Breaking News

Columnists

రాహుల్‌ తెలివి

రాహుల్‌, నీ తెలివి అమోఘం అని మెచ్చుకోవాలనే ఉన్నా, ఇంత రచ్చచేసినందుకు ఆగ్రహం కూడా కలుగుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి పేమా ఖండూ బుధవారం నాడు సభా విశ్వాసాన్ని అవలీలగా చూరగొని సుదీర్ఘకాలం సాగిన సంక్షోభానికి తెరదించేశారు. ‘చిల్లులు పడిన పడవలో ప్రయాణిస్తే మునగడం ఖాయం.. నీటిని తిట్టిపోస్తారెందుకు?’ అని కేంద్రహోంమంత్రి మంగళవారం లోక్‌సభలో కాంగ్రె్‌సను ఎగతాళి చేశారు. తాము పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కేంద్రం అసమ్మతిని రెచ్చగొడుతూ అడ్డతోవల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ విమర్శిస్తున్న సందర్భంలో రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్య ...

Read More »

సంస్కరణల సమయం

భారత క్రికెట్‌ పాలనా వ్యవహారాల్లో సమూల ప్రక్షాళన మొదలైంది. దేశంలోని క్రికెట్‌ వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసే చర్యలకు పచ్చజెండా ఊపడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం క్రీడారంగ చరిత్రలో ఓ ఉత్కృష్ట నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ భారత క్రీడారంగంలోని వివిధ రుగ్మతల పరిష్కారం దిశగా తొలి అడుగు పడినట్టయింది.                   భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో సంస్థాగత సంస్కరణలపై జస్టిస్‌ లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులలో సింహభాగం ఆమోదించిన సుప్రీం కోర్టు, వీటన్నింటినీ ఆరుమాసాలలోగా అమలుచేయాలని ఆదేశించింది. దీంతో బీసీసీఐ, ...

Read More »

ఎవరి కోసం?

తలుపులు తెరవడం వేరు. వాటిని పీకి పక్కనబెట్టడం వేరు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తలుపులను పూర్తిగా తొలగించడమే. అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఇంత తీవ్రమైన దూకుడును మోదీ సర్కారు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. కొన్ని రంగాల్లో పూర్తిగా నూరు శాతం, మరికొన్ని రంగాల్లో దాదాపు నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రక్షణ, పౌర విమానయానం, ఫార్మా వంటి రంగాలను తమ నియంత్రణలోకి ...

Read More »

బ్రిటన్‌కు భరోసా

బ్రిటన్‌ తొలి మహిళా ప్రధాని తానే కావాలనుకొని, ఆ కీర్తి మార్గరేట్‌ థాచర్‌కు దక్కినప్పుడు చిరాకుపడిన థెరెసా మే అనూహ్య పరిణామాల నేపథ్యంలోనైనా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఆక్స్‌ఫోర్డ్‌లో చదువుకుంటున్న కాలం నుంచి తన రాజకీయంపై స్పష్టత ఉన్నదామెకు. మార్గరేట్‌ థాచర్‌తో నాకు పోలికేమిటని అంటున్నా విశ్లేషకులు ఆమెను వదిలిపెట్టడం లేదు. ధరించే దుస్తులనుంచి ప్రవర్తన వరకూ థాచర్‌కూ థెరెసాకూ ఉన్న తేడాలూ పోలికలతో మీడియా తనపని తాను చేసుకుపోతున్నది. ‘బ్రెగ్జిట్‌’ సృష్టించిన ఆర్థిక, రాజకీయ, నాయకత్వ సంక్షోభం కారణంగా, అలనాటి ‘ఉక్కు మహిళ’ను ...

Read More »

సాకర్‌ సంబరం

ఫ్రా‌న్స్‌ ఆతిథ్యంలో పారిస్‌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్‌ ముగిసింది. నెలరోజులపాటు అమితాసక్తిగా సాగిన ఈ క్రీడోత్సవం ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులను ఊర్రూతలూగించింది. యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలు హోరాహోరీగా పోటీపడిన ఈ సాకర్‌ సంబరం ఫుట్‌బాల్‌ ప్రేమికులను ‘గోల్‌’ ఫీవర్‌లో ముంచెత్తింది. 24 దేశాలు ట్రోఫీ కోసం పోటీపడగా తుది సమరంలో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించిన పోర్చుగల్‌ జట్టు తొలిసారిగా యూరో కప్‌ను ఒడిసిపట్టింది. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఎడర్‌ అదనపు సమయంలో మెరుపు గోల్‌ చేసి, 76 ఏళ్ల యూరో ...

