అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఆ దేశపు చట్టసభ సభ్యులనే కాక, దాన్ని మాధ్యమాల్లో వీక్షించిన వారిని కూడా మంత్రముగ్ధులను చేసింది. అబ్రహం లింకన సూక్తులతో ఆరంభించి భారత-అమెరికా సంబంధాలను, అంతర్జాతీయ పరిణామాలను లోతుగా చర్చిస్తూ, అనుబంధాలను స్పృశిస్తూ, అలవోకగా ఒక ప్రవాహంలాగా సాగిన ఈ ప్రసంగానికి కాంగ్రెస్‌సభ్యులు తొమ్మిదిసార్లు లేచినిలబడి కరతాళధ్వనులతో ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాల మధ్య స్నేహం, సహకారం ఏ స్థాయికి విస్తరించగలిగే అవకాశాలున్నాయో ఆయన ప్రసంగం విప్పిచెప్పింది. ఇరుదేశాల దీర్ఘకాలిక ...
Read More »స్నేహ వారధి!
అమెరికాలో మూడురోజుల పర్యటన ఆరంభానికి ముందు భారతప్రధాని తన ఐదుదేశాల యాత్రలో ఇప్పటికే మూడింటిని పూర్తిచేశారు. ఈ పర్యటనలో ఒబామాతో భేటీ ఎంత ప్రధానమైనదో, ఆఖరు నిముషంలో వచ్చి చేరిన స్విట్జర్లాండ్, మెక్సికోలతో వ్యవహారం కూడా అంతే ప్రధానమైనది. స్విట్జర్లాండ్ వ్యాపారవేత్తలను భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించడం, నల్లధనం, పన్ను ఎగవేతలు ఇత్యాది అంశాలపై సమష్టి పోరాటానికి సంకల్పించడం వంటివి అటుంచితే, ఏ లక్ష్యంతో ప్రధాని ఈ దేశంలో కాలుమోపారో అది ఇప్పటికే నెరవేరింది. ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్’(ఎనఎ్‌సజీ)లో భారత సభ్యత్వానికి తాను మద్దతు ...
Read More »మథురలో హింస
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులకూ, స్థలం ఆక్రమణదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా పాతికమంది మరణించిన ఘటన విషాదంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కత్తులు, తుపాకులు, బాంబులతో పోలీసులపై వారు తిరగబడి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తిని కూడా బలితీసుకున్న వైనం మధుర ప్రాంతంలోని బాబాలు, భూ కబ్జాదారుల దాష్టీకానికి అద్దం పడుతున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్‌బాగ్ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే, ముఖ్యమంత్రి ...
Read More »ఆర్ష సంస్కృతిపై అన్నివైపులా దాడులు
1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ”మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.” అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది. సంస్కృతం చదువుకున్న వారిని అవమానకరంగా చూడటం మొదలు ...
Read More »కలాం ఆత్మకథ
కలాం ఆత్మకథను నేను అనువదించిన కొత్తలో, ఒక ప్రసిద్ధ విప్లవ రచయిత నాతో ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ ‘కలాం ప్రొడక్షన్ గురించి మాట్లాడినట్టుగా డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడలేదు కదా ‘అన్నాడు.గ్లోబలైజేషన్ సందర్భంగా దేశంలో సంపద సృష్టి ముమ్మరమైన సమయంలో కలాం కూడా సంపద సృష్టించడం గురించి మాట్లాడేడు తప్ప, సృష్టించిన సంపద నలుగురికీ అందుబాటులోకి రావడం గురించీ, అసమానతలు తొలగిపోవడం గురించీ ఆయన మాట్లాడలేదనీ, పోరాడలేదనీ, ఆ రచయిత భావన. కాని కలాం పట్ల నా ఆరాధనకి కారణం ఆర్థిక, రాజకీయ రంగాలకి ...
Read More »పొడుపుకథల యక్షప్రశ్నలు
ఒక ప్రక్రియగా పొడుపుకథల గురించి ఆలోచిస్తూ ‘యక్షప్రశ్నలు’ మరొకసారి చదివాను. ఒక మహేతిహాసంలో ఆ సంఘటనని ఆ విధంగా conceive చేయగలగిన భారతకారుడి ప్రజ్ఞకు మరోసారి నిలువెల్లా నివ్వెరపోయాను. గొప్ప సాహిత్యం మనకి ప్రతి సారీ కొత్తగా కనిపించినట్టే, యక్షప్రశ్నలు కూడా మళ్ళా మరోసారి కొత్తగా కనిపించి కొత్త ఆలోచనలు నాలో సుళ్ళు తిరిగేయి. మహాభారతంలో యక్షప్రశ్నలతో వనపర్వం ముగిసిపోతుంది. అప్పటిదాకా కామ్యక వనంలో గడిపిన పాండవులు, ద్వైత వనానికి రాగానే ఒక బ్రాహ్మణుడు తన అరణి పోయిందని చెప్పడం, ఆ అరణి ని ...
Read More »సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి
సంగిశెట్టి శ్రీనివాస్ తెంగాణలో అస్తిత్వవాదం వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణం పాట. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, అమర్, విమ మొదు వందలాది మంది వాగ్గేయకాయి పాట రూపంలో తెంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. అయితే ఈ పాటలు కైగట్టడానికి ముడిసరుకుని అందించింది విస్మరణకు, వివక్షకు గురైన విషయాలువెలుగులోకి తేవడంలో చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు కృషి చేసిండ్రు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉద్యమ సందర్భంలో మెగులోకి తెచ్చిన విషయాలు, ఆంధ్రా కుహనా మేధావులు పత్రికల్లో నిత్యం కక్కే ...
