Breaking News

Crime

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆల‌యం వద్ద శనివారం తెల్ల‌వారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మహారాష్ట్రకు చెందిన హర్షల్‌ సురేష్‌ భోంకర్‌ అనే 23 సంవత్సరాల‌ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్‌.ఐ. విజయ్‌ నారాయణ తెలిపారు. మృతదేహంపై నుంచి భారీ వాహనాలు వెళ్లడంతో తునాతునకలు అయి గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతదేహాన్ని ...

Read More »

యానంపల్లిలో పోలీసు కళాజాత

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యానంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ మోసాల గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్‌ ధరించాలని, లేకుంటే ప్రయాణం చేయొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కార ...

Read More »

దోపిడీ దొంగల అరెస్టు

కోరుట్ల, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పదిహేను తులాల బంగారం, మూడు సెల్‌ ఫోన్స్‌, ఒక మోటార్‌ బైక్‌, 7 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితులు సారంగాపూర్‌, ధర్మపురి, జగిత్యాల మొదలగు ప్రదేశాలలో 8 దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఒక ఆడ మనిషి మగ వారిని ఆకర్షించి ఎవరు లేని ప్రదేశాలలోకి తీసుకు ...

Read More »

మనల్ని మనం కాపాడుకుందాం…

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరం జనవరి-2020 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక దేవన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 59 కాగా అందులో 30 మంది వారి విలువైన ప్రాణాలను కోల్పోగా, 94 మంది గాయపడగా వారి కుటుంబాలు కోలుకోలేని పరిస్థితులలోకి వెళ్లాయని కామారెడ్డి పోలీసు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి ప్రమాదాలలో 44 నెంబర్‌ జాతీయ రహదారి పైన 18 మంది, 11 నెంబర్‌ ఎస్‌హెచ్‌ ...

Read More »

అట్రాసిటీస్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అట్రాసిటీస్‌ కేసులు త్వరగా పూర్తిచేసి వారికి నిర్ణీత సమయంలో న్యాయం జరిగే విధంగా, పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పోలీసు, సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లాస్థాయి అట్రాసిటీస్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. అట్రాసిటీ కేసులు 2011 నుండి 2018 వరకు 95 కేసులు వచ్చాయని, వాటిలో పోక్సో చట్టం క్రింద 40 కేసులు, అత్యాచార కేసులు 6 వచ్చాయని, ...

Read More »

ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎంఎస్‌సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. టిప్పర్ల నెంబర్లు : ఏపి 25 డబ్ల్యు 4174 ...

Read More »

ముగ్గురిపై పిడి యాక్టు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 5 వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోలో గల రౌడీషీటర్లు ఆరిఫ్‌, ఉస్మాన్‌, ఇబ్రహీం చోచ్‌ అనే ముగ్గురిపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశానుసారం పిడి యాక్ట్‌ చేసినట్టు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌ రెడ్డి వెల్లడించారు. సదరు ముగ్గురు వ్యక్తులు గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 5 వ టౌన్‌, ఒకటవ టౌన్‌ మరియు ఆరవ టౌన్‌ పరిధిలో వివిధ కేసులలో రిమాండ్‌ ...

Read More »

భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టౌన్‌ 1 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంజ్‌ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్‌ ...

Read More »

భారీగా గుట్కా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బర్కత్‌ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ తన సిబ్బందితో కలిసి ...

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బొల్తాకొట్టిన క్రమంలో డ్రైవర్‌ మాచారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన బాబాగౌడ్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడేమతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More »

కామారెడ్డిలో విషాదం

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా టెక్రియల్‌ శివారులోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో శుక్రవారం యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామరెడ్డి పట్టణానికి చెందిన శ్యామ్‌ అనే యువకుడు మహాలక్ష్మి ఆటోమొబైల్స్‌లో సెల్స్‌ మెన్‌గా పనిచేస్తునాడు. మతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో దూకి ఎంధుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

రెండు గంటలలో మూడు చోరీలు…

వర్ని, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వర్ని మరియు గోవూరు గ్రామాలలో రెండు గంటలలో మూడు చోరీలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వర్ని పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధన్‌ ఏసిపి రామారావు వెల్లడించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సాయికుమార్‌ అనే వ్యక్తి వర్ని మండల కేంద్రంలో రెండు ఇళ్లలో, గోవూరులో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. దొంగతనాలు జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ...