Read More »

చర్చలు పునఃప్రారంభించాలి

కశ్మీర్‌లో పరిస్థితులు మరోసారి సంక్షోభస్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడి కశ్మీర్‌ పరిస్థితిని వివరించి, సహకారం కోరారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లాతో కూడా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కశ్మీర్‌కు మరో 100 కంపెనీల భద్రతాదళాలను కూడా పంపించాలని నిర్ణయించారు. హిజ్‌బుల్‌ ముజహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ దరిమిలా జరిగిన ప్రజా నిరసనలు, భద్రతాదళాల కాల్పుల్లో మరణించినవారి సంఖ్య 23కు చేరుకున్నది. కశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోవడంతో, దేశం ...

Read More »

వివక్ష వైషమ్యాలు

జాతివివక్షకు ఇంతకుమించిన నిదర్శనం లేదు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వాపోతున్నారు. ‘అతను తెల్లవాడైతే పోలీసులు ఇలా కాల్చిపారేసేవారా?’ అని మిన్నెసోట గవర్నర్‌ ప్రశ్నిస్తున్నారు. నేతలు ఇంత దయామయులైనా ఆ దేశ తెల్లపోలీసుల వైఖరిలో మార్పు ఎందుకు రాలేదని ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది.                   అమెరికా మరొకమారు అట్టుడికిపోతున్నది. కేవలం రెండురోజుల తేడాలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు నల్లజాతి యువకులను తెల్లపోలీసులు కాల్చిచంపిన ఘటనలు నల్లజాతివారిని ఆగ్రహానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగు తున్నాయి. గురువారం రాత్రి డల్లాస్‌లో ఇటువంటి నిరసన ర్యాలీ ...

Read More »

స్ఫూర్తిమంత్రం

వ్యక్తిత్వ వికాస గ్రంథ రచయిత శివ్‌ ఖెరా సుప్రసిద్ధ గ్రంథం ‘యు కెన్‌ విన్‌’ అట్టమీద ఒక ఆంగ్ల వాక్యం ఉంటుంది. ‘విజేతలు మనకన్నా వేరే విభిన్నమైన పనులు చేయరు… మనం చేసే పనులనే విభిన్నంగా చేస్తారు’ అన్న ఆ చిన్నవాక్యం ఎన్నో కోట్లమందికి ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. విజేతలుగా మార్చింది. ‘ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయి?’ అన్న గురజాడ వెన్నుచరుపు ఈ జాతిని జలదరింపజేసింది. ‘కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం’ అన్న శ్రీశ్రీ ...

Read More »

ఆగని మారణహోమం

ఉరుముతున్న ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేదిదెలా అన్నది పెనుసవాల్‌గా మారిపోయింది. దాడు లు, బాంబుపేల్లుళ్లతో ఉగ్రవాదులు ఎప్పటిక ప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు.మొన్న ఇస్తాంబుల్‌లో ప్రారంభమైన ఉగ్రవాద బీభత్సం నిన్నఢాకా, నేడుబాగ్దాద్‌లో రక్తసిక్తం చేశాయి. 131 మందికిపైగా మృతిచెందగా మరెందరో క్షతగా త్రులయ్యారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో శనివారంరాత్రి ఉపవాసదీక్ష ముగించుకుని కరాదా వాణిజ్య ప్రాంతంలోకి షాపింగ్‌కు వచ్చిన కుటుంబాలు ఉగ్రవాదదాడికి బలయ్యాయి. మృతుల్లో 15మందికి పైగా, గాయపడిన వారి లో అధికశాతం పిల్లలే ఉన్నారు. ట్రక్కుల్లో పేలుడుపదా ర్థాలు తీసుకుని ...

Read More »

ఢాకా హెచ్చరిక

బం‌గ్లాదేశ్‌లో శుక్రవారం రాత్రి ఒక రెస్టారెంట్‌లోకి జొరబడి ఆరుగురు ఉగ్రవాదులు సాగించిన బీభత్సకాండ అత్యంత అమానుషమైనది. విదేశీయులు, దౌత్యవేత్తలు అధికంగా ఉండే ఈ హోలీ ఆర్టిసాన్‌ కేఫ్‌ను ఎంచుకోవడం ద్వారా ఉగ్రవాదులు తమ ఉనికిని మిగతా ప్రపం చానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఏడాదికాలంగా బ్లాగర్లు, ప్రచురణ కర్తలు, నాస్తికవాదులు, హిందువులు, విదేశీయులపై సాగుతున్న దాడులు, హత్యలలో ఇస్లామిక్‌ స్టేట్‌ హస్తం ఏమాత్రం లేదని ఖండిస్తూ వచ్చిన బంగ్లాదేశ్‌ను ఈ మారణకాండ భయోత్పాతంలో ముంచెత్తింది. అక్కడ నుంచి తరలివచ్చిన తరుషి జైన్‌ మృతదేహం సరిహద్దులు ...