Read More »ఆలోచించాల్సిన విషయమే
……………….. నిజమే! మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని ప్రోత్సహిస్తున్నది. గోమాంసం తిన్న వాడిని రాళ్లతో కొట్టటం దుర్మార్గం అన్నారు. సురేంద్ర కులకర్ణి ముఖాన నల్లసిరా పోయటం తప్పు- ఇది భారత ప్రజాస్వామ్యం ముఖాన పూసిన నల్లరంగు అన్నారు- ఈ విషయాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి?? ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించడం. సృష్టికి మూలం కార్యాకారణ సంబంధం అన్నాడు. ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదిస్తే దానికి స్టీఫెన్ హాకిన్స్ సవరణలు చేశాడు. ఇదంతా భావ ప్రకటనాస్వేచ్ఛ ...
Read More »నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్ కల్చరల్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూరు చెరువులో ఈనెల 27న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ యోగితా రాణా తెలిపారు. శనివారం సాయంత్రం మల్కాపూరు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను అధికారులతోకలిసి కలెక్టర్ పరిశీలించారు. మూడు అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను మల్కాపూర్ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఆర్అండ్బి రోడ్డు నుంచి నిమజ్జనం ప్రదేశానికి వాహనాల రాకపోకలకు విడివిడిగా తాత్కాలిక రోడ్డును ఏర్పాటు ...
Read More »నేతాజీ మిస్టరీ వీడినట్టేనా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీకి సంబంధించిన 64 డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. సోమవారం నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. స్టేట్ పోలీస్ వెబ్ సైట్ లో ఈ డీటేల్స్ ని అప్ డేట్ చేయనున్నారు. మమతా సర్కార్ నిర్ణయంపై నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న 150 డాక్యుమెంట్లను కూడా వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read More »నీళ్ళు లేక, వానలు లేక అల్లాడుతున్న పల్లె తెలంగాణా!
మన పల్లెల్లో పరిస్థితి చాల విషమంగా ఉంది. వేసిన పంటలు ఎలాగూ చేతికి రావడం లేదు. కాని అది ఎవ్వరు ఆలోచించడం లేదు. బతకడానికి కనీసం తాగే నీళ్ళు కూడా కరువయ్యే కరువు పరిస్థితి ఈనాడు ఊర్లల్లో ఉంది. బోర్లకు నీళ్ళు అందడం లేదు. నా నాటికి పరిస్థితి దిగజారుతున్నది. వారం వారానికి తేడా వస్తున్నది. స్వాతంత్రం వచ్చి ఆరు పదులు దాటినా కనీసం తాగు నీళ్ళు అందించలేని పరిస్థితికి అందరం సిగ్గు పడాలి. “ఇండియా షైనింగ్ “, “మేక్ ఇన్ ఇండియా ” ...
Read More »కూటికోసం కోటి విద్యలు
– అడ్డం పడితే అంతే సంగతి నిజామాబాద్ కల్చరల్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని చూశారు కదా… చిన్న పిల్లలైతే ఆనందంగా నవ్వుతూ వింతగా చూస్తూ మురిసిపోతారు…. పెద్దలైతే ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు…. కానీ నాకు మాత్రం ఈ చిత్రాన్ని చూడగానే కూటికోసం కోటి విద్యలు అనే సామెత గుర్తుకొచ్చింది. అసలు విషయానికొస్తే… నిజామాబాద్ నగరంలోని తిలక్‌గార్డెన్ వద్దగల సింధ్భవన్లో అరుంధతి ఫ్యాషన్స్ పేరుతో బట్టలు, వివిద వస్తువుల దుకాణం ఏర్పాటు చేశారు. ...
Read More »అతిథి దేవోభవ
<span style=”COLOR: #800000″>నేటి యువత ఎన్నో ఉన్నత చదువులు చదువుతున్నా.. టెక్నాలజీని ఎంతో వేగంగా ఒడిసి పట్టుకుంటున్నా.. కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత కొలువులు కైవసం చేసుకుంటున్నా.. ఎన్నో ఉపకరణాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమవుతున్నా.. ఒంటరితనం, ఒత్తిడి పట్టిపీడిస్తోంది. మానవ సంబంధాల్లో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్న నవతరం వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కార మార్గంగా- అతిథులు ఇంటికి రావడం, వారితో గడపడం వల్ల ఒంట రితనం, మానసిక ఒత్తిడి తగ్గి, జీవన గమనం ఒక సమన్వయ స్థితిని పొందగలుగుతుందన్నది మానసిక ...
Read More »ఉత్తిష్ఠత! జాగ్రత ! ప్రాప్యవరాన్ నిబోధత
కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాంగికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలా కాన్త త్రై లోక్యం మంగళం కురు ఈ సంస్కృత వాక్యాలు వినని వారు మనలో చాలా అరుదు. ప్రతి ఇంటా, ప్రతి ఆలయంలో వినిపించే ఈ మంగళ వాక్యాలు విద్యాభ్యాసం చేస్తున్న రాముడిని తెల్లవారు జామున మేల్కొలుపుతూ గురువు విశ్వామిత్రుడు పలికిన మాటలు. ‘‘కౌసల్య సుపుత్రుడవైన ఓ శ్రీరామా! సూర్య భగవానుడు రాబోయే వేళవుతోంది. ఓ నర శ్రేష్ఠుడా మేలుకొనుము. ...
Read More »