Read More »

పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ ఐపిఎస్‌ కార్తికేయ సమాచారం మేరకు నిజామాబాద్‌ పోలీసులు ఒరిస్సాకు చెందిన ఒక కార్‌, ఒక మహేంద్ర బొలెరో ట్రక్కులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 35 ప్యాకెట్లలో సుమారు 15 లక్షల నుండి 16 లక్షల విలువ గల 152 కిలోల గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్‌పోన్లు, 1000 రూపాయల నగదు, హుందాయ్‌ ఐ 20 కార్‌, బి.నెం. ఓడి ...

Read More »

భారీగా గుట్కా స్వాధీనం, నిందితుల అరెస్టు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 2వ టౌన్‌ పరిధిలో భారీ మొత్తంలో గుట్కా పట్టుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందన్నారు. మంగళవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ, వారి సిబ్బంది నిజామాబాద్‌ 2వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొందరు వ్యక్తుల ఇంట్లో ప్రభుత్వ నిషేదిత గుట్కా ఉందని, ...

Read More »

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించి మాణిక్‌ బండార్‌ చౌరస్తా వద్ద 250 క్వింటాళ్ళ పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తున్న 2 ఐచర్‌ వాహనాలను మరియు డ్రైవర్‌ని పట్టుకొని మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Read More »

మానవత్వం చాటుకున్న టౌన్‌ సిఐ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టౌన్‌ 4 పిఎస్‌ పరిధిలోని రోటరీ నగర్‌ కాలనికి సంబంధించిన గంగోని బాలమణి (65) ని తన కుమారుడు గత కొన్నిరోజుల నుండి వద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. కాగా కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో వధాశ్రమము నుండి ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మధ్య నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడం వలన తిరిగి వద్ధాశ్రమానికి పంపగా కరోనా నేపథ్యంలో వృద్ధాశ్రమము మూసివేశారు. కావున సాటివారు బాలమణిని వారి కుమారుని వద్దకు తీసుకుని ...

Read More »

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్మార్ట్‌ లైఫ్‌ పేరు మీద లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు బుక్కులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 4వ టౌన్‌ పరిధిలో అక్షర ఏజెన్సీ పేరుతో లక్కీ లాటరీ స్కీం నడుపుతున్న వారిపై దాడులు చేసి బ్రోచర్లు ...

Read More »

భారీగా నిషేదిత పొగాకు స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌, షాకీర్‌ అలీ, సిబ్బంది కలసి టౌన్‌ పిఎస్‌ పరిధిలో నిషేధిత గుట్కా, తయారీ కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత పొగాకు సంచులు 175, లతీఫ్‌ లేబుల్‌ గుట్కా బ్యాగులు 43 సీజ్‌ చేశారు. గుట్కా ఫ్యాక్టరీ మెషిన్‌ – 5, తంబాకు బ్యాగులు -32, తంబాకు కెమికల్‌ లిక్విడ్‌ డ్రమ్ములు – 3, గుట్కా ...

Read More »

పెట్రోల్‌ బంకుల్లో హైటెక్‌ మోసం

కామారెడ్డి బడా వ్యాపారే సూత్రధారి… కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యాధునిక టెక్నాల‌జి అందుబాటులోకి రావడంతో అనేక రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. కాగా పెట్రోల్‌ బంకుల్లో మోసాలు కొత్తేం కాకపోయినా ఇటీవల‌ ఎక్కువయ్యాయి. పెట్రోల్‌ బంకుల్లో వాడే చిప్‌లో వాహనదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇవి జరిగాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అవకతవకల‌కు పాల్ప‌డుతున్న పెట్రోల్‌ బంకుల‌పై ఎస్‌వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్‌ తక్కువ వచ్చి మీటర్‌ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్‌లు అమర్చినట్టు గుర్తించారు. ...

Read More »

చట్టవ్యతిరేక కార్యకలాపాల‌ సమాచారం తెల‌పండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల‌ సమాచారం తెల‌పాల‌ని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్ల‌డిరచారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజనల్‌ పరిధిలో ఎక్కడైనా గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్టు తెలిస్తే క్రింది నెంబర్లకు సమాచారం అందించాల‌న్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి రివార్డు ఇస్తామన్నారు. ...

Read More »