Read More »

హైదరాబాద్‌లో భయం…భయం

పోలీసు గణాంకాల ప్రకారం 24,707 మందిపై నేరచరిత్ర ఉంది. వీరిలో 10000 మంది మాత్రమే గ్రేటర్‌ పరిధిలో నేర గాళ్లున్నారు. మిగిలినవారంతా అంతర్రాష్ట్ర, జిల్లాలకు చెందిన వారే. ఏటా పలు నేరఘటనలపై 45,000 కేసులు నమోదవుతుంటాయి. 70కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకుపోతుంటారు. మూడు వేల రూపాయలకే మార్కెట్‌లో దొరికే దేశవాళీ తుపాకులు.. రూ. 10,000 ఇస్తే హత్యలు చేసే ముఠాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇది నాణేనికి ఓ వైపు.. మరోవైపు.. ఉగ్రభూతం మహానగరాన్ని వణికిస్తోంది. 2014లో రెండుసార్లు హై అలర్ట్‌ ప్రకటించారు. ...

Read More »

కైరానా కిటుకు

అలహాబాద్‌లో రెండురోజుల పాటు జరిగిన భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితం 2019 లోక్‌సభ ఎన్నికల తీర్పును నిర్ణయిస్తుంది కనుక ఆ రాష్ట్రాన్ని ఆరునూరైనా దక్కించుకోవాల్సిందేనని. ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సదస్సులో చర్చలు జరిగినా అవన్నీ వేరు, యూపీ లెక్క వేరు. ఈ అతిపెద్ద రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి అభివృద్ధి నినాదాలకంటే, ‘ముజఫర్‌ నగర్‌’ వాదనలే తమకు అధికంగా ఉపకరిస్తాయని ఆ ...

Read More »

మరో ఉగ్రదాడి

ఆసియా-యూరప్‌ ఖండాల వారధి టర్కీలో మంగళవారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత పాశవికమైనది. రాజధాని ఇస్తాంబుల్‌లోని అటాటుర్క్‌ విమానాశ్రయంలో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతోనూ, తమను పేల్చివేసుకోవడం ద్వారా యాభైమంది ప్రయణీకుల ప్రాణాలు తీసి 250మందిని క్షతగాత్రులను చేశారు. యూరప్‌లోని మూడవ అతిపెద్ద విమానాశ్రయం, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్‌లో ఈ విధ్వంసానికి పాల్పడటం ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ తన ఉనికిని యావత్ ప్రపంచానికి మరొకమారు చాటిచెప్పి భయోత్పాతంలో ముంచెత్తే ప్రయత్నం చేసింది. ఇది దొంగచాటుగా జరిపిన దాడి కాదు. విమానాశ్రయంలోకి ...

Read More »

శ్రీనగర్‌ ఘాతుకం

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతాసిబ్బంది మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. ఈ అతిపెద్ద దాడి ఏ అర్ధరాత్రో జరిగింది కాదు. శిక్షణకు హాజరైన సిబ్బందిని వెనక్కు తెస్తున్నప్పుడు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు తెగబడి జరిపినది ఇది. నలభైమంది సిబ్బంది ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన నియమాలను బేఖాతరుచేసిన కారణంగానే మరొక పాతికమంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో ‘పాకిస్థాన ముర్దాబాద్‌’ అంటూ బీజేపీ ప్రతినిధులు నినాదాలు చేయడం, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పొరుగుదేశం కంకణం కట్టుకుందంటూ హోంమంత్రి ...

Read More »

విందులు సరే, రిజర్వేషన్లేవీ?

రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగ బద్దమైన వెసులుబాటు. ఇది సమాజంలోని అణగారిన వర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకునే ఒక ముఖ్యమైన ప్రక్రియ. రిజర్వేషన్ అంటే సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో, మిగతా వర్గాల సరసన సమాన అవకాశాలను కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధిలో భాగం కల్పించటం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి చెబుతూ, దీన్ని 2014 సార్వత్రక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ...

Read More »

మోదీ గారి ‘సంజయ్‌ గాంధీ’

నాతో సహా పలువురు వ్యాఖ్యాతలు నరేంద్రమోదీని ఇందిరాగాంధీతో పోల్చారు. మోదీ నిశ్చయంగా ఇందిర అనంతరం అత్యంత అధికారపూర్వక ప్రధానమంత్రి. పూర్తికాలం పదవిలో ఉన్న మరో ఇద్దరు ప్రధానమంత్రులు వాజపేయి, నరసింహారావు కంటే కూడా మోదీ అత్యంత సాధికార ప్రధాని అనడంలో సందేహం లేదు.                         ఇందిర మాదిరిగానే మోదీ కూడా ఒంటరి వ్యక్తి. బహుశా ఆయన ఏకైక ఆంతరంగికుడు, ఒక విధంగా తనతో సమానుడుగా పరిగణించే ఏకైక వ్యక్తి అమిత్ షా. మోదీ గుజరాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాకు మొత్తం పన్నెండు మంత్రిత్వ శాఖల బాధ్యతలు ...

Read More »

ఎన్‌ఎస్జీ పోరాటం!

తాష్కెంట్‌లో స్విచ్ వేస్తే సియోల్‌లో బల్బు వెలగాలి. అనుకున్నట్టు గానే, ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో భారత ప్రధాని కాలు మోపారు. ఆయన అక్కడకు వెళ్ళింది ‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీవో) సమావేశంలో పాల్గొనడానికి. పాకిస్థాన్‌‌‌తో పాటు భారతదేశానికి కూడా ఈ గ్రూపులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే పని ఇందులో ముందుకు కదులుతుంది. కానీ, ఇంతకంటే ప్రధానమైనది చైనా అధ్యక్షుడితో భేటీ. నూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్ఎస్జీ)లో భారత సభ్య త్వాన్ని వ్యతిరేకిస్తూ, వారం రోజులుగా గొంతుబాగా పెంచిన చైనాను బుజ్జగించే ప్రయత్నమిది. ఎన్ఎస్జీ సభ్యత్వానికి ...

Read More »

ఇదేమి న్యాయం?

గుల్బర్గ్‌ సొసైటీ నరమేథం కేసులో నిందితులకు అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు ఖరారు చేసిన శిక్షలు బాధితులకు అన్యాయంగా అనిపించడం సమంజసం. పద్నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఊచకోతలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది దారుణ మారణకాండకు బలయ్యారు. పదిహేను రోజుల క్రితం న్యాయస్థానం తీర్పు ప్రకటిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిందితులుగా పేర్కొన్న 66 మందిలో 24 మందిని మాత్రమే దోషులుగా నిర్థారించి, బీజేపీ నాయకుడు బిపిన పటేల్‌ సహా 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టేసినప్పుడే బాధితులు ...

Read More »

తిండి కొద్ది తిప్పలు!

తినకముందు ఆకలికుట్టు.. తిన్నాక దండికుట్టు అంటే ఇదేనేమో?! మనోళ్లకు తిండి రుచిగా ఉండాలి. అగ్గువకు దొరకాలి. ఈజీగా అందాలి. కానీ పోషకాలు.. ఆరోగ్యం విషయానికొచ్చేసరికి అంత శ్రద్ధ చూపరు. ఆధునిక పోకడలను ఆసరా చేసుకొని పాష్ ముసుగులో పాచి పదార్థాలకు రంగులేసినా తినేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం. పిల్లల్ని పొద్దున్నే స్కూల్‌కి పంపించాలి. ఒకవైపు స్కూల్ టైమ్ అవుతుంది. మరోవైపు బోలెడన్నీ పనులు నెత్తిమీద. ఏం చేయాలి? చకాచకా షాప్‌కి వెళ్లి చాయ్‌లో వేసుకోవడానికి నాలుగు బ్రెడ్ ముక్కలు.. లంచ్ బాక్స్‌లో పెట్టేందుకు రెండు ...

Read More »

ఓర్లాండో ఘాతుకం

అమెరికాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత అమానుషమైనది. ఈ తరహా కాల్పులకు మారుపేరైన దేశంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం ఆ దేశాన్ని మరోమారు కుదిపేసింది. స్వలింగ సంపర్కుల ప్రత్యేక నైట్‌క్లబ్‌ ‘పల్స్‌’లో ఈ దారుణం చోటుచేసుకోవడం, కాల్పులకు పాల్పడిన వ్యక్తి అఫ్ఘాన్ మూలాలున్న ఒమర్‌ సిద్దిఖీ మతీన కావడం ఈ ఘటనకు మరిన్ని కోణాలను చేర్చింది. ఘటన జరగగానే ‘ఇది మా పనే’ అని ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌, మర్నాడు దానిని ‘అమెరికాలోని మా కాలిఫైట్‌ ...

Read More »