతున్నాయి. ఈ వ్యాధులు సోకిన లక్ష్మీప్రసన్నుల సంగతి అలా ఉంచితే మధ్యతరగతి, మరీ ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని రోజుకూలీలు,చిన్నాచితక వ్యాపారాలపై ...

Read More »

ఉపాధికి ఉపయోగపడే విద్య ఇంకెప్పుడు?

మారిన, మారుతున్న కాలానుగుణంగా విద్యావిధా నంలో ఆశించినమేరకు మార్పులు రాకపోవడంతో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతున్నది. జ్ఞానార్జన ప్రజలందరికీ హక్కుగా తీర్మానిం చేందుకు దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా నేటికీ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్నాం. ప్రాథమిక విద్యలో కొంతలో కొంతమార్పు అభివృద్ధి కనిపించినా సమాజంలో వ్యక్తి వికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే నాణ్య మైన విద్యను అందించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాం. ఫలితంగా మూస చదువుల బారినపడి ఉపాధి అవకాశాలురాక నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతు న్న నిరుద్యోగ పట్టభద్రులు కోకొల్లలుగా తయారవుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 620కు పైగా ...

Read More »

శతకోటి ఆశల ‘రియో’

యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ ఆరంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ఆటల పండుగకు బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికైంది. దక్షిణ అమెరికా ఖండంలోని ఓ దేశం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. 17 రోజులపాటు ఉత్కంఠగా సాగే ఈ పోటీలు క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనున్నాయి. మొత్తం 206 దేశాలు పాల్గొంటున్న రియో ఒలింపిక్స్‌లో 10,500 మంది క్రీడాకారులు 42 క్రీడాంశాల్లో 306 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారిగా శరణార్థుల జట్టు ...

Read More »

ప్రచండకు పట్టం

నేపాల్‌ కొత్త ప్రధానమంత్రిగా మావోయిస్ట్‌ సెంటర్‌ అధినేత పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ ఎన్నికయ్యారు. ఇంతవరకూ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలిని వారం క్రితం మద్దతు ఉపసంహరించడం ద్వారా ప్రచండ గద్దెదించేసిన విషయం తెలిసిందే. ప్రధాని కావాలన్న నీ కోరిక నెరవేరుగాక! అని ప్రచండను ఆశీర్వదిస్తూనే, భారతకుట్ర బలంగా పనిచేసిందని పరోక్ష విమర్శలు చేశారు ఓలి. అతిపెద్ద రాజకీయపక్షం నేపాలీ కాంగ్రె్‌సతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన ప్రచండకు 595 మంది సభలో 363 ఓట్లుపడ్డాయి. మధేశీ పార్టీలు ఆయనకు అండగా నిలబడ్డాయి. ఓలి ...

Read More »

ఆనందీ నిష్క్రమణ!

  గజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామాకు ఆమె చెబుతున్నట్టుగా వయోపరిమితి కారణం కాదన్నది తెలిసిన విషయమే. రాజీనామాకు ఆమె సరేనన్న కొద్దిగంటల్లోనే మరొకరిని కూర్చోబెట్టడానికి అధిష్ఠానం రంగం సిద్ధంచేసింది. ఆరోగ్యమంత్రిగా ఉన్న నితిన్‌భాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు విప్లవాలతో ఊగిపోతున్న మోదీ పీఠభూమిని కాపాడుకోవాలంటే ఆమెను తప్పించడం వినా మరోమార్గం లేదని బీజేపీ అధినాయకత్వం విశ్వాసం.                   ఆమెను స్వయంగా ఎంపికచేసిన నరేంద్రమోదీకి ఈ రెండేళ్ళకాలంలో రాష్ట్రంలో పార్టీ ఎంతగా దెబ్బతిన్నదో మిగతావారికంటే బాగా తెలుసు. తనను ముఖ్యమంత్రి పదవినుంచి ...

Read More »

ట్రంప్‌ తొలి అడుగు

మధ్యలోనే పోతాడనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ చివరివరకూ నిలిచి గెలిచాడు. పదహారుమంది ప్రత్యర్థులను ఓడించి, ముప్పయ్యేడు రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష గట్టెక్కి, ఈ రియల్‌ ఎస్టేట్‌ మొగల్‌ ముత్తాతల పార్టీ ఆశీస్సులు అందుకుంటాడని ఎవరూ అనుకోలేదు. విమర్శలూ, వివాదాలతో రిపబ్లికన్‌ పార్టీ మహాసభల వేదిక ఊగిపోతుందనీ, ట్రంప్‌ను కాదని ఓట్లు తక్కువ వచ్చినవాడిని ఎవరినో ముందుకు తోస్తారన్న వాదనలన్నీ అంతిమంగా వీగిపోయాయి. క్లీవ్‌ల్యాండ్‌లో మీరు ఊహించినట్టుగా ఏమీ జరగదని ట్రంప్‌ కూతురు రెండునెలల క్రితమే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. విమర్శలు నామమాత్రమై, వ్యతిరేకతలన్నీ అడ్డుతప్పుకొని, ...

Read More »

ఉనా ఉన్మాదం!

ప్రధాని నరేంద్రమోదీ రెండువారాల క్రితం మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఐదుగురు దళితులకు పదవులు ఇచ్చారు. వివాదాల వీరనారి స్మృతి ఇరానీ శాఖ మార్చేశారు. ఏడాదికాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనలు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపిన తరువాత చేసిన నిర్ణయాలు ఇవి. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఎన్నికల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బోల్తాపడకుండా దళితులకు చేరువకావడానికి చేసిన ప్రయత్నం ఇది. కానీ, గతంతో పాటుగా ఇప్పుడు గుజరాతలో చోటుచేసుకున్న అమానవీయ పరిణామాలు, మాయావతిపై బీజేపీ నాయకుడు నోరుపారేసుకున్న ఘటన, మహారాష్ట్రలో అంబేద్కర్‌ భవన్‌ వివాదం వంటివి ...

Read